Mane Praveen

Jul 29 2024, 10:56

కాంగ్రెస్ హయాం లోనే విద్యుత్ రంగం అభివృద్ధి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
TG: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు ఉచిత కరెంటు కాన్సెప్ట్ ను మొదటిసారిగా ప్రవేశపెట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఇవాళ ఐదవరోజు అసెంబ్లీ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ హయాంలోనే విద్యుత్ రంగం అభివృద్ధి చెందిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. విద్యుత్ రంగాన్ని గత బిఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసింది.యుపిఏ సర్కార్ ముందు చూపుతో రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీర్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Mane Praveen

Jul 28 2024, 21:54

TG: 'నెట్‌ జీరో సిటీ’ స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
హైద్రాబాద్ శివారుల్లో అద్భుత నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య రహితం, కర్బన ఉద్గారాల రహితంగా ప్రతిపాదిత 'నెట్‌ జీరో సిటీ’ స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌ లో నెట్ జీరో సిటీని సీఎం సందర్శించారు. దీనిపై రూపొందించిన ప్రణాళికలను పరిశీలించి చేయాల్సిన మార్పుచేర్పులపై అధికారులకు సూచనలిచ్చారు.

Mane Praveen

Jul 28 2024, 21:41

SCVN ఫౌండేషన్ సేవలు అభినందనీయం
నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలం కొత్తబావి గ్రామానికి చెందిన  ఓ కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు తల్లితండ్రులు చనిపోవడం తో అనాధలు గా మారారు. గ్రామస్థుల సహకారంతో SCVN ఫౌండేషన్ ను సంప్రదించగా  వారి కుటుంబానికి   SCVN ఫౌండేషన్ వారు  రూ. 13,000/- మరియు 25 కేజీల రైస్ బ్యాగ్ అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు SCVN ఫౌండేషన్ సేవలు అభినందనీయం  అని కొనియాడారు.

Mane Praveen

Jul 28 2024, 21:04

TG: వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ
నాగర్ కర్నూలు జిల్లా, వంగూరు మండలం, పోల్కంపల్లి గ్రామంలో వీర నారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా విగ్రహం దాదాత బోగరాజు శ్రీనివాస్ (భవన నిర్మాణ నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి) ఆధ్వర్యంలో సురేంద్ర అధ్యక్షత వహించి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ కన్వీనర్ కొలుకులపల్లి రాధిక హాజరై మాట్లాడుతూ.. భూమికోసం,భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ఆనాడు దొర లపై తిరుగుబాటు జెండా ఎగరేవేసింది చాకలి ఐలమ్మ. ఐలమ్మ చేసిన భూ పోరాటం.. ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. వీర తెలంగాణ విప్లవ పోరాటాలకు ఒక ముఖ చిత్రంగా ఆమె నిలిచింది. దేశ్ముఖ్ దుర్మార్గాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర చాకలి ఐలమ్మ ది. నేటి యువత ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్ (రచయిత) నాగిళ్ళ శంకర్, కోఆర్డినేటర్ పగిళ్ల సందీప్, సురిగల రమేష్, చిలికేశ్వరం శ్రీనివాస్, మరియు కళాకారులు రేలారే గంగ, మద్దెల సందీప్,యక్కన్న తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jul 28 2024, 20:19

TG: ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కావాల్సిందే: మంత్రి ఉత్తమ్‌
HYD: రాష్ట్రంలో నీటి పారుదల శాఖపై జలసౌధ లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ సమీక్ష చేపట్టారు. నీటి పారుదల ఉన్నతాధికారులతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని, ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కావాల్సిందేనని అన్నారు.

Mane Praveen

Jul 28 2024, 16:48

విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి: ఎస్ఎఫ్ఐ డిమాండ్
భారత విద్యార్థి ఫెడరేషన్ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ దేవరకొండ లోని పలు విద్యాసంస్థలలో ఎస్ఎఫ్ఐ  సభ్యత్వం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించి విద్యపై దృష్టి కేంద్రీకరించాలని, అదేవిదంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ పై విద్యా విధానంపై మేధావులతో చర్చ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్యను అంగన్వాడి సెంటర్ల ద్వారా అందించాలని  ప్లే స్కూల్గా అంగన్వాడి కేంద్రాలుగా మార్చి కేజీ నుండి మూడో తరగతి విద్య వరకు అందించి, తద్వారా 4 నుంచి 10వ తరగతి వరకు సెకండరీ విద్యను సెమీ రెసిడెన్షియల్ విద్యా విధానం ద్వారా ప్రభుత్వం విద్యను అందించాలనే నిర్ణయం ప్రభుత్వ విద్యను పూర్తిగా నష్టం చేసే విధంగా ఉందని అన్నారు. తక్షణమే ఈ ఆలోచనను విరమించుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రైమరీ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడి కేంద్రాలను ఫౌండేషన్ విద్యా పేరుతో నిర్వహించి, ప్రైమరీ తరగతులను నిర్వహించాలనే నూతన విద్యా విధానం 2020 ప్రతిపాదించిన ఆలోచనలను   తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అనిపిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఈ నిర్ణయం అమలు చేస్తే పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ అట్టడుగు విద్యార్థులకు విద్యను దూరం చేసే భాగమే అవుతుందని అన్నారు. ఒకపక్క తల్లిదండ్రులు కేజీ తరగతులు ప్రభుత్వ రంగంలో  నిర్వహించాలని డిమాండ్ చేస్తుంటే,ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయకుండా అంగన్వాడి  కేంద్రాలను ప్లే స్కూల్ గా మార్చి, ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే ఆలోచనను విరమించుకోవాలని అన్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్లో తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ప్రభుత్వ విద్యను  బలోపేతం చేయాలని అన్నారు.వెంటనే నూతన జాతీయ విద్యా విధానాన్ని జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ఎన్ఈపి కి వ్యతిరేకంగా  తీర్మానం చేసి కేంద్రంతో పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ అధ్యక్షులు, రామవత్ లక్ష్మణ్, రాహుల్, శ్రవణ్, రాకేష్, మనోజ్, మేఘన, సంధ్య,  స్వాతి, యాదమ్మ, జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jul 28 2024, 13:09

సెంట్రల్ యూనివర్సిటీలో సీట్లు సాధించిన ఎన్జీ కళాశాల విద్యార్థులు
నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో R.గణేష్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్/గ్రంథాలయ సమాచార శాస్త్రం, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు,
యదీశ్వర్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో సీట్లు సంపాదించినందుకు శనివారం, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్సిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో విద్యార్థులు సీటు సంపాదించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయ వనరులు, పరిశోధనలు, సివిల్స్ పై ప్రత్యేక శిక్షణ, ఉన్నత విద్యను అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నాగరాజు , డాక్టర్ కృష్ణ కౌండిన్య, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, తదితరులు అధ్యాపకులు పాల్గొని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించిన విద్యార్థులను అభినందించారు.

Mane Praveen

Jul 27 2024, 15:54

చౌటుప్పల్ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు కోసం సీఎంను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

HYD: జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఇవాళ చౌటుప్పల్ బార్ అసోసియేషన్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి  రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ నియమాలు, మార్గదర్శకాలు అనుకూలంగా ఉన్నాయని, అన్ని శాఖల డివిజన్ కార్యాలయాల తో పాటు, రెవిన్యూ డివిజన్, మున్సిపాలిటీగా ఉన్న చౌటుప్పల్ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రికి తెలిపారు.  యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కేంద్రాన్ని మినహాయిస్తే ఏకైక రెవిన్యూ డివిజన్ గా చౌటుప్పల్ ప్రాంతం ఉన్నదని.. అన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసి జ్యుడీషరీ పొజిషన్లో ఉన్నదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. వీటితోపాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకి కావలసిన పెండింగ్ కేసులకు సంబంధించి చౌటుప్పల్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయని వారు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే లా సెక్రెటరీ కి ఫోన్ చేసి పరిశీలించమని ఆదేశించారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు తాడూరు పరమేష్, జనరల్ సెక్రెటరీ రాపోలు శ్రీను, కోశాధికారి పడమటి జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పబ్బు రాజు తో పాటు చౌటుప్పల్ బార్ అసోసియేషన్ చెందిన 40 మంది అడ్వకేట్లు ఉన్నారు.

Mane Praveen

Jul 26 2024, 22:12

NCC ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు
నల్గొండ: స్థానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  NCC  ఆధ్వర్యంలో శుక్రవారం  కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహిచారు. గురువారం అరుణాచల్ ప్రదేశ్ లో జవానుగా విధులు నిర్వహిస్తూ మృతిచెందిన ఎన్జీ కళాశాల  పూర్వ NCC క్యాడేట్ ఈరటి మహేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగార్జున కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ ను దేశవ్యాప్తంగా జరుపబడుతున్నదని, 1999 జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారని, కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా మరియు తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికుల ధైర్యసాహసాలను గుర్తుచేశారు. భారత్ తన సరిహద్దులను సురక్షితంగా ఉంచుకోవడం మరియు సైనిక సంసిద్ధతను మెరుగుపరచుకోవడం కోసం, సరిహద్దులో ఉన్న జవానుల కృషి అభినందనీయమని క్యాడెట్లకు తెలియజేశారు.ఈ సందర్భంగా నాగార్జున ప్రభుత్వ కళాశాల, KPM జూనియర్ కళాశాల ల ఎన్సిసి క్యాడెట్లు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల ఎన్సిసి ఆఫీసర్ చిలుముల సుధాకర్, KPM జూనియర్ కళాశాల ఎన్సిసి ఆఫీసర్ జిల్లా నరసింహ మరియు కళాశాల అధ్యాపకులు, NCC  క్యాడేట్లు పాల్గొన్నారు.

Mane Praveen

Jul 26 2024, 21:55

భవన నిర్మాణ కార్మికులకు తంబ్‌ ఇంప్రెషన్‌ తొలగించి పాత పద్దతిలో కార్డులు ఇవ్వాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ,తంబ్‌ ఇంప్రెషన్‌ తొలగించి పాత పద్దతిలో భవన నిర్మాణ కార్మికులకు కార్డులు ఇవ్వాలనీ ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం డీసీఎల్ కార్యాలయం ముందు నిరసన తెలిపి సీనియర్ అసిస్టెంట్ వెంకట నరసయ్యకు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకాశాన్నంటే అందమైన భవనాలు నిర్మిస్తున్న భవన నిర్మాణ కార్మికుల బ్రతుకుల్లో వెలుగులు లేక చీకటి అలుముకుంది. నిర్మాణ రంగంలో తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా 25 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రమాదాలు లెక్కచేయకుండా ప్రాణాలను ఫణంగా పెట్టి  కార్మికులు భవనాలు నిర్మిస్తున్నారు.  పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెరగక ఆర్థిక భారంతో భవన కార్మికులు బ్రతుకులు సాగిస్తున్నారు. క్లైమ్ లకు,కొత్త కార్డులకు తంబు విధాన పెట్టడం వల్ల నిజమైన పనిచేసే కార్మికులకు సిమెంటు తో చేతులు అరిగి తంబ్ పడటం లేదని అన్నారు.తంబ్‌ ఇంప్రెషన్‌ తొలగించి పాతపద్దతిలో కార్డులు ఇవ్వాలనీ ప్రమాదవశాత్తు మరణిస్తే నిర్మాణ కార్మికుల కుటుంబానికి రూ.10లక్షలు, సహజ మరనానికి 5లక్షలు చెల్లించాలని కోరారు. సంక్షేమ బోర్డు, సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేసి కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. 50 ఏండ్లు నిండిన భవన నిర్మాణ కార్మికునికి ప్రతినెలా రూ.6 వేలు పెన్షన్‌ ఇవ్వాలనీ,ఇన్‌టైంలో రెన్యువల్‌ చేసుకోని వారికి రెన్యువల్‌ అనుమతి ఇవ్వాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా 1996 చట్ట ప్రకారం అడ్డాల వద్ద షెడ్‌లు, మంచినీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి మౌళిక సదుపాయాలు కల్పించాలి.ఖాళీగా ఉన్న డిసిఎల్‌, ఎఎల్‌ఓ, ఎసిఎల్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయాలి . భవన నిర్మాణ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి. నిర్మాణ కార్మికుల పిల్లలకు  స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలి.వలస కార్మికుల పేర్లు నమోదు చేసి గుర్తింపు, రేషన్‌ కార్డులు ఇవ్వాలి. ప్రసూతి సౌకర్యం రూ.50వేలకు పెంచాలి. ఆధార్‌ అప్‌డేట్‌, రెన్యువల్‌ అప్‌డేట్‌ ఎఎల్‌ఓలకే సరిచేసే అధికారం ఇవ్వాలి. 2019 వరకు ఆఫ్‌లైన్‌లో ఉండటం వలన చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నింటిని క్లియర్‌ చేయాలి. పెళ్ళి కానుక లక్ష రూపాయలకు పెంచాలని, ప్రస్తుత భవన నిర్మాణంలో ప్రభుత్వానికి కడుతున్న ఒక శాతం సెస్సును 2 శాతానికి పెంచాలి. కొత్త కార్డులు ఇప్పించే సందర్భంగా కానీ రెన్యువల్‌ చేసే సందర్బంగా కానీ మీ సేవాలో సాఫ్ట్‌వేర్‌ చాలా స్లోగా ఉంది, దీన్ని మెరుగుపర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్  కార్యదర్శి విశ్వనాధుల లేనిన్ భవనిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు గుండె రవి కార్యదర్శి రేవల్లి యాదయ్య, నాగరాజు లక్ష్మయ్య యూసఫ్, పుల్లయ్య అంజయ్య జయరాజు, నరసింహ వెంకన్న తదితరులు పాల్గొన్నారు