చేనేత బకాయిల విడుదల హర్షనీయం -బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్
చేనేత బకాయిల విడుదల హర్షనీయం
-బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్
చేనేత కార్మికుల బకాయిలకు సంబంధించి మొదట విడుతగా 50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడాన్ని బీసీ రాజ్యాధికార సమితి స్వాగతించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మేరకు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్ యూనిఫామ్‌ల తయారీకి 47 కోట్ల అడ్వాన్సుతో పాటు నూలు కొనుగోలు, సైజింగ్ కు మరో 14 కోట్లు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరకు సంబంధించి మొత్తం 351 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మిగతా బకాయిలను కూడా త్వరలో విడుదల చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని దాసు సురేష్ కోరారు. సిరిసిల్ల చేనేత పరిశ్రమ స్వయం అభివృద్ది చెందకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకే పరిమితం చేసిందని విమర్శించారు. ఇపుడు కేటీఆర్ మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల చేనేత పరిశ్రమ పూర్వ వైభవం సాధించేలా ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని కోరారు.
Apr 20 2024, 23:58