నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితా లు నేడు ఉదయం 11 గంట లకు విడుదల కానున్నాయి.

ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేయ నున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా తెలిపారు.

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితా లు ఒకేసారి విడుదల కాను న్నట్లు వెల్లడించారు.

పలితాల కోసం https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in వెబ్‌సైట్‌లోనూ చెక్ చేసుకోవచ్చని తెలిపారు.

రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిం దే.ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80, 978 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇందులో.. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు.

వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవ  త్సరంలో 46,542 మంది విద్యార్థులు ఉన్నారు...
ఈనెల 26న తెలంగాణకు ఉపరాష్ట్రపతి రాక

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ ఖడ్‌ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు.

పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి దృష్టి సారించారు.

ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటు రాకూడదని సక్రమంగా ఏర్పాట్లు చేయా లని సీఎస్‌ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశిం చారు...
నేటి నుండి కొనసాగనున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర
బీఆర్‌ఎస్‌ అధినేత, తెలం గాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రవ్యా ప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కాను న్నది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ యాత్ర కొన‌సాగించ‌బోయే బ‌స్సుకు తెలంగాణ భ‌వ‌న్‌ లో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో గులా బీ శ్రేణులు పాల్గొన్నారు. నేటినుండి వరుసగా 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నది.

మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభ మై సిద్దిపేటలో జరిగే బహి రంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.

దాదాపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్‌ చేశారు.

తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్‌ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియో జకవర్గాల నేతల నుంచి డిమాండ్‌ వస్తున్నది. అయి తే, సమయం తక్కువగా ఉండటం, ఎండ వేడి దృష్ట్యా కొన్ని నియోజక వర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు...
CSK 211 టార్గెట్ ను ఛేదించిన లక్నో

చెన్నై చిదంబరం స్టేడియం వేదిక‌గాలో సీఎస్‌కే తో తలపడిన లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. చెపాక్‌లో భారీ ఛేద‌న‌కు దిగిన ల‌క్నో.. చెన్నైపై లక్నో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

సీఎస్‌కే నిర్దేశించిన 211 పరుగుల ఛేదనలో లక్నో జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (0), కేఎల్ రాహుల్ (16) వెనుదిరిగారు.

ఈ క్రమంలో మార్కస్ స్టోయినిస్ సెంచరీతో విజృంభించాడు.63 బంతుల్లో 124 పరుగుల నాటౌట్ తో చెలరేగిపోయా డు. మరోవైపు నికోలస్ పూరన్,15 బంతుల్లో 34 పరుగులు, దీపక్ హుడా 6 బంతుల్లో 17 పరుగులు నాటౌట్, స్టోయినిస్‌కు మంచి స‌పోర్ట్‌గా నిలిచారు.

దీంతో చెన్నై జట్టు నిర్దేశిం చిన 211 పరుగుల లక్ష్యా న్ని 3 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి.. 6 వికెట్లతో గెలుపొందింది లక్నో. ఇక ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో 5వ స్థానంలో ఉన్న లక్నో 4వ స్థానానికి చేరుకుంది..

Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు

*•శ్రీరామనవమి ఊరేగింపులో మసీదు వైపు బాణం వదులుతున్నట్టు ఊహాజనిత సంకేతమిచ్చిన బీజేపీ అభ్యర్థి*

*•ముస్లింల మనోభావాలు దెబ్బతీశారంటూ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు*

*•బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు*

మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదుపై హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదయింది. సిటీలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్న మాధవి.. సిద్ది అంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీదు వైపు బాణం గురిపెట్టి వదులుతున్నట్టు ఊహాజనిత సంజ్ఞ చేశారని ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఆమె బాధ్యతారహిత చర్యకు పాల్పడ్డారని, ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థిగా మాధవీ లతను ప్రకటించిన నాటి నుంచి ఆమె ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. దీంతో ఐపీసీలోని 295-ఏ (మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 ( ఉద్దేశపూర్వకంగా మతవిశ్వాసాలను రెచ్చగొట్టడం), హానికరమైన చర్యలకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

కాగా మసీదు వైపు బాణం వేస్తున్నట్టుగా మాధవీ లత ఇచ్చిన ఊహాజనిత సంజ్ఞకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్నికల సంఘం మౌనంగా ఉందంటూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఈ విమర్శలపై మాధవీ లత స్పందిస్తూ.. వీడియో అసంపూర్తిగా ఉందన్నారు. వీడియో కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని కూడా ఆమె అన్నారు. సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో కూడా ప్రతిపక్షాలపై దాడి చేశారు. ప్రత్యర్థి పార్టీల పరువు తీయవద్దని, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దని మాధవి లత ఘాటుగా వ్యాఖ్యానించారు.

*హైదరాబాద్‌లో మే 13న పోలింగ్*

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి, ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే మే 13న హైదరాబాద్‌లో ఓటింగ్ జరగాల్సి ఉంది. 2004 నుండి అసదుద్దీన్ ఒవైసీ మరియు 1989 నుండి అతని తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ స్థానం నుండి మాధవి లత పార్టీ అభ్యర్థిగా ఉన్నారు.

చెన్నై ని చిత్తు చేసిన లక్నో

ఐపీఎల్ 2024లో భాగంగా హోం గ్రౌండ్‌లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది.

చెన్నై నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో లక్నో ఓపెనర్లు చెలరేగిపోయారు. దీంతో సీఎస్‌కేపై జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొం దింది.

సొంత గడ్డ పై CSK ను త‌క్కువ‌కే క‌ట్ట‌డి చేసిన ల‌క్నోకు ఓపెన‌ర్లు శుభా రంభ‌మిచ్చారు. క్వింట‌న్ డికాక్‌(54), కెప్టెన్ కేఎల్ రాహుల్(82) చ‌రో హాఫ్ సెంచ‌రీతో చెన్నై బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతున్నారు.

ఇక ఆ త‌రువాత వ‌చ్చిన నికోలస్ పూరన్ 23,నాటౌట్ మెప్పించాడు. దాంతో 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసిన లక్నో… 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరనా చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు రద్దు?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిన్ను ప్రారంభం అయ్యా యి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహి స్తున్నారు.

మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో 12 రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

నిన్ను దేశంలో తొలి దశ పోలింగ్ జరిగింది.ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

దేశంలో ఎన్నికలు జరుగు తున్నందున ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ స్పష్టం చేసింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీని యన్ పోల్స్ ప్రదర్శించరా దని ఈసీ పేర్కొంది.

విధుల్లో నిర్లక్ష్యం ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌

హైదరాబాద్ మల్టీజోన్‌ -1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను ఐజీ ఏవీ రంగనాథ్‌ గురువారం సాయంత్రం సస్పెండ్‌ చేశారు.

సస్పెండ్‌ అయిన వారిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఉన్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రజా భవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ను తప్పించేందుకే పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌తో సంప్రదింపులు జరిపినట్టుగా హైదరాబాద్‌ సీపీ విచారణలో తేలడంతో అప్పటి బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.

మద్యం సేవించి పోలీస్‌స్టే షన్‌కు వచ్చి స్టేషన్‌ సిబ్బం దిని ఇబ్బందులకుగురి చేసిన నిజామాబాద్‌ జిల్లా సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేశ్‌ను సస్పెండ్‌ చేశారు.

జగిత్యాల జిల్లా సారంగా పూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో అలసత్వంగా వ్యవహారిం చిన ఎస్సైలు మనోహర్ రావు, తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ బి. రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేం దర్ లను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగ నాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు...

ముంబై ముందు తలవంచిన పంజాబ్

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు చివరి ఓవర్ వరకు పోరాడింది.

ఇక 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై 7వ స్థానానికి చేరుకుంది.

అయితే, పంజాబ్ కింగ్స్ టాపార్డర్ పూర్తిగా విఫల మైనప్పటికీ… మిడిలార్డర్ బ్యాటర్లు శ‌శాంక్ సింగ్, అశుతోష్ శర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ‌శాంక్ సింగ్ (41; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించాడు. హర్‌ప్రీత్ బ్రార్ (21) పరువాలేదరనిపించాడు.

ఇక ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ చెరో మూడు వికెట్లు పడగొట్ట గా… శ్రేయాస్ గోపాల్, ఆకాశ్ మ‌ధ్వాల్, హార్దిక్ పాండ్యలు త‌లా ఓ వికెట్ దక్కించుకున్నారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు నష్టానికి 192 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్యకుమార్ యాదవ్ (78; 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా..

తిల‌క్ వ‌ర్మ (34 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రోహిత్ శ‌ర్మ (36; 25 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు...

ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్ వెంకటరమణి

ఓ భూమిని ఎల్‌ఆర్‌ఎస్‌ చేయడం కోసం టీపీఎస్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం చోటు చేసుకుం ది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పాల్వంచ మున్సిపల్‌ కార్యా లయంలో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ టీపీఎస్‌ గాపని చేస్తున్న వెంకటర మణి, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ప్రసన్నకుమార్‌ ఓ భూమి విషయంలో ఎల్‌ఆర్‌ ఎస్‌ చేయడం కోసం ప్లాట్‌కు రూ.10 వేల చొప్పున మూడు ప్లాట్లకు రూ.30 వేలు డిమాండ్‌ చేశారు.

తాను రూ.30 వేలు ఇవ్వలేనని, ప్లాట్‌కు రూ.5 వేల చొప్పున.. రూ.15 వేలు ఇస్తామని పాల్వంచకు చెందిన భూ యజమాని కాంపెల్లి కనకేష్‌ సదరు ఉద్యోగులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

తర్వాత ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించిన కనకేష్‌.. వారి సూచన మేరకు గురువారం టీపీఎస్‌కు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి రూ.15 వేలు లంచం ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డీఎస్పీ రమేశ్‌ వెల్లడించారు.

ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయొ చ్చన్నారు. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దని, ఫిర్యాదుదారులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు...