VijayaKumar

Sep 05 2024, 11:37

వలిగొండ నూతన ఎస్సైగా వి యుగేందర్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నూతన ఎస్సైగా వి యుగేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీలో భాగంగా పోచారం ఐటి కార్డార్ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు ఇక్కడ పనిచేసిన ఎస్ఐ డి మహేందర్ లాల్ ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా నూతన ఎస్సై మాట్లాడుతూ మండల ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకొని పోలీసులకు సహకరించాలని కోరారు.

VijayaKumar

Sep 05 2024, 07:36

స్వామి రామానంద తీర్థ సంస్థలో బేసిక్ కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కొరకు ఉచిత శిక్షణ: పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మి డైరెక్టర్


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆద్వర్యంలో స్వామి రామానంద తీర్థ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా "దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన" పథకం ను గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బేసిక్ కంప్యూటర్స్ (డాటా ఎంట్రీ ఆపరేటర్) కోర్సును 3 నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి మరియు భోజనం ఉచితంగా అందించి, శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. ఇంటర్ పాసైన,18-35 సంవత్సరాల లోపు వయస్సు కల్గిన యువతీ యువకులు సెప్టెంబర్ 09-2024 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఎస్సీ/ ఎస్టీ/ మైనారిటీ అభ్యర్థులకు ప్రాదాన్యత ఉంటుందని ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు పోన్ నెంబర్ (1) 9133908000 (2) 9133908111 (3) 9133908222 లను సంప్రదించాలని ఆమె కోరారు

VijayaKumar

Sep 03 2024, 21:47

మా డిగ్రీ కళాశాల మాకే కావాలి: BJYM జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్

భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లోని కార్యాలయ అధికారి జగన్మోహన్ గారికి మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ డిగ్రీ పురుషుల గురుకుల కళాశాలను అనంతారం, భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి తరలించకుండా ఆపాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది* ఈ సందర్భంగా బిజెవైఏం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ గారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బిసి సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాల ను కందుకూర్ మండలం, మహేశ్వరం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా కు తరలించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాలం నుండి జిల్లా నుండి ప్రభుత్వ విద్యాసంస్థలను తలరించే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది, యాదగిరిగుట్ట మెడికల్ కళాశాల తరలిస్తుంటే ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య గారు ఏం చేశారు అదేవిధంగా భువనగిరి నుండి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ తరలిస్తుంటే ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి గారు ఏం చేశారు బీజేవైఎం ఉద్యమాలు చేసి ఆ రెండు విద్యాసంస్థలను రక్షించుకుంది అదేవిధంగా ఈ మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను రక్షించుకుంటాం అయ్యా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మీరు ఇకనైనా నిద్ర మత్తును వీడండి ఈ నియోజకవర్గంలో విద్యారంగం ఎలా బ్రష్టు పడుతుందో చూడండి ఈ డిగ్రీ కళాశాల ఆపడానికి మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం లేనియెడల సోమవారం రోజు మీ క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికి BJYM కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారు దయచేసి కళాశాల రక్షించండి అని ఆయన డిమాండ్ చేశారు" మా డిగ్రీ కళాశాల మాకే కావాలి " అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు...... ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు బూరుగు మణికంఠ, మంగు నరసింహారావు, బట్టు క్రాంతి, పల్లెపాటి వేణుగోపాల్, రాళ్ల బండి కృష్ణ చారి, కానుకుంట్ల రమేష్, కొలిచేలిమ మల్లిఖార్జున్,భువనగిరి సిద్దు గౌడ్, నూనె బాలకృష్ణ, బొజ్జ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 03 2024, 18:04

ఈనెల 6న వలిగొండలో మూసి ప్రక్షాళన, గోదావరి కృష్ణా జలాల సాధన సదస్సును జయప్రదం చేయండి: మాటూరి బాలరాజు జిల్లా కన్వీనర్, సిర్పంగి స్వామి పిలుపు

ఈనెల 6వ తేదీన వలిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మూసీ ప్రక్షాళన-బునాది గాని,భీమ లింగం కాల్వల ద్వారా గోదావరి కృష్ణా జలాల సాధన కోసం జరుగు సదస్సును జయప్రదం చేయాలని జిల్లా కన్వీనర్ మాటూరు బాలరాజు-కోకన్వీనర్ సిర్పంగి స్వామి లు పిలుపునిచ్చారు మంగళవారం మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు రైతాంగానికి మూగజీవాలకు గత 30 సంవత్సరాల క్రితం స్వచ్ఛమైన నీరును అందించిన మూసీ నేడు పరిశ్రమల వ్యర్థ కాలుష్యాల వల్ల విష కోపంగా మారిందని ఈ విషపు నీటి వల్ల జిల్లా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే మూసి కాలుష్యాన్ని అరికట్టేందుకు నిధులు కేటాయించి మూసీ ప్రక్షాళన నిర్వహించాలని అదేవిధంగా గోదావరి జలాలను బస్వాపురం ప్రాజెక్టు ద్వారా వలిగొండ, భువనగిరి, బీబీనగర్, ఆత్మకూరు,మోత్కూరు, అడ్డగూడూరు,గుండాల మోటకొండూరు మండలాలకు బునాది గాని భీమలింగం కాల్వల ద్వారా నీరు అందించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వ తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బునాది గాని కాల్వను వెంటనే పూర్తి చేసి అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు సాగునీరును అందించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రజలు రైతులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వాకిటి వెంకటరెడ్డి, దొడ్డి బిక్షపతి, వరికుప్పల యాదయ్య, వడ్డమాని వెంకటయ్య,మారబోయిన నరసింహ,బొడ్డు రాములు,వేముల దావీదు, వేముల నాగరాజు,గ్రామ రైతులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 02 2024, 23:23

గోపరాజు పల్లి లో ఘనంగా ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు .వలిగొండ మండల జన నాయకులు మేడి కుమార్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు ,పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు చిల్లర స్వామి ,పాలకూర్ల మల్లేశం, కోమటిరెడ్డి మల్లారెడ్డి, పాలకూర్ల అంజయ్య, ఏనుగుల మల్లయ్య, రుద్రపల్లి మచ్చ గిరి , పాలకూర్ల రాములు , పులగూర్ల శంకర్ రెడ్డి ,గాజుల రాజయ్య, ఎనుగుల సత్తయ్య, పాలకూర్ల రఘుపతి, పోలబోయిన గోపాల్ ,ఏనుగుల విష్ణు , సలిలిగంజి పృథ్వి,గ్రామ యూత్ మరియు మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

VijayaKumar

Sep 02 2024, 17:26

జిట్టా బాలకృష్ణారెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలు కోవాలని అన్నారం షరీఫ్ దర్గాలో ప్రార్థనలు

జిట్టా అభిమానులతో కలిసి ప్రార్థనలు నిర్వహించిన మహమ్మద్ అబ్దుల్ రావుఫ్* *వలిగొండ సెప్టెంబర్ 2 తెలుగు ప్రభ* *మండల పరిధిలోని గోకారం గ్రామానికి చెందిన జిట్ట బాలకృష్ణారెడ్డి అభిమాని మహమ్మద్ అబ్దుల్ రావుఫ్ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ జిల్లాలోని తొర్రూరు దగ్గరలో ఉన్న అన్నారం షరీఫ్ దర్గాలో 20 మంది జిట్టా అభిమానులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థనలు నిర్వహించి ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాలకృష్ణారెడ్డి అమ్మ కీ.శే జిట్టా రాధమ్మ పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఈరోజు ఆయన సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందడం చాలా బాధాకరమని బాలకృష్ణారెడ్డి అభిమానులుగా ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నామని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థన (ఫాతేహా)చేశామని తెలిపారు. అనంతరం భక్తులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిట్ట అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 02 2024, 17:23

అంబేద్కర్ డిగ్రీ ప్రవేశాల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడగింపు: డాక్టర్ గంజి రమేష్ లెర్నింగ్ సెంటర్ కోఆర్డినేటర్

భువనగిరి:  డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం (బీఆర్ఎఓయూ) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు భువనగిరి శ్రీ లక్ష్మినరసింహ డిగ్రీ కళాశాల లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ కో- ఆర్డినేటర్ డాక్టర్ గంజి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఏ, బీకాం , బీఎస్సీ లో ప్రవేశానికి ఇంటర్ చదివిన విద్యార్థులు, పదో తరగతి తర్వాత రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు చేసిన వారు, ఇంటర్ సర్టిఫికెట్ లేదా సమాన స్థాయి కలిగిన నేషనల్ ఓపెన్ స్కూల్ సోసైటీ విద్యార్హత కలిగిన వారు కూడా అర్హులేనని, అలాగే రెండు సంవత్సరాలు ఐటిఐ చేసిన వారు కూడా అర్హులేనని ఆయన తెలిపారు. విద్యార్హతలు, ఫీజుల వివరాలు వెబ్సైట్ లో పొందుపర్చామని ఆయన తెలిపారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 30 లోపు ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాలని ఆయన కోరారు. పూర్తి సమాచారం కోసం సెల్ 9000590545 నంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.

VijayaKumar

Sep 01 2024, 15:47

తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి త్వరగా కోలుకోవాలని అభిమానుల పాదయాత్ర

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ,తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిట్టా  బాలకృష్ణ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ వారి అభిమానులు ఆదివారం భువనగిరి పట్టణంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం నుండి పాత బస్టాండ్ సాయిబాబా దేవాలయం మీదుగా మాసుకుంట ఆంజనేయస్వామి దేవాలయం మీదుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.

VijayaKumar

Sep 01 2024, 15:14

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి: ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులను గుర్తిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా హామీలను అమలు చేయాలని ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలో చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంకు. పూల.మాలవేసి పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగానే మన ప్రభుత్వం కూడా అమలు చేయాలని అన్నారు..ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి 250 గజాల ఇంటి స్థలం తో పాటు 25 వేల రూపాయల పెన్షన్ హెల్త్ కార్డు బస్సు పాసు మిగతా రాయితీలు కల్పించి ఉద్యమకారుల న్యాయం చేయాలని అలాగే ఉద్యమంలో పనిచేసి నష్టపోయి కేసులు కానటువంటి ఉద్యమకాలను గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు ఈనెల 27న సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్ లో జరుగు ఆత్మీయ ఘన. సన్మానం కార్యక్రమాన్ని ఉద్యమకాల పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన అన్నారు భువనగిరిలో స్వరాజ్ షోరూమ్ దగ్గర నుండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కార్లు.లో ర్యాలీతో వెళ్లడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా రాష్ట్ర కమిటీ మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి .ప్రధాన కార్యదర్శి పటోళ్ల. సురేందర్ రెడ్డి. జానకి రెడ్డి. గగన్ కుమార్. నెట్టెం భాస్కర్.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంతం యాదిరెడ్డి.నియోజకవర్గ అధ్యక్షులు జోగు అంజయ్య. మారగొని శ్రీనివాస్ గౌడ్.మంటి రమేష్. శీలం స్వామి. మల్లం వెంకటేశం.. గంధం మల్ల. మల్లమ్మ. . . ఈ తాప .మల్లేశం రాంబాబు. దయానంద్ భూపాల్ అవినాష్. మరుగన్ శ్రీనివాస్. నోముల శంకర్. కదిరేని. స్వామి మంటి లింగం శంకర్. ఐటిపాముల పుష్ప. గంధ మల్ల బాలయ్య....తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 01 2024, 11:25

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ డి మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వలిగొండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై డి మహేందర్ అన్నారు. వర్షాల కారణంగా మండల ప్రజలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలని కరెంటు వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మండల ప్రజలకు తెలియజేశారు.