మహానగరంలో పలుచోట్ల వర్షం

భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరా బాద్ వాసులకు బుధవారం రాత్రి ఉపశమనం కలిగింది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపో యింది.

హైదరాబాద్ లోని పలుచోట్ల బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. రాత్రి 9 గంటల తరువాత పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, అమీర్ పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది.

కుత్బుల్లాపూర్ లోని సూరా రం, చింతల్, నిజాంపేట్, సుచిత్ర, దుండిగల్, షాపూర్ నగర్ పలు ప్రాంతాలలో ఉరుములు తో కూడిన వర్షం కురిసింది.గత కొన్ని రోజులుగా భానుడి భగ భగల నుంచి ఇబ్బంది పడుతున్న నగర వాసులకు వర్షం కురవడంతో ఉపశమనం లభించింది.

దీంతో నగరంలో ఉష్ణోగ్ర తలు భారీగా పడిపోయా యి. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు...

నేడు DC,GT, ఢీ: ఢిల్లీకి కీలకం

ఐపిఎల్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా కీల కంగా మారింది. వరుస ఓటములతో సతమతమ వుతున్న డిల్లీ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని తపిస్తుంది.

లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న పోరు లో ఎలాగైనా జయకేతనం ఎగుర వేయాలనే లక్షంతో గుజరాత్ పోరుకు సిద్ధమైంది.

బ్యాటిగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.లక్నో తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. గుజరాత్‌ను కూడా మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది.

అయితే స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈ సీజన్‌లో వార్నర్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో పోటీలో తేలిపోతున్నాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది.

మరో ఓపెనర్ పృథ్వీషా ఫామ్‌లో ఉండడం జట్టుకు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా అతని పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వార్నర్‌తో కలిసి అతను శుభారంభం అందిస్తే జట్టు బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి.

ఇక లక్నోపై యువ ఆటగా డు జాక్ ఫ్రెజర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడి లోనూ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. దీం తో ఈ మ్యాచ్‌లో కూడా అతని నుంచి జట్టు అలాం టి ప్రదర్శనే ఆశిస్తోంది. కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును ముందుండి నడిపిస్తున్నా అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తు న్నాడు.

ఈ మ్యాచ్‌లో కూడా రాణిం చేందుకు సిద్ధమయ్యాడు. పంత్ తన మార్క్ బ్యాటిం గ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు ఖాయమనే చెప్పాలి. ట్రిస్టన్ స్టబ్స్ కూడా నిలకడడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటు న్నాడు. పలు మ్యాచుల్లో జట్టును ఆదుకున్నాడు.

ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తు న్నాడు. షాయ్ హోప్ రూపంలో మరో హార్డ్ హిట్టర్ జట్టులో ఉన్నాడు. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాఛిన్నం చేసే సత్తా అతనికుంది. దీంతో హోప్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. కుల్దీప్ యాదవ్, ఖలీల్, అక్షర్, ముకేశ్, ఇషాంత్ తదిత రులతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీని తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు...

నేడు కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల ప్రచారం లో ఆయన పాల్గొనను న్నారు.

బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సిఎం రేవంత్ కేరళలో పర్యటించ నున్నట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేప థ్యంలోనే ఆయన బుధవా రం రేవంత్ హైదరాబాద్ నుంచి కేరళకు బయల్దేర తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

బుధవారం అలిప్పీ నియోజ కవర్గంలో గురువారం వయ నాడు, నియోజకవర్గంలో సిఎం రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. అలిప్పీ నియోజకవర్గం నుంచి ఏఐసిసి నాయకులు కెసి వేణుగోపాల్ పోటీ చేస్తుండగా వయనాడు నియోజకవర్గం నుంచి ఏఐసిసి అగ్రనేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్ రెండు రోజుల పాటు ఈ రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించను న్నారు.

ఎపి, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ సిఎం ప్రచారం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చరిష్మాను తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నూ ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రచారానికి వెళ్లాలని ఆ పార్టీ అధినా యకత్వం సిఎం రేవంత్‌ను ఆదేశించింది.

ఈ మేరకు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళ నాడు, కర్ణాటక, మహారా ష్ట్రల్లో, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న పార్టీ అభ్య ర్థులకు మద్ధతుగా రేవంత్‌ రెడ్డి ప్రచారం నిర్వహించను న్నారు.

అధిష్ఠానం నిర్ణయం మేరకు మంగళవారం మహారాష్ట్ర లో రేవంత్‌రెడ్డి ప్రచారం చేయాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలతో సిఎం రేవంత్ పర్యటన రద్దైంది... 18వ తేదీ రాత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరా బాదు చేరుకుంటారు.

మహిళలకు అధికారం అందని ద్రాక్షేనా❓️

దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ మహిళల ఓట్లపై ప్రధానంగా దృష్టి పెడు తుంది. ఇందు కోసం మహిళా సాధికారత, వారికి 33 శాతం రిజర్వేషన్లు, హక్కులువంటి అంశాలపై చుట్టూ రాజకీయాలు నడుపుతుంది.

కానీ, నిజ జీవితంలో మాత్రం అవేమీ కార్యరూపం దాల్చటం లేవు. ఇందుకు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌లోని ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు మహిళలకు కేటాయించిన అతి తక్కువ సీట్లే ఇందుకు ప్రత్యక్ష నిద ర్శనం. ఈ రెండు పార్టీలు ఈ సారి నలుగురు చొప్పున మహిళలను లోక్‌సభ బరిలో నిలిపాయి.

ముఖ్యంగా, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించటం, అందుకు పార్లమెంటులో చట్టం చేయటం.. అన్నీ తమ కారణంగానే అని చెప్పుకునే బీజేపీ.. సాక్షా త్తూ ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోనే వారికి మహిళ లకు సీట్లు కేటాయించటం లో విముఖతను చూపు తుండటం గమనార్హం.

ఈ సారి బీజేపీ నలుగురు, కాంగ్రెస్‌ నలుగురు మహిళ లను తమ పార్టీల నుంచి లోక్‌సభ ఎంపీ అభ్యర్థు లుగా పోటీలో ఉంచాయి. గుజరాత్‌లో దాదాపు 2.39 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం నమోదైన ఓటర్లలో 50 శాతం మంది వారే. అయినప్పటికీ చెప్పు కోదగిన సంఖ్యలో కూడా ప్రధాన పార్టీలు మహిళలకు లోక్‌సభ సీట్లను కేటాయిం చక పోవటాన్ని మేధావులు, స్త్రీ అభ్యుదయవాదులు తప్పు బడుతున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నుంచి ఆరుగురు మహిళా ఎంపీలు గెలిచారు. అయితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ నలుగురికి మాత్రమే పరిమితం కావటాన్ని మహిళావాదులు వేలెత్తి చూపుతున్నారు. గుజరా త్‌లో మహిళా ఎంపీలు, అభ్యర్థుల ప్రాతినిధ్యం క్రమంగా క్షీణిస్తున్నది.

26 స్థానాలకు గానూ ప్రస్తుతం బీజేపీ నామినేట్‌ చేసిన నలుగురు మహిళ లలో జామ్‌నగర్‌ స్థానానికి పూనమ్‌ మేడమ్‌, సబర్‌ కాంతా స్థానానికి శోభనా బరయ్య, భావ్‌నగర్‌ స్థానానికి నీము బంభా నియా, బనాస్‌ కాంతా స్థానానికి రేఖా బెన్‌ చౌదరి ఉన్నారు.

ముఖ్యంగా, ఉత్తర గుజరా త్‌లోని బనస్కాంత స్థానాని కి బీజేపీ మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్‌ మహిళ అభ్యర్థి పోటీ చేయనున్నారు. గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఒకరిపై ఒకరు మహిళా అభ్యర్థులను నిలబెట్టిన ఏకైక సీటు ఇదే కావటం గమనార్హం.

ఇక కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదిం చిన నలుగురు మహిళా అభ్యర్థుల్లో జెనీ బెన్‌ ఠాకోర్‌ బనస్కాంత స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా పోటీ చేస్తున్న గాంధీనగర్‌ స్థానం నుంచి సోనాల్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ పోటీకి దింపింది. మిగతా రెండు స్థానాలైన అమ్రేలిలో జెని తుమ్మర్‌, దాహౌద్‌లో ప్రభా తవియాడ్‌లు ఉన్నారు.

గుజరాత్‌లో అహ్మదాబాద్‌ వెస్ట్‌, గాంధీనగర్‌, పోర్‌ బందర్‌, పటాన్‌, పంచ మహల్‌, ఖేడా, బరూచ్‌, వల్సాద్‌, నవ్‌సారి స్థానాల్లో ఇప్పటివరకు ఏ పార్టీ నుంచి కూడా మహిళా అభ్యర్థి ఎన్నిక కాకపోవటం గమనార్హం.

రాజకీయ పార్టీలకు గెలుపు, అధికారం తప్పితే.. మహిళ లకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆసక్తి ఉండదని మేధావులు, విశ్లేషకులు అంటున్నారు. మహిళపై మరొక మహిళను నిలబెట్టటం, ఓడిపోయే స్థానాల్లోనూ మహిళనే బరిలో ఉంచి.. కంటి తుడుపు చర్యగా సీట్లను కేటాయిస్తున్నారని చెప్తున్నారు.

నేడు సీతారాముల కళ్యాణ మహోత్సవం :ప్రత్యేక ప్రసారానికి ఈసీ ఓకే

భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

ఏప్రిల్ 4న రాముడి కల్యా ణాన్ని ప్రసారం చేయడంపై ఈసీ నిషేధం విధించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యం లో ఈసీ ఈ ఆంక్షలు విధించింది.

అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

నాలుగు దశాబ్దాలుగా రాముల‌వారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికలకు దేవుడికి సంబంధం లేదని పేర్కొన్నాయి. దీనిపై స్పం దించిన ఎన్నికల సంఘం ఈరోజు జరగబోయే సీతారాముని కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసి అనుమతి ఇచ్చింది.

ఒంటరి పోరాటంతో R R కి,విజయాన్ని అందించిన జోస్ బట్లర్

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌క‌తా నైట్‌రై డర్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్ రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది.

అంతా ఓడిపోతుంది.. కోల్‌కతా పేసర్ల ధాటికి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్లు వ‌రుస పెట్టి పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్న సమయంలో బట్లర్ జోష్ పెంచాడు..

నిలకడగా ఆడుతూ దంచికొట్టాడు. దీంతో ఈ ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో విజయం సాధిం చింది. ఈ విజయంతో రాజస్థాన్ జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

234 పరుగుల భారీ ఛేద నలో రాజస్థాన్ టాపార్డర్ విఫ‌ల‌మైన‌ వేల… జోస్ బట్లర్ వీరోచితంగా పోరా డాడు. 60 బంతుల్లో 107 పరుగులతో చెలరేగి పోయాడు.

ఇక‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (19), కెప్టెన్ సంజూ శాంసన్ (12) పరుగులకే పెవిలియన్ చేరగా.. రియాన్ పరాగ్ (34) పరుగుల వద్ద ఔటయ్యాడు. రోవ్‌మన్ పావెల్ జట్టుకు పరుగులు (26) జోడించి అతను కూడా ఔట య్యాడు.

ఇక కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఒక్క వికెట్ దక్కించుకున్నాడు..

Bhadradri: శ్రీరాముని కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి

Bhadradri: శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాద్రి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. శ్రీరామనవమి పనులు శరవేగంగా పూర్తయ్యాయి. రామాలయానికి విద్యుత్‌ దీపాలంకరణలు, చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలంకరణలు, బాపు రమణీయ చిత్రాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి..

స్వాగత ద్వారాలు భక్తరామదాసు కీర్తనలతో భద్రాద్రి భక్తాద్రిగా మారిపోయింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు ఇప్పటికే భద్రాద్రి చేరుకున్నారు.

కల్యాణోత్సవంలో భాగంగా జరిగే... ఎదుర్కోలు కార్యక్రమం, శ్రీరామనవమి, మహా పట్టాభిషేకాలను ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. పోలీసుశాఖ 1800 మందికి పైగా సిబ్బందితొ బందోబస్తు ఏర్పాటు చేసింది.

శ్రీరామనవమి ఏర్పాట్లను దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, భద్రాద్రి కలెక్టర్‌ ప్రియాంక, ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఐటీడీఏ పీవో, దేవస్ధానం ఈవో రమాదేవిలు పరిశీలించారు. వీవీఐపీ సెక్టార్‌లతో పాటు ఇతర సెక్టార్లలో చేపట్టాల్సిన మార్పుల గురించి స్ధానిక అధికారులకు సూచనలు చేశారు.

భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు 24 సెక్టార్లలో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.

ఈ నెల 18న బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేత

తెలంగాణ భవన్ లో ఈనెల 18 వ తేదీ గురువారం నాడు, పార్లమెంటు ఎన్ని కల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బి ఫారాలు అందజేయను న్నారు.

అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమా వళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకో నున్నారు.

ఈ మేరకు అదే రోజు జరిగే సుధీర్ఘ సమీక్షా సమావేశం లో ఎన్నికల ప్రచారం, తది తర వ్యూహాలకు సంబంధిం చి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో… ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసన సభ్యులు, ఎంఎ ల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్ పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యు లు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు.

ఆహ్వానితులందరికీ తెలం గాణ భవన్ లో మధ్యాహ్నం లంచ్ ఏర్పాట్లుంటాయి. కాగా…. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయినామని చింతి స్తున్న తెలంగాణ ప్రజలు.. కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నది.

తమ హక్కులు కాపాడబడా లంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఆదరించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంట న్నట్టు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణ ప్రజా ఆకాంక్ష లకు అనుగుణంగా అధినేత కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు. ఇప్పటికే జరిపిన బహిరంగ సభలకు విపరీతమైన ప్రజా స్పందన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలకు మరింత చేరువ కావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

కాంగ్రేస్ తెచ్చిన కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాం గం వద్దకు వెల్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవ డానికి, వారికి భరోసానివ్వ డానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహిం చాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఏప్రిల్ 18వ తేదీ గురు వారం నాడు జరగనున్న ఈ సమావేశంలో అధినేత కేసీ ఆర్ బస్సు యాత్రకు సంబం ధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయంలో అగ్నిప్రమాదం

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం హోం శాఖ ఆఫీస్‌లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కార్యాలయంలోని కంప్యూ టర్లు, పత్రాలు, ఫైళ్లు, జిరా క్స్ మిషన్‌కు మంటలు అంటుకుని కాలి బూడిదై నట్లు గుర్తించారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడ లేరని అధికారులు వెల్లడించారు. కొందరు సీనియర్ అధికారులు ఉన్నట్లు తెలిపారు.

మంగళవారం ఉదయం 9.20 గంటలకు ఆఫీస్‌లో అగ్నిప్రమాదం సంభవించి నట్లు వివరించారు. నార్త్‌ బ్లాక్‌లోని ఐసీ డివిజన్‌లోని రెండో ఫ్లోర్‌లో ఈ మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు.

అమిత్ షా ఆఫీస్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అధికారులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారు లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.

7 ఫైర్‌ ఇంజన్ల సాయంతో ఎగిసి పడిన మంటలను అదుపు చేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనలో జిరాక్స్‌ మెషిన్‌‌, కొన్ని కంప్యూటర్లు, మరి కొన్న పత్రాలు అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు.

ప్రమాద సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భవనంలో లేరని.. పలు వురు సీనియర్‌ అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చు కున్నారు..

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజల కలకలం..

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు కలకలం రేపాయి. హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి..

అక్కడ ఓ బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, కవర్ లో నల్ల కోడి దాని ఈకలు, కుంకుమ వంటి ఆనవాళ్లు అక్కడ ఉండటం కలకలంగా మారింది. గత రాత్రి ఈ క్షుద్రపూజలు చేయగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో ఈ క్షుద్రపూజలు చేసింది ఎవరు? అనేది సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం, కవిత అరెస్ట్ వంటి అంశాలు బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులను సైతం చేపట్టారు. ఇంతలో కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో క్షుద్రపూజల అనవాళ్లు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

ఇది ఎవరు చేశారు?ఎందుకు చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రముఖులు నివాసం ఉంటే ఈ ప్రాతంలో క్షుద్రపూజల అనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పని చేసిందెవరూ అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది..