విధ్యా రంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కు వినతి పత్రం
దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్య రంగ సమస్యలు పరిష్కరించాలని ఇవాళ దేవరకొండ పట్టణ కేంద్రంలో విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఆర్డిఓ శ్రీరాములు కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న నిరుపేద కుటుంబ విద్యార్థులకు.. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడువుస్తున్నా నేటి వరకు నోట్ పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు సంక్షేమ వసతి గృహాలలో ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు.
రాష్ట్రంలో కరువు విలయా తాండవం చేస్తుంటే వ్యవసాయానికి పెట్టుబడి లేక నిరుపేద కుటంబాలు ఇబ్బందులు పడుతూ.. తమ పిల్లలకు ప్రభుత్వ హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పిల్లలను తీసుకొని వచ్చి హాస్టల్లో వేసిన తల్లిదండ్రులను విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా, విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆపి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ లో సుమారు 10200 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే నల్లగొండ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అన్ని సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో సంక్షేమ హాస్టల్ విద్యార్థులను పట్టించుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వాన్ని పడుతుందని హెచ్చరించారు. సోమవారం లోపు హాస్టల్ విద్యార్థులకు అందించకుంటే జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్వో, ఆర్డీవో ఆఫీస్ ల ముందు నిరాహార దీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రమావత్ లక్ష్మణ్ నాయక్, బుడిగ వెంకటేష్,ఆడెపు సిద్దు, చరణ్, ఇద్దిరాములు, సాయి, మనోజ్, రోహిత్,అనూష,మంజుల, ఉమా, శైలజ, హరిణి రమాదేవి, రేఖశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Jul 19 2024, 19:04