NLG: ఎన్ జి కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులకు ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి పురస్కారాలు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న ఇద్దరు అధ్యాపకులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ బుధవారం తెలిపారు. వాణిజ్య శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ర్యాక శ్రీధర్ మరియు రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. అనిల్ అబ్రహం  లకు అవార్డులు లభించాయని ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం నుండి ఉత్తర్వులు అందినట్లు తెలిపారు.

ఈ ఇద్దరు అధ్యాపకులు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఈ అవార్డును అందుకుంటారని చెప్పారు.

ఈ సందర్బంగా అవార్డు పొందిన అధ్యాపకులను వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్, వాణిజ్య శాస్త్ర విభాగం అధ్యక్షులు డా. జె. నాగరాజు, డా. అంతటి శ్రీనివాస్, పరిపాలన అధికారి డి. శ్రావణి, ప్రజా సంబంధాల అధికారి డా. వెల్డండి శ్రీధర్, ఇతర అధ్యాపకులు ఎ. మల్లేశం, డా.మునిస్వామి, డా. కిరీటం, తదితరులు అభినందించారు.
గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి: మునుగోడు ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా:
మునుగోడు: నియోజకవర్గంలో గంజాయి అనేది కనిపించవద్దని గంజాయి నిర్మూలించడానికి పోలీసులు నిబద్దతతో పని చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పోలీసులకు తెలిపారు.బెల్ట్ షాపుల నిర్మూలన,గంజాయి వాడకంపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం పోలీసులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో బెల్ట్ షాపుల నిర్మూలనకు,గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని,అవసరమైతే దోషులను అరెస్టు చేసి జైల్లో కి పంపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా  యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి ఎవరు పాల్పడిన సహించేది లేదని వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటివరకు మునుగోడు సర్కిల్లో  బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై 30 కేసులు నమోదు చేశామని, 105 మందిని బైండోవర్ చేశామని  పోలీసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా బెల్ట్ షాపు ల నిర్మూలనకు  కఠినంగా వ్యవహరించాలని అన్నారు.

మునుగోడు నియోజకవర్గానికి గంజాయి ఎక్కడినుండి వస్తుందో వాటి మూలాలను తెలుసుకుని, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ నిర్మూలిస్తూనే  గంజాయికి అలవాటైన వారికి కౌన్సిలింగ్ ఇస్తూ  గంజాయి బారిన పడకుండా చూడాలని అన్నారు.
NLG: ఎన్ జి కళాశాలలో డిగ్రీ స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్లు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చివరి దశ అడ్మిషన్ల  కోసం దోస్త్ స్పెషల్ డ్రైవ్ విడుదల అయినట్లు ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నెల 4 వ తేది నుంచి 9 వ తేది లోపు దోస్త్ వెబ్ సైట్ లో రూ. 400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.

దివ్యాంగులు, ఎన్ సి సి, స్పోర్ట్స్, అదనపు సహపాఠ్యంశాలలో ప్రతిభ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వెబ్ ఆప్షన్లు  ఈ నెల 9 వ తేదీ లోపు ఇవ్వాలని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా 9 వ తేదీనే  ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు ఈ నెల 11 న జరుగుతుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 13 వ తేదీ లోపు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు.

ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకొని సీట్లు పొందని వారు మరియు రిజిస్ట్రేషన్ చేయించుకోనివారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
NLG: దేవరకొండ కు చేరిన SFI జిల్లా కమిటీ మోటార్ సైకిల్ పోరు యాత్ర
దేవరకొండ. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మోటార్ సైకిల్ పోరు యాత్ర  మంగళవారం దేవరకొండ కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రంగంలో ఉండే హాస్టల్ విద్యార్థుల బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా హాస్టల్లో ఉండే విద్యార్థులు ఆరు బయట స్నానాలు చేయాలా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు కరువు అయ్యాయని అన్నారు.

సంక్షేమ హాస్టల్ లలో హెచ్ డబ్ల్యూఓ లు అందుబాటులో ఉండకుండా రూము లలో ఫ్యాన్స్ సౌకర్యాలు, త్రాగడానికి మంచినీరు కూడా అందుబాటులో లేవని‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ చార్జీలు పెంచాలని సుమారు 5, 6 నెలలు బకాయి లో ఉన్న మెస్ చార్జీలు లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కొండ భీమనపల్లి లో వున్నా బిసి గురుకుల బాలుర పాఠశాల లో  గురువులు లేరు.  గత నాలుగు నెలలుగా సబ్జెక్టు సంబంధించిన ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదు , త్రాగడానికి మంచినీరు సరఫరా కూడా సరిగ్గా  విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

దేవరకొండ ఆదర్శ పాఠశాల హాస్టల్ లో వుండే విద్యార్థీనిలు  చాలా ఇబ్బంది పడుతున్నారు ఆదర్శ పాఠశాల కళాశాల హాస్టల్ విధ్యార్థీనీలు హాస్టల్లో ఏమైనా  చిన్న చిన్న మైనర్ రిపేర్లు అయితే విద్యార్థినీలు అందరు డబ్బులు పోగేసి చేయిస్తున్నారు. ఆదర్శ పాఠశాల ఆవరణలో కోళ్ళ పారమ్ వుండడం వల్ల  విద్యార్థులు  అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల లో కుర్చోని శ్రద్ద గా పాఠాలు వినే పరిస్థితిలో లేదని యాత్ర దృష్టి తీసుకురావడం జరిగిందని తెలిపారు.

తక్షణమే  విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో హాస్టల్ విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. ఎస్సీ బాలుర హాస్టల్ లో 70 మంది విద్యార్థులు వుంటున్నారు. ఇందులో కేవలం ఒక్క పార్ట్ టైం వర్కర్ మాత్రమే వున్నారు.ఒకే హాస్టల్ వార్డెన్ నాలుగు ఐదు  హాస్టళ్ల ఇన్చార్జి వుండడం వల్ల విద్యార్థులకు  ఏమైనా సమస్యలు వస్తే  తక్షణమే అందుబాటులో ‌లేనటువంటి పరిస్థితి ఉంది.

గిరిజన గురుకుల పాఠశాలలో  వాటర్ సమస్య, బాత్ రూమ్ కడిగే వారు లేరు. గురుకుల పాఠశాల విద్యార్థుల గోడు‌ వినేది ఎవరిని అన్నారు. నల్లగొండ జిల్లా  వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో, గురుకులాల్లో, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ కొరబడిందని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో ఉండే పేద, మధ్యతరగతి విద్యార్థుల పక్షాన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ లు  సమరశీల పోరాటాలకు పిలుపు నివ్వడం జరుగుతుంది హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రమావత్ లక్ష్మణ్ నాయక్, బుడిగ వేంకటేష్, రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య, జిల్లా ఆఫిస్ బేరర్స్ కుర్ర సైదా నాయక్, కొరె రమేష్, ముస్కు రవిందర్, స్పందన, పావని, జగన్ నాయక్, సంపత్ , రాకేష్, వీరన్న ,నవదీప్, కిరణ్, న్యూమాన్, ప్రవీణ్, ఇద్ది రాములు, సాయి, సిద్దు నవీన్, వర్షిత్, చందు, తదితరులు పాల్గొన్నారు.
NLG: రైతు రుణ మాఫీ కోసం కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన సామాజిక ఉద్యమకారుడు కొమ్ము గణేష్
నల్లగొండ జిల్లా, చండూరు:
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని ఈరోజు చండూరు పర్యటన కోసం విచ్చేసిన కలెక్టర్ కు  సామాజిక ఉద్యమకారుడు కొమ్ము గణేష్ రైతుల పక్షాన రైతు రుణమాఫీ కోసం వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కొమ్ము గణేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల  రైతు రుణమాఫీ కి   అర్హత ఉండి, రుణమాఫీ రాక కొంత మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని, అర్హత గల రైతులకు రుణమాఫీ ఇవ్వాలని అన్నారు.
NLG: జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్ష నిర్వహించిన  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా, చండూరు:

అభివృద్ధి పనులు, సీజనల్ వ్యాదుల పై చండూరు ఆర్డీఓ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సెంటర్లో ఉండాలని ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని అన్నారు. ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను, అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో, మున్సిపాలిటీ లలో పాతబడిన డ్రైనేజీ లను గుర్తించి వాటిని పునర్ నిర్మించి మురుగునీరు సాఫీగా వెళ్ళేలా చూడాలని సూచించారు. వసతి గృహాలల్లో విద్యుత్ సర్క్యూట్ కాకుండా తగిన చర్యలు తీసుకుంటూనే విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతో 197 కోట్లు విద్యుత్ శాఖ కు మంజూరయ్యాయని విద్యుత్ అధికారులు తెలపడంతో.. ప్రియారిటీ ఆఫ్ లిస్టు ప్రకారం విద్యుత్ పనులు చేయాలని, చండూరు లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు డెడికేటెడ్ గా ఒక ట్రాన్స్ఫార్మర్ ని పెట్టాలని అధికారులను ఆదేశించారు. చండూరు రెవెన్యూ డివిజన్ అయిన సందర్భంగా ఆర్డిఓ ఎమ్మార్వో ఎంపీడీవో ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని.. ప్రతి ప్రభుత్వ నిర్మాణం భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని అధికారులను కోరారు.ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ మున్సిపాలిటీకి అరుదైన గౌరవం..స్వచ్ఛ వాయు సర్వేక్షన్ లో దేశంలోనే రెండో స్థానం
పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్  కింద నిర్వహించబడిన స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్, 2024 లో నల్గొండ మున్సిపాలిటీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ జనాభా కేటగిరీ-3 (<3 లక్షలు)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి ఘనత సాధించింది. ఈ మేరకు ఎన్సీఏపి డైరెక్టర్ డా. ప్రశాంత్ మార్గదర్శకాలకు అనుగుణంగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 131 నగరాలు స్వీయ-అంచనా నివేదికలు సమర్పించ గా, వాటిని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మూల్యాంకనం చేసింది.

ఈ మూల్యాంకనం లో, నల్గొండ మున్సిపాలిటీ అత్యుత్తమ పనితీరు కనబరిచిన మున్సిపాలిటీలో ఒకటిగా ఎంపిక చేయడమే కాకుండా, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్, 2024లో రెండవ స్థానంలో నిలిచింది.

ఈ సందర్భంగా ఈనెల 7న రాజస్థాన్‌ లోని జైపూర్ ఎగ్జిబిషన్,  కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న స్వచ్ఛ్ వాయు దివస్ 2024 సందర్భంగా, నల్గొండ మున్సిపాలిటీకి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి, రాజస్థాన్ సిఎం చేతులమీదుగా
నగదు పురస్కారాన్ని నల్లగొండ మున్సిపాలిటీ అందుకోనుంది.
NLG: NMMS స్కాలర్షిప్ పొందిన విద్యార్థులను అభినందించిన ఆర్డీవో మరియు డి.ఎస్.పి
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ కు చెందిన 4గురు విద్యార్థులు M. కీర్తన, లుబ్నాతన్వీర్, A.దివ్య, D.దినేష్ లు 2023-24 విద్యా సంవత్సరంలో National Means Merit Scholarship పొందిన సందర్భంగా పల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు బ్యాగ్స్, మెటీరియల్స్ అందజేస్తూ,  2024-25 సంవత్సరానికి గాను ప్రిపేర్ అవుతున్న 11 మంది విద్యార్థులకు ప్రోత్సాహక మెటీరియల్స్ అందజేశారు. బొట్టుగూడ హైస్కూల్  ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఆర్డీవో రవి, డి.ఎస్.పి శివ రాంరెడ్డి లు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించే భాగంలో బ్యాగ్స్ నోట్ బుక్స్ మరియు NMMS మెటీరియల్స్ అందజేశారు.

అనంతరం వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా స్త్రీ భద్రత, శాంతి భద్రతలు,డ్రగ్స్ నిర్మూలన పై విద్యార్థులకు
అవగాహన కలిగించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ మరియు చదువుల పట్ల అంకితభావంతో ఉండాలని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పల్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్లు పల్ రెడ్డి రామిరెడ్డి, పల్ రెడ్డి నరసింహారెడ్డి లు, మరియు పాఠశాల ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు
వై.శ్యామ్ సుందర్ రెడ్డి, ఎస్.కె మన్సూర్ అలీ,ఏ.వి.ఆర్ వినాయక్, కే.దయాశంకర్,ఎస్.కె. సలీం, కే.జయ, బి.రాములు,బి.సుధారాణి,ఎం.ప్రసన్న,
కే.లింగయ్య, పి.శ్రీకాంత్, పి.కుశలకుమారి, బొమ్మపాల గిరిబాబు, ఎస్.చరణ్, కె.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మృదుల
హైదరాబాద్: బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా.నందవరం మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.

డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని పురస్కరించుకుని అందజేసే ఈ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 16 మందిని ఎంపిక చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక ఉపాధ్యాయురాలుగా మృదుల నిలిచారు. ఈనెల 5 న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకోనున్నారు.
TG: పాలేరు అలుగు వరద ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం జిల్లా,కూసుమంచి మండలం,పాలేరు అలుగు వరద ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం పరిశీలించారు.ఈ పర్యటనలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు