చిన్న పరిశ్రమలే దేశానికి వెన్నుముక : చిక్క ప్రభాకర్ గౌడ్ ప్రిన్సిపాల్ నవభారత్ డిగ్రీ కళాశాల
భువనగిరి: చిన్న తరహా పరిశ్రమలే దేశానికి వెన్నెముక గా నిలిచి, దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతాయని నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చిక్కా ప్రభాకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం "స్కిల్ ఇండియా" సహకారంతో ఏర్పాటు చేసిన విద్యార్థుల శిక్షణా,అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో 2021 నుండి ప్రతి ఏటా ఆగస్టు 30 న *జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని* జరుపుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆర్థిక సహాయం అందించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించతో పాటు, దేశాన్ని ఆర్దికంగా అగ్ర భాగాన నిలబెట్టవచ్ఛని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సఫల్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా సీనియర్ రీసోర్స్ పర్సన్ ఎర్ర శివరాజ్ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాల క్రితం ఇన్ఫోసిస్, రిలయన్స్ సంస్థలు కూడా చిన్న తరహా పరిశ్రమలు గానే ప్రారంభమై నేడు టాప్ టెన్ లో నిలిచాయన్నారు. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, పరిశ్రమల స్థాపనలో, మరియు స్వయం ఉపాధి అవకాశాలకు ప్రాదాన్యత ఇవ్వాలని కోరారు. పరిశ్రమల స్థాపనలో విద్యార్థులకు శిక్షణా మరియు అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రిసోర్స్ పర్సన్ ఎర్ర శివరాజ్, నవభారత్ కళాశాల అధ్యాపకులు ఫూల్ చంద్, సంతోష్ కుమార్, రీసోర్స్ పర్సన్లు వగ్గు క్రిస్టోఫర్, కొడారి వెంకటేష్, మాటూరి దశరథ, మహిపాల్ , హరిబాబు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Sep 02 2024, 17:23