Mane Praveen

Sep 07 2024, 15:18

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు
హైదరాబాద్‌ సీపీ గా సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి బదిలీ

విజిలెన్స్‌ డీజీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్‌

Mane Praveen

Sep 07 2024, 14:51

లెంకలపల్లి: తొలి పూజలు అందుకున్న గణనాథుడు

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ఈరోజు వినాయక చవితి సందర్భంగా, గ్రామంలోని గాంధీ సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. చాపల మల్లయ్య పద్మ కుటుంబం తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు.

Mane Praveen

Sep 07 2024, 13:51

TG: ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి

తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి (రిటైర్డ్ ఐఎఎస్),

బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్,

తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చైర్మన్ గా కోదండ రెడ్డి లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Mane Praveen

Sep 07 2024, 11:16

TG: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
HYD: ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆది దేవుడు విఘ్నేశ్వరుడి కృప అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు.

Mane Praveen

Sep 07 2024, 08:34

NLG: గాలి కాలుష్యంపై అవగాహన.. గణపతి మట్టి విగ్రహాల పంపిణీ
నల్లగొండ: మున్సిపల్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని RP రోడ్డులో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నీలి ఆకాశాల కోసం స్వచ్ఛమైన గాలి  అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నిపుణులు విద్యార్థినిలకు గాలి కాలుష్యంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా స్వచ్ఛమైన గాలి కోసం తీసుకోవలసిన చర్యలను వివరించారు. కాలేజీ ఆవరణలో పచ్చదనం పెంపొందించడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి వృక్షార్పణ కార్యక్రమం నిర్వహించారు. నల్లగొండ మున్సిపల్ కౌన్సిల్, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ర్యాంకుల్లో రెండవ స్థానం సాధించి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు. గాలి స్వచ్ఛత సాధించడంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థిని లకు  మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.

అంతేకాకుండా సైకిల్ పై కళాశాలకు వచ్చే విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు.కార్యక్రమానికి ముందు జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం చౌరస్తా నుండి ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, సురేష్ గుప్తా,తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 06 2024, 23:01

నారాయణపూర్ PRTU TS మండల శాఖ అధ్యక్షులుగా నంద్యాల చలపతి రెడ్డి
PRTU TS యాదాద్రి జిల్లా నారాయణపూర్ మండల శాఖ, సర్వసభ్య సమావేశం శుక్రవారం నారాయణపూర్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది.

ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా నంద్యాల చలపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దోర్నాల రాము, అసోసియేట్ అధ్యక్షులుగా అంతటి శ్రీనివాసులు, మహిళా ఉపాధ్యక్షులు మమత, కార్యదర్శిగా కోల శ్రీనివాస్, మహిళా కార్యదర్శిగా శ్రావణి ఎన్నికయ్యారు.

Mane Praveen

Sep 06 2024, 21:53

వరద బాధితులకు అండగా.. తెలుగు చిత్ర పరిశ్రమ
TG: వరద బాధితులకు అండగా నిలుస్తామంటూ తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) కు ఫిల్మ్ ఛాంబర్ తరపున రూ. 25 లక్షలు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున రూ.10 లక్షలు, ఫిల్మ్ ఫెడరేషన్ తరపున రూ. 5 లక్షలు విరాళంగా ప్రకటించారు.

టాలివుడ్ లోని పలు విభాగాల ప్రతినిధులు, సభ్యులు సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చూపడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Mane Praveen

Sep 06 2024, 21:36

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపన్న హస్తం.. అనారోగ్య బాధితురాలికి 2 లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు
నల్గొండ జిల్లా,  నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కె. చంద్రకళ భర్త రాములు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించి.. ముఖ్యమంత్రి సహాయ నిధి లో భాగంగా ముందస్తు చికిత్స కోసం 2,00,000 రూపాయలు ఎల్ ఓ సి  చెక్కును మంజూరు చేయించారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సీఎం రిలీఫ్ ఫండ్ - ఎల్ఓసి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మహిళ కుటుంబీకులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

Mane Praveen

Sep 06 2024, 21:17

NLG: మర్రిగూడ బైపాస్ - పిట్టంపల్లి రోడ్డు రిపేర్ కు మోక్షమెప్పుడో...
నల్లగొండ జిల్లా కేంద్రం పరిధిలోని మర్రిగూడ బైపాస్ నుండి పిట్టంపల్లి రహదారి కనీస మరమ్మత్తులు లేక గుంతలమయమైంది. ప్రజా రవాణా కు అసౌకర్యంగా మారింది.

ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడి రోడ్డు రిపేర్ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు రిపేర్ కు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Mane Praveen

Sep 06 2024, 21:11

NLG: వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
నల్లగొండ జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. వినాయకుడు సర్వవిఘ్నాలను తొలగించి జిల్లా ప్రజలకు మంచి చేకూర్చాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వినాయకచవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని అన్నారు.

వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులను పూజించాలని విజ్ఞప్తి చేశారు.