ఎం ఎస్ ఎం ఈ లతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు: ఎర్ర శివరాజ్ సీనియర్ రిసోర్స్ పర్సన్
భువనగిరి: దేశంలో అధికశాతం యువత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల తోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని సీనియర్ రీసోర్స్ పర్సన్ ఎర్ర శివరాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నవభారత్ డిగ్రీ కళాశాలలో జరిగిన "సఫల్ శిక్షణా కార్యక్రమం" లో భాగంగా రెండు రోజుల శిక్షణా కార్యక్రమాల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. మన దేశంలో సుమారు 6.3 కోట్ల ఎం ఎస్ ఎం ఈ లు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. సూక్ష్మ, చిన్న, మద్య తరహా పరిశ్రమల ద్వారానే అధికశాతం ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. దేశంలోని ఎగుమతుల్లో సుమారు 40 శాతం ఎగుమతులు కేవలం ఎం ఎస్ ఎం ఈ లు ద్వారానే జరుగుతుందన్నారు. చిన్న పరిశ్రమలను రక్షించుకునేందుకు యువతీ యువకులు పారిశ్రామిక రంగం లో ప్రవేశించాలని ఆయన కోరారు. ఎం ఎస్ ఎం ఈ లను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం సెమినార్లు, ఎగ్జిబిషన్లు, వర్క్ షాపులు, అవార్డులు , గుర్తింపులు నిరంతరం కొనసాగించాలని ఆయన సూచించారు.ఈ శిక్షణా సమావేశంలో నవభారత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిక్కా ప్రభాకర్ గౌడ్, రీసోర్స్ పర్సన్లు కొడారి వెంకటేష్, వగ్గు క్రిస్టోఫర్, మాటూరి దశరథ, ఆవుల వినోద్, అధ్యాపకులు పూల్ చంద్, సంతోష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
Sep 02 2024, 17:26