Mane Praveen

May 09 2024, 17:40

బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం
నాంపల్లి: మండలంలో భారత రాష్ట్ర సమితి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, రాందాస్ తండాలో గురువారం పెద్దాపురం మాజీ ఎంపీటీసీ మెగావత్ భాషా నాయక్ స్థానిక కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ ను గెలిపించాలని భాష నాయక్ కోరారు.

ఈ కార్యక్రమంలో హనుమంతు, ఎం. భాస్కర్, ఆదిత్య, టేఖ్య, మహిపాల్, మెగావత్ వంశీ, రమేష్, మెగావత్ శ్రీనివాస్, రఘు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 09 2024, 15:33

రేపే తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయాలు
చార్‌థామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను మే 10న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.

వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ తలుపులు తెరవనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా ఆలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు.

Mane Praveen

May 09 2024, 15:20

సరంపేట లో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం
NLG: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో  భాగంగా గురువారం మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో, భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా, చేతి గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ కాంగ్రెస్ నాయకులు గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

Mane Praveen

May 09 2024, 15:16

NLG: దేవరకొండ ఎమ్మెల్యేను కలిసిన  AISSD జిల్లా నాయకులు
దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ ను వారి క్యాంప్ కార్యాలయంలో, గురువారం ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు మద్దిమడుగు బిక్షపతి, ఉపాద్యక్షుడు యేకుల సురేష్ మరియు సభ్యులు  మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు సంఘం గురించి వారికి వివరించారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

May 08 2024, 22:11

NLG: నామినేషన్ వేసిన MLC అభ్యర్థి పోతుల గంగిరెడ్డి కోటిరెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

ఆరవ రోజు బుధవారం స్వతంత్ర అభ్యర్థిగా పోతుల గంగిరెడ్డి కోటిరెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన కు అందజేశారు.

Mane Praveen

May 08 2024, 22:07

NLG: ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ వేసిన పాలకూరి అశోక్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్దిగా పాలకూరి అశోక్, బుధవారం నల్లగొండలో నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి దాసరి హరిచందన కు అందజేశారు.

నాగార్జున ప్రభుత్వ కళాశాల నుండి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. యువకులు ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mane Praveen

May 08 2024, 22:04

ఎర్ర జెండా పేదలకు అండ: సిపిఎం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున
మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ను గెలిపించాలని, మద్యం డబ్బు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు.

ఈరోజు మర్రిగూడ మండలం కొండూరు, వట్టిపల్లి, బట్లపల్లి , మర్రిగూడలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎర్రజెండా ఏనాటికైనా పేదలకు అండ అని, ఎర్రజెండా నీడనే పేదల హక్కులు కాపాడబడతాయని, నిరుపేదలు తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలంటే సిపిఎం గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల నాయకులు కొట్టం యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 07 2024, 16:46

NLG: ఇందుర్తి మేటిచందాపురం గ్రామాలలో సిపిఎం ప్రచారం
మర్రిగూడ మండలం, ఇందుర్తి మేటిచందాపురం గ్రామాలలో భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి కామ్రేడ్ జహంగీర్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల  యాదయ్య మాట్లాడుతూ.. మత రాజ్యం వద్దు ప్రజాస్వామ్యం హద్దుగా పనిచేయాలని, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పని చేసే అభ్యర్థి, నిరంతరం ప్రజల తరఫున నిలబడుతూ వారి హక్కుల కోసం పోరాడే జహంగీర్ ను గెలిపించాలని కోరారు.

తెలంగాణ రైతాంగ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న సిపిఎం పార్టీని గెలిపించాలని దేశ రాజకీయాల్లో విశిష్టత స్థానాన్ని సంపాదించుకుందని ఆయన అన్నారు పేదలు కష్టజీవుల తరఫున నీతితో నిజాయితీతో పోరాడుతున్నది ఎర్రజెండా ఒక్కటే అని అన్నారు.

పేదల కోసం కార్మికుల కోసం పోరాటం చేసే సిపిఎం అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాలని ఆయన అన్నారు.

కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో పగిల్ల రాములు, దుర్గమ్మ, వెంకటయ్య, శివ, నందిని, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

May 07 2024, 08:36

NLG: లెంకలపల్లి: పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించిన భక్తులు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు (పెద్దమ్మ తల్లి పండుగ)  సందర్భంగా సోమవారం సాయంత్రం గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

May 06 2024, 21:46

నాంపల్లి మండలం స్థాయి బూత్ కమిటీ సభ్యుల విస్తృతస్థాయి సమావేశం
నాంపల్లి: పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైంది. ప్రజలందరి దీవెనలతో ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది. ఇప్పుడు ఆదర్శ తెలంగాణను తీర్చిదిద్దుకుందామని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.నియంతృత్వ బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయడమే తన లక్ష్యమన్నారు.

సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో మండలం స్థాయి బూత్ కమిటీ సభ్యుల విస్తృతస్థాయి సమావేశం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారు అభివృద్ధిని చేయలేరన్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 

మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు, త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని బీజేపీ, బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలను నమ్మవద్దని  భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని తనను ఆదరించినట్లే అతనిని కూడా ఆదరించాలని అన్నారు. నాంపల్లి మండలం నుండి భారీ మెజార్టీని తేవాలని అన్నారు.

నక్కలగండి పూర్తి చేసి కిష్ణరాంపల్లి, చర్లగూడెం, ప్రాజెక్టుల ద్వారా సాగు, త్రాగునీరు, మునుగోడు నియోజకవర్గ ప్రజలు అందించి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. గత పది ఏళ్లలో బి ఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో దేశ చరిత్రలోనే గుర్తింపు ఉండేలాగా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కార్యకర్తలను కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలిచి తీరుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, ప్రతి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారు. రైతుబంధు రాని వారికి ఈనెల 9 నుండి రైతుబంధు, అందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో  పీసీసీ రాష్ట్ర కార్యనిర్వణ కార్యదర్శి పున్న కైలాస్, నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు  ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, గజ్జల శివారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, మేకల రమేష్ ముదిరాజ్, పానుగంటి వెంకన్న, విష్ణువర్ధన్ రెడ్డి, కొమ్ము బిక్షం, అంగిరేకుల పాండు, సుధనబోయిన శ్రీను యాదవ్, దండిగ అలివేలు నరసింహ, కోరే యాదయ్య, పోగుల దివ్య, అబ్బనబోయిన చంద్రమౌళి, బొల్లంపల్లి విష్ణుమూర్తి, మెగావత్ రవి నాయక్, మెగావత్ దీప్లా నాయక్, అన్నేపాక కిరణ్, సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి, దామర యాదగిరి, దొటి పరమేష్ యాదవ్, రేవల్లి సుధాకర్, గుండాల అంజయ్య, ఈద శేఖర్, మారేపాకుల కొండలు, దూదిమెట్ల యాదగిరి, సురేందర్ నాయక్ పానుగంటి వెంకటయ్య, గాదేపాక నాగరాజు, వడ్డేపల్లి సైదులు, కలకొండ దుర్గయ్య, జమ్లా నాయక్, కామిశెట్టి చత్రపతి, తదితరులు పాల్గొన్నారు.