తెలంగాణలో మిగిలిన స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణలో మిగిలిన స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణలోని మిగిలిన మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం - రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్- వెలిచాల రాజేందర్‌రావు, హైదారాబాద్ - మహ్మద్ సమీర్
సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్
సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్
| కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెరిగాయి. బస్‌యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు
తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం..
‘ఆ నాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. ఈ జిల్లాల్లో మంత్రులున్నారు. ఇరిగేషన్ మినిస్టర్ స్వయంగా ఇక్కడ ఉన్నడు. వీళ్లు దద్దమ్మల్లా పోయి నాగార్జునసాగర్ కట్టపై కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి అప్పగించారు. మీరంతా కళ్లారా చూశారు. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా. 1956 నుంచి ఈ నాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ. 56వ సంవత్సరంలో ఏపీలో కలిపి 58 సంవత్సరాలు అనేక రకాలుగా గోసపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మొన్న ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చింది. నోటికి మొక్కాలి అన్ని హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి.. సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి మనకు అవస్థలు తెచ్చిపెడుతున్నారు. రైతుబంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోని కొడుతా అని ఒక మంత్రి మాట్లాడుతున్నడు. చెప్పులు మీకే లేవు రైతులకు కూడా ఉంటయ్, వాళ్ల చెప్పులు చాలా బందబస్తుగా ఉంటయ్ అని నేను చెప్పిన’ అంటూ గుర్తు చేశారు కేసీఆర్.
దద్దమ్మలు సాగర్‌ను కేంద్రం చేతుల్లో పెట్టారు..
‘బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో 18 పంటలకు ఏమాత్రం వెనుకాముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్టంతా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించాం. ఇవాళ ఈ రోజు ఏమైంది? సాగర్‌లో నీళ్లు ఉండే.. ఇవ్వగలిగే అవకాశం ఉండే. ఈ దద్దమ్మలకు దమ్ములేక.. ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్‌ఎంబీ చేతులో పెట్టి పంటలన్నీ ఎండబెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినయంటే ఇదే మొదటిసారి. రైతుబంధులో ధగా.. రైతుబీమా ఉంటదో ఊడుతదో తెలియదు. బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు పోని కరెంటు కటుక బంద్‌చేసినట్లే మాయమైంది. ఎక్కడికి పోయింది కరెంటు ? ఏమైంది కరెంటుకు ? వీళ్లు కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వి పని చేయాల్సిన అవసరం లేకున్నా కేసీఆర్ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు రాజ్యమేలుతున్నరు. కరెంటు ఎందుకు ఆగమవుతుంది’ అంటూ రేవంత్ సర్కారును కేసీఆర్ ప్రశ్నించారు.
ప్రజలను ఎందుకు బాధపెడుతున్నరు ?
‘ప్రజలను ఎందుకు బాధలుపెడుతున్నరు? మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేం చేశాం. ఆ మాత్రం మీకు చేయచేతనైతలేదా? సరఫరా జరిగిన కరెంటును అలాగే ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ? మిషన్ భగీరథతో మంచినీళ్లు తెచ్చి అర్బన్ ఏరియాలో.. మున్సిపల్ ఏరియాలో అన్నివర్గాల పేదలకు దొరకాలని ఒక్కరూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చాం. ప్రతి ఇంట్లో నల్లా బిగించి ప్రతి ఇంటికీ నళ్లా నీరందించాం. ఇవాళ మిషన్ భగీరథ ఎందుకు నడుపలేకపోతున్నరు. మీ తెలివితక్కువ తనం ఏందీ? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఆ నాడు నీళ్లకోసమే గోస. నాలుగైదు నెలలకే.. కేసీఆర్ పక్కకు జరుగంగనే ఎందుకు మాయమై పోయినయ్ ? ఎందుకు బాధపడుతున్నరు ? సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌ను తిట్టాలి పబ్బం గడుపుకోవాలి..
‘ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కేసీఆర్‌ను తిట్టడం ఒకటే పని. కేసీఆర్‌ను తిట్టాలి పబ్బం గడుపుకోవాలి తప్పా.. పంటలు ఎండబెట్టారు.. రైతుబంధు ఎగొట్టారు.. రైతుబంధు ఐదెకరాలు అని మాట్లాడుతున్నారు. ఏం పోయింది మీ అబ్బసొత్తా ? ఇచ్చేందుకు మీకు ఏం బాధైంది. ప్రభుత్వం సహాయం లేకుండా ప్రపంచంలో ఎక్కడా రైతులు వ్యవసాయం చేయడం లేదు. దాన్ని గమనించే భారతదేశంలో తొలిసారిగా రైతులకు అండగా ఉండాలని, అప్పులు తీరాలని బడ్జెట్ నుంచి రూ.15వేలు-రూ.16వేలకోట్లు పెట్టి రైతుబంధు ఇచ్చాం. నేను వస్తుంటే ఆర్జాలబావి దగ్గర బస్సును రైతులు ఆపారు. సార్ 20 రోజులైంది ధాన్యం తెచ్చి ధాన్యం కొనడం లేదని చెప్పారు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి ? బీఆర్‌ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోదీ వడ్లు కొన అని మొండి కేస్తే.. ముఖ్యమంత్రితో సహా తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో ధర్నా చేసి.. నరేంద్ర మోదీ మెడలు వంచి.. మా తెలంగాణ పండిస్తున్నది. న్యాయంగా కొనాలి అని చెప్పి కొనుగోలు చేసేలా చేశాం. మద్దతు ధర రూపాయి తగ్గకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో వేశాం’ అన్నారు.
TS: కెసిఆర్ కు సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌కు నేను సవాల్ విసురుతున్నా.. నువ్వు కట్టిన కాళేశ్వరం అద్భుతమైతే చర్చకు రా..? నీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై చర్చకు రా..? హరీష్ రావు.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండు.. రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తా.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాం-సీఎం రేవంత్‌రెడ్డి
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆన్‌లైన్ సేవలపై ఆర్బీఐ ఆంక్షలు..
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆన్‌లైన్ సేవలపై ఆర్బీఐ ఆంక్షలు.. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆన్‌లైన్ సేవల్లో లోపాలు గుర్తించిన ఆర్బీఐ.. ఆన్‌లైన్‌లో కొత్త ఖాతాలు ఓపెన్ చేయొద్దని ఆదేశం.. క్రెడిట్ కార్డులు కూడా జారీ చేయొద్దన్న ఆర్బీఐ.
లోక్సభ ఎలక్షన్ల తర్వాత..పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం
పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం
పంచాయతీ ఎన్నికలు..
ఈసీ కీలక నిర్ణయం
తెలంగాణలో లోక్ సభ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. మే 15లోగా బ్యాలెట్ బాక్సులకు సీళ్లు, అడ్రస్ ట్యాగ్ లను ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ను ఆదేశించింది.
రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగిసింది. ప్రస్తుతం పంచాయతీల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతోంది.
ఐదేళ్లకు ఒకసారి దేశం కోసం ఐదు నిమిషాలు:ఓటు హక్కుపై జస్టిస్ డీవై చంద్రచూడ్
ఐదేళ్లకు ఒకసారి దేశం కోసం ఐదు నిమిషాలు:ఓటు హక్కుపై జస్టిస్ డీవై చంద్రచూడ్
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రజలను కోరారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం 'మై ఓట్ మై వాయిస్' మిషన్‌లో భాగంగా ఓ వీడియోను విడుదల చేసింది..
ఇందులో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ '' ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించింది. అలాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం పౌరులుగా మన ప్రధాన బాధ్యత. ఐదు సంతవత్సరాలకు ఒకసారి మన దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించడానికి సాధ్యమవుతుంది కదా. ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతిఒక్కరినీ అభ్యర్థిస్తున్నా. గర్వంగా ఓటు వేద్దాం. నా ఓటు నా వాయిస్'' అని అన్నారు..
దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే గొప్ప అవకాశం ప్రజలకు ఉందని అందుకే రాజ్యాంగంలో 'భారత ప్రభుత్వం ప్రజలచే, ప్రజల కొరకు' అని రాసుందని చంద్రచూడ్ తెలిపారు. తాను మొదటి సారి ఓటు వేయడానికి చూపిన ఉత్సాహాన్ని, ఓటు వేసినప్పుడు కలిగిన ఆనందాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు జూన్ 1వరకు జరగనున్నాయి. ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు.
నల్లగొండ భారతీయ జనతా పార్టీ (బిజెపి) చేనేత సెల్ నూతనంగా కన్వీనర్గా నియామకమైన వర్కల శ్రీనివాస్ మరియు కో కన్వీనర్ గా నియామకమైన కటకం శ్రీధర్
నల్లగొండ భారతీయ జనతా పార్టీ (బిజెపి) చేనేత సెల్ నూతనంగా కన్వీనర్గా నియామకమైన వర్కల శ్రీనివాస్ మరియు కో కన్వీనర్ గా నియామకమైన కటకం శ్రీధర్
నల్గొండ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో యువ రక్తంతో ముందుకు దూసుకుపోతుంది, ఈ సందర్భంగా వారు నల్గొండలో ఇప్పటికే కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చింది. కాగా నూతనంగా భారతీయ జనతా పార్టీ చేనేత సెల్ కన్వీనర్ గా వర్కాల శ్రీనివాస్ మరియు కో కన్వీనర్ గా నల్లగొండ చర్లపల్లి వాసి కటకం శ్రీధర్ని నియమించారు. ఇదివరకు చేనేత సెల్ నల్గొండ విభాగంలో పనిచేసిన మిర్యాల వెంకటేశం ను నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వర్కాల శ్రీనివాస్ మరియు కటకం శ్రీధర్ మాట్లాడుతూ....
తమకు కొత్తగా ఇచ్చిన పదవి పార్టీ కోసం తమపై ఎంతో బాధ్యతను పెంచింది అని, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం తమ వంతు పాత్ర కచ్చితంగా పోషిస్తామని, తమని ఎన్నుకున్న రాష్ట్ర మరియు జిల్లా బిజెపి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
చేనేత బకాయిల విడుదల హర్షనీయం -బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్
చేనేత బకాయిల విడుదల హర్షనీయం
-బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్
చేనేత కార్మికుల బకాయిలకు సంబంధించి మొదట విడుతగా 50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడాన్ని బీసీ రాజ్యాధికార సమితి స్వాగతించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మేరకు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్ యూనిఫామ్‌ల తయారీకి 47 కోట్ల అడ్వాన్సుతో పాటు నూలు కొనుగోలు, సైజింగ్ కు మరో 14 కోట్లు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరకు సంబంధించి మొత్తం 351 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మిగతా బకాయిలను కూడా త్వరలో విడుదల చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని దాసు సురేష్ కోరారు. సిరిసిల్ల చేనేత పరిశ్రమ స్వయం అభివృద్ది చెందకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకే పరిమితం చేసిందని విమర్శించారు. ఇపుడు కేటీఆర్ మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల చేనేత పరిశ్రమ పూర్వ వైభవం సాధించేలా ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని కోరారు.
జ్యోతిబాపూలే 150 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి-బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్
జ్యోతిబాపూలే 150 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి-దాసు సురేశ్ , అధ్యక్షులు - బీసీ రాజ్యాధికార సమితి
సంఘ సంస్కర్త, వెనుకబడిన వర్గాల ఆశాకిరణం మహాత్మా జ్యోతిబా పూలే 150 అడుగుల విగ్రహాన్ని నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ డిమాండ్ చేశారు. జ్యోతిబా పూలే 198వ జయంతిని బాగ్ లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిబా పూలే పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం అంబర్పెపేట్ లోని జ్యోతిభాఫూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. భవిష్యత్ బీసీలదేనని నినదించారు ..తదనంతరం మీడియాతో మాట్లాడుతూ బడుగుల ఉన్నతికి జ్యోతిబా పూలే చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
నెక్లెస్ రోడ్ లో అంబేద్కర్ భారీ విగ్రహం తరహాలోనే జ్యోతిబాపూలేకు కూడా 150 అడుగుల విగ్రహన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.. చారిత్రక అంశాలతో కూడిన ఫూలే స్మృతివనాన్ని నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేయాలన్నారు ఇదే ప్రాంగణంలో జ్యోతిబా పూలే పేరిట బీసీ నాలెడ్జ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లతో నిధని ఏర్పాటు చేసి ప్రతి ఏటా జ్యోతిబా పూలే పేరిట సంఘ సంస్కర్తలకు అవార్డులు ప్రధానం చేయాలని దాసు సురేష్ సూచించారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను జ్యోతిబా పూలేకు ఇవ్వాలని, పూలే జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి దాసు సురేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ తులసి శ్రీమాన్, మీడియా కన్వీనర్ మారేపల్లి లక్ష్మణ్ సిటీ కమిటీ సభ్యులు ప్యారసాని దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
Apr 25 2024, 12:17