సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారి తో సహా ఆరుగురు చనిపో యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరు గురు ఘటనాస్థంలోనే చనిపోయారు. గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

క్రికెట్ అభిమానులకు మెట్రో యాజమాన్యం శుభవార్త

హైదరాబాద్ ప్రజలకు మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈరోజున ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది.

అయితే, మిగతా మార్గాల లో మాత్రం సాధారణ మెట్రో వేళలు కొనసాగుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి వరకు అందుబాటు లో ఉంటాయని చెప్పారు.

ఉప్పల్ మార్గంలో లాస్ట్ ట్రైన్ అర్థరాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుం టుందని ఆయన పేర్కొ న్నారు.

ఆ సమయంలో.. ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్ల లో మాత్రమే ప్రయాణికు లను ప్రవేశానికి అనుమతి స్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి వీలుండదని స్పష్టం చేశారు.

మిగతా మార్గాల్లో మాత్రం డైలీ నడిచే నిర్ణిత వేళలలో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు కొనసాగు తాయన్నారు. ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆర్సీబీ, సన్ రైజర్స్ కు మధ్య మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే...

ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ..

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ ను. నియ మిస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విజయవాడ సీపీగా పీహెచ్ రామకృష్ణను నియమిం చింది. రేపు ఉదయం లోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది....

ఢిల్లీ తో పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్

ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ పోరాడినా ఫ‌లితం లేక‌పోయింది. ఆఖ‌రి బంతికి అయిదు ప‌రుగులు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ఉత్కంఠ పోరులో ఢిల్లీ నాలుగు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

కాగా, అంత‌కుముందు భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన గుజరాత్‌ బ్యాటర్లు చెలరేగి ఆడారు. రెండో ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (6) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్‌ సాహా 39,తో కలిసి సాయి సుద ర్శన్ 50,దూకుడుగా ఆడాడు.

అయితే 10వ ఓవర్‌లో నాలుగో బంతికి సాహా ఔటయినప్పటికీ.. సాయి సుదర్శన్‌ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (1) వెంటనే ఔటయ్యాడు..

ఇలా మొత్తం ఎనిమిది వికెట్లు న‌ష్ట‌పోయిన గుజ‌ రాత్ విజ‌యం చేరువ‌లోకి వ‌చ్చి ఓట‌మిచెందింది...

కేసీఆర్ కాన్వాయ్ కి రోడ్డు ప్రమాదం?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఈరోజు బస్సు యాత్ర ప్రారంభించిన విషయం పాఠకులకు తెలిసిందే.

నేడు ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి యాత్ర ప్రారంభించారు. వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది.

ఒకదాని కొకటి 10 వాహ నాలు వరుసగా ఢీకొన్నా యి. దీంతో పలువురికి గాయలైనట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

తెలంగాణ జిల్లాలలో కొనసాగుతున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర

తెలంగాణ భ‌వ‌న్ నుంచి పోరుయాత్ర‌కు కేసీఆర్ బుధవారం శ్రీకారం చుట్టారు.

భ‌వ‌న్‌కు చేరుకున్న కేసీ ఆర్‌కు మ‌హిళ‌లు మంగ‌ళ‌ హారతుల‌తో ఘ‌నస్వాగ‌తం ప‌లికారు. మొద‌ట‌ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలోని తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేశారు.

కేసీఆర్. అనంత‌రం కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభ‌మైం ది. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌కు కేసీఆర్ అభివాదం చేశారు. బాణాసంచా కాల్చి బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకున్నారు.

నేటి నుంచి 17 రోజుల పాటు సాగే ఈ యాత్ర కొన‌సాగ‌నుంది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాల గూడలో ప్రారంభమై సిద్దిపే టలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది.

రేపు నామినేషన్ వేయనున్న ఏపీ సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఏప్రిల్ 25 తన సొంత నియోజక వర్గం పులివెందులలో నామినేషన్ వేయనున్నారు.

నామినేషన్ కు ముందు సీఎం జగన్ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజ రవుతారు.

అనంతరం పులివెందుల వైఎస్సార్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోని ఆర్వో కార్యా లయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు...

సుదర్శన క్రియ, మెడిటేషన్, యోగ కార్యక్రమాల కరపత్రాల ఆవిష్కరణలో పాల్గొన్న గుత్తా అమిత్ కుమార్ రెడ్డి

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామం లో సుదర్శన క్రియ, మెడిటేషన్, యోగ కార్యక్రమాల కరపత్రాల ఆవిష్కరణలో గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈనెల 27వ తేదీ నుండి ఉరుమడ్ల గ్రామంలో మూడు రోజులపాటు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ద్వారా 30 సంవత్సరాల అనుభవం కలిగిన శ్రీ శ్రీనివాస రావు గురూజీ గారిచే గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడే సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్ క్లాస్ ద్వారా ప్రతి ఒక్కరు జీవితంలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

కరపత్రాల ఆవిష్కరణలో GVR ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు తో కలిసి మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఒత్తిడిని పారదోలి, ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది అన్నారు. దీనివల్ల మీరు యోగా యొక్క ప్రాచీన ఆచరణాలు, ధ్యానం మరియు ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను చక్కగా పొందుతారు అన్నారు.

సుదర్శన క్రియ ద్వారా శారీరక మరియు మానసిక బలహీనత నుండి విముక్తి పొందుతారని, వ్యక్తిగత సంబంధాలను పెంపొందించుకుంటారని, రక్త పోటు, మధు మేహం, ఉబ్బసం మొదలగు వాటిని అరికట్టవచ్చని, గుండె జబ్బులు, పక్షపాతం, మైగ్రేన్, సైన సైటీస్, చర్మవ్యాధులు, గ్యాస్టిక్ మరియు ఎన్నో ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులను అరికట్టవచ్చునని తెలియజేశారు.

కాబట్టి ఈ యొక్క ఉరుమడ్ల గ్రామంలో నిర్వహించబడు సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్ కార్యక్రమాలు చిట్యాల మండల ప్రజలు యువకులు మహిళలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గుత్తా యువసేన నల్గొండ జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు జన్నపాల శ్రీను, బోయ స్వామి, పోలగోని శ్రీశైలం, మర్రి అశోక్, ఉడుగు పాండు, పోలగోని శంకరయ్య, మర్రి రమేష్, మాధగోని వెంకన్న, పోలగోని నరేష్, దినేష్, స్వామి, శివ, నరేష్, దిలీప్, లింగస్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ సీనియర్ నాయకుని పరామర్శించిన శాసన మండలి చైర్మన్

ఉరుమడ్ల గ్రామానికి చెందిన. బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు. మాజీ ఎంపీటీసీ,పోలగొని స్వామికి చెరువుగట్టు దగ్గర జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో గాయాలయ్యాయి. ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఇట్టి విషయం తెలుసుకున్న తెలంగాణ శాసనమండలి చైర్మన్ గౌరవనీయులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వారి తనయుడు అమిత్ రెడ్డి గారు , పరమర్శించారు. కార్యక్రమంలో వనం వెంకటేశ్వర్లు,పల్లపు బుద్ధుడు, జన్నపాల శ్రీను, మాజీ ఎంపీటీసీ,మర్రి అబ్బయ్య, మర్రి రమేష్,బోయ స్వామి, మర్రి అశోక్, మాదగోని నరసింహ, స్వామి, శ్రీశైలం, శంకరయ్య తదిరులు పాల్గొన్నారు.

మనోళ్లు 18 రోజుల్లో రూ.670 కోట్ల విలువైన బీర్లు తాగేశారు

తాగుడు వ్యసనం కాదు. అలవాటు పడిన ఓ సంప్ర దాయం.'అని ఓ తెలుగు సినిమాలోని డైలాగ్ ఇది. ఆ డైలాగ్‌ను మన తెలంగాణ మందుబాబులు స్పూర్తిగా తీసుకున్నట్టు ఉన్నారు.

18 రోజుల్లోనే రికార్డు స్థాయి లో బీర్లు తాగేశారు. గత రికార్డులను తిరగరాస్తూ.. రూ.670 కోట్ల విలువైన బీర్లను మంచినీళ్ల ప్రాయం గా తాగేశారు. ప్రస్తుతం ఎన్నికలు సీజన్, ఎండలు తీవ్రత పెరగటం, ఆపై పెళ్లిళ్ల సీజన్ కావటంతో లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగాయి.

ఈ నెల 1 నుంచి ఏప్రిల్ 18 వరకు దాదాపు 670 కోట్ల రూపాయల విలువైన బీర్లను తాగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ 18 రోజుల్లో 23,58,827 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు 28.7 శాతం పెరిగినట్లు వెల్లడించారు.

ఎండలు అంతంత మాత్రం గా ఉండే ఏప్రిల్ నెలలోనే ఇలా తాగితే.. మే నెలలో ఏ రేంజ్ అమ్మకాలు సాగుతా తో అంచనా వేయవచ్చు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మద్యంపై వచ్చే ఆదాయం దాదాపు 30 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం.

రానున్న కాలంలో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకు లు అంచనా వేస్తున్నా రు.ఎండలు దంచి కొట్టడం, పార్లమెంట్ ఎన్నికలు, పెళ్లి వంటి శుభకార్యాలు ఉండ టంతో బీర్ల సేల్స్ పెరిగినట్లు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లోని ఓ అధికారి వెల్లడించారు.

కేవలం ఒక్క బీరు సీసాలే ఈ రేంజ్‌లో అమ్ముడుపోతే మొత్తం మద్యం అమ్మాకలు ఏ రేంజ్‌లో ఉంటాయోనని పలువురు ఆశ్చర్యపోతు న్నారు. తెలంగాణలో మెుత్తం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వెయ్యికిపైగా బార్లు, క్లబ్‌లు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి.

ఇందులోనూ మద్యం సర ఫరా ఉంది. వీటి ద్వారా రోజుకు రూ.90 నుంచి రూ.100 కోట్లు విలువైన మద్యం సేల్ అవుతుంది. కాగా, ప్రస్తుతం ప్రభుత్వం కూడా రోజు రోజుకు పెరిగి పోతున్న బీర్ల అమ్మకాలకు తగ్గట్టుగా స్టాక్ అందుబా టులో ఉంచుతోంది..