రేపటి ఉచిత ఆరోగ్య సదస్సు లో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలి: బొమ్మపాల గిరిబాబు

నల్గొండ: రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించే 'నేచురోపతి ఆరోగ్య సదస్సు' లో క్రీడాకారులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్ర క్రీడా విభాగం ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఈరోజు ఉదయం మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో క్రీడాకారులు మరియు ఆర్మీ, పోలీస్ ఉద్యోగాలకై ట్రైనింగ్ పొందుతున్న వారిని ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. ఆరోగ్య సదస్సు లో పాల్గొనడం ద్వారా చురుకైన శరీర కదలకలను  మరియు ప్రకృతి ఆహార నియమాల ద్వారా అథ్లెటిక్ ఫిజికల్ ఫిట్నెస్ ను ఎలా సాధించవచ్చునననే విషయాన్ని ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాముల అశోక్, లోకనబోయిన రమణ, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
NLG: ఆరోగ్య సదస్సును విజయవంతం చేయండి: ఏచూరి శైలజా భాస్కర్
ఈనెల 21 వ తేదీ ఆదివారం నాడు నల్గొండ లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్  మరియు సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే *ఆరోగ్య సదస్సు* ను విజయవంతం చేయాలని ఐబిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏచూరి శైలజా భాస్కర్ పిలుపునిచ్చారు. ఈరోజు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రకృతి జీవన విధానం మరియు వంటిల్లునే ఔషధాలయంగా మార్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు గా తయారు కావచ్చుననే విషయాన్ని ఎన్నో కార్యక్రమాల ద్వారా సదస్సుల ద్వారా గత 25 సంవత్సరాలుగా డాక్టర్
కే.వై. రామచంద్రరావు మరియు డాక్టర్ పద్మ గార్లు సమాజానికి ప్రత్యక్షంగా చూయించడం జరిగిందని తెలియజేస్తూ నల్లగొండలో నిర్వహించే *ఆరోగ్య సదస్సు* లో జిల్లాలోని మహిళలు, ఉద్యోగస్తులు, వృద్ధులు, యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రతినిధులు బొమ్మపాల గిరిబాబు, పాముల అశోక్ ముదిరాజ్, కందిమల్ల నాగమణి రెడ్డి, లోకనబోయిన రమణ ముదిరాజ్, ముక్కామల నరసింహ, MD అజీజ్ షరీఫ్, రవీందర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 21న జరుగు ఆరోగ్య సదస్సు కు ముఖ్యఅతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్
నల్లగొండ:
ఈనెల 21వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించే *నేచురోపతి ఆరోగ్య సదస్సు* కు ముఖ్యఅతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్నారని, ఈ రోజు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి  తెలిపారు. ఈ సందర్భంగా నిన్నరాత్రి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రతినిధులు
బొమ్మపాల గిరిబాబు, పాముల అశోక్, లోకనబోయిన రమణ తదితరులు మంత్రి క్యాంప్ ఆఫీస్ నందు మర్యాదపూర్వకంగా కలిసి బుర్రి శ్రీనివాస్ రెడ్డి మరియు గుమ్మల మోహన్ రెడ్డి లను శాలువాతో ఘనంగా సత్కరించి మెమొంటో అందజేసి కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించి కరపత్రాలను ఆవిష్కరించారు.
విధ్యా రంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కు వినతి పత్రం
దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్య రంగ సమస్యలు పరిష్కరించాలని ఇవాళ దేవరకొండ పట్టణ కేంద్రంలో విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఆర్డిఓ శ్రీరాములు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నల్గొండ జిల్లా  అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న నిరుపేద కుటుంబ విద్యార్థులకు.. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడువుస్తున్నా నేటి వరకు నోట్ పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు సంక్షేమ వసతి గృహాలలో  ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు విలయా తాండవం చేస్తుంటే వ్యవసాయానికి పెట్టుబడి లేక నిరుపేద కుటంబాలు ఇబ్బందులు పడుతూ.. తమ పిల్లలకు ప్రభుత్వ హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పిల్లలను తీసుకొని వచ్చి హాస్టల్లో వేసిన తల్లిదండ్రులను విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా, విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆపి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా  ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ లో సుమారు 10200 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే నల్లగొండ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అన్ని సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో సంక్షేమ హాస్టల్ విద్యార్థులను పట్టించుకోకపోతే గత ప్రభుత్వానికి  పట్టిన  గతే ఈ ప్రభుత్వాన్ని పడుతుందని హెచ్చరించారు. సోమవారం లోపు హాస్టల్ విద్యార్థులకు అందించకుంటే జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్వో, ఆర్డీవో ఆఫీస్ ల ముందు నిరాహార దీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రమావత్ లక్ష్మణ్ నాయక్, బుడిగ వెంకటేష్,ఆడెపు సిద్దు, చరణ్, ఇద్దిరాములు, సాయి, మనోజ్, రోహిత్,అనూష,మంజుల, ఉమా, శైలజ, హరిణి రమాదేవి, రేఖశ్రీ తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. రుణమాఫీ తో రైతుల్లో ఆనందోత్సవాలు
నల్లగొండ జిల్లా:
ఎన్నికలో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్ట మొదటి సారిగా మహిళలకు ఉచిత ప్రయాణం, రెండోది గా ఉచిత కరెంటు బిల్లు గృహ జ్యోతి, నేడు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణ మాఫీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామంలో గురువారం రాత్రి పాలాభిషేకం చేశారు. ముందు ముందు సామాన్య ప్రజల హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేస్తుందని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పేదోడి కి న్యాయం జరగాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారనే సాధ్యమన్నారు. తెలంగాణ మార్పు అంటే పేదోడి దగ్గరికి వచ్చిన ఫలితమే, నేడు ఎంతో మంది రైతు కళ్ళల్లో ఆనందం వెలుగుతుందన్నారు. అదే విధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిగోటి శేఖర్, ముప్పిడి రవి, సింగం నర్సింహా, ముక్కముల నాగరాజు, రూపాని రాములు, నడిగోటి అంజయ్య, ఎల్లయ్య, మాధగోని శ్రీను, జక్కిలి గణేష్, శేఖర్, రఘు, నర్సింహా చారి, శివ, జలంధర్  కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
నల్లగొండ జిల్లా:
ఈరోజు రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా మర్రిగూడ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద, రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి  మర్రిగూడ కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మర్రిగూడ మాజీ సర్పంచి మాస నీలిమ చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి వెంకటంపేట బాలయ్య, పల్లె మల్లేష్ సింగల్ విండో డైరెక్టర్ పగడాల లింగయ్య, ఈద రాములు, కుకుడపు ముత్యాలు, ఎలిమినేటి సత్తిరెడ్డి, పొనుగుంటి శేఖర్, చంద్రయ్య, పగడాల పెద్ద అంజయ్య, ఎడ్ల ముత్తయ్య, గ్యార యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
వంటిల్లే ఔషధాలయం - ఈనెల 21 న ఉచిత ఆరోగ్య సదస్సు
నల్గొండ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ,సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 21న ఉ.గం 10 నుండి మ. గం.1 వరకు చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఉచిత ఆరోగ్య సదస్సులో నేచురోపతి ప్రముఖులు డా. కే.వై. రామచంద్రరావు, డా.పద్మ లు పాల్గొంటారు.

మొహర్రం వేడుకల్లో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం ఇడికుడ గ్రామంలో మొహర్రం వేడుకల్లో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ..సాంప్రదాయక స్వాగతం పలికిన ముస్లిం సోదరులు.

శివన్నగూడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
మర్రిగూడ మండలం, శివన్నగూడ గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు   కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆవుల చిన్న జంగయ్య మరియు బొంత మంగమ్మ కు పంపిణీ చేసిన శివన్నగూడ శ్రీ నీలకంఠ రామస్వామి దేవస్థానం చైర్మన్ రాపోలు యాదగిరి, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మర్రిగూడ మండల మాజీ జెడ్పిటిసి 
మేతరి యాదయ్య, దేవాలయ ధర్మకర్త చిట్యాల రంగారెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ వాయిల సోమయ్య,  మండల కాంగ్రెస్ నాయకులు నందికొండ లింగారెడ్డి, శివన్నగూడ గ్రామ పెద్దలు ఇరగదిండ్ల సత్తయ్య, అయితగోని వెంకటయ్య, నల్లవోతు కొమురయ్య, జిల్లాగోని నరసింహ, గ్రామస్తులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA
SB NEWS NLG
NLG: చెత్తను వేరు చేయాలని ఇంటింటి ప్రచారం

నల్లగొండ: మున్సిపాలిటీ పరిధిలో ఐటీసీ చీఫ్ మేనేజర్ ఉమాకాంత్ మరియు మారి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మురళి సహకారంతో వావ్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వాలంటీర్లను ఎంపిక చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి చెత్తను మూడు భాగాలుగా విభజించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త హానికరమైన చెత్తను వేరు చేయాలని తెలిపారు. ఇలా చెత్తను వేరు చేయడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చు, తడి చెత్త మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుందని, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయవచ్చని, హానికరమైన చెత్త విద్యుత్ తయారికి ఉపయోగపడుతుందని తెలిపారు. మంగళవారం, శుక్రవారం పొడి చెత్తను సేకరిస్తున్నట్లు.. మిగతా రోజుల్లో తడి చెత్త, హానికరమైన చెత్తను సేకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వాలంటీర్ నాగుల జ్యోతి పాల్గొన్నారు.