ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో చిన్న మార్పు
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.
అంతకుముందు 2024 మే 24 నుండి జూన్ 1కి ఉన్న పరీక్ష తేదీలను.. మే24 నుంచి జూన్ 3వ తేదీకి మార్చింది. మే 27న నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉంది..
ఈ నేపథ్యంలో పరీక్ష తేదీల్లో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు ఒకే రోజున నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఈయర్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ సెకండ్ ఈయర్ పరీక్షలు జరగనున్నాయి.











Apr 28 2024, 13:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.9k