TS స్థానంలో TG అమలు చేయాలని గెజిట్ నోటిఫికేషన్‌..
తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా TS స్థానంలో TG అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌.. కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్‌ ప్రకారం ఇక నుండి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌లు TS స్థానంలో TG ఉండే విధంగా రిజిస్టేషన్లు చేయాలని గెజిట్
పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు 52 మంది అభ్యర్థులు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

బిజెపి పార్టీ నుండి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి, జాతీయ నవక్రాంతి పార్టీ నుండి కర్నే రవి, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ నుండి గుండాల జ్యోతి, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి చెన్న శ్రీకాంత్, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్, తదితరులు పోటీ చేయుచున్నారు. కాగా, ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG
ఫుట్బాల్ క్రీడాకారునికి 20,000/-రూపాయలు ఆర్థిక సహాయం చేసిన YRP ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎలిషాల రవిప్రసాద్
ఈనెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ హైస్కూల్ నందు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రప్రధమంగా *ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ D లైసెన్స్ ప్రొఫెషనల్ కోచ్ సర్టిఫికెట్ కోర్సు* ను నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలోని చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు మద్ది కర్ణాకర్ ఈ కోర్సును పూర్తి చేయడానికి గాను కావలసిన 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని క్లబ్ వ్యవస్థాపకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు గారి చొరవతో YRP ఫౌండేషన్ వారిని సంప్రదించగా నేడు హైదరాబాదులోని వారి ప్రధాన కార్యాలయంలో 20,000/- వేల రూపాయల చెక్కును మద్ది కరుణాకర్ కు ఎలిషాల రవి ప్రసాద్ గారు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూన శ్రీశైలం గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మపాల గిరిబాబు గారి ఆధ్వర్యంలో ఎలిశాల రవి ప్రసాద్ మరియు కూన శ్రీశైలం గౌడ్ గార్లను క్లబ్ పక్షాన శాలువాతో ఘనంగా సన్మానించి మాట్లాడుతూ YRP ఫౌండేషన్ సంస్థలు ఎన్నో సామాజిక కార్యక్రమాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫుట్బాల్ కబడ్డీ క్రీడాకారులని జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేసే క్రమంలో వారికి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తూ క్రీడాభివృద్ధికి సహకరిస్తుందని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో చెకీలం శేషగిరిరావు, మారెపల్లి అర్జున్, తిరుమణి మోహన్ కుమార్, మద్ది కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
SRPT: CCTV కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
సూర్యాపేట: కంట్రోల్ సెంటర్ నుండి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన ఎలక్షన్స్ సెల్, సోషల్ మీడియా మానిటరింగ్ యూనిట్, పోలీస్ కంట్రోల్ రూమ్, మరియు CCTV కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లను ఆదివారం ఎస్పీ పరిశీలించారు.
NLG: కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం
నల్లగొండ: అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షుడు బొల్లా వేణుగోపాల్ రావు అధ్యక్షతన సంఘ సభ్యులు చేత సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆకెళ్ళ శ్రీనివాస్, ఫణి ఆచార్య, గొల్లపూడి మారుతి శర్మ, పులిజాల యాదగిరిరావు, తమృగోటి పవన్ కుమార్ తేనెపల్లి శేఖర్, ధర్పల్లి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
SB NEWS TELANGANA

SB NEWS NLG
NLG: బైక్ షోరూం లో అగ్ని ప్రమాదం
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టీవీఎస్ బైక్ షో రూమ్ లో ఇవాళ  అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి కొత్త ద్విచక్ర వాహనాలు కాలి బూడిద అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: ఉపాధి కూలీలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: నాంపల్లి జెడ్పిటిసి AV రెడ్డి
నాంపల్లి:ఉపాధి కూలీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదని జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుంభం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ పూల వెంకటయ్య,మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు.

శనివారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి కూలీలను కలిసి కాంగ్రెస్ కు ఓటువేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు.కాంగ్రెస్ హాయంలోనే ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజు శీలం జగన్మోహన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, వైస్ ఎంపీపీ పానుగంటి రజనీ ఎంకన్న గౌడ్, ఎస్కే చాంద్ పాషా, గాదేపాక నాగరాజు, కోరే శివ, కామిశెట్టి చత్రపతి, దోటీ పరమేష్ యాదవ్, గడ్డం రఘుపతి, కోరే కిషన్, సంగేo గణేష్,ఎదుల రాములు, తదితరులు పాల్గొన్నారు. SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG
లెంకలపల్లి లో జోరుగా కాంగ్రెస్ ప్రచారం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం,  భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు.. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని, చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని గ్రామంలో పలు వార్డులలో  ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, గ్రామ తాజా మాజీ సర్పంచ్ పాక నగేష్, చాపల రవి, పగిళ్ల యాదయ్య, పెంబల్ల లింగయ్య, పెంబల్ల గిరి, బోడ బిక్షం, తిరుమణి మల్లేష్, పాక అంజయ్య, పాక పరమేష్, కాటగోని కృష్ణయ్య, అబ్బనగోని శ్రీను, వావిళ్ళ కృష్ణ, ఏర్పుల వెంకటేష్, పెంబల్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG
NLG: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని లెంకలపల్లి లో విస్తృతంగా ప్రచారం
నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం, భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని, గెలిపించాలని కోరుతూ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

హస్తం గుర్తుకు ఓటు వేసి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ పాక నగేష్, నాయకులు చాపల రవి, పెంబల్ల గిరి, కాటగోని కృష్ణయ్య, పాక పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG
NLG: కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రజానేత నూనె సురేష్
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: విద్యార్థుల రాజకీయ పార్టీ నల్లగొండ జిల్లా ఇన్చార్జి, మండలం లోని తూర్పుపల్లి గ్రామ మాజీ వార్డు మెంబర్, అడ్వకేట్ నూనె సురేష్ గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లోకసాని శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ఆయనతో పాటు విద్యార్థుల రాజకీయ పార్టీ దేవరకొండ డివిజన్ అధ్యక్షులు ఎం.డి ఇమ్రాన్, దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన నూనె వెంకటయ్య, నూనె లక్ష్మయ్య,అంజి , ఎన్నిమల్ల తిరుపతయ్య, వల్లవోజు అంజయ్య ,హరి లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టిలో చేరారు.

ఈ సందర్భంగా ప్రజానేత నూనె సురేష్ మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు సంక్షేమం కోసం, ఎమ్మెల్యే సహకారంతో తూర్పుపల్లి గ్రామ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG