నిజందాగదుక్షణంఆగదు

Jun 11 2024, 18:18

చర్ల: భద్రాచలం:CRPF ఎదురు సందులో కరెంట్ స్థంభానికి ఉన్న ట్రాన్స్ఫార్మర్ వెంటనే తొలగించాలి:సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి ముసలి సతీష్

చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీ లోని లింగాల కాలనీ గ్రామంలో CRPF, పోలీస్ క్యాంప్ ఎదురు సందులో ఉన్న కరెంట్ స్తంభానికి ఉన్న ట్రాన్స్ఫార్ను తొలగించాలి న్యూడెమోక్రసీ నేత కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్

చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీలోని లింగాల కాలనీ గ్రామంలో సిఆర్పిఎఫ్ పోలీస్ క్యాంప్ ఎదురుగా ఉన్న సందులో కరెంటు స్తంభానికి ఒక ట్రాన్స్పరు నిర్మించబడి ఉన్నది అది వెంటనే తొలగించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీని ఉద్దేశించి చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ ఈ ట్రాన్స్ ఫార్మర్ స్తంభానికి కింది బాగానే ఉండడంతో చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులు అనేకమంది ప్రమాదానికి గురి అయ్యే పరిస్థితి ఉంది ఇది రహదారి కావడంతో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్న క్రమంలో అలసిపోయి పట్టుకుంటే కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉన్నది కావున విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క కింది భాగాన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ని తొలగించి వేరే దగ్గర నిర్మించవలసిందిగా కోరుతున్నాం లేనియెడల అధికారులకు ఫిర్యాదు చేయవలసి వస్తుందని వారు కోరారు ఈ కార్యక్రమంలో POW జిల్లా నాయకురాలు ఇర్ప సమ్మక్క మండల నాయకురాలు బొర్ర సమ్మక్క రామలక్ష్మి నాగమణి ఇర్ప వెంకటేష్ కణితి రమణ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 11 2024, 09:11

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుంది అంటే....

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు

నిజందాగదుక్షణంఆగదు

Jun 11 2024, 09:05

నాగర్ కర్నూల్ మునిసిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవిశ్వాసం పెట్టనున్న కాంగ్రెస్...

నాగర్ కర్నూల్ మునిసిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవిశ్వాసం పెట్టనున్న కాంగ్రెస్...

నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం.. మున్సిపల్ చైర్పర్సన్ కల్పనభాస్కర్ గౌడ్పై ఈ రోజు అవిశ్వాస తీర్మానం ఇవ్వనున్న కాంగ్రెస్.. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు.. కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం ఇవ్వనున్న 14 మంది కౌన్సిలర్లు..

నిజందాగదుక్షణంఆగదు

Jun 11 2024, 08:55

ఆగస్టు నెలలో రైతుల రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించండి, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే.. పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి.. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నిజందాగదుక్షణంఆగదు

Jun 10 2024, 08:49

తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..వార్షిక తెప్పోత్సవాలు ఎప్పటినుండి అంటే...

తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,744 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 36,833 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు

17 నుంచి 21వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు.. 19 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక జ్యేష్టాభిషేకం ఉత్సవాలు.. 22వ తేదీన పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.

నిజందాగదుక్షణంఆగదు

Jun 10 2024, 08:37

TS:నిజామాబాద్‌ వరకు విస్తరించిన నైరుతి...రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు...

నిజామాబాద్‌ వరకు విస్తరించిన నైరుతి

రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు నిజామాబాద్‌ జిల్లా వరకు విస్తరించాయి. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాపించనున్నాయి. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. మరోవైపు శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ఖమ్మం జిల్లా కొణిజర్లలలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నిజందాగదుక్షణంఆగదు

Jun 10 2024, 08:27

'నీట్' పై టెన్షన్... వెల్లడించిన ఫలితాలు ఉంచుతారా? రద్దు చేస్తారా?

'నీట్' పై టెన్షన్

వెల్లడించిన ఫలితాలు ఉంచుతారా? రద్దు చేస్తారా?

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీపై విమర్శల వెల్లువ

దేశవ్యాప్తంగా కోర్టులను ఆశ్రయిస్తున్న విద్యార్థులు

చెప్పిన తేదీకి పది రోజుల ముందే ఫలితాల వెల్లడిపై సందేహాలు

ఎన్నికల ఫలితాల రోజు విడుదల చేయడంపైనా అనుమానాలు

కొందరికి గ్రేస్‌ మార్కులిచ్చారు సరే...

మరి హైదరాబాద్‌ విద్యార్థులకు ఇవ్వరా?

హైదరాబాద్‌: వైద్యవిద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో టెన్షన్‌ మొదలైంది. ప్రవేశ పరీక్ష సందర్భంగా లోపాలు తలెత్తడం... ఫలితాల వెల్లడి సమయంలో మార్కుల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న అనేకమంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

దేశవ్యాప్తంగా వందలాది మంది కోర్టుల్లో పిటిషన్లు వేశారు. దీంతో అసలు నీట్‌ ఫలితాలు ఇవే ఉంటాయా? వాటిని రద్దు చేస్తారా? మళ్లీ నీట్‌ పరీక్ష ఏమైనా పెడతారా? అన్న ఆందోళనలు విద్యార్థుల్లో నెలకొన్నాయి. మరోవైపు నీట్‌ ఫలితాలపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. రద్దు ఉండకపోవచ్చని... దానివల్ల విద్యార్థులు మరింత నష్టపోతారని అధికారులు అంటున్నారు.

ఎన్‌టీఏపై విమర్శల వెల్లువ

మే 5న నీట్‌ పరీక్ష జరగ్గా, ఫలితాలను జూన్‌ 14న ప్రకటిస్తామని ఎన్‌టీఏ ముందుగానే ప్రకటించింది. కానీ జూన్‌ 4న దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే... అదే రోజు చడీచప్పుడు కాకుండా నీట్‌ ఫలితాలను ఎన్‌టీఏ ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. అంత హడావుడిగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచి్చందనే విమర్శలు వస్తున్నాయి. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, పక్కదారి పట్టించేందుకు ఆరోజు విడుదల చేశారన్న చర్చ జరుగుతోంది. అలాగే ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులకు ముందే అవకాశం కలి్పంచారు. అయితే, ఆలిండియా ర్యాంకులు.. మార్కులు.. ఫలితాల సమగ్ర సమాచారాన్ని మాత్రం ఆరోజు మరింత ఆలస్యం చేసి ఇచ్చారు. ఇలా అనుమానాలకు తావిచ్చేలా ఎన్‌టీఏ వ్యవహరించిందన్న చర్చ జరుగుతోంది.

హైదరాబాద్‌లోనూ ఆలస్యం

ఇక పలువురు విద్యార్థులకు ఎన్‌టీఏ గ్రేస్‌ మార్కులు ఇచి్చన అంశంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నీట్‌ పరీక్ష సమయం 3 గంటల 20 నిమిషాలు. కొన్ని కేంద్రాల్లో ప్రశ్నాపత్రాల అందజేతలో ఆలస్యం, చిరిగిన ఓఎంఆర్‌ పత్రాలు తదితర కారణాల నేపథ్యంలో సమయం వృథా అయ్యిందంటూ కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీ, ఛతీస్‌గఢ్, హరియాణ న్యాయస్థానాల్లో రిట్‌ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను ఎన్‌టీఏ సమీక్షించి వారికి గ్రేస్‌ మార్కులు ఇచ్చినట్లు తెలిపింది. అలాగైతే దేశంలో అనేకచోట్ల విద్యార్థులకు ఆలస్యంగా పరీక్ష పేపర్‌ ఇచ్చారు. వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని మెరీడియన్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలోని ఒక రూంలో ప్రశ్నపత్రాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చారు. ఆ గదిలో గడియారం ఆగిపోవడం... తప్పుగా చూపించడకపోవడంతో ఆలస్యం చేశారు. తప్పు సిబ్బందిదే అయినా కానీ విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు అనేకమంది ప్రశ్నలు రాయలేకపోయారు. అంత సమయం పోవడం వల్ల తమకు మార్కులు తగ్గుతాయని, రావాల్సిన సీటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. మరి వారికెందుకు గ్రేస్‌ మార్కులు కలపలేదని ప్రశి్నస్తున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 09 2024, 17:02

ఏపీ : ప్రమాణ స్వీకారానికి ముందే పని ప్రారంభించిన చంద్రబాబు

అమరావతి : ప్రమాణ స్వీకారానికి ముందే పని ప్రారంభించిన చంద్రబాబు. వివిధ కీలక శాఖల నుంచి సమాచారం తెప్పించుకుంటున్న టీడీపీ అధినేత. కీలకాంశాలపై వరుస రివ్యూలు ఉంటాయని అధికారులకు చంద్రబాబు స్పష్టీకరణ. ప్రజా సంబంధిత అంశాలపై నిర్లక్ష్యం తగదని చంద్రబాబు స్పష్టీకరణ. ప్రమాణస్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు సిద్ధం అవుతన్న కీలక శాఖల అధికారులు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 09 2024, 14:19

TS: ముగిసిన ఎలక్షన్ కోడ్.. ఇక పాలనపైనే రేవంత్ సర్కార్ దృష్టి.. చుట్టూ ముడుతున్న ఆర్థిక సమస్యలు ఉక్కిరి బిక్కిరి...

ఉక్కిరిబిక్కిరి !

 చుట్టుముడుతున్న ఆర్థిక సమస్యలు

భారీగా సర్కారు పెండింగ్‌ బిల్లులు

ముగిసిన ఎలక్షన్‌ కోడ్‌

పాక్షికంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత

ఏడాదిగా కాంట్రాక్టర్ల ఎదురుచూపులు

వెంటాడుతున్న రైతు రుణమాఫీ

ప్రత్యామ్నాయ ఆదాయంపై ప్రభుత్వ దృష్టి

ఇక పాలనపైనే రేవంత్‌ సర్కార్‌ నజర్‌

ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చే బాధ్యతను నెత్తికెత్తుకున్న రేవంత్‌ సర్కార్‌ ఇప్పుడు అదనపు ఆదాయం కోసం నానా అవస్థలు పడుతుంది. ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ లక్ష్యాలకు మధ్య భారీ అంతరం ఏర్పడటంతో దాన్ని భర్తీ చేయడంపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పెండింగ్‌ బిల్లులు కాంట్రాక్టర్లనే కాదు…అధికారుల్నీ చికాకు పెడుతున్నాయి. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు వాటిని పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఎలక్షన్ల హడావిడి ముగియడంతో ఇక సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ఆర్థికస్థితిని గాడినపెట్టే కసరత్తు ప్రారంభించారు.

ఎలక్షన్‌ కోడ్‌ ముగిసింది. ఇక సర్కారు పాలనపై సమస్త ప్రజానీకం దృష్టి నిలిపింది. అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తామన్న హామీల అమలుకోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాటిలో ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పెన్షన్ల పెంపు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు, ధరణి పోర్టల్‌ సవరణలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక చేయూత, మహాలక్ష్మి స్కీం ద్వారా మహిళలకు నెలకు రూ.2,500 బ్యాంకు ఖాతాల్లో జమ వంటి అనేక అంశాలు ఉన్నాయి. అయితే వీటన్నింటిపై రేవంత్‌ సర్కార్‌ ఇప్పుడు దృష్టి పెట్టింది. ఎలక్షన్‌ కోడ్‌ ముగియగానే గృహజ్యోతి స్కీం పరిధిలోకి వచ్చే ఇతర విద్యుత్‌ వినియోగదారులందరికీ ‘జీరో’ బిల్లులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది.అయితే ఇవన్నీ ఆర్థికపరమైన అంశాలు కావడంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతుంది.రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు ఏడాది నుంచి బిల్లులు చెల్లించలేదు. దీనితో ఆయా పనులన్నీ సగంలో నిలిచిపోయాయి. పెండింగ్‌ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రాజెక్టులతో పాటు రోడ్లు, నాళాల మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లందరికీ కలిపి ప్రభుత్వం దాదాపు రూ.50వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్టు సమాచారం.

రెండేండ్లుగా ప్రయివేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదు. దీనితో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా సర్కారుపై ఒత్తిడి తెస్తున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ సేవలు అందిస్తున్న డెంటల్‌ ఆస్పత్రులు రెండు వారాలుగా కొత్త పేషెంట్ల నమోదును నిలిపివేశాయి. ప్రభుత్వం నుంచి తమకు రావల్సిన బకాయిలు వచ్చే వరకు కొత్త కేసులు తీసుకోబోమని హైదరాబాద్‌ హైదర్‌గూడలోని సురక్షా డెంటల్‌ మల్టీ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ రాజోలు తెలిపారు. వివిధ సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు తమకు వర్కవుట్‌ కావట్లేదనీ, 2004 నాటి చార్జీలనే ఇప్పటికీ వర్తింప చేస్తున్నారనీ, వాటిని సవరించాలని కోరుతున్నారు. అయితే ఆరోగ్యశ్రీ లోని 1,375 సేవల ప్యాకేజీల రేట్లనుపెంచుతూ శనివారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆగస్టు 15వ తేదీ లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లేసి చెప్పిన విషయం తెలిసిందే. దీనికోసం దాదాపు రూ.35వేల కోట్ల నిధులు కావల్సి ఉంది. రుణమాఫీ జరిగితే, బ్యాంకర్ల నుంచి కొత్త రుణాలు తీసుకోవచ్చని రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు, సర్కారు హామీల మధ్య భారీ ఆర్థిక అంతరం ఏర్పడటంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలు ముగియగానే పురపాలక సంఘాలు, ఎమ్‌పీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఇప్పుడు పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. బీసీ జనగణన జరిపి, రిజర్వేషన్లు ఖరారు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లూ ఊపందుకున్నాయి. పరిస్థితి పాలకపక్షానికి అనుకూలంగా లేదని భావించిన రేవంత్‌ సర్కార్‌ ఈ ఎన్నికలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీనితో ముందస్తుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆదాయవనరులు సమకూరలేదని సమాచారం. పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌ బిల్లులు అధికారుల్ని మహా చిరాకు పెడుతున్నాయి. ప్రోటోకాల్‌ విభాగంలోని కాంట్రాక్టర్లకు ఏడాదికాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో, వారు తామిక ఎదురు పెట్టుబడి పెట్టలేమని చేతులెత్తేసినట్టు సమాచారం. దీనితో అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. పౌరసరఫరాల శాఖలోనూ పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తే తప్ప, లారీలు తిప్పలేమని యజమానులు ఖరాఖండిగా చెప్తున్నారు. సెక్రటేరియల్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు వాడుతున్న కార్లకు ఏడాదిగా బిల్లులు చెల్లించలేదు. ఇదే పరిస్థితి ఇతర కార్పొరేషన్లలోనూ ఉంది. కార్లకు ఈఎమ్‌ఐలు చెల్లించేందుకు అప్పుల పాలవుతున్నామని సదరు యజమానులు మొత్తుకుంటున్నారు.

ఆదాయాన్వేషణ

ఇటీవల వివిధ శాఖలపై సంయుక్తంగా సమీక్షా సమావేశం నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాలని అన్ని శాఖల ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. శాఖల వారీగా వారంరోజుల్లో అలాంటి ప్రతిపాదనల్ని తన దృష్టికి తెస్తే, మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం ఇప్పటికీ నత్తనడకనే సాగుతుంది. సర్కారు ఆశించిన స్థాయిలో ఆదాయం రావట్లేదు. మరోవైపు భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుపై కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో భూములు సామాన్యులకు అందుబాటులో లేని స్థాయిలో ఉన్నాయి. వాటిని మరోసారి పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనా ప్రభుత్వంలో ఉంది. హెచ్‌ఎండీఏ ద్వారా భూముల అమ్మకంపై కసరత్తు జరుగుతుంది. రేవంత్‌ సర్కార్‌ ప్రాధాన్యతా క్రమంలో ఒక్కో సమస్యను పరిష్కరించాలని అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కోరుతున్నారు. నిధులు లేకుండా పరిపాలన ఎలా సాగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్‌ సర్కార్‌ ఆ దిశగా దృష్టి పెట్టాలని ప్రజలు, పెండింగ్‌ బిల్లుల బకాయిదార్లు కోరుతున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 09 2024, 11:11

TS:ఆర్థిక శాఖ పరిధిలోకి రాష్ట్ర ఆర్థిక సంఘం..

ఆర్థిక శాఖ పరిధిలోకి రాష్ట్ర ఆర్థిక సంఘం

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని(స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ను) పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆర్థికశాఖకు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.2014లో ఏర్పాటైన రాష్ట్ర ఆర్థిక సంఘం ఇన్ని రోజులుపంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉంది. గొడిశాల రాజేశంగౌడ్ అధ్యక్షతన ఏర్పాటైన మొదటి ఆర్థిక సంఘం తమ సిఫార్సుల్లో తమ సంస్థను ఆర్థికశాఖ పరిధిలోకి మార్చాలని సిఫార్సు చేసింది. దీనిని ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.*