చీల్చి చెండాడి వేటాడుతం...‼️

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. బ‌డ్జెట్‌ను చూస్తుంటే ఇది రైతు శ‌త్రువు ప్ర‌భుత్వం అని తేలిపోయింద‌న్నారు. అన్ని వ‌ర్గాల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెన్నుపోటు పొడిచింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వ‌ద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు.

గ‌త ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల సంక్షేమాన్ని ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. యాద‌వ సోద‌రుల ఆర్థికాభివృద్ధి కోసం ప్ర‌వేశ‌పెట్టిన గొర్రెల పంపకం ప‌థ‌కాన్ని మూసివేసిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది. అట్ట‌డుగు వ‌ర్గాల గొంతు కోసింది. ద‌ళిత బంధు ప్ర‌స్తావ‌న లేనే లేదు. ఇది చాలా దుర్మార్గం. ద‌ళిత స‌మాజం ప‌ట్ల నిర్ల‌క్ష్యానికి, ఫ్యూడ‌ల్ విధానానికి ఇంత గొప్ప నిద‌ర్శ‌నం లేదు. మ‌త్స్య‌కారుల‌కు భ‌రోసా లేదు. ఇందులో విశేషం ఏంంటంటే.. అంకెలు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆర్థిక మంత్రి ఒత్తిఒత్తి ప‌లక‌డం త‌ప్ప కొత్త‌గా ఏం లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు.

మ‌హిళ‌ల ప‌ట్ల కూడా చాలా విష‌యాలు స్ప‌ష్టంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉండే. ఏదో కొత్త‌గా ల‌క్ష కోట్ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాలు ఇస్తామ‌ని చెప్పారు. అది ఆల్రెడీ ఉన్న స్కీమే. దుర‌దృష్టం ఏందంటే.. ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ త‌ర్వాత మేం కూడా క‌నీసం 6 నెల‌ల స‌మ‌యం ఇవ్వాల‌నుకున్నాం. నేను కూడా పెద్ద‌గా శాస‌న‌స‌భ‌కు రాలేదు. కానీ ఈ రోజు బ‌డ్జెట్ చూస్తే.. ఏ ఒక్క పాల‌సీ ఫార్ములేష‌న్ జ‌ర‌గ‌లేదు. రాష్ట్రానికి సంబంధించిన‌టువంటి ఏ ఒక్క విష‌యంలో కూడా ఈ అర్బ‌క ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు పాల‌సీ ఫార్ములేష‌న్ చేసిన‌ట్టుగా క‌న‌బ‌డుత‌లేదు అని కేసీఆర్ తెలిపారు.

వ్య‌వ‌సాయం విష‌యంలో మాకు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉండే. ఈ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ స్థీరిక‌ర‌ణ జ‌ర‌గాల‌ని, మేం రెండు పంట‌ల‌కు రైతుబంధు ఇచ్చాం. వీళ్లెమో ఎగ్గొడుతామ‌ని చెబుతున్నారు. రైతుల‌కు ఇచ్చిన డ‌బ్బును పాడు చేసినం.. చెడ‌గొట్టినం.. దుర్వినియోగం చేసినం అనే ప‌ద్ధ‌తిలో దుర‌దృష్ట‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శ‌త్రువు ప్ర‌భుత్వం అని తెలుస్తుంది.

ధాన్యం కొనుగోలు చేయ‌లేదు. విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డం లేదు. నీళ్లు స‌ర‌ఫ‌రా చేయ‌డం లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతుబంధు, రైతుభ‌రోసా ప్ర‌స్తావ‌నే లేదు. రైతుభ‌రోసా ఎప్పుడు వేస్తార‌ని మా ఎమ్మెల్యేలు అరిస్తే క‌నీసం స‌మాధానం చెప్ప‌డం లేదు. కాబ‌ట్టి రైతుల‌ను ఈ ప్ర‌భుత్వం వంచించింది. వృత్తి కార్మికుల‌ను వంచించింది అని కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇండ‌స్ట్రీయ‌ల్ పాల‌సీ ఏమిటి..? ఏం లేదు వ‌ట్టిదే గ్యాస్.. ట్రాష్. ఇదేదో స్టోరీ టెల్లింగ్‌లాగా ఉంది త‌ప్ప బ‌డ్జెట్‌లాగా లేదు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయ పాల‌సీ ఏమిటి..? పారిశ్రామిక పాల‌సీ ఏమిటి..? ఐటీ పాల‌సీ ఏమిటి..? ఇంకా ఇత‌ర అనేక పాల‌సీలు.. పేద వ‌ర్గాల‌కు సంబంధించిన పాల‌సీ ఏమిటి..? అనే ఏ ఒక్క‌దాని మీద కూడా స్ప‌ష్ట‌త లేదు.

అంత వ‌ట్టిదే గ్యాస్, ట్రాషే. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్లాట్‌ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది త‌ప్ప అది బ‌డ్జెట్ ప్ర‌సంగంలా లేదు. రాజ‌కీయ స‌భ‌ల్లో చెప్పిన‌ట్టుగా ఉంది త‌ప్ప ఏ ఒక్క పాల‌సీని కూడా నిర్దిష్టంగా ఈ ప‌నిని మేం ఇలా సాధిస్తాం.. మా గోల్స్, టార్గెట్స్ ఇవి అనే ప‌ద్ధ‌తి కానీ, ప‌ద్దు కానీ లేదు. ఇది పేద‌ల బ‌డ్జెట్ కాదు.. రైతుల బ‌డ్జెట్ కాదు.. ఎవ‌రి బ‌డ్జెటో రేపు మీకు విశ్లేష‌ణ‌లో తెలుస్త‌ది. భ‌విష్య‌త్‌లో బ్ర‌హ్మాండంగా చీల్చి చెండాడ‌బోతాం అని కేసీఆర్ తేల్చిచెప్పారు.

నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు..

ప్రశ్నోత్తరాలు, కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. 

ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం.. 

గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ.. 

ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్న సీఎం చంద్రబాబు.. 

ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్న మంత్రులు.

నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు‼️

- ఆగస్టు 5 వరకు పరీక్షలు

- మొత్తం పోస్టులు 11,062

- 2.70 లక్షల మంది అభ్యర్థులు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలను గురువారం నుంచి నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 5 వరకు జరిగే ఈ పరీక్షలు కొనసాగనున్నాయి.

11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. సుమారు 2.79 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

వారిలో బుధవారం రాత్రి వరకు 2.48 లక్షల మంది తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 2.30 గంటల పాటు జరిగే పరీక్షలో 160 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 80 మార్కులు కేటాయించారు.

టెట్‌ ద్వారా మరో 20 మార్కులు వెయిటేజీలో భాగంగా కలపనున్నారు.

డీఎస్సీ పరీక్షలను రాష్ట్రం యూనిట్‌గా నిర్వహిస్తున్నారు. ఫలితాలు విడుదల చేసి, మెరిట్‌ జాబితాను మాత్రం జిల్లాల వారీగా ప్రకటిస్తారు.

నియామకాలు కూడా జిల్లా యూనిట్‌గా చేయనున్నారు. కాగా, ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఎస్‌జీటీ 6,508, భాషా పండితులు 272, పీఈటీ 182, స్పెషల్‌ క్యాటగిరీ స్కూల్‌ అసిస్టెంట్‌ 220, స్పెషల్‌ క్యాటగిరీ ఎస్‌జీటీ పోస్టులు 796 ఉన్నాయి.

మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులతో అమెరికా హైఅలర్ట్‌.

పెన్సిల్వేనియా బట్లర్‌లో ట్రంప్‌పై దాడి జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన సీక్రెట్‌ సర్వీస్. 

ఆ ప్రాంతంలోని బిల్డింగ్‌లను తమ ఆదీనంలోకి తీసుకున్న బలగాలు. 

కాల్పుల ఘటనలో ట్రంప్‌ కుడి చెవి భాగంలో గాయం. 

ట్రంప్‌పై దాడి జరిపిన దుండగుడిని కాల్చి చంపిన బలగాలు.

Streetbuzz News

SB NEWS

Real Time News Platform

సిద్ధరామయ్య సతీమణి పై కేసు ‼️

)

- ఫోర్జరీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్‌ చేశారని ఆరోపణలు

కర్ణాటక రాజకీయాల్లో మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ముడా) భూకుంభకోణం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

తాజాగా ఈ స్కామ్‌కు సంబంధించి సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్‌, మరో వ్యక్తిపై స్నేహమయి కృష్ణ అనే సామాజిక కార్యకర్త మైసూర్‌లోని విజయనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సిద్ధరామయ్య, పార్వతి, ముడా అధికారులతోపాటు మైసూర్‌ జిల్లా కలెక్టర్‌, పలువురు ఇతర ప్రభుత్వ అధికారులకు భూ కేటాయింపు కుంభకోణంలో పాత్ర ఉన్నదని ఆరోపించారు. ఇందుకు రెవెన్యూ, ఇతర అధికారులు సహకరించారని ఆరోపించారు.

భూ కేటాయింపు వివాదంపై దర్యాప్తు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ కార్యదర్శిలకు కూడా స్నేహమయి కృష్ణ లేఖ రాశారు.

అయితే ఈ భూ కేటాయింపులు బీజేపీ హయాంలోనే జరిగాయని సీఎం సిద్ధరామయ్య అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తున్నది.

ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలు ‼️

ఖాళీలను సక్రమంగా చూపలేదు.. చూపినవాటిల్లోనూ తప్పులు.. ఇక రాత్రికి రాత్రే మారిన జోన్లు.. ఇదేంటని టీచర్లు అడిగితే బదిలీలు కావాలంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి అని హూంకారం!

ఆందోళనకు దిగితే పోలీసులతో బెదిరింపులు! ఇదీ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో బదిలీల పరిస్థితి. గురుకుల బదిలీల ప్రక్రియ అంతా గందరగోళంగా కొనసాగుతున్నది.

ప్రణాళిక అంటూ లేకుండా సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా బదిలీలు నిర్వహిస్తున్నారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బదిలీ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

సొసైటీ సాధారణ బదిలీల ప్రక్రియను ఇటీవలే ప్రారంభించగా.. మొదటి నుంచి 317 బాధితులకు న్యాయం చేస్తామని, స్పౌజ్‌, ఇతర మెడికల్‌ కేసులను పరిష్కరిస్తామని, అంతా కూడా ఆన్‌లైన్‌ ద్వారానే బదిలీలను చేపడతామని సొసైటీ అధికారులు ప్రకటించారు.

కానీ, ఆచరణలో పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషనలైజేషన్‌ నిబంధనల ప్రకారం అదనపు ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిన సందర్భంలో తొలుత సీనియర్ల అంగీకారం తీసుకోవాలి.

బలవంతంగా బదిలీ చేయాల్సివస్తే జూనియర్లను మాత్రమే బదిలీ చేయాలి. కానీ సొసైటీ మాత్రం అందుకుపూర్తి విరుద్ధంగా ఏకపక్షంగా రాత్రికిరాత్రే సీనియర్‌ టీచర్లతో లిస్ట్‌ విడుదల చేసి, మరుసటి రోజే కౌన్సెలింగ్‌కు రమ్మని పిలవటంపై టీచర్లు నిప్పులు చెరుగుతున్నారు.

317 జీవో, స్పౌజ్‌ కేసులను కూడా సొసైటీ పరిగణనలోకి తీసుకోవటం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చాక, అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బదిలీల కోసం ముందుగా ప్రకటించిన మెరిట్‌ జాబితాలో పేర్లు ఉండగా, తాజాగా ప్రకటించిన మెరిట్‌ జాబితాలో లేవని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పారదర్శకత పాటించాలని, సీనియర్‌ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి

జిల్లాలోని రామడుగు మండలం వేదిర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది . కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి లోని గంగాధ మండలంలో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఫిట్స్ వచ్చింది .

వెంటనే బస్సులోని ప్రయాణికులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు . అంబులెన్స్ వేగంగా రాకపోవడంతో ప్రయాణికుడి బస్సులోని శ్వాశ విడిచాడు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు పై అరా తీస్తున్నారు .

బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మిస్టర్ తెలంగాణ మహ్మద్ సోహైల్

సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాడీబిల్డర్ మహ్మద్ సోహైల్(23) బైక్‌ను అతి వేగంగా నడుపుతూ స్క్రాప్ ఆటోను ఢీకొట్టాడు.. 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహ్మద్ సోహైల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సోహైల్ తన కెరీర్‌లో అనేక జిల్లా-స్థాయి, రాష్ట్ర-స్థాయి, దక్షిణ భారత-స్థాయి బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు.. 

మిస్టర్ తెలంగాణ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన మహ్మద్ సోహైల్ చిన్న వయసులో మరణించడంతో అందరూ కన్నీరుమున్నీరు అయ్యారు.

Streetbuzz News

Real time news platform

SB NEWS

సిరాజ్ కు బంపర్ ఆఫర్ ...‼️

టీ20 వరల్డ్‌కప్ విన్నర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ గెలిచినందుకు సిరాజ్‌కు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అంతేకాదు.. భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను సిరాజ్‌కు నగరంలో ఓ ఇంటిస్థలం ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అటు.. సిరాజ్ టీమిండియా జెర్సీని సీఎంకి బహూకరించాడు.

ఇదిలావుండగా.. టీ20 వరల్డ్‌కప్ సాధించిన భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ ఉన్న విషయం తెలిసిందే. అమెరికా వేదికగా జరిగిన తొలి మూడు మ్యాచ్‌ల్లో అతడు తుది జట్టులో ఉన్నాడు. అయితే.. వెస్టిండీస్‌కు వేదిక షిఫ్ట్ అయ్యాక అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు.

అక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో.. సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ని తీసుకోవడం జరిగింది. ఆ మూడు మ్యాచ్‌ల్లో సిరాజ్ ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అయితే.. స్పెల్ మాత్రం బాగా వేశాడు. భారీ పరుగులు ఇవ్వకుండా, కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి తన సత్తా చాటాడు.

మరోవైపు.. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు సిరాజ్‌కు ఘనస్వాగతం లభించింది. అభిమానులు అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

అది చూసి ఉప్పొంగిపోయిన సిరాజ్.. తానూ వాహనంపై ఓపెన్ టాప్ తీసి పాట పాడారు. డ్యాన్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నింపారు. కాగా.. సీఎం రేవంత్‌ని సిరాజ్ కలిసిన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజహరుద్దీన్‌ కూడా పాల్గొన్నారు.

మరోవైపు.. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు సిరాజ్‌కు ఘనస్వాగతం లభించింది. అభిమానులు అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అది చూసి ఉప్పొంగిపోయిన సిరాజ్.. తానూ వాహనంపై ఓపెన్ టాప్ తీసి పాట పాడారు. డ్యాన్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నింపారు. కాగా.. సీఎం రేవంత్‌ని సిరాజ్ కలిసిన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజహరుద్దీన్‌ కూడా పాల్గొన్నారు.

లక్ష్మీ నరసింహస్వామి నీ దర్శించుకున్న డిజిపి..

రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు మాట్లాడుతూ..

గుంటూరు లోనే పుట్టి చదువుకుని డీజీపీ స్థాయిలో ఇక్కడికి రావడం సంతోషం..

లక్ష్మీ నరసింహస్వామి గుడిని చిన్నప్పటి నుండి దర్శించుకునేవాడిని..

కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోడం సంతోషంగా ఉంది..

పోలీసులు అందరూ జవాబుదారీ తనంగా ఉండేలా చేస్తాం..

పోలీస్ వ్యవస్థలో కొన్ని సదుపాయాలు లేక కొన్ని విభాగాలు మూతపడ్డాయి..

ఇప్పుడు వాటిని మళ్ళీ ప్రారంభించి నూతన విధానాన్ని అమలు చేస్తాం..

క్రింది స్థాయి పోలీసులకు ఉన్న సమస్యలు తీర్చాడనికి కృషి చేస్తాం..