తెలంగాణ టెట్‌ పరీక్షకు ఎన్నికల గండం: షెడ్యూల్‌ మార్పుకు ఛాన్స్‌ఉందా?

తెలంగాణలో టీచర్‌ ఎలిజి బిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తేదీలు కూడా ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం మే 20 నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి.

ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తామ ని విద్యాశాఖ పేర్కొంది. ఇక జూన్‌ 12న టెట్‌ 2024 ఫలితాలు కూడా ప్రకటి స్తామని షెడ్యూల్‌లో పేర్కొం ది. దీంతో నిరుద్యోగులు టెట్‌ ప్రిపరేషన్‌లో మునిగి పోయారు.

అయితే సార్వత్రిక ఎన్నికల గండం గడిచినా. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం టెట్ పరీక్షపై పడుతుందేమోనని పలువురు నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ గురువారం (ఏప్రిల్‌ 25) విడుదలైంది.

మే 27న ఉప ఎన్నిక పోలిం గ్‌ జరగనున్నట్లు షెడ్యూల్‌ పేర్కొంది. ఈ క్రమంలో మే 20 నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటించడంతో అసలు ఆయా తేదీల్లో పరీక్షలు ఇంటాయో.. లేదోనని అభ్యర్ధులు గందరగోళంలో పడ్డారు.

మే 27న పోలింగ్‌ కాబట్టి ఆ రోజు ఆయా జిల్లాల్లో సాధా రణ సెలవుగా ప్రకటిస్తారు. టెట్‌ పరీక్షకు హాజరయ్యే వారంతా పట్టభద్రులు కావడంతో వీరంతా తమ ఓటు హక్కును వినియోగిం చుకోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలోనే టెట్‌ పరీక్ష ల నిర్వహణ సాధ్యా సాధ్యా లపై పాఠశాల విద్యాశాఖ తర్జనభర్జనలు పడుతుంది. తెలంగాణ టెట్‌ పరీక్షలు మే 20 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహిస్తామని చెప్పిన ప్పటికీ ఏ తేదీన ఏ పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తామనే విష యం మాత్రం ఇప్పటివరకు విద్యాశాఖ వెల్లడించలేదు.

అయితే ఉప ఎన్నికల నేపథ్యంలో పేపర్ల వారీగా పరీక్షల నిర్వహణ తేదీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆ ప్రకారంగా పోలింగ్‌ రోజున పరీక్షలు జరపకుండా మిగతా రోజు ల్లో యథావిథిగా జరిగేలా షెడ్యూల్‌ రూపొం దించే అవకాశం ఉన్నట్లు సమా చారం. ఇందుకు సంబం ధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పులు మ్యాచ్ అవుతాయా? నేడు సుప్రీంకోర్టు తీర్పు

100% ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ఓట్లు మరియు ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) స్లిప్‌లను 100% క్రాస్ చెక్ చేయాలన్న డిమాండ్‌పై లోక్‌సభ ఎన్నికల రెండో దశ ఓటింగ్ కొనసాగుతోంది ఇదిలావుండగా, జూన్ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జరిగేటప్పుడు ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్‌లు సరిపోతాయా లేదా అనేదానిపై సుప్రీంకోర్టు ఈరోజే నిర్ణయం తీసుకోనుంది. EVM మరియు VVPAT స్లిప్‌లను సరిపోల్చాలని డిమాండ్ చేస్తూ చాలా సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయని మీకు తెలియజేద్దాం. ఏప్రిల్ 24న ఈ కేసు విచారణ అనంతరం కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది.

ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీపీఏటీ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లలో (ఈవీఎం) వేసిన ఓట్లను తప్పనిసరిగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించనుంది . ఈ బెంచ్‌లో జస్టిస్ దీపాంకర్ దత్తా కూడా ఉన్నారు. ఈవీఎంల పనితీరుకు సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలపై స్పష్టత ఇవ్వాలంటూ భారత ఎన్నికల సంఘం అధికారిని బుధవారం అంతకుముందు కోర్టు సమన్లు ​​జారీ చేసింది.

ఈ పిటిషన్లపై విచారణ జరిపి ఎన్నికల సంఘం నుంచి స్పష్టత ఇవ్వడంతో సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. వీవీప్యాట్ స్లిప్పుల ద్వారా ఈవీఎం ఓట్లను 100 శాతం వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛత ఉండాలని గత విచారణలో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు చెప్పింది.

బుధవారం తీర్పును రిజర్వ్ చేస్తూ, ఎన్నికలను నియంత్రించలేమని, రాజ్యాంగ సంస్థకు నియంత్రణ అధికారంగా వ్యవహరించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తప్పు చేసిన వ్యక్తి పర్యవసానాలను ఎదుర్కోవడానికి చట్టం కింద నిబంధనలు ఉన్నాయి. కేవలం అనుమానం ఆధారంగా కోర్టు మాండమస్‌ మంజూరు చేయదు. ఓటింగ్ యంత్రాల ప్రయోజనాలను అనుమానించే వారి ఆలోచనా విధానాన్ని మార్చలేమని, బ్యాలెట్‌లోకి తిరిగి రావాలని న్యాయస్థానం పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు..

వచ్చే మూడు రోజులు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు.. 

రాయలసీమ, కోస్తాంధ్రలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు.. 

ఈరోజు ఏపీలో 56 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 

తెలంగాణలో పలు జిల్లాల్లో వడగాలులు.. 

రామగుండం, భద్రాచలంలో అధిక ఉష్ణోగ్రతలు

నేడు తెలంగాణకు అమిత్ షా! సిద్దిపేట లొ భారీ బహిరంగ సభ

అగ్ర‌నేత అమిత్‌షా ఇవాళ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌ను న్నారు. సిద్దిపేట‌లో నిర్వ‌ హించే బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొంటారు.

ఢిల్లీ నుంచి ఉదయం బయ లుదేరి బేగంపేట విమానాశ్ర యానికి చేరుకుంటారు అక్కడి నుంచి హెలికా ప్టర్‌లో సిద్దిపేటకు చేరు కుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు.

మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్ద తుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు సభ జరగనుంది.

ఆ తర్వాత 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.

సాయంత్రం 4.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరు తారు. ఇక మరోవైపు రాష్ట్రంలో మే 13న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైంది.

ఇక.. పార్టీ నేతలు, కార్యక ర్తల్లో జోష్‌ నింపేలా ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని సమాచారం...

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిల దే హవా

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక ఫలితాలను బుధవా రం హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డులో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు.

ఈ ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ వారే పైచేయి సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్స రంలో 4,78,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,87,261 (60.01 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇందులో 2,41,682 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,65,190 (68.35 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,37, 041,మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 1,22,071 (51.50 శాతం) మంది పాసయ్యారు.

అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు 16.85 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు.ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ విభా గంలో 4,30,413 మంది పరీక్షలు రాస్తే, 2,62,829 (61.06 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇందులో 2,17,716 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,49,331 (68.59 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,12 ,697 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 1,13, 498,(53.36 శాతం) మంది పాసయ్యారు.

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌ విభాగంలో 48,310 మంది పరీక్ష రాస్తే, 24,432 (50.57 శాతం) మంది ఉత్తీర్ణత సాధిం చారు. ఇందులో 23,966 మంది అమ్మాయిలు పరీక్షలు రాయగా, 15,859 (66.17 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు.

24,344 మంది అబ్బాయి లు పరీక్షలు రాస్తే, 8,573 (35.21 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 5,02,280 మంది పరీక్షలకు హాజరుకాగా, 3,22,432 (64.19 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇందులో 2,47,358 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 1,79,412 (72.53 శాతం) మంది ఉతీర్ణత పొందారు. 2,54,922 మంది అబ్బాయి లు పరీక్షలు రాయగా, 1,43,020 (56.10 శాతం) మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలోనూ అబ్బా యిల కంటే అమ్మా యిలు 16.43 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత పొందారు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్స రం జనరల్‌ విభాగంలో 4,01,445 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,78,856 (69.46 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,05,381 మంది అమ్మా యిలు పరీక్షలు రాయగా, 1,55,500 (75.71 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఒకేష నల్‌ జనరల్‌ విభాగంలో 42,723 మంది పరీక్షలు రాస్తే, 27,287 (63.86 శాతం) మంది విద్యార్థులు పాసయ్యారు.

ఇందులో 21,853 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరు కాగా, 17,327 (79.28 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 20,870 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 9,960 (47.72 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్‌ బోర్డు పరీక్షల నియంత్రణా ధికారి (సీవోఈ) జయప్రద బాయి, జాయింట్‌ సెక్రెటరీ వై శ్రీనివాస్‌, సీజీజీ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్ర నిమ్జే తదితరులు పాల్గొన్నారు...

ఉత్తర ప్రదేశ్ లొ ఎన్నికల వేళ విషాదం..బీజేపీ ఎంపీ కన్నుమూత

ఉత్తరప్రదేశ్ లొ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ కన్నుమూ శారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్ వీర్ దిలేర్ అలీగఢ్ లోని ఆస్పత్రిలో ఈరోజు ఉదయం మర ణించారు.

గత కొంతకాలంగా రాజ్ వీర దిలేర్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో హథ్రాస్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు.

కాగా ఈసారి ఎన్నికల్లోనూ అదే స్థానానికి పోటీ చేస్తు న్నారు రాజ్ వీర్ దిలేర్. ఆయన మృతితో స్థానిక కార్యకర్తలు దిగ్భ్రాంతి గురయ్యారు.

దిలేర్ 2017లో ఇగ్లాస్ నుంచి ఉత్తరప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యారు. తర్వాత లోక్‌ సభకు ఎన్నికయ్యారు. దీంతో, ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేశారు. దిలేర్ మృతికి యూపీ సీఎం యోగి ఆది త్యనాథ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

రాజ్ వీర్ దిలేర్ అకాల మరణం చాలా బాధాకరం అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. బీజేపీకి, ఆయన కుటుంబానికి దిలేర్ మృతి తీరని లోటని సానుభూతి వ్యక్తం చేశారు.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారి తో సహా ఆరుగురు చనిపో యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరు గురు ఘటనాస్థంలోనే చనిపోయారు. గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

క్రికెట్ అభిమానులకు మెట్రో యాజమాన్యం శుభవార్త

హైదరాబాద్ ప్రజలకు మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈరోజున ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది.

అయితే, మిగతా మార్గాల లో మాత్రం సాధారణ మెట్రో వేళలు కొనసాగుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి వరకు అందుబాటు లో ఉంటాయని చెప్పారు.

ఉప్పల్ మార్గంలో లాస్ట్ ట్రైన్ అర్థరాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుం టుందని ఆయన పేర్కొ న్నారు.

ఆ సమయంలో.. ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్ల లో మాత్రమే ప్రయాణికు లను ప్రవేశానికి అనుమతి స్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి వీలుండదని స్పష్టం చేశారు.

మిగతా మార్గాల్లో మాత్రం డైలీ నడిచే నిర్ణిత వేళలలో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు కొనసాగు తాయన్నారు. ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆర్సీబీ, సన్ రైజర్స్ కు మధ్య మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే...

ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ..

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ ను. నియ మిస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విజయవాడ సీపీగా పీహెచ్ రామకృష్ణను నియమిం చింది. రేపు ఉదయం లోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది....

ఢిల్లీ తో పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్

ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ పోరాడినా ఫ‌లితం లేక‌పోయింది. ఆఖ‌రి బంతికి అయిదు ప‌రుగులు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ఉత్కంఠ పోరులో ఢిల్లీ నాలుగు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

కాగా, అంత‌కుముందు భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన గుజరాత్‌ బ్యాటర్లు చెలరేగి ఆడారు. రెండో ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (6) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్‌ సాహా 39,తో కలిసి సాయి సుద ర్శన్ 50,దూకుడుగా ఆడాడు.

అయితే 10వ ఓవర్‌లో నాలుగో బంతికి సాహా ఔటయినప్పటికీ.. సాయి సుదర్శన్‌ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (1) వెంటనే ఔటయ్యాడు..

ఇలా మొత్తం ఎనిమిది వికెట్లు న‌ష్ట‌పోయిన గుజ‌ రాత్ విజ‌యం చేరువ‌లోకి వ‌చ్చి ఓట‌మిచెందింది...