NCC ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు
నల్గొండ: స్థానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  NCC  ఆధ్వర్యంలో శుక్రవారం  కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహిచారు. గురువారం అరుణాచల్ ప్రదేశ్ లో జవానుగా విధులు నిర్వహిస్తూ మృతిచెందిన ఎన్జీ కళాశాల  పూర్వ NCC క్యాడేట్ ఈరటి మహేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగార్జున కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ ను దేశవ్యాప్తంగా జరుపబడుతున్నదని, 1999 జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారని, కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా మరియు తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికుల ధైర్యసాహసాలను గుర్తుచేశారు. భారత్ తన సరిహద్దులను సురక్షితంగా ఉంచుకోవడం మరియు సైనిక సంసిద్ధతను మెరుగుపరచుకోవడం కోసం, సరిహద్దులో ఉన్న జవానుల కృషి అభినందనీయమని క్యాడెట్లకు తెలియజేశారు.ఈ సందర్భంగా నాగార్జున ప్రభుత్వ కళాశాల, KPM జూనియర్ కళాశాల ల ఎన్సిసి క్యాడెట్లు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల ఎన్సిసి ఆఫీసర్ చిలుముల సుధాకర్, KPM జూనియర్ కళాశాల ఎన్సిసి ఆఫీసర్ జిల్లా నరసింహ మరియు కళాశాల అధ్యాపకులు, NCC  క్యాడేట్లు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు తంబ్‌ ఇంప్రెషన్‌ తొలగించి పాత పద్దతిలో కార్డులు ఇవ్వాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ,తంబ్‌ ఇంప్రెషన్‌ తొలగించి పాత పద్దతిలో భవన నిర్మాణ కార్మికులకు కార్డులు ఇవ్వాలనీ ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం డీసీఎల్ కార్యాలయం ముందు నిరసన తెలిపి సీనియర్ అసిస్టెంట్ వెంకట నరసయ్యకు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకాశాన్నంటే అందమైన భవనాలు నిర్మిస్తున్న భవన నిర్మాణ కార్మికుల బ్రతుకుల్లో వెలుగులు లేక చీకటి అలుముకుంది. నిర్మాణ రంగంలో తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా 25 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రమాదాలు లెక్కచేయకుండా ప్రాణాలను ఫణంగా పెట్టి  కార్మికులు భవనాలు నిర్మిస్తున్నారు.  పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెరగక ఆర్థిక భారంతో భవన కార్మికులు బ్రతుకులు సాగిస్తున్నారు. క్లైమ్ లకు,కొత్త కార్డులకు తంబు విధాన పెట్టడం వల్ల నిజమైన పనిచేసే కార్మికులకు సిమెంటు తో చేతులు అరిగి తంబ్ పడటం లేదని అన్నారు.తంబ్‌ ఇంప్రెషన్‌ తొలగించి పాతపద్దతిలో కార్డులు ఇవ్వాలనీ ప్రమాదవశాత్తు మరణిస్తే నిర్మాణ కార్మికుల కుటుంబానికి రూ.10లక్షలు, సహజ మరనానికి 5లక్షలు చెల్లించాలని కోరారు. సంక్షేమ బోర్డు, సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేసి కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. 50 ఏండ్లు నిండిన భవన నిర్మాణ కార్మికునికి ప్రతినెలా రూ.6 వేలు పెన్షన్‌ ఇవ్వాలనీ,ఇన్‌టైంలో రెన్యువల్‌ చేసుకోని వారికి రెన్యువల్‌ అనుమతి ఇవ్వాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా 1996 చట్ట ప్రకారం అడ్డాల వద్ద షెడ్‌లు, మంచినీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి మౌళిక సదుపాయాలు కల్పించాలి.ఖాళీగా ఉన్న డిసిఎల్‌, ఎఎల్‌ఓ, ఎసిఎల్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయాలి . భవన నిర్మాణ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి. నిర్మాణ కార్మికుల పిల్లలకు  స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలి.వలస కార్మికుల పేర్లు నమోదు చేసి గుర్తింపు, రేషన్‌ కార్డులు ఇవ్వాలి. ప్రసూతి సౌకర్యం రూ.50వేలకు పెంచాలి. ఆధార్‌ అప్‌డేట్‌, రెన్యువల్‌ అప్‌డేట్‌ ఎఎల్‌ఓలకే సరిచేసే అధికారం ఇవ్వాలి. 2019 వరకు ఆఫ్‌లైన్‌లో ఉండటం వలన చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నింటిని క్లియర్‌ చేయాలి. పెళ్ళి కానుక లక్ష రూపాయలకు పెంచాలని, ప్రస్తుత భవన నిర్మాణంలో ప్రభుత్వానికి కడుతున్న ఒక శాతం సెస్సును 2 శాతానికి పెంచాలి. కొత్త కార్డులు ఇప్పించే సందర్భంగా కానీ రెన్యువల్‌ చేసే సందర్బంగా కానీ మీ సేవాలో సాఫ్ట్‌వేర్‌ చాలా స్లోగా ఉంది, దీన్ని మెరుగుపర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్  కార్యదర్శి విశ్వనాధుల లేనిన్ భవనిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు గుండె రవి కార్యదర్శి రేవల్లి యాదయ్య, నాగరాజు లక్ష్మయ్య యూసఫ్, పుల్లయ్య అంజయ్య జయరాజు, నరసింహ వెంకన్న తదితరులు పాల్గొన్నారు
వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు
యాదాద్రి జిల్లా:
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా బస్టాప్ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు శుక్రవారం మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర నాయక్, డిఇ రాములు, బస్ డిపో మేనేజర్ శ్రీనాథ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ కొరగోని లింగస్వామి, దండ అరుణ్ కుమార్, కామిశెట్టి భాస్కర్, రామాలయ గుడి చైర్మన్ బొబ్బిళ్ళ మురళి, ట్రినిటీ స్కూల్ డైరెక్టర్ కృష్ణారావు, ప్రిన్సిపాల్ ఉజ్జిని మంజుల, మున్సిపల్ అధికారులు వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
NLG: మాల మహానాడు జిల్లా మీడియా అధ్యక్షులుగా గోగు బాలసైదులు
నల్గొండ:  జడ్పీగెస్ట్ హౌస్ లో మాల మహానాడు సమావేశం మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ అధ్యక్షతన  నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా మీడియా అధ్యక్షులుగా గోగు బాలసైదులు నియామకం పత్రాన్ని అందజేశారు. ముఖ్యఅతిథిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, విద్యార్థి జిల్లా అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ నాగాటి జోసఫ్, కామర్ల నరేష్ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి, పెరమళ్ళ వినోద్ రాష్ట్ర నాయకులు, చింతపల్లి వెంకన్న జిల్లా విద్యార్థి ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నామినేషన్ దాఖలు చేసిన అల్వాల్ రెడ్డి
మర్రిగూడ: అధిష్టానం అభిప్రాయం మేరకు యూత్ కాంగ్రెస్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఈనెల 20వ తేదీన నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని కొడాల అల్వాల్ రెడ్డి అన్నారు. గురువారం స్థానికంగా అతను మాట్లాడుతూ.. మండల ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, యువకులు కార్యకర్తలు అందరూ తన యొక్క విజయానికి సహకరించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో మర్రిగూడ మాజీ  ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, మండల నాయకులు నున్సావత్ బిచ్చునాయక్, సత్తిరెడ్డి, నవీన్ లు ఉన్నారు.
NLG: ఫీవర్ సర్వే తో పాటు లార్వా సర్వే కూడా చేయాలి: జిల్లా మలేరియా అధికారి గంగప్ప
నల్లగొండ: ఆర్పిలు, ఆశ వర్కర్లు ఫీవర్ సర్వే తో పాటు లార్వా సర్వే కూడా చేయాలని జిల్లా మలేరియా అధికారి గంగప్ప కోరారు. గురువారం నల్లగొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఫీవర్ సర్వే పై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీవర్ సర్వే చేసిన ఇళ్ళలో జ్వరంతో బాధపడే వ్యక్తులు ఉన్నట్లైతే వారి వివరాలు సేకరించి, మరుసటి రోజు వారి గురించిన వివరాలు మరల కనుక్కోవాలని అన్నారు. లార్వా నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వెంటనే వాటిని శుభ్రపరచాలని సిబ్బందికి సూచించారు. రోజు సర్వే చేసిన 50 ఇళ్ళకు సంబందించిన వివరాలు నోట్ చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ ముసబ్ అహ్మద్ మట్లాడుతూ.. నేటి నుండి  48 వార్డులలో ఆర్పి లు, ఆశ వర్కర్లు కలిసి ఫీవర్ సర్వే, లార్వ సర్వే చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ సూపర్వైజర్లు, మెప్మా సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
NLG: బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేసేలా ఉంది: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేసేలా ఉందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ అన్నారు. ఈరోజు స్థానిక  ఐబీ కార్యాలయం వద్ద బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. రూ. 48,20,512 కోట్ల భారీ బడ్జెట్ తో మన తెలుగింటి ఆడపడుచు నిర్మల సీతారామన్  ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగం, వ్యవసాయం, మహిళా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి కొరకు అధిక నిధులు కేటాయించి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన అన్నారు. రక్షణ రంగానికి 6.22 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా ఈ దేశ రక్షణ విషయంలో తమ వైఖరిని స్పష్టం చేయడం జరిగిందని అన్నారు. యువతకు ఉపాధి నైపుణ్య అభివృద్ధి కొరకు రెండు లక్షల కోట్ల రూపాయలను, వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్లు మహిళా సంక్షేమానికి మూడు లక్షల కోట్లు గ్రామీణ అభివృద్ధికి 1.77 లక్షల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి అన్ని రంగాలకు  ప్రాధాన్యతలిచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో ఆత్మ నిర్భర భారత వైపు పయనించడమే తమ లక్ష్యమని నిన్నటి బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరోసారి చాటి చెప్పిందని ఆయన అన్నారు. మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గాలకు పన్ను మినహాయింపులు ప్రకటించి ఊరట కలిగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకురి నరసింహ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేతల వెంకటేష్ , రెడ్డి శంకర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి జల్దాభాస్కర్, గంజి హరి కుమార్, ఈడం రవికుమార్ శేఖర్ రెడ్డి, గంప పణి బిక్షపతి జాదవ్, గుండాల అంజి, బెలిదే మాధవి, అప్పం అజయ్, గడ్డం శివ, కాసుల శంకరయ్య, చిత్రం ఉదయ్ ,కర్తాల బాలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఇవాళ ముక్కం యాదయ్య కు రూ. 40,500/-, వనపర్తి యాదయ్య కు రూ.10000/- రెడ్డగోని అలివేలు కు రూ. 27500/- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో కులవరం అశోక్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు, కురంపల్లి జంగయ్య, జమ్ముల వెంకటేష్, అందుగుల ముత్యాలు, సిలువేరు యాదయ్య, గజ్జి యాదయ్య, ఉప్పునూతల ముత్తయ్య, తోడుసు వెంకటయ్య, వల్లంల గాంధీ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఈనెల 26న మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 26 వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు సాధారణ సమావేశము నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశము కౌన్సిల్ హాల్ లో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కమిషనర్ కోరారు.
ఈ నెల 27 నుండి ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ రామచంద్ర ఆన్లైన్ క్లాసులు
ఈనెల 21 న నల్గొండలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య సదస్సు కార్యక్రమ సదస్సులో దాదాపు 1200 మంది విద్యార్థులు, పుర ప్రముఖులు, ఉద్యోగస్తులు, క్రీడాకారులు, సీనియర్ సిటిజన్స్ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకు,  గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర క్రీడల కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 4 గంటలపాటు సాగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం ప్రకృతి మాత అందిస్తున్న వనరులను వినియోగించుకుని డబ్బులు వృధా చేసుకోకుండా సంపూర్ణ ఆరోగ్యం గా తయారు కావాలని సూచించారని, ఈ నెల 27 నుండి ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ రామచంద్ర ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.