Mane Praveen

Jul 24 2024, 21:57

NLG: బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేసేలా ఉంది: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేసేలా ఉందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ అన్నారు. ఈరోజు స్థానిక  ఐబీ కార్యాలయం వద్ద బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. రూ. 48,20,512 కోట్ల భారీ బడ్జెట్ తో మన తెలుగింటి ఆడపడుచు నిర్మల సీతారామన్  ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగం, వ్యవసాయం, మహిళా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి కొరకు అధిక నిధులు కేటాయించి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన అన్నారు. రక్షణ రంగానికి 6.22 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా ఈ దేశ రక్షణ విషయంలో తమ వైఖరిని స్పష్టం చేయడం జరిగిందని అన్నారు. యువతకు ఉపాధి నైపుణ్య అభివృద్ధి కొరకు రెండు లక్షల కోట్ల రూపాయలను, వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్లు మహిళా సంక్షేమానికి మూడు లక్షల కోట్లు గ్రామీణ అభివృద్ధికి 1.77 లక్షల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి అన్ని రంగాలకు  ప్రాధాన్యతలిచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో ఆత్మ నిర్భర భారత వైపు పయనించడమే తమ లక్ష్యమని నిన్నటి బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరోసారి చాటి చెప్పిందని ఆయన అన్నారు. మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గాలకు పన్ను మినహాయింపులు ప్రకటించి ఊరట కలిగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకురి నరసింహ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేతల వెంకటేష్ , రెడ్డి శంకర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి జల్దాభాస్కర్, గంజి హరి కుమార్, ఈడం రవికుమార్ శేఖర్ రెడ్డి, గంప పణి బిక్షపతి జాదవ్, గుండాల అంజి, బెలిదే మాధవి, అప్పం అజయ్, గడ్డం శివ, కాసుల శంకరయ్య, చిత్రం ఉదయ్ ,కర్తాల బాలు తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jul 24 2024, 21:28

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఇవాళ ముక్కం యాదయ్య కు రూ. 40,500/-, వనపర్తి యాదయ్య కు రూ.10000/- రెడ్డగోని అలివేలు కు రూ. 27500/- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో కులవరం అశోక్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు, కురంపల్లి జంగయ్య, జమ్ముల వెంకటేష్, అందుగుల ముత్యాలు, సిలువేరు యాదయ్య, గజ్జి యాదయ్య, ఉప్పునూతల ముత్తయ్య, తోడుసు వెంకటయ్య, వల్లంల గాంధీ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jul 24 2024, 12:56

NLG: ఈనెల 26న మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 26 వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు సాధారణ సమావేశము నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశము కౌన్సిల్ హాల్ లో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కమిషనర్ కోరారు.

Mane Praveen

Jul 23 2024, 16:44

ఈ నెల 27 నుండి ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ రామచంద్ర ఆన్లైన్ క్లాసులు
ఈనెల 21 న నల్గొండలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య సదస్సు కార్యక్రమ సదస్సులో దాదాపు 1200 మంది విద్యార్థులు, పుర ప్రముఖులు, ఉద్యోగస్తులు, క్రీడాకారులు, సీనియర్ సిటిజన్స్ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకు,  గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర క్రీడల కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 4 గంటలపాటు సాగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం ప్రకృతి మాత అందిస్తున్న వనరులను వినియోగించుకుని డబ్బులు వృధా చేసుకోకుండా సంపూర్ణ ఆరోగ్యం గా తయారు కావాలని సూచించారని, ఈ నెల 27 నుండి ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ రామచంద్ర ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Mane Praveen

Jul 23 2024, 12:22

TG: ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత‌ల‌కుఇక నుండి పింఛన్.. ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పద్మశ్రీ అవార్డులు ప్రకటంచగానే శిల్పరామం లో ఘనంగా సత్కరించిన విషయం విదితమే! ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షలు నజరానా అందించగా, ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛన్ కు సంబంధించి ఇవాళ జివో విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు సిఎం రేంవ‌త్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. అందులో భాగంగా ఇటీవ‌ల ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని అందుకున్న గ‌డ్డం స‌మ్మ‌య్య‌, దాస‌రి కొండ‌ప్ప‌ తదితరులకు ప్ర‌తీ నెల25 వేల రూపాయల ప్ర‌త్యేక‌ పింఛ‌న్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసినట్లు వివరించారు. ఇక నుంచి సాంస్కృతిక శాఖ ద్వారా పింఛ‌న్ డ‌బ్బులు నేరుగా వారి ఖాతాల్లో జ‌మ అవుతాయి.

Mane Praveen

Jul 21 2024, 23:16

NLG: సకల ఔషధ నిధి ప్రకృతి
నల్గొండ: సకల ఔషధాల నిధి ప్రకృతి అని.. దాన్ని పరిరక్షించుకుని సహజసిద్ధమైన ఆయుర్వేద ఔషధాలను ఉపయోగించడంతో ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను సైతం న్యాయం చేయవచ్చని సిద్ధార్థ యోగ విద్యాలయం, ప్రకృతి వైద్యులు డాక్టర్ కే వై రామచంద్రరావు తెలిపారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ - సిద్ధార్థ యోగ విద్యా నిలయం సంయుక్తంగా నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం ' *ప్రకృతి జీవన విజ్ఞానం - ఆరోగ్య సదస్సు*'. నిర్వహించారు. దీనికి ఆయన *ముఖ్య అతిథిగా హాజరై* గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి పై అవగాహన ఉంటే చిన్నచిన్న రోగాలను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలను ప్రకృతిలో లభించే వివిధ ఫలాలు, గింజలు, ఆకులను ఉపయోగించుకొని దూరం చేసుకోవచ్చన్నారు.నేటి ఆధునిక జీవన విధానంలో ఆహార నియమాలు పైన అవగాహన లేకపోవడంతో ఒత్తిడికి గురి అవుతూ అనేక రకాల సమస్యలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే యోగ మెడిటేషన్ తో పాటు ఆరోగ్య నియమాలను పాటిస్తూ సహజసిద్ధమైన జొన్నలు, రాగులు, మినుములు ఇలాంటి మిల్లెట్స్ ను ఆహారంగా రోజువారిగా తీసుకోవడం తో ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్నారు.

ఆధునిక విజ్ఞానం పేరుతో 80% ప్రజలు లక్షలు ఖర్చుపెట్టి పేదరికంలోనికి నిట్టపడుతున్నారని అన్నారు. వీటిపై చైతన్యం చేసేందుకే గత కొన్ని దశాబ్దాలుగా సిద్ధార్థ యోగ విద్యాలయం రామచంద్ర ప్రకృతి ఆశ్రమాల ద్వారా లక్షల మందికి పైగా నేచురల్ లైఫ్ సైన్స్ పై అవగాహన కల్పిస్తూ బిపి షుగర్ థైరాయిడ్ పిసిఒడి అధిక బరువు కిడ్నీ గౌట్ మానసిక రోగాలు యాసిడిటీ గ్యాస్ట్రిక్ మలబద్దకం ఇమ్యూనిటీ తగ్గిపోవడం గుండె జబ్బులు బ్రెయిన్ స్ట్రోక్ సోరియాసిస్ తల తిరుగుడు వంటి వ్యాధులను ఆయుర్వేద చికిత్స ద్వారా నయం చేశామన్నారు. ఇలాంటి సదస్సులు నిర్వహించిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు
డాక్టర్ N.G. పద్మ మాట్లాడుతూ రోజువారిగా తీసుకోవలసిన ఆహారము, నియమాలను ప్రాక్టికల్ గా ఉదాహరణలతో వివరించి, సిద్ధార్థ యోగ విద్యాలయం డైట్ షీట్ ను దైనందిక జీవితంలో అలవాటు చేసుకోవాలని స్ఫూర్తినింపారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ద్వారా ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య చేస్తున్నామన్నారు. రామచంద్ర ప్రకృతి ఆశ్రమంలో ఎంతోమంది చికిత్స తీసుకొని ఆనందంగా ఉన్నారని తెలిపారు. మానవ జీవన విధానం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాలంటే అది కేవలం ఆరోగ్యంగా ఉండటంతోనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలను పాటించి సహజసిద్దమైనటువంటి నేచురల్ లైఫ్ సైన్స్ ను ప్రకృతి జీవన విధానాన్ని ఔషధాలను ఉపయోగించాలన్నారు. ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లెన్సర్ ఏచూరి శైలజ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ప్రకృతి చికిత్స విధానం-ఆరోగ్య సదస్సుపై సిద్ధార్థ యోగ విద్యాలయం డాక్టర్స్ రామచంద్రరావు పద్మలతో ఇంత పెద్ద ఆరోగ్యసదస్సును నిర్వహించడం ఎంతో పెద్ద బృహత్ కార్యమని  తెలియజేస్తూ ఇది నలగొండ వాసులకు ఎంతో ఉపయోగపడుతుందని దీనికి కృషి చేసిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలకు అభినందనలు అని తెలిపారు.

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.యానాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డాక్టర్స్ ను ఘనంగా సన్మానించారు.

నల్గొండ పట్టణం తో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారుగా సదస్సుకు 1200 పైగా ప్రముఖులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావేత్తలు, విద్యార్థులు, క్రీడాకారులు, యువతి,యువకులు హాజరైనారు.

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు బొమ్మపాల గిరిబాబు, పాముల అశోక్, లోకనబోయిన రమణ,గిరిధర్ రావు, నాగమణి రెడ్డి, ముక్కామల నరసింహ, ఎండి అజిజ్,  దశరథ గౌడ్, పజూరి రవీందర్ రెడ్డి, ప్రముఖ పర్యావరణ వేత్త మిట్టపల్లి సురేష్ గుప్తా, గౌడ్,ట్రస్మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోడి శ్రీనివాస్ జి వి రావు తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jul 20 2024, 19:01

రేపటి ఉచిత ఆరోగ్య సదస్సు లో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలి: బొమ్మపాల గిరిబాబు

నల్గొండ: రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించే 'నేచురోపతి ఆరోగ్య సదస్సు' లో క్రీడాకారులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్ర క్రీడా విభాగం ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఈరోజు ఉదయం మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో క్రీడాకారులు మరియు ఆర్మీ, పోలీస్ ఉద్యోగాలకై ట్రైనింగ్ పొందుతున్న వారిని ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. ఆరోగ్య సదస్సు లో పాల్గొనడం ద్వారా చురుకైన శరీర కదలకలను  మరియు ప్రకృతి ఆహార నియమాల ద్వారా అథ్లెటిక్ ఫిజికల్ ఫిట్నెస్ ను ఎలా సాధించవచ్చునననే విషయాన్ని ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాముల అశోక్, లోకనబోయిన రమణ, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jul 19 2024, 19:04

NLG: ఆరోగ్య సదస్సును విజయవంతం చేయండి: ఏచూరి శైలజా భాస్కర్
ఈనెల 21 వ తేదీ ఆదివారం నాడు నల్గొండ లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్  మరియు సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే *ఆరోగ్య సదస్సు* ను విజయవంతం చేయాలని ఐబిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏచూరి శైలజా భాస్కర్ పిలుపునిచ్చారు. ఈరోజు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రకృతి జీవన విధానం మరియు వంటిల్లునే ఔషధాలయంగా మార్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు గా తయారు కావచ్చుననే విషయాన్ని ఎన్నో కార్యక్రమాల ద్వారా సదస్సుల ద్వారా గత 25 సంవత్సరాలుగా డాక్టర్
కే.వై. రామచంద్రరావు మరియు డాక్టర్ పద్మ గార్లు సమాజానికి ప్రత్యక్షంగా చూయించడం జరిగిందని తెలియజేస్తూ నల్లగొండలో నిర్వహించే *ఆరోగ్య సదస్సు* లో జిల్లాలోని మహిళలు, ఉద్యోగస్తులు, వృద్ధులు, యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రతినిధులు బొమ్మపాల గిరిబాబు, పాముల అశోక్ ముదిరాజ్, కందిమల్ల నాగమణి రెడ్డి, లోకనబోయిన రమణ ముదిరాజ్, ముక్కామల నరసింహ, MD అజీజ్ షరీఫ్, రవీందర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jul 19 2024, 18:59

ఈ నెల 21న జరుగు ఆరోగ్య సదస్సు కు ముఖ్యఅతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్
నల్లగొండ:
ఈనెల 21వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించే *నేచురోపతి ఆరోగ్య సదస్సు* కు ముఖ్యఅతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్నారని, ఈ రోజు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి  తెలిపారు. ఈ సందర్భంగా నిన్నరాత్రి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రతినిధులు
బొమ్మపాల గిరిబాబు, పాముల అశోక్, లోకనబోయిన రమణ తదితరులు మంత్రి క్యాంప్ ఆఫీస్ నందు మర్యాదపూర్వకంగా కలిసి బుర్రి శ్రీనివాస్ రెడ్డి మరియు గుమ్మల మోహన్ రెడ్డి లను శాలువాతో ఘనంగా సత్కరించి మెమొంటో అందజేసి కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించి కరపత్రాలను ఆవిష్కరించారు.

Mane Praveen

Jul 19 2024, 17:09

విధ్యా రంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కు వినతి పత్రం
దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్య రంగ సమస్యలు పరిష్కరించాలని ఇవాళ దేవరకొండ పట్టణ కేంద్రంలో విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఆర్డిఓ శ్రీరాములు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నల్గొండ జిల్లా  అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న నిరుపేద కుటుంబ విద్యార్థులకు.. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడువుస్తున్నా నేటి వరకు నోట్ పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు సంక్షేమ వసతి గృహాలలో  ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు విలయా తాండవం చేస్తుంటే వ్యవసాయానికి పెట్టుబడి లేక నిరుపేద కుటంబాలు ఇబ్బందులు పడుతూ.. తమ పిల్లలకు ప్రభుత్వ హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పిల్లలను తీసుకొని వచ్చి హాస్టల్లో వేసిన తల్లిదండ్రులను విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా, విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆపి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా  ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ లో సుమారు 10200 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే నల్లగొండ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అన్ని సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో సంక్షేమ హాస్టల్ విద్యార్థులను పట్టించుకోకపోతే గత ప్రభుత్వానికి  పట్టిన  గతే ఈ ప్రభుత్వాన్ని పడుతుందని హెచ్చరించారు. సోమవారం లోపు హాస్టల్ విద్యార్థులకు అందించకుంటే జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్వో, ఆర్డీవో ఆఫీస్ ల ముందు నిరాహార దీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రమావత్ లక్ష్మణ్ నాయక్, బుడిగ వెంకటేష్,ఆడెపు సిద్దు, చరణ్, ఇద్దిరాములు, సాయి, మనోజ్, రోహిత్,అనూష,మంజుల, ఉమా, శైలజ, హరిణి రమాదేవి, రేఖశ్రీ తదితరులు పాల్గొన్నారు.