NLG: రైతు రుణ మాఫీ కోసం కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన సామాజిక ఉద్యమకారుడు కొమ్ము గణేష్
నల్లగొండ జిల్లా, చండూరు:
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని ఈరోజు చండూరు పర్యటన కోసం విచ్చేసిన కలెక్టర్ కు  సామాజిక ఉద్యమకారుడు కొమ్ము గణేష్ రైతుల పక్షాన రైతు రుణమాఫీ కోసం వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కొమ్ము గణేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల  రైతు రుణమాఫీ కి   అర్హత ఉండి, రుణమాఫీ రాక కొంత మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని, అర్హత గల రైతులకు రుణమాఫీ ఇవ్వాలని అన్నారు.
NLG: జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్ష నిర్వహించిన  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా, చండూరు:

అభివృద్ధి పనులు, సీజనల్ వ్యాదుల పై చండూరు ఆర్డీఓ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సెంటర్లో ఉండాలని ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని అన్నారు. ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను, అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో, మున్సిపాలిటీ లలో పాతబడిన డ్రైనేజీ లను గుర్తించి వాటిని పునర్ నిర్మించి మురుగునీరు సాఫీగా వెళ్ళేలా చూడాలని సూచించారు. వసతి గృహాలల్లో విద్యుత్ సర్క్యూట్ కాకుండా తగిన చర్యలు తీసుకుంటూనే విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతో 197 కోట్లు విద్యుత్ శాఖ కు మంజూరయ్యాయని విద్యుత్ అధికారులు తెలపడంతో.. ప్రియారిటీ ఆఫ్ లిస్టు ప్రకారం విద్యుత్ పనులు చేయాలని, చండూరు లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు డెడికేటెడ్ గా ఒక ట్రాన్స్ఫార్మర్ ని పెట్టాలని అధికారులను ఆదేశించారు. చండూరు రెవెన్యూ డివిజన్ అయిన సందర్భంగా ఆర్డిఓ ఎమ్మార్వో ఎంపీడీవో ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని.. ప్రతి ప్రభుత్వ నిర్మాణం భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని అధికారులను కోరారు.ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ మున్సిపాలిటీకి అరుదైన గౌరవం..స్వచ్ఛ వాయు సర్వేక్షన్ లో దేశంలోనే రెండో స్థానం
పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్  కింద నిర్వహించబడిన స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్, 2024 లో నల్గొండ మున్సిపాలిటీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ జనాభా కేటగిరీ-3 (<3 లక్షలు)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి ఘనత సాధించింది. ఈ మేరకు ఎన్సీఏపి డైరెక్టర్ డా. ప్రశాంత్ మార్గదర్శకాలకు అనుగుణంగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 131 నగరాలు స్వీయ-అంచనా నివేదికలు సమర్పించ గా, వాటిని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మూల్యాంకనం చేసింది.

ఈ మూల్యాంకనం లో, నల్గొండ మున్సిపాలిటీ అత్యుత్తమ పనితీరు కనబరిచిన మున్సిపాలిటీలో ఒకటిగా ఎంపిక చేయడమే కాకుండా, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్, 2024లో రెండవ స్థానంలో నిలిచింది.

ఈ సందర్భంగా ఈనెల 7న రాజస్థాన్‌ లోని జైపూర్ ఎగ్జిబిషన్,  కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న స్వచ్ఛ్ వాయు దివస్ 2024 సందర్భంగా, నల్గొండ మున్సిపాలిటీకి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి, రాజస్థాన్ సిఎం చేతులమీదుగా
నగదు పురస్కారాన్ని నల్లగొండ మున్సిపాలిటీ అందుకోనుంది.
NLG: NMMS స్కాలర్షిప్ పొందిన విద్యార్థులను అభినందించిన ఆర్డీవో మరియు డి.ఎస్.పి
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ కు చెందిన 4గురు విద్యార్థులు M. కీర్తన, లుబ్నాతన్వీర్, A.దివ్య, D.దినేష్ లు 2023-24 విద్యా సంవత్సరంలో National Means Merit Scholarship పొందిన సందర్భంగా పల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు బ్యాగ్స్, మెటీరియల్స్ అందజేస్తూ,  2024-25 సంవత్సరానికి గాను ప్రిపేర్ అవుతున్న 11 మంది విద్యార్థులకు ప్రోత్సాహక మెటీరియల్స్ అందజేశారు. బొట్టుగూడ హైస్కూల్  ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఆర్డీవో రవి, డి.ఎస్.పి శివ రాంరెడ్డి లు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించే భాగంలో బ్యాగ్స్ నోట్ బుక్స్ మరియు NMMS మెటీరియల్స్ అందజేశారు.

అనంతరం వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా స్త్రీ భద్రత, శాంతి భద్రతలు,డ్రగ్స్ నిర్మూలన పై విద్యార్థులకు
అవగాహన కలిగించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ మరియు చదువుల పట్ల అంకితభావంతో ఉండాలని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పల్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్లు పల్ రెడ్డి రామిరెడ్డి, పల్ రెడ్డి నరసింహారెడ్డి లు, మరియు పాఠశాల ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు
వై.శ్యామ్ సుందర్ రెడ్డి, ఎస్.కె మన్సూర్ అలీ,ఏ.వి.ఆర్ వినాయక్, కే.దయాశంకర్,ఎస్.కె. సలీం, కే.జయ, బి.రాములు,బి.సుధారాణి,ఎం.ప్రసన్న,
కే.లింగయ్య, పి.శ్రీకాంత్, పి.కుశలకుమారి, బొమ్మపాల గిరిబాబు, ఎస్.చరణ్, కె.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మృదుల
హైదరాబాద్: బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా.నందవరం మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.

డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని పురస్కరించుకుని అందజేసే ఈ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 16 మందిని ఎంపిక చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక ఉపాధ్యాయురాలుగా మృదుల నిలిచారు. ఈనెల 5 న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకోనున్నారు.
TG: పాలేరు అలుగు వరద ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం జిల్లా,కూసుమంచి మండలం,పాలేరు అలుగు వరద ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం పరిశీలించారు.ఈ పర్యటనలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు

NLG: సీజనల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఈ రోజు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రోగులకు అవగాహన కల్పించారు.

గ్రామస్థాయి నుంచి ప్రతి పల్లెలో జరం సర్వే విస్తృతంగా నిర్వహించాలని వైద్య సిబ్బందికి తెలిపారు. సీజనల్ జ్వరాల పట్ల అవగాహన కల్పిస్తూ వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. మండల వైద్యాధికారులు డాక్టర్ ఇజ్రత్, డాక్టర్ తరుణ్, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
NLG: మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా వై యస్ ఆర్ 15వ వర్ధంతి
నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో నేడు  దివంగత మాజీ సిఎం డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయంలో ఉన్న వైయస్సార్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం వైయస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్ లు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జమ్ముల వెంకటేష్ గౌడ్
నల్లగొండ జిల్లా:
భారీ వర్షాల పట్ల  మర్రిగూడ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్ముల వెంకటేష్ గౌడ్ అన్నారు.

ఆదివారం మర్రిగూడ మండలంలో వారు మాట్లాడుతూ.. భారీ వర్ష సమయంలో ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు ఇంట్లోనే ఉండండి, అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి, వర్షాల వల్ల తడిసిన కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగలు, ఇనుప స్తంభాలు తాగకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ఇంట్లో ఉండే విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.ముఖ్యంగా పిల్లలు, వృద్దులు బయటకు రాకుండా చూసుకోవాలి. రైతులు పొలాల్లో విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండండి. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల వద్దకు వెళ్ల వద్దని మండల ప్రజలకు సూచించారు.
రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు చేపట్టిన ఆర్ అండ్ బి అధికారులు

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవకుండా ఆర్ అండ్ బి అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం గ్రామానికి విచ్చేసి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన నీరు మళ్లించడానికి తన సిబ్బందితో చర్యలు తీసుకున్నారు.