విష్ణుపురం దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.
విష్ణుపురం దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.
ఆ రూట్‌లో వెళ్లే పలు రైళ్లకు అంతరాయం.
మిర్యాలగూడలో శబరి ఎక్స్‌ప్రెస్ రైలు నిలిపివేత.
పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు నిలిపివేత.
Streetbuzz News
వ్యవస్థలో మార్పు తీసుకరావడానికి ప్రధాన పాత్రదారులు పట్టభద్రులు
•పాలకూరి రవి,నల్గొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి
వ్యవస్థలో మార్పు తీసుకరావడానికి పట్టభద్రులు ప్రధాన పాత్రదారులు కావాలని, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మీయొక్క సమస్యలపై అవగాహన కలిగి యుండి నిరంతరం పోరాడే అభ్యర్థికి మీ మొదటి ప్రాధాన్యత కలిగిన ఓటు వేసి ప్రజలందరికీ మీరు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను అని నల్గొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి గౌడ్ తెలిపారు.
సాధారణ ఎన్నికలలో నిరక్షరాస్యులైన కొంత మంది ఓటర్లు,అలాగే ఓటు విలువ తెలియని వాళ్ళు ఆయా ఎన్నికల సమయంలో డబ్బులకు లేదా ఇతర ప్రలోభాలకు లొంగి తమ ఓటును అసమర్థులకు వేస్తున్న విషయం మన అందరం గమనిస్తూనే ఉన్నాము.
అలాంటి వాళ్ళలో చైతన్యం రావాలి అంటే చదువుకొని విజ్ఞానవంతులైన మీరు మీ యొక్క ఓటును నిష్పక్షపాతంగా వేసి మీ విజ్ఞతను నిరూపించుకోవాలని కోరారు.
కొన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు అధికార,ధన బలంతో గెలుపు తమదే అని విర్రవీగుతున్న వారికి మీ ఓటుతో దిమ్మ తిరిగేలా సమాధానం ఇవ్వాలని మీ అందరినీ మరొక్కసారి కోరుతున్నాను అని నల్గొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి అన్నారు.
తిరుపతిలో మరోసారి చిరుత కలకలం..
జిల్లాలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది..
తాజాగా వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచరిస్తోంది..
నిత్యం పశువుల కాపర్లు పశువులను మేపుకోవడానికి వెళ్లే ప్రాంతంలో చిరుత సంచరించడం, అలానే అడవి గ్రమానికి దగ్గరగా ఉండడంతో గ్రామస్తులు భయాంధోళనకు గురవుతున్నారు..
ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు..
పట్టభద్రుల ఓటు ఎవరికో ?
మూడు ఉమ్మడి జిల్లాలు.. ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు.. 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న శాసనమండలి స్థానం. 4,63,839 మంది పట్టభద్రులైన ఓటర్లకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గం.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారిన ఉప ఎన్నిక.
దీంతో సోమవారం పోలింగ్ జరగనున్న వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ తరఫున ఏనుగుల రాకే్‌షరెడ్డి బరిలోకి దిగారు.
2007 నుంచి నాలుగు పర్యాయాలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఏకపక్షంగా గెలవగా, ఐదోసారి కూడా మళ్లీ పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే గులాబీ కోటకు ఎలాగైనా చెక్ పెట్టి తమ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్, బీజేపీ వ్యూహ, ప్రతివ్యూహాలతో హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు అత్మీయ సమ్మేళనాలు, ఫోన్‌కాల్ పలకరింపులు, వాకర్స్‌తో మాటామంతీ లాంటి కార్యక్రమాలతో ప్రచారాన్ని హోరెత్తించారు.
Breaking : కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత !
- స్పందించిన ఎంపీ బండి సంజయ్ కుమార్
- పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్
కరీంనగర్‌లో పరిస్థితి అదుపుతప్పింది. నిన్న (26-5-2024) హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న హనుమాన్ ఆలయం నుంచి, గాంధీ రోడ్డు లోని హనుమాన్ ఆలయం వరకు.. ఈ శోభయాత్ర జరపాలని ప్రారంభించారు.
హనుమాన్ మాల వేసిన వారు ర్యాలీ చేస్తుండగా.. కొందరు వ్యక్తులు వచ్చి ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళన చేశారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు కరీంనగర్ వైపు చూసే పరిస్థితి. అక్కడ జరిగిన పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి. హనుమాన్ శోభాయాత్రలో తోపులాటతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై బండి సంజయ్ స్పందించారు.
Blast in Factory:ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు 17మంది దుర్మరణం..
Blast in Factory : ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది..
ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు..
ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 17 మృతదేహాలను శిథిలాల నుంచి బయటికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..
MPని చంపి.. చర్మం ఒలిచి, ముక్కలుగా నరికి నగరమంతా పారేసిన వైనం
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
అయితే ఎంపీ అన్వరుల్ హత్యకు సంబంధించి సీఐడీ తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించింది
ఓ మహిళను ఎరవేసి హనీ ట్రాప్ ద్వారా ఎంపీని కోల్‌కతాకు రప్పించి..
ఓ అపార్ట్‌మెంట్‌లో హత్య చేశారు.
అనంతరం చర్మం వలిచి, ముక్కలుగా నరికారు.
వాటిని ప్లాస్టిక్ బ్యాగ్‌ల్లో నగరమంతా పారేశారని సీఐడీ అధికారులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి జిహాద్ హవల్దార్‌ను సీఐడీ అరెస్ట్ చేసినట్లు తెలిపింది.
విశాఖలో అయ్యనార్ ఆపరేషన్ సక్సెస్.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు
విశాఖపట్నంలో అయ్యనార్ ఆపరేషన్ సక్సెస్.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు.
కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ బాధితులకు సీపీ రవిశంకర్ అయ్యనార్ బాసటగా నిలిచారు.
సైబర్ క్రైమ్ గ్యాంగ్ చేతిలో చిత్రహింసలకు గురైన వారిని విశాఖకు రప్పించి శభాష్ అనిపించుకున్నారు.
ఇంతకీ.. కంబోడియాలో విశాఖ వాసులు ఎందుకు చిక్కుకున్నారు?..
వారిని రప్పించేందుకు అయ్యనార్ చేసిన ఆపరేషన్ ఏంటి?…
సైబర్ క్రైమ్ కేటుగాళ్లు రోజుకో రూటులో నేరాలు చేస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు. రూట్ చేంజ్ అంటూ.. ఇప్పుడు కొత్త పంథా ఎంచుకున్నారు. ఉద్యోగాల పేరుతో భారతీయులను వాళ్ల దేశాలకు తీసుకెళ్లి.. మన కంటిని మన వేళ్లతోనే పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అవును.. సరిగ్గా ఇలాంటి కేసే విశాఖలో వెలుగులోకి వచ్చింది. కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు విశాఖ పోలీసులు. ఒక వ్యక్తి ఫిర్యాదుతో కంబోడియా గ్యాంగ్ డొంకనే పెకిలించారు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్. ఈ కేసులో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్ బాగోతాన్ని గుర్తించడమే కాదు.. మానవ అక్రమ రవాణా కోణాన్ని వెలికి తీశారు.
ఇక.. ఈ కేసులో ఇప్పటికే విశాఖకు చెందిన ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా వివరాలు, వారి మోసాలపై CP రవిశంకర్ అయ్యానార్ దృష్టి సారించారు. కొందరు విశాఖ ఏజెంట్లు.. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో 150 మంది నిరుద్యోగులను పంపడంతో కాంబోడియా గ్యాంగ్ నిర్బంధించినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన తర్వాత భారతీయుల వీసాలు చించివేయడంతో ఆ కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారని.. ఇలా.. దేశవ్యాప్తంగా కంబోడియా గ్యాంగ్ చేతిలో సుమారు 5వేల మంది చిక్కుకున్నట్లు దర్యాప్తులో తేలడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వివిధ రాష్ట్రాల వారిని తీసుకెళ్లి నిర్బంధించినట్లు వెల్లడైంది. అంతేకాదు.. మనవాళ్లకు పలు రకాల స్కామ్‌ల్లో ట్రైనింగ్ ఇచ్చి.. మనదేశంపైనే సైబర్ ఎటాక్ చేయిస్తుండడం సంచలనంగా మారింది.
ఇక.. కంబోడియా గ్యాంగ్ మన వాళ్లను అక్కడికి ఎలా తీసుకెళ్తున్నారు?.. మనవాళ్లతో సైబర్ నేరాలు ఎలా చేయిస్తున్నారు? ఆ గ్యాంగ్ గుట్టు ఎలా రట్టు చేశారు?.. అనే కీలక విషయాలను వెల్లడించారు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో విశాఖ ఏజెంట్లు నిరుద్యోగులను కంబోడియా ఏజెంట్లకు అమ్మేస్తున్నారన్నారు. ఇలా చేయడం ద్వారా విశాఖ ఏజెంట్లకు కంబోడియా గ్యాంగ్ ఒక్కొక్కరికి 50వేలు చొప్పున ఇస్తున్నారని తెలిపారు.
మొత్తంగా.. కంబోడియా కేటుగాళ్ల కేసులో విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది. కంబోడియాలోని ఇండియన్ ఎంబసీ సహకారంతోనే 48 గంటల్లో బాధితులను తీసుకొచ్చి శభాష్ అనిపించుకున్నారు. ఇక.. దేశ వ్యాప్తంగా జరిగిన సైబర్ స్కామ్‌కు సంబంధించి డొంక కదిలించేందుకు సిద్ధమవుతున్నారు విశాఖ పోలీసులు.
గుడివాడలో మాయా లేడి
•మాయ మాటలు చెప్పి కోటిన్నర కాజేసిన మాయలేడి లీలావతి
•నమ్మించి మోసం చేసింది ఓ మాయలేడి.
కృష్ణా జిల్లా గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పి కోటిన్నర కాజేసింది మాయలేడి. గుడివాడలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.
మాయ లేడి లీలావతిపై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలంటూ రూరల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు ఇప్పిస్తానంటూ లీలావతి మాయమాటలు చెప్పింది. లక్ష్మీ నగర్ కాలనీ, బాపూజీ నగర్, చౌదరి పేట, ఆర్టీసీ కాలనీ, టీడ్కో కాలనీ, జగనన్న కాలనీల్లోని మహిళలతో 60 గ్రూపులు ఏర్పాటు చేసింది.
గ్రూపుల్లోని సభ్యులకు మంజూరైన రుణాల్లో మాయ మాటలు చెప్పి కోటిన్నర తీసుకుంది. రుణాలు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద బంగారు ఆభరణాలు తీసుకొని తాకట్టు పెట్టింది. రుణాలు చెల్లించకపోవడంతో, బ్యాంకుల ప్రతినిధులు బాధితుల ఇళ్లకు రావడంతో వారు లీలావతి కోసం వెతికారు.
ఆమె అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయింది. లీలావతి హైదరాబాదులోని మియాపూర్‌లో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి ప్రశ్నించిన ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలోనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదగు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
May 27 2024, 08:24