బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం
నాంపల్లి: మండలంలో భారత రాష్ట్ర సమితి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, రాందాస్ తండాలో గురువారం పెద్దాపురం మాజీ ఎంపీటీసీ మెగావత్ భాషా నాయక్ స్థానిక కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ ను గెలిపించాలని భాష నాయక్ కోరారు.
ఈ కార్యక్రమంలో హనుమంతు, ఎం. భాస్కర్, ఆదిత్య, టేఖ్య, మహిపాల్, మెగావత్ వంశీ, రమేష్, మెగావత్ శ్రీనివాస్, రఘు, తదితరులు పాల్గొన్నారు.

నాంపల్లి: మండలంలో భారత రాష్ట్ర సమితి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, రాందాస్ తండాలో గురువారం పెద్దాపురం మాజీ ఎంపీటీసీ మెగావత్ భాషా నాయక్ స్థానిక కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

చార్‌థామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను మే 10న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.
NLG: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా గురువారం మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో, భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా, చేతి గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ కాంగ్రెస్ నాయకులు గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ ను వారి క్యాంప్ కార్యాలయంలో, గురువారం ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు మద్దిమడుగు బిక్షపతి, ఉపాద్యక్షుడు యేకుల సురేష్ మరియు సభ్యులు మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు సంఘం గురించి వారికి వివరించారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్దిగా పాలకూరి అశోక్, బుధవారం నల్లగొండలో నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి దాసరి హరిచందన కు అందజేశారు.
మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ను గెలిపించాలని, మద్యం డబ్బు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు.
మర్రిగూడ మండలం, ఇందుర్తి మేటిచందాపురం గ్రామాలలో భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి కామ్రేడ్ జహంగీర్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. మత రాజ్యం వద్దు ప్రజాస్వామ్యం హద్దుగా పనిచేయాలని, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పని చేసే అభ్యర్థి, నిరంతరం ప్రజల తరఫున నిలబడుతూ వారి హక్కుల కోసం పోరాడే జహంగీర్ ను గెలిపించాలని కోరారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు (పెద్దమ్మ తల్లి పండుగ) సందర్భంగా సోమవారం సాయంత్రం గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
May 09 2024, 18:20
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.1k