AP: ఆగస్టు 1న శ్రీశైలం డ్యామ్ వద్దకు సీఎం చంద్రబాబు
శ్రీశైలం వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం పెరుగుతోంది. మొత్తం 5 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 1 వ తేదీ న శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు రానున్నారు. కృష్ణమ్మకు ఆయన జలహారతి ఇవ్వనున్నారని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఆయా ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో వస్తోంది.
*రెండు రోజులపాటు రైల్వే గేట్ మూసివేత *గేటు పనులు జరుగుతున్నందున సహకరించండి *సౌత్ సెంట్రల్ రైల్వే సెక్షన్ ఇంజనీర్
చౌటుప్పల్ నాగారం గ్రామాల మధ్య, వలిగొండ- రామన్నపేట రైల్వే స్టేషన్ లో మధ్యలో ఉన్న రైల్వే గేటు ( గేట్ నెంబర్ 16) వద్ద పనులు జరుగుతున్నందున రైల్వే గేట్ ను  జూలై 31, ఆగస్టు 1 రెండు రోజులపాటు తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే సెక్షన్ సెక్షన్ ఇంజనీరు తెలిపారు. ఈ గేటు నుండి ఎలాంటి రాకపోకలు జరపబడవన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని ప్రయాణించాల్సిందిగా  సూచించారు. గేటు లో పనులు జరుగుతున్నందున వాహనదారులు, ప్రజలు అందరూ సహకరించాల్సిందిగా వారు కోరారు. .
తైక్వాండో ఛాంపియన్‌షిప్ లో నల్గొండ జిల్లాకు 4 బంగారు పతకాలు
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఈ నెల 27,  28 తేదీలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర తైక్వాండో క్యాడేట్ మరియు జూనియర్ ఛాంపియన్‌షిప్ 2024 విజయవంతంగా పూర్తయింది.

నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థులు 4 బంగారు పతకాలు, 3 రజత పతకాలు 6 కాంస్య పతకాలు సాధించారు. బంగారు పతక విజేతలు:
1. వాల్కి శ్రేష్ట చంద్ర
2. గుండాల అక్షయ
3. జె.రేష్మా గౌడ్
4. పి. సోహం
 
సిల్వర్ మెడల్ విజేతలు:
1. అబ్దుల్ ముక్సిత్
2. అబ్దుల్ ముహీత్
3. ఎం. సౌమిత్ర

కాంస్య పతక విజేతలు:
1. సదా శివ
2. షేక్ ఫిరోజ్
3. రాహుల్ బిట్టు
4. బి. యస్వంతి
5. మొహమ్మద్ సులేమాన్ మాలిక్ గోల్డ్ మెడల్ విజేతలు ఆగష్టు 18 నుండి 20 వరకు మహారాష్ట్ర (ఔరంగాబాద్) లో జరిగే జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పథకాలు సాధించిన విద్యార్థులకు ది తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు పి.విఠల్ బాబు ప్రధాన కార్యదర్శి యం డి. యూనుస్ కమాల్, కోషాదికారి అంబటి ప్రణీత్ లు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి A. ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.
NLG: 511 అడుగులకు చేరిన సాగర్ జలాశయం నీటిమట్టం
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 54,438 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 6744 ఉంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 511.40 అడుగులకు చేరుకుందని డ్యాం అధికారులు సోమవారం తెలిపారు. ప్రస్తుతం నీటి నిల్వ 134.0598 టిఎంసి లుగా ఉందని తెలిపారు.
చారుమతి చైల్డ్ కేర్ సెంటర్, ప్రభుత్వ ఎస్టి హాస్టల్లో లో పండ్లు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ

నల్గొండ: బైకాని శ్రీశైలం యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పానగల్ లోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ లో విద్యార్థిని విద్యార్థులకు పండ్లు మరియు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న JBS ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా నిర్మల్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక సేవ చేయడం అనేది ఎంతో అదృష్టమని తెలియజేస్తూ, ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్ మాజీ విద్యార్థి, మా శిష్యుడు మారేపల్లి అర్జున్ ఆధ్వర్యంలో ఎమరాల్డ్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ బైకానీ శ్రీశైలం యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమంలో విద్యార్థులకు ఈ రకమైన సేవ చేసే అవకాశాన్ని చేతబూనడం చాలా సంతోషదాయకమని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు కూడా చేపట్టాలని తెలియజేస్తూ, విద్యార్థులకు పండ్లు నోట్ బుక్స్ & పెన్నులు పంపిణీ చేసి అనంతరం విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరొక ముఖ్య అతిథి చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. బైకానీ శ్రీశైలం యాదవ్ ఉన్నత చదువులు చదువుకొని, కన్స్ట్రక్షన్ రంగంలో రాణిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటాడని తెలియజేస్తూ ఎంతోమంది యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ తను ఎన్నుకున్నరంగంలో రాణిస్తున్నాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ హాస్టల్ వార్డెన్ రామకృష్ణ, మారేపల్లి అర్జున్, మారేపల్లి మనోజ్, అక్కినపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ హయాం లోనే విద్యుత్ రంగం అభివృద్ధి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
TG: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు ఉచిత కరెంటు కాన్సెప్ట్ ను మొదటిసారిగా ప్రవేశపెట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఇవాళ ఐదవరోజు అసెంబ్లీ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ హయాంలోనే విద్యుత్ రంగం అభివృద్ధి చెందిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. విద్యుత్ రంగాన్ని గత బిఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసింది.యుపిఏ సర్కార్ ముందు చూపుతో రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీర్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
TG: 'నెట్‌ జీరో సిటీ’ స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
హైద్రాబాద్ శివారుల్లో అద్భుత నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య రహితం, కర్బన ఉద్గారాల రహితంగా ప్రతిపాదిత 'నెట్‌ జీరో సిటీ’ స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌ లో నెట్ జీరో సిటీని సీఎం సందర్శించారు. దీనిపై రూపొందించిన ప్రణాళికలను పరిశీలించి చేయాల్సిన మార్పుచేర్పులపై అధికారులకు సూచనలిచ్చారు.
SCVN ఫౌండేషన్ సేవలు అభినందనీయం
నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలం కొత్తబావి గ్రామానికి చెందిన  ఓ కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు తల్లితండ్రులు చనిపోవడం తో అనాధలు గా మారారు. గ్రామస్థుల సహకారంతో SCVN ఫౌండేషన్ ను సంప్రదించగా  వారి కుటుంబానికి   SCVN ఫౌండేషన్ వారు  రూ. 13,000/- మరియు 25 కేజీల రైస్ బ్యాగ్ అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు SCVN ఫౌండేషన్ సేవలు అభినందనీయం  అని కొనియాడారు.
TG: వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ
నాగర్ కర్నూలు జిల్లా, వంగూరు మండలం, పోల్కంపల్లి గ్రామంలో వీర నారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా విగ్రహం దాదాత బోగరాజు శ్రీనివాస్ (భవన నిర్మాణ నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి) ఆధ్వర్యంలో సురేంద్ర అధ్యక్షత వహించి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ కన్వీనర్ కొలుకులపల్లి రాధిక హాజరై మాట్లాడుతూ.. భూమికోసం,భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ఆనాడు దొర లపై తిరుగుబాటు జెండా ఎగరేవేసింది చాకలి ఐలమ్మ. ఐలమ్మ చేసిన భూ పోరాటం.. ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. వీర తెలంగాణ విప్లవ పోరాటాలకు ఒక ముఖ చిత్రంగా ఆమె నిలిచింది. దేశ్ముఖ్ దుర్మార్గాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర చాకలి ఐలమ్మ ది. నేటి యువత ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్ (రచయిత) నాగిళ్ళ శంకర్, కోఆర్డినేటర్ పగిళ్ల సందీప్, సురిగల రమేష్, చిలికేశ్వరం శ్రీనివాస్, మరియు కళాకారులు రేలారే గంగ, మద్దెల సందీప్,యక్కన్న తదితరులు పాల్గొన్నారు.
TG: ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కావాల్సిందే: మంత్రి ఉత్తమ్‌
HYD: రాష్ట్రంలో నీటి పారుదల శాఖపై జలసౌధ లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ సమీక్ష చేపట్టారు. నీటి పారుదల ఉన్నతాధికారులతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని, ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కావాల్సిందేనని అన్నారు.