BJP,RSS, మోడీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం
•ఇండియా కూటమి అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపిద్దాం.
•రాజ్యంగాన్ని,రిజర్వేషన్లను కాపాడుకుందాం
సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు పిలుపు
సిపిఐ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు మద్దతుగా పదవ డివిజన్ కట్ట రాంపూర్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈసందర్బంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షులు బత్తిని చంద్రయ్య గౌడ్ లు మాట్లాడుతూ...
మోడీ 10 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా హిందుత్వ ఫాసిస్టు శక్తులు పెట్రేగిపోయా యని, దళితులపైన, ఆదివాసీల పైన, మహిళల పైన, మైనారిటీ లపైన దాడులు, హింసలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ముస్లిం, క్రిస్టియన్ తదితర మైనారిటీ మతాలకు వ్యతిరేకంగా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశ సమైక్యతకు, లౌకిక, ప్రజాస్వామిక విధానాలకు తూట్లు పొడుస్తు 80% హిందువుల సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతు హిందువుల్ని బిజెపి మభ్యపెడుతుందన్నారు.
దేశంలోని మణిపూర్లో మైనారిటీలపై, తెగలపై ఎడతెగని హత్యాకాండ కొనసాగిస్తున్నారని, రామ మందిర నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 రద్దు తదితర చట్టాలతో మైనారిటీలను కేంద్రంగా చేసుకొని దాడులు చేస్తూ, వారిని అభద్రతా భావానికి గురిచేస్తున్నారన్నారు.
లౌకిక, ప్రజాస్వామిక వాదులపై, ఆలోచనాపరులపై పాశవిక నిర్బంధాన్ని బీజేపీ అమలు చేస్తుందని, రాజ్యాంగ పరంగా ఏర్పడిన సంస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని మోడీ ప్రభుత్వం చట్టసభలను నామమాత్రం చేస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులను, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నారని, పార్లమెంటరీ ఫాసిజాన్ని దేశంలో అమలు చేస్తున్నదని విమర్శించారు.
భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూసే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శక్తుల ప్రమాదాన్ని అడ్డుకోవాలని తెలిపారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో బిజెపిని, దాని మిత్రపక్షాలను ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థి రాజేందర్ రావు ని గెలిపించాలని పైడిపల్లి రాజు, బత్తిని చంద్రయ్య గౌడ్ లు పిలుపునిచ్చారు.
పదవ డివిజన్ ఇంటింటా ప్రచార కార్యక్రమంలో సిపిఐ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంకటి మమత, మంజుల, పోచయ్య, ప్రశాంత్, పద్మ, హరి, శ్రీనివాసరెడ్డి, కవిత, సంధ్య, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
May 10 2024, 18:03