మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ !

అధికారుల కోసం బ్లాక్ బుక్ రెడీ చేశానని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వార్నింగ్ ఇచ్చారు. ‘ ఫ్లై యాష్ రవాణాలో నాకు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) లీగల్ నోటీసులు పంపించారు. మీ లీగల్ నోటీసులకు మా లీగల్ టీమ్ లీగల్‌గా సమాధానం చెప్తుంది.

ఫ్లై యాష్ రవాణాలో పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డబ్బులు తీసుకోకపోతే బుధవారం టీటీడీ వెంకటేశ్వరస్వామి టెంపుల్‌లో ప్రమాణానికి సిద్ధమా...? బుధవారం రోజు పొన్నం ప్రభాకర్ రాకపోతే మరిన్ని నిజాలు బయటపెడతాము’’ అని సవాల్ విసిరారు. హుజురాబాద్ ఎమ్మెల్యేకు చెక్కులు ఇవ్వవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెబుతున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పింఛన్ల పెంపు గురించి మర్చిపోయారన్నారు. మూడు నెలల పింఛన్లను రేవంత్ రెడ్డి ఆపారని చెప్పారు. వంద రోజుల్లో పింఛన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు.

తాము ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబానికి ఇద్దరికి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాల్లో ప్రోటోకాల్స్ ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. కళ్యాణలక్ష్మి చెక్కులను తమకు తెలియకుండా పంపిణీ చేస్తున్నారన్నారు. చెక్కులను ఎమ్మెల్యేకు ఇవ్వవద్దని మంత్రి ఎమ్మార్వోలకు ఆదేశాలు ఇస్తున్నారన్నారు.

రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

#మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభం తోను, అధికారులు పుష్ప గుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు.

# వేద పండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య ఆ భగవంతునికి షోడశోపచారా పూజ నిర్వహించిన తదుపరి తమ సీట్లో ఆసీనులు అయ్యారు.

#ప్రకాశం జిల్లా దర్శి లో రూ.18.51 కోట్ల అంచనా వ్యయంతో  డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు.

#ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటు పాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు చేపడతామన్నారు.

# రాష్ట్ర రవాణా శాఖ అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, జీవి రవి వర్మ, చంద్రశేఖర్, ఏపీఎస్ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వై శ్రీనివాస్, క్రీడా శాఖ ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్ వెంకటరమణ, యువజన సర్వీసెస్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ, ఎన్సీసీ అసిస్టెంట్ డైరెక్టర్కేజియా తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.

ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది సమస్యలు

రాష్ట్ర శాసన సభలో పని చేసే హౌస్ కీపింగ్ సిబ్బందిగా ఉన్న 154 మంది మహిళలు తమ సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్లారు. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నామని, తాము అమరావతి ప్రాంత రైతు కూలీలమని తెలిపారు.

శాసనసభ రెండో రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు ఉదయమే విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ ప్రాంగణమంతా కలియ తిరిగి పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో, సెక్యూరిటీతో సరదాగా మాట్లాడుతూ వారితో మమేకమయ్యారు. సిబ్బందికి ఫొటోలు ఇచ్చి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శాసనసభను పరిశీలించారు. 

ఈ సందర్భంగా శాసనసభ హౌస్ కీపింగ్ సిబ్బంది శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తమ సమస్యలను చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా హౌస్ కీపింగ్ సిబ్బంది మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 154 మంది వరకు శాసనసభలో పనిచేస్తున్నామని, రాజధాని ప్రాంత రైతు కూలీలమని ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పారు. 8 సంవత్సరాల కిందట రూ.6 వేలకు ఉద్యోగంలో చేరామని ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నారన్నారు.

అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలో ఉన్నామని తెలిపారు. అమరావతి రైతు కూలీలుగా ఉన్నందున నెలకు రూ.2500 భత్యం వచ్చేదని.. తరవాతి రోజుల్లో కీపింగ్ ఉద్యోగం ఉందని చెప్పి ఆ భత్యం నిలిపివేశారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ.. పురపాలక ఉద్యోగులుగా గుర్తించాలని వేడుకున్నారు. హౌస్ కీపింగ్ ఉద్యోగుల సమస్యను ఆసాంతం విన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, తగు విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ రాజమహళ్లు- నామమాత్రపు లీజులతో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ

వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్న విధంగా వైఎస్సార్సీపీ పాలనలో అక్రమాలు జరిగాయి.

అడుగడుగునా అధికారాన్ని దుర్వినియోగం చేసిన జగన్ అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు లీజులకే వైఎస్సార్సీపీ కార్యాలయాలకు కట్టబెట్టారు.

అన్ని నిబంధనలనూ ఉల్లంఘిస్తూ చట్టాలన్నింటినీ కాలరాస్తూ 26 జిల్లాల్లో ప్యాలెస్‌లను తలదన్నేలా నిర్మాణాలను దాదాపు పూర్తి చేశారు.

ఐదేళ్లుగా అనుమతులు లేకుండా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు సర్వే నెంబరు 44లో రూ.2 కోట్ల విలువైన ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలో దీన్ని నిర్మిస్తున్నారు. 2022, మే 18న 33 సంవత్సరాలు ఎకరా వెయ్యి రూపాయల చొప్పున స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు జీవో ఇచ్చారు. పట్టణ ప్రణాళిక సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం తుది దశకు చేరింది.

విజయనగరం నడిబొడ్డున మూడున్నర కోట్ల రూపాయల విలువైన భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. మహరాజుపేట 540 సర్వే నంబర్​లోని స్థలంపై కన్నేసిన వైఎస్సార్సీపీ నేతలు చెరువు గర్భం స్థలాన్ని రెవిన్యూ దస్త్రాల్లో డీ-పట్టాగా మార్పు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో వైఎస్సార్సీపీ కార్యాలయ భవనం నిర్మిస్తున్నారు. దాదాపు 85 శాతం నిర్మాణం పూర్తైంది. దీనికీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.

పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.2కోట్ల విలువైన ఎకరం 18 సెంట్ల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చివరిదశకు చేరింది. గతంలో ఈ స్థలాన్ని రైతు శిక్షణ కేంద్రానికి కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు. 

విశాఖపట్నం ఎండాడలో 175/4 సర్వే నంబర్​లో రూ.100 కోట్ల విలువైన 2ఎకరాల ప్రభుత్వ భూమిలో కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. గతంలో ఈ భూమిని రెవెన్యూ ఉద్యోగులకు కేటాయించారు. ఈ నిర్మాణానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు ఇప్పుడు నోటీసులు అంటించారు.

అనకాపల్లిలో రూ.15 కోట్ల విలువైన ఎకరం 75 సెంట్ల భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణం పూర్తి చేశారు. గతంలో ఈ భూమిని కాపు భవనానికి కేటాయించి శంకుస్థాపన సైతం చేసి 50లక్షల నిధుల కేటాయింపులు చేశారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.5 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది సాగుభూమి అని గిరిజనులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

కాకినాడలో 75 కోట్ల విలువైన ఎకరం 93 సెంట్ల సర్కారు భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భూమి 22ఎ నిషేధిత జాబితాలో ఉంది. 

రాజమహేంద్రవరం జైలు రోడ్డులోని ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహం వెనుక సర్వే నంబరు 107/7లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. భవన నిర్మాణం దాదాపు పూర్తై, రంగులు అద్దుతున్నారు. 2023లో పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేశారు. ఐతే నిర్మాణానికి ఎలాంంటి అనుమతులు తీసుకోలేదన్న అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రూ.10కోట్ల విలువైన ఎకరం ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చెరువు భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణ దశలో ఉంది. సర్వే నంబర్ 201/3లో సుమారు 72 సెంట్ల స్థలాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఇచ్చేశారు. దాని విలువ రూ.7కోట్ల పైమాటే. గృహ నిర్మాణ శాఖకు చెందిన ఈ స్థలాన్ని గతంలో పేదలకు కేటాయించి ఆ తర్వాత రద్దు చేశారు. ఇక్కడి పార్టీ కార్యాలయ శ్లాబ్‌ పూర్తైంది.

ఏలూరు రైల్వే స్టేషన్​కు వెళ్లే దారిలో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థకు చెందిన రూ.5 కోట్ల విలువైన రెండెకరాల స్థలంలో రాజమహల్​ను తలదన్నేలా వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించారు. రెండేళ్ల క్రితం ఈ నిర్మాణం చేపట్టగా ఇటీవలే పూర్తైంది. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణంపై నిబంధనల మేరకు ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. 

విజయవాడ విద్యాధరపురంలోని సితార సెంటర్‌ సమీపంలో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే ఎకరం స్థలంలో మూడంతస్తుల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేవు. నగరపాలక సంస్థకు రూపాయి కూడా రుసుముల కింద చెల్లించలేదు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్‌లో 60కోట్లకు పైగా విలువైన 2ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని దర్జాగా కడుతున్నారు. ఈ స్థలంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో ఓ గ్రంథాలయం, ఆడిటోరియం, కన్వెన్షన్‌ సెంటర్, మ్యూజియం నిర్మించాలని ప్రతిపాదనలుండగా వాటిని కాదని కార్యాలయం కట్టుకుంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దీని వెనుక ప్రధాన పాత్రధారి. అక్రమంగా నిర్మిస్తున్న భవనానికి ఇప్పుడు ప్లాన్‌ అప్రూవల్‌ కోసం మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేశారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో లింగంగుంట్ల అగ్రహారంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి, రైల్వేస్టేషన్‌ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఎకరం 50 సెంట్ల స్థలంలో అనుమతులు లేకుండానే కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు.

బాపట్లలో ఏపీఐఐసీకి చెందిన రూ.6కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. 2022లో అప్పటి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ కనుసన్నల్లో ఇది జరిగింది. 2022 డిసెంబర్ 19న వైఎస్సార్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఇది ఆర్టీసికి చెందిన స్థలమని డిపో మేనేజర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగ్రహించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేనేజర్​ను అక్కడి నుంచి బదిలీ చేసింది. పట్టణ ప్రణాళికా విభాగానికి భవన నిర్మాణ ప్లాన్ సమర్పించారేగానీ, ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదు. ఐనా నిర్మాణం పూర్తి చేశారు. 

ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ బైపాస్‌లో నీటిపారుదల శాఖ కార్యాలయం ఆనుకొని ఉన్న నాలుగున్నర కోట్ల విలువైన ఎకరం 64 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ ఆఫీస్‌ కట్టారు. 2023 జులై 31న అనుమతులు తీసుకున్నారు. 2025 జనవరి 21లోగా ప్రారంభించి 2029 నాటికి పూర్తి చేయాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతిచ్చారు. నిర్మాణం ప్రారంభానికి గడువుండగానే వైఎస్సార్సీపీ నాయకులు ఆగమేఘాలపై నిర్మాణం పూర్తి చేశారు.

నెల్లూరులో వెంకటేశ్వరపురంలో రూ.10 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. అనుమతుల్లేకుండానే 90శాతం నిర్మాణం పూర్తి చేశారు. దీనికి ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. గతంలో ఈ స్థలాన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. 

కర్నూలు ఐదు రోడ్ల కూడలిలోని సర్వే నంబర్ 95-2లో ఏపీ ఆగ్రోస్‌కు చెందిన రూ.100 కోట్ల విలువైన ఎకరం 60 సెంట్ల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పూర్తైంది.

నంద్యాల సమీపంలోని కుందూనది ఒడ్డున జగనన్న కాలనీలో సుమారు 7 కోట్ల విలువైన ఎకరా భూమిని వైఎస్సార్సీపీ కార్యాలయానికి కేటాయించారు. 6 నెలల క్రితం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పునాదులు పూర్తయ్యాయి. వీటికీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. 

కడపలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సర్వేనంబర్ 424/3 లోని రెండు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనుమతులు తీసుకోలేదు.

అన్నమయ్య జిల్లా రాయచోటిలో 12కోట్ల విలువైన ఎకరం 61 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్మాణం చివరి దశకు చేరింది. 

అనంతపురంలో రూ.45 కోట్ల విలువైన ఎకరం 50 సెంట్ల జలవనరుల శాఖ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం తుదిదశకు చేరింది. భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు. తక్షణమే నిర్మాణం ఆపేసి వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడికి అధికారులు నోటీసిచ్చారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శ్రీసత్యసాయి జిల్లాలో 20కోట్ల విలువైన ఎకరంన్నర భూమిలో విమానాశ్రయం ఎదురుగా కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది తుదిమెరుగుల దశలో ఉంది. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. 

తిరుపతి రేణిగుంట విమానాశ్రయ సమీపంలో పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన రూ.14 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికి రెవెన్యూశాఖతో పాటు తుడా అనుమతులూ లేవు. పరిశ్రమల శాఖ అనుమతి నిరాకరిస్తూ గత అక్టోబర్‌లో పని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారు.

చిత్తూరు జిల్లాలో రూ.17కోట్ల విలువైన 2 ఎకరాల్లో అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేశారు. ఇది ఇతరుల ఆధీనంలోని భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. 

రాష్ట్ర వ్యాప్తంగా రూ.677 కోట్ల విలువైన 42 ఎకరాల 24 సెంట్ల స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. రాజ ప్రాసాదాలను తలదన్నేలా వీటిని కడుతున్నారు. 

అధికారం అండతో వైఎస్సార్సీపీ ఐదేళ్లుగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినవి ఏమన్నా ఉన్నాయంటే అవి సొంత పార్టీకి చెందిన కార్యాలయాలేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్‌ సరఫరా చేయా­లని ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో నిధులు విడుదలవక సర్కారీ బడులు, కళాశాల­లు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందు­లు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.

ప్రత్యేక పోర్టల్‌తో అనుసంధానం

సర్కారీ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రత్యేక ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌ను రూపొందించనున్నా­యి. విద్యాసంస్థలు ఏ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ విభాగాధిపతి (హెచ్‌ఓడీ)కి ఆ పోర్టల్‌ను లాగిన్‌ చేసే సదుపాయం కల్పిస్తాయి. తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల వివరాలను వెబ్‌ పోర్టల్‌లో చేర్చడం/తొలగించడం/సవరణలు(యాడ్‌/డిలీట్‌/ఎడిట్‌) చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరాన్నిబట్టి ఆయా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని లేదా నిలిపివేయాలని కోరే వెసులుబాటును హెచ్‌ఓడీలు పొందనున్నారు.

ఇన్‌చార్జీలకు ‘ఉచిత’బిల్లులు

విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేసినా ప్రతినెలా క్రమం తప్పకుండా మీటర్‌ రీడింగ్‌ తీసి ఇన్‌చార్జి అధికారికి బిల్లులు జారీ చేస్తారు. ఇన్‌చార్జి అధికారులకు బిల్లులు జారీ చేస్తే ఉచిత విద్యుత్‌ దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు వారు చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని యూనిట్ల విద్యుత్‌ వాడారు? ఎంత బిల్లు వచ్చిందనే వివరాలు అందులో ఉండనున్నాయి. అయితే ఆ బిల్లులను సదరు పాఠశాల/కళాశాల/విద్యాసంస్థ చెల్లించాల్సిన అవసరముండదు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించిన బిల్లులను సంబంధిత విభాగాధిపతులు తమ శాఖ బడ్జెట్‌ నిధుల నుంచి ప్రతి నెలా డిస్కంలకు చెల్లించనున్నాయి.

విభాగాధిపతుల పర్యవేక్షణ...

విభాగాధిపతులు తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల విద్యుత్‌ వినియోగం, బిల్లుల మొత్తం, గత కాలానికి సంబంధించిన వినియోగం, జారీ అయిన బిల్లులు, జరిపిన చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిల వంటి సమాచారంతో కూడిన నివేదికలను వెబ్‌ పోర్టల్‌లో చూసుకోవడానికి వీలుండనుంది. విద్యాసంస్థ, మండలం, జిల్లావారీగా సైతం ఈ నివేదికలు ఆన్‌లైన్‌లో జనరేట్‌ కానున్నాయి. సంబంధిత విభాగాధిపతులు బడ్జెట్‌ కేటాయింపుల నుంచి విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి వీలుగా పోర్టల్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖతో సైతం అనుసంధానించనున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం లోనూ పనులు చేయించుకునేలా చెవిరెడ్డి భారీ స్కెచ్

అసెంబ్లీ లో క్యాటరింగ్ ద్వారా తన అనుచరులకు 5కోట్లు పాత బకాయిలు చెల్లించేలా దిమ్మతిరిగే ప్లాన్

ఎమ్మెల్యే గా ఓత్ తీసుకుని అసెంబ్లీ నుంచి వెళ్లిపోతున్న జగన్ తో ఫుడ్ కాంట్రాక్టర్ తిలక్ జరిపిన ఏకాంత భేటీ అనేక అనుమానాలకు తావిస్తోంది.

అసెంబ్లీ కి వచ్చి తన పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సరిగా మాట్లాడని జగన్ ... ఫుడ్ కాంట్రాక్టర్ తిలక్ తో మాత్రం 5మినిట్స్ పైనే మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. అంతా మనం అనుకున్నట్లే జరుగుతోంది మళ్లీ వస్తే నన్ను మర్చిపోవద్దoటూ తిలక్ జగన్ తో దేనిని ఉద్దేశించి అన్నాడో ఆలస్యంగా అందరికి అర్ధమవుతోంది.

 టిడిపి సానుభూతి పరుడు ముసుగులో వైసిపి తొ అంతకాగుతూ . అసెంబ్లీ లొ బోజనాల్ని పెట్టె కాంట్రాక్టర్ తిలక్ కు తెలివిగా చెవిరెడ్డి అప్పగించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో తిలక్ చేపట్టిన భోజన కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారాక మళ్లీ తిలకే భోజనం కాంట్రాక్టు తెచ్చుకుంటాడని ముందే పసిగట్టిన వైసీపీ పెద్దలు అతణ్ని ముందే లొంగతీసుకున్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రధాస అనుచరుడైన ,తాడేపల్లి కృష్ణ రెడ్డి  ద్వారా అతని అనుచరుడు మల్లికార్జునరెడ్డి ద్వార అసెంబ్లీ భోజనాల కాంట్రాక్టు తిలక్ ద్వారా నడిపే పన్నాగం పన్నారు.

ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తిలక్ ద్వారా తమకు రావాల్సిన 5కోట్ల బకాయిలు రాబట్టుకోవటంతో పాటు తాము పంపే భోజనమే అసెంబ్లీలో సభ్యులు ఇతర సిబ్బంది కి అందేలా పకడ్బందీగా స్కెచ్ వేశారు.  చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రధాస అనుచరుడైన ,తాడేపల్లి కృష్ణ రెడ్డి తయారు చేసే భోజనం ఇప్పుడు మల్లికార్జునరెడ్డి ద్వారా తిలక్ కు చేరితే అతను అసెంబ్లీలో కాంట్రాక్టర్ గా ఫుడ్ సప్లై చేస్తాడు. తిలక్ చేసేదల్లా మినిస్టర్ లు ఎమ్మెల్యేలు వద్ద అతివినియం ప్రదర్శిస్తూ ఎక్కడా తన వెనుక ఉన్న వైసీపీ గ్యాంగ్ పై అనుమానం రాకుండా చేయటమే. ఇందుకు ఫుడ్ సప్లైయర్లు, సూపరువైజర్ల ముసుగులో వైసీపీ మనుషుల్ని పెద్దయెత్తునే అసెంబ్లీకి మోహరించేసుకున్నాడు. ఎమ్మెల్యేలని సైతం గుర్తుపట్టకుండా వారిని ఇన్సల్ట్ చేస్తూ మంత్రులు కనిపిస్తే చాలు ఎమ్మెల్యే చేతిలో ఉన్న ఖాళీ ప్లేటు సైతం లాగేసుకుని మంత్రికి ఇచ్చి 2రోజులు అతివినియం బాగా చూపాడు.

 ఇష్టానుసారం బిల్లులు ఆమోదం చేపించుకునెందుకు మల్లిఖార్జున రెడ్డి ద్వారా క్రిష్ణరెడ్డి వ్యాపార సంస్థకు చేరేలా పక్కా స్కెచ్ అమలు చేస్తున్నాడు. 

టీడీపీ కి నిత్యం ఫుడ్ సప్లై చేసే కాంట్రాక్టర్లను కాదని ఈ తిలక్ ని ఎవరు తీసుకొచ్చారనే చర్చా టీడీపీ నేతల్లో జరుగుతోంది. టీడీపీ వాళ్లైతే నాకేంటి అసెంబ్లీలో నాదే ఇష్టారాజ్యం అంటూ అందరినీ అగౌరవ పరిచే వీడి వెనుక ఎవరు ఉన్నారని సీనియర్లు సైతం ఆశ్చర్య పోతున్నారట. బిల్లులు మాట అటుంచితే చెవిరెడ్డి వైసీపీ నేతలతో ఆంటకాగే Tilak ద్వారా ఎమ్ కుట్ర జరుగుతోందనే అనుమానం నెలకొంది ‼️

పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో ప్రయాణికుని వీరంగం...

అన్నమయ్య జిల్లా : కడప నుంచి రాజంపేట కు వస్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో ప్రయాణికుని వీరంగం...

కడపలో బస్సు ఎక్కి టిక్కెట్ తీసుకోకుండా కండెక్టర్, డ్రైవర్,తోటి ప్రయాణికులతో ఘర్షణ...

ప్రశ్నించిన మహిళా ప్రయాణికురాలి పై పాదరక్షతో దాడి...

బలవంతంగా నందలూరు పోలీస్ స్టేషన్ లో అప్పగింత...

పోలీస్ స్టేషన్ లో సైతం వీరంగం..

కంట్రోల్ చేయలేక సెల్ లో పెట్టి తాళం వేసిన పోలీసులు...

కోర్టు ఆదేశాలతోనే వైఎస్సార్​సీపీ ఆఫీస్ కూల్చివేత - సీఆర్డీఏ

గుంటూరు జిల్లాలోని వైఎస్సార్​సీపీ కార్యాలయం కూల్చివేత కోర్టు ఆదేశాల ప్రకారమే జరిగిందని అధికారులు ప్రకటించారు.

బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న ఈ స్థలాన్ని తక్కువ లీజుతో వైఎస్సార్​సీపీకార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్‌ కట్టబెట్టింది.

అనుమతులు లేకుండానే ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని గుర్తించాక వైఎస్సార్​సీపీకి నోటీసులు జారీ చేసి కూల్చివేసినట్లు సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.

గుంటూరు జిల్లా సీతానగరంలో నీటిపారుదల శాఖ స్థలంలో అనుమతులు లేకుండా చేపట్టిన వైఎస్సార్​సీపీ కార్యాలయ భవనాన్ని సీఆర్డీఏ, ఎంటీఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఇరిగేషన్ బోట్ యార్డు స్థలముంది. దీనిలో 2 ఎకరాల భూమిని వైఎస్సార్​సీపీ హయాంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింAది. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో బకింగ్ హామ్ మెయిన్ కెనాల్ పక్కనున్న స్థలాన్ని తక్కువ ధరకే వైఎస్సార్​సీపీ కొట్టేసింది.

ఈ ప్రాంతంలో ఎకరా మార్కెట్ ధర 5 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. కానీ ఏడాదికి ఎకరాకు కేవలం వెయ్యి చొప్పున 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గతేడాది ఫిబ్రవరి 16న వైఎస్సార్​సీపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఈ జీవో బయటకు రాకుండా అప్పటి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు జీవో బయటికి రావడంతో స్థానికులు అప్పటి ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి: 

తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ కట్టిన అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో బోట్‌ యార్డ్‌ సమీపంలో వైఎస్సార్​సీపీ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు గుర్తించారు. అక్రమ నిర్మాణంపై అనుమతులు చూపించాలంటూ నోటీసులు జారీ చేశారు. వీటిపై వైఎస్సార్​సీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా వారికి ఊరట లభించలేదు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల సాయంలో తెల్లవారుజాము నుంచే కూల్చివేత చేపట్టిన అధికారులు రెండున్నర గంటల్లోనే ప్రక్రియ పూర్తిచేశారు.

వైఎస్సార్​సీపీ కార్యాలయ అక్రమ నిర్మాణాన్ని న్యాయస్థానం ఆదేశాలమేరకే కూల్చివేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టకపోతే కోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. జలవనరుల శాఖ భూమిని వైఎస్సార్​సీపీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వడం కుదరదంటూ ఈఎన్సీ నారాయణరెడ్డి ఇచ్చిన లేఖను ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి.

ఏపీలో పింఛన్ పంపిణీ.. కీలక అప్‌డేట్..

పింఛన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. 

పెంచిన పింఛన్ మొత్తం రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు రూ.1000 చొప్పున మొత్తం జులై 1న రూ.7 వేలు అందించడాన్ని అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

నూతన పాసు పుస్తకాలను పింఛన్‌తో పాటు అందించాలన్నారు.

Streetbuzz News

గృహ సిబ్బందిని దోపిడీ చేసినందుకు నలుగురు హిందూజా కుటుంబ సభ్యులకు స్విస్ కోర్టు జైలు శిక్ష విధించింది

ఒక బిలియనీర్ భారతీయ వ్యాపార కుటుంబం వారి సేవకులను దోపిడీ చేసినందుకు 4.5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. బ్రిటన్‌లో నివసిస్తున్న ఈ కుటుంబంలోని నలుగురు సభ్యులు జైలులో గడపాల్సి వస్తుంది. గృహ సిబ్బందిని దోపిడి చేసిన కేసులో హిందూజా కుటుంబానికి చెందిన నలుగురిపై స్విస్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దోషులందరికీ నాలుగున్నర జైలు శిక్షలు విధించారు. అయితే, హిందుజా కుటుంబ సభ్యులు ప్రకాష్ మరియు కమల్ హిందుజా, వారి కుమారుడు అజయ్ మరియు కోడలు నమ్రత వంటి తీవ్రమైన కేసుల్లో ప్రతి ఒక్కరినీ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది, భారతదేశం నుండి కొంతమందిని వారి భవనంలో పని చేయడానికి పంపారు. జెనీవా కోసం తీసుకొచ్చారు. కానీ వారిని ఎక్కువ గంటలు పని చేసేలా చేసిన తర్వాత, వారు రోజుకు $8 మాత్రమే చెల్లించారు. హిందుజా కుటుంబం ఈ వ్యక్తుల పాస్‌పోర్ట్‌లను ఉంచిందని మరియు వారి కదలికలపై ఆంక్షలు విధించిందని కూడా పరిపాలన ఆరోపించింది.

జెనీవా కోర్టులో కేసు విచారణ సందర్భంగా, హిందుజా కుటుంబం గృహ సహాయకులను దోపిడీ చేయడం మరియు దుర్వినియోగం చేసినందుకు దోషిగా నిర్ధారించబడింది మరియు 4.5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ కేసులో, హిందుజా కుటుంబం, 47 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తిని కలిగి ఉన్నారని ఆరోపించిన ముగ్గురు గృహ సహాయకులు మానవ అక్రమ రవాణా ఆరోపణల నుండి ఆమె విముక్తి పొందారు. అతనికి మరియు అతని కుటుంబానికి మధ్య కోర్టు వెలుపల సెటిల్మెంట్ జరగడం దాదాపు ఖాయం, అయినప్పటికీ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కోర్టు విచారణను కొనసాగించింది.

ప్రకాష్ హిందుజా (78), కమల్ హిందుజా (75) కేసు మొత్తం విచారణ సమయంలో కోర్టుకు గైర్హాజరయ్యారు. అతనికి 4.5 సంవత్సరాల శిక్ష పడింది. కాగా అతని కొడుకు, కోడలుకు 4 ఏళ్ల శిక్ష పడింది. నలుగురు నిందితులు జెనీవా కోర్టుకు హాజరుకాలేదు. ఈ కేసులో మరో నిందితుడు కుటుంబ వ్యాపార నిర్వాహకుడు నజీబ్ జియాజీ కోర్టుకు హాజరయ్యారు. అతనికి 18 నెలల జైలు శిక్ష విధించబడింది, ఇది ప్రస్తుతం సస్పెండ్ చేయబడింది.

ఈ కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. హిందుజా కుటుంబానికి చెందిన మాన్షన్‌లో సేవకులుగా పనిచేస్తున్న సిబ్బందిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. వారు 18-18 గంటల పాటు పని చేసేలా చేశారు. జీతం పేరుతో నెలకు 250 నుంచి 450 డాలర్లు (నెలకు 20,000 నుంచి 35,000 రూపాయలు) వచ్చేది. స్విట్జర్లాండ్ ప్రకారం ఇది చాలా తక్కువ జీతం. ఇది మాత్రమే కాదు, వారికి స్విస్ ఫ్రాంక్ కరెన్సీకి బదులుగా భారతీయ రూపాయలలో చెల్లించబడింది. హిందూజా కుటుంబం తమ కుక్కల కోసం ప్రతి నెలా ఇంతకు మించి ఖర్చు పెట్టేది.

హిందూజా కుటుంబం భారతదేశంలో మూలాలను కలిగి ఉంది మరియు అదే పేరుతో వ్యాపార సంస్థను కూడా నడుపుతోంది, ఇది అనేక కంపెనీల సమ్మేళనం. ఇందులో నిర్మాణం, దుస్తులు, ఆటోమొబైల్, చమురు, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ వంటి రంగాలు కూడా ఉన్నాయి. హిందూజా గ్రూప్ వ్యవస్థాపకుడు పర్మానంద్ దీప్‌చంద్ హిందూజా అవిభక్త భారతదేశంలోని సింధ్‌లోని ప్రసిద్ధ నగరమైన షికార్‌పూర్‌లో జన్మించారు. 1914లో, అతను భారతదేశం యొక్క వాణిజ్య మరియు ఆర్థిక రాజధాని అయిన బొంబాయికి (ప్రస్తుతం ముంబై) వెళ్ళాడు. హిందూజా గ్రూప్ వెబ్‌సైట్ ప్రకారం, అతను అక్కడ వ్యాపారం యొక్క ఇన్‌లు మరియు అవుట్‌లను త్వరగా నేర్చుకున్నాడు. సింధ్‌లో ప్రారంభమైన వ్యాపార ప్రయాణం 1919లో ఇరాన్‌లో కార్యాలయంతో అంతర్జాతీయ రంగంలోకి ప్రవేశించింది. ఈ బృందం 1979 వరకు ఇరాన్‌లో ప్రధాన కార్యాలయంగా కొనసాగింది. ఆ తర్వాత యూరప్‌కు వెళ్లింది. ప్రారంభ సంవత్సరాల్లో, హిందూజా గ్రూప్ వ్యాపారానికి మర్చంట్ బ్యాంకింగ్ మరియు ట్రేడింగ్ రెండు స్తంభాలు. గ్రూప్ వ్యవస్థాపకుడు పర్మానంద్ దీప్‌చంద్ హిందుజా ముగ్గురు కుమారులు - శ్రీచంద్, గోపీచంద్ మరియు ప్రకాష్ - తర్వాత కార్యకలాపాలను చేపట్టి దేశ విదేశాల్లో కంపెనీని విస్తరించారు.

2023లో శ్రీచంద్ హిందూజా మరణించిన తర్వాత, అతని స్థానంలో అతని తమ్ముడు గోపీచంద్ గ్రూప్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. స్విట్జర్లాండ్‌లో మానవ అక్రమ రవాణా కేసును ఎదుర్కొంటున్న ప్రకాష్ మొనాకోలో వ్యాపారాన్ని స్థాపించాడు. హిందూజా కుటుంబం యునైటెడ్ కింగ్‌డమ్‌లో చాలా విలువైన ఆస్తులను కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 2023లో, హిందూజా గ్రూప్ లండన్‌లోని వైట్‌హాల్‌లో ఉన్న ఓల్డ్ వార్ ఆఫీస్‌లో రాఫెల్స్ పేరుతో ఒక హోటల్‌ను నిర్మించింది, ఇది అంతకుముందు బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖగా ఉంది. ఈ హోటల్ ప్రత్యేకత ఏమిటంటే ఇది బ్రిటిష్ ప్రధాని అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ నుండి కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉంది. అదే సమూహం కార్ల్టన్ హౌస్ యొక్క పైకప్పులో కొంత భాగాన్ని కలిగి ఉంది, ఈ భవనం అనేక కార్యాలయాలు, నివాసాలు మరియు ఈవెంట్ గదులను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు చాలా సమీపంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీల్లో 2 లక్షల మంది పనిచేస్తున్నారని హిందూజా గ్రూప్ పేర్కొంది.