హైదరాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌,మెట్రో కారిడార్‌ పరిశీలన

•14 కిలోమీటర్లు నడుస్తూ పరిశీలించిన హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీయస్‌ రెడ్డి

కొత్తగా తలపెట్టిన హైదరా బాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌ మెట్రో స్టేషన్‌ స్థానాలను ఖరారు చేసేందుకు హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీయస్‌ రెడ్డి ఆదివారం నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు సుమారు 14 కిలోమీటర్లు కాలినడకన పరిశీలించారు.

నాగోలు-ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో కొత్తగా నాగోల్‌ వద్ద నిర్మించనున్న మెట్రో స్టేషన్‌.. ప్రస్తుతం ఉన్న నాగోల్‌ స్టేషన్‌కు దగ్గరలోనే ఎడమ వైపున (ఎల్‌బీనగర్‌ వైపు) ఉంటుంది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఈ రెండు స్టేషన్లను కాన్‌కోర్స్‌ లెవల్‌లో కలుపు తూ విశాలమైన స్కైవాక్‌ నిర్మాణాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా ఎండీ ఆదేశించారు.

నాగోల్‌ స్టేషన్‌ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని ఉన్న పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్‌ విద్యుత్‌ కేబుళ్ల దృష్ట్యా, మెట్రో ఎలైన్‌మెంటును మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపాలన్నారు.

అలాగే మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్‌లతో నిర్మించాలని సూచించారు. ఇక కొత్తపేట జంక్షన్‌ నుంచి వచ్చే రహదారికి కనెక్టివిటీని ఇస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులందరి అవసరాల కోసం అదనపు స్టేషన్‌కు ప్లాన్‌ చేయాలని చెప్పారు. ప్రతిపాదిత నాగోల్‌ ఆర్టీఓ స్టేషన్‌ను అల్కాపురి జంక్షన్‌ లక్కీ రెస్టారెంట్‌ కు సమీపంలో నిర్మించాలన్నారు.

ఎల్బీనగర్‌ జంక్షన్‌కు కుడి వైపున ఉండబోయే కొత్త స్టేషన్‌.. కారిడార్‌-1లో మియాపూర్‌-ఎల్బీనగర్‌ ప్రస్తుత ఎల్బీనగర్‌ స్టేషన్‌కు విశాలమైన స్కై వాక్‌తో అనుసంధానించాలని ఎండీ ఆదేశించారు. బైరమల్ గూడ,సాగర్‌ రోడ్‌ జంక్షన్‌లో ఇప్పటికే ఎత్తైన ఫ్లైఓవర్‌లు ఉండటంతో ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లైన్‌ ఎత్తు ఇంకా పెంచాల్సి ఉంది.

అయితే బైరామల్‌గూడ/సాగర్‌ రోడ్‌ జంక్షన్‌ మెట్రో స్టేషన్‌ ఎత్తును తగ్గించడాని కి గాను, మెట్రో అలైన్‌మెంట్‌ ను ఫ్లై ఓవర్లకు కుడి వైపున కు మార్చాల్సి ఉంటుందని, పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో స్టేషన్‌ నిర్మాణం చేపట్టాలని అధికారులకు, కన్సల్‌టెంట్‌కు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి సూచించారు.

మైత్రీనగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట జంక్షన్‌, ఒవైసీ హాస్పిటల్‌, డీఆర్‌డీఓ, హఫీజ్‌ బాబా నగర్‌ తదితర ప్రాంతాలలో ప్రతిపాదిత స్టేషన్‌లను అక్కడకు దగ్గరలోని కాలనీవాసులుకు వీలుగా జంక్షన్‌లకు సమీపంలో నిర్మించాలని సూచించారు.

చాంద్రాయణగుట్టలో ఫ్లైఓవ ర్‌ నిర్మాణం ఉన్నందున ఇక్కడ ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ నిర్మాణం, అలాగే, చంద్రాయణగుట్ట వరకూ చేపట్టిన పాత నగరం మెట్రో విస్తరణ పనులు, టెర్మినల్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు ఒక ఇంజినీరింగ్‌ సవాలుగా మారే అవకాశం ఉందని ఎన్వీయస్‌ అన్నారు...

ఈ నెల 30 న పాలిటెక్నిక్ ఫలితాల ప్రాథమిక" కీ "విడుదల

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పాలిటెక్నిక్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది.

పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవే శాలకు శనివారం నిర్వహిం చిన పాలిసెట్ పరీక్ష ప్రశాం తంగా ముగిసింది. పరీక్షకు 88.74 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

1,59,989 మంది విద్యార్థు లు దరఖాస్తు చేసుకున్నా రు. ఇందులో లక్ష 41, 978 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఇక సెట్ ప్రాథమిక కీని ఈ నెల 30వ తేదీన విడుదల చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.

కాగా మే10 వ తేదీలోపు ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు వెల్లడిం చారు.....

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: హెడ్ కానిస్టేబుల్ మృతి

పోలీస్ శాఖలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ అనే హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు.

కొద్ది రోజుల పాటు ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కాని స్టేబుల్‌గా విధులు నిర్వహి స్తున్న 1995 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్ శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమా దంలో మృతి చెందాడు.

గతంలో గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో సైతం హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేన్‌కు బదిలీపై వెళ్లారు.

శ్రీనివాస్ గౌడ్ సొంత గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ కాగా గతంలోనే వారి కుటుంబం కామారెడ్డి లో స్థిరపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మృతి పట్ల ఎల్లారెడ్డి పేట రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డి పేట ఎస్.ఐ రమాకాంత్ గంభీరావుపేట ఎస్ఐ రామ్మోహన్, కోనరా వుపేట ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు....

తెలంగాణలో 625 నామినేషన్లను ఆమోదించిన ఎన్నికల కమిషన్

తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసిం ది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు 625 నామినేషన్లను ఆమోదించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా 893 మంది 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 268 మందికి చెందిన 428 సెట్లను ఈసీ తిరస్కరిం చింది. మల్కాజ్‌గిరిలో 114 మంది నామినేషన్లు దాఖలు చేయగా 77 తిరస్కరణకు గురయ్యాయి.

మెదక్‌లో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. మెదక్‌లో 53, ఆదిలాబా ద్‌లో 13, పెద్దపల్లిలో 49, కరీంనగర్‌లో 33, నిజామాబాద్‌లో 32, జహీరాబాద్‌లో 26, సికింద్రాబాద్‌లో 46, హైదరాబాద్‌లో 38, చేవెళ్లలో 46, మహబూబ్ నగర్‌లో 35, నాగర్ కర్నూలులో 21, నల్గొండలో 31, భువనగిరిలో 51, వరంగల్‌లో 48, మహబూబాబాద్‌లో 25, ఖమ్మంలో 41 నామినేష న్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి వికాస్ రాజ్ తెలిపారు.

ఆదిలాబాద్‌లో 10, పెద్దపల్లిలో 14, కరీంనగర్‌లో 20, నిజామాబాద్‌లో 10, జహీరాబాద్‌లో 14, సికింద్రాబాద్‌లో 11, హైదరాబాద్‌లో 19, చేవెళ్ళలో 18, మహబూబ్ నగర్‌లో 7, నాగర్ కర్నూలులో 13, నల్గొండలో 25, భువనగిరిలో 10, మహబూబాబాద్‌లో 5, ఖమ్మంలో 4, వరంగల్‌లో 10 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి....

నేటినుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర

ఏపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా.. సీఎం జగన్ మ‌రో యాత్రకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఎన్నికల ప్రచార సభల్లో జగన్ పాల్గొననున్నారు.

తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కాను న్నాయి. ప్రతిరోజు మూడు ప్రచార సభల్లో ముఖ్యమం త్రి జగన్ పాల్గొంటారు.

28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు.. 29న చోడవ రం, పి.గన్నవరం, పొన్నూ రు.. 30న కొండపి, మైదుకూ రు, పీలేరు.. మే 1న బొబ్బి లి, పాయకరావుపేట, ఏలూ రులో సభలు నిర్వహించను న్నారు.

ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కు వైసీపీ ముఖ్య నేతలు తుది మెరుగులు దిద్దు తున్నట్లు తెలుస్తోంది.

ప్రతి రోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి...

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో చిన్న మార్పు

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.

అంతకుముందు 2024 మే 24 నుండి జూన్‌ 1కి ఉన్న పరీక్ష తేదీలను.. మే24 నుంచి జూన్ 3వ తేదీకి మార్చింది. మే 27న నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉంది..

ఈ నేపథ్యంలో పరీక్ష తేదీల్లో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇక, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌ పరీక్షలు ఒకే రోజున నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఈయర్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ సెకండ్ ఈయర్ పరీక్షలు జరగనున్నాయి.

నేడు వరంగల్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భాగంగా నేడు వరంగల్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా వరంగల్ లోక్ సభ అభ్యర్థి సుధీర్ కుమార్ తరపున హన్మకొండ లో రోడ్ షో నిర్వహించనున్నారు.

ఆదివారం సాయంత్రం నగరానికి చేరుకునే కేసీఆర్.. నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.

అనంతరం జిల్లా నేతలతో కలిసి బస్సులో అదాలత్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, పెట్రోల్ పంపు జంక్షన్ మీదు గా హనుమకొండ చౌరస్తాకు చేరుకుంటారు. చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారు...

నేడు హైదరాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ఇవాళ హైదరాబాద్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. ఇవాళ ఎల్బీ నగర్, మల్కాజ్ గిరి రోడ్ షోలలో పాల్గొననున్నారు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.

ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం ఎల్బీ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు

సీఎం రేవంత్‌ రెడ్డి.అనం తరం రాత్రి మల్కాజ్ గిరి రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు..

దక్షిణాదిలో దంచికొడుతున్న ఎండలు..

weather Report: దక్షిణాదిలో ఎండలు దంచికొడుతున్నాయి. సౌత్ రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఓవైపు.. ఎండల వేడి మరోవైపు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి..

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జనాలను ఎండ వేడికి ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే 40 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అవసరమైతేనే బయటికి రావాలని.. వాతావరణ శాఖ సూచిస్తోంది. రానున్న మరో 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలో వేడిగాలుల వీస్తాయని.. కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, వనపర్తి, యాదాద్రి, రంగారెడ్డి, జిల్లాలకు రెడ్ అలర్డ్ జారీ చేసింది.

ఎండ వేడిమికి అల్లాడుతున్న సాధారణ జనాలు ఓవైపు అయితే... సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారానికి జనాలు రాక.. పార్టీల నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో అసెంబ్లీకి... పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ... ప్రచారాలు ముమ్మరం చేయాల్సిన సమయంలో.. ఎండ వేడిమికి తాళలేక జనాలు బయటికి రావడం లేదు. వీలైనంత వరకూ పార్టీలు సైతం.. ఉదయం.. సాయంత్రం మాత్రమే ప్రచారాలకు ప్లాన్ చేసుకుంటున్నాయి.

సౌత్ మొత్తంలో కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కేరళలో హీట్‌వేవ్ ఎక్కువగా ఉండటంతో.. పాలక్కాడ్‌, మలప్పురం, అలప్పుజా నియోజకవర్గాల్లో ముగ్గురు ఓటర్లు మృతిచెందారు. ఎండ వేడి తట్టుకోలేక వాళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కోజికోడ్‌లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతిచెందాడు. 48 డిగ్రీలు ఎండ, వేడిగాలులతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పింఛన్ల ఒక్క ప్రాణం పోయినా సీఎస్ దే బాధ్యత: ఎన్డీయే కూటమి

అమరావతి: పింఛన్ల పంపిణీలో సీఎస్‌ జవహర్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఎన్డీయే కూటమి నేతలు సచివాలయంలో ఆకస్మిక ధర్నాకు దిగారు. సీఎం, సీఎస్‌ కార్యాలయాలు ఉండే మొదటి బ్లాక్‌ వద్ద మెట్లపై బైఠాయించి ఆందోళన చేశారు..

సీఎం జగన్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సీఎస్‌కు ఎన్నికల సంఘం లేఖ రాసిన నేపథ్యంలో తెదేపా, జనసేన, భాజపా నేతలు సీఎస్‌ను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. మే నెల పింఛను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని, ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు..

గ్రామ సచివాలయ ఉద్యోగులు సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా పెన్షన్ల పంపిణీకి వినియోగించాలని సూచించారు. దీనిపై సీఎస్‌ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కూటమి నేతలు అక్కడే బైఠాయించి సీఎస్‌ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉన్నాధికారుల పొరపాటు, నిర్లక్ష్యం, దురుద్దేశం వల్ల 33 మంది వృద్ధులు పింఛను కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల వద్ద పెట్టిన ప్రభుత్వం.. పింఛను పంపిణీకి ఉద్యోగులను వినియోగించలేరా? అని ప్రశ్నించారు. మే నెల పింఛన్ల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. తెదేపా నేత దేవినేని ఉమా, జనసేన నేత శివశంకర్‌, భాజపా నేత లంకా దినకర్‌ తదితరులు నిరసన తెలిపిన వారిలో ఉన్నారు..