కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజల కలకలం..

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు కలకలం రేపాయి. హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి..

అక్కడ ఓ బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, కవర్ లో నల్ల కోడి దాని ఈకలు, కుంకుమ వంటి ఆనవాళ్లు అక్కడ ఉండటం కలకలంగా మారింది. గత రాత్రి ఈ క్షుద్రపూజలు చేయగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో ఈ క్షుద్రపూజలు చేసింది ఎవరు? అనేది సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం, కవిత అరెస్ట్ వంటి అంశాలు బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులను సైతం చేపట్టారు. ఇంతలో కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో క్షుద్రపూజల అనవాళ్లు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

ఇది ఎవరు చేశారు?ఎందుకు చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రముఖులు నివాసం ఉంటే ఈ ప్రాతంలో క్షుద్రపూజల అనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పని చేసిందెవరూ అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది..

యుపిఎస్పి సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ యువతికి 3వ ర్యాంక్

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థిని సత్తా చాటింది.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లోనే మూడో ర్యాంక్ సాధించారు.

ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని, రోజుకు 12-14 గంటలు చదివేదానినని తెలిపారు.

సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు...

శ్రీరామ నవమి కి ముస్తాబవుతున్న భద్రాది రామయ్య

భ‌ద్రాచలంలో శ్రీ సీతా రాముల కల్యాణానికి శ్రీరామ దివ్య క్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేశారు.

రేపు సీతారాముల కల్యా ణం జరగనుంది. అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఇవాళ ఎదరుకోలు ఉత్సవాన్ని పండితులు నిర్వహిస్తున్నారు.ఈరోజు జరిగే శ్రీ రామన వమి కోసం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రూ. 3కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

భద్రాచలంలో సీతారాముల కల్యాణం నేపథ్యంలో ఏర్పా ట్లు చురుగ్గా జరుగుతున్నా యి. రామాలయ ప్రాంగణా న్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు తున్నారు. శ్రీ సీతారాముల కల్యాణం జరిగే మిథిలా కళ్యాణ మంటపాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు.

నేడు ఎదురుకోలు వేడుక‌…

భద్రాద్రిలోని రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రేపు మిధిలా స్టేడియంలో సీతా రామ కల్యాణం జరగనుం ది. రేపు సీతారామ కల్యా ణం… సీతారామ కల్యాణం సందర్భంగా పెద్దయెత్తున భక్తులు భద్రాద్రికి చేరుకుం టున్నారు.

ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఇప్పటికే భద్రాద్రి బాట పట్టారు. భద్రాచలంలోని అన్ని వసతి గృహాలు బుక్ అయి పోయాయి. సీతారామలు కల్యాణాన్ని తిలకించేందుకు ఎక్కువ మంది భక్తులు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు.

ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వీస్తుండటంతో అందుకు తగినట్లు చర్యలు ఆలయ అధికారులు తీసుకున్నారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు దేశ నలు మూలల నుంచి వచ్చే ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల కోడ్ ఉండటంతో ఈ సారి స్వామి వారి కల్యాణానికి ముఖ్యమంత్రి వచ్చే వీలు లేనట్లు తెలు స్తోంది.రూ.3 కోట్ల వ్యయం..

దేవాదాయ శాఖ రూ.2.88 కోట్లు, గ్రామ పంచాయతీ రూ. 26 లక్షలు, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూఎస్, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మొత్తం రూ.3 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి.

స్వామి వారి కళ్యాణానికి మరో రోజు మాత్రమే గడువు ఉండటంతో యుద్ధ ప్రాతి పదికన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగమంతా ఏర్పాట్ల లో తలమునకలై ఉన్నారు. రాములోరి కళ్యాణానికి దేశ నలు మూలల నుంచి లక్ష మందికిపైగా భక్తులు వస్తారనే అంచనాతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది...

యూపీఎస్పీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల

యూపీఎస్సీ సివిల్స్ ఫలి తాలు ఇవాళ విడుదల య్యాయి.

మొత్తం 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్ వచ్చింది. అనిమేశ్ ప్రధాన్‌కి రెండో ర్యాంక్ రాగా, తెలుగ మ్మాయి దొన్నూరు అనన్య రెడ్డికి మూడో ర్యాంకు దక్కింది.

పీకే సిద్ధార్థ్‌ రామ్‌ కుమార్‌, రుహాని నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.

ఆ తదుపరి స్థానాల్లో సృష్టి దబాష్, అన్మోల్‌ రాఠోఢ్, ఆశీష్‌ కుమార్‌, ఐశ్వర్యం ప్రజాపతి ఉన్నారు.

జనరల్ కేటగిరీలో 347 మంది ఎంపిక కాగా, 303 మంది ఓబీసీ, 165 మంది ఎస్సీ కేటగిరీలో, 86 మంది ఎస్టీ కేటగిరీలో ఎంపిక య్యారు. ఈడబ్ల్యూఎస్‌ నుంచి 115 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది...

గులాబీ గూటికి ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్

ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ కమలం గూటిని వీడి మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆయన బీజేపీ పార్టీలో చేరారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ ఎన్నికల ప్రచారంలో తిరిగిన

జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఇవాళ‌ బీఆర్ఎస్ కార్యని ర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలోఈరోజు గులాబీ కండువా కప్పుకున్నారు.

ఆయనతో పాటు పలువురు మాజీ సర్పంచులు, కొమరం భీమ్ మనవడు కొమరం సోనేరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు...

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిపై ముస్లిం దేశాల వాగ్వాదం

ఇరాన్ ఆకస్మిక డ్రోన్ మరియు క్షిపణి దాడి తరువాత, అమెరికా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ వంటి పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచాయి. ఇది మాత్రమే కాదు, కొన్ని ముస్లిం దేశాలు కూడా ఇజ్రాయెల్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వైపు వందల కొద్దీ డ్రోన్లు మరియు క్షిపణులను ప్రయోగించింది, వీటిలో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ గాలిలో కూల్చివేసినట్లు పేర్కొంది.

ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ఇప్పటికే సిద్ధంగా ఉందని వెల్లడించింది, ఎందుకంటే అరబ్ దేశాలు టెహ్రాన్ దాడి ప్రణాళికల గురించి నిశ్శబ్దంగా ఇంటెలిజెన్స్ ఇచ్చాయి. ఇరాన్ దాడిని ఆపడంలో ఇజ్రాయెల్ పొరుగున ఉన్న జోర్డాన్ ముఖ్యమైన పాత్ర పోషించింది, అయితే ఈ ప్రాంతంలో పెద్ద మరియు ప్రభావవంతమైన ముస్లిం దేశమైన సౌదీ అరేబియా కూడా దీనికి సహాయం చేసింది.

దాదాపు 7 నెలలుగా గాజా మైదానంలో ఇజ్రాయిల్ సైన్యం యుద్ధం చేస్తోంది. ముస్లిం దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఇజ్రాయెల్‌కు మద్దతివ్వాలని ఏ ముస్లిం దేశం కూడా ఆలోచించదు. కానీ ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడి తరువాత, ఇప్పుడు ముస్లిం దేశాలు చీలిపోతున్నాయి. ఇరాన్ దాడికి ముస్లిం దేశాలు మద్దతు ఇస్తుండగా, ఇరాన్ దాడిని ఖండించిన కొన్ని ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. వీటిలో అతిపెద్ద మరియు మొదటి పేరు జోర్డాన్ మరియు రెండవది సౌదీ అరేబియా.

అరబ్ దేశాలు యుద్ధ విమానాల కోసం తమ గగనతలాన్ని తెరిచాయని, రాడార్ నిఘా సమాచారాన్ని పంచుకున్నాయని మరియు కొన్ని సందర్భాల్లో తమ సైన్యాల సేవలను కూడా అందించాయని అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇరాన్ దాడి చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన డ్రోన్‌లు మరియు క్షిపణులను అడ్డగించేందుకు అమెరికా అధికారులు ప్రాంతీయ అరబ్ ప్రభుత్వాలను ఒత్తిడి చేశారని సౌదీ మరియు ఈజిప్టు అధికారులు నివేదించారు.

టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఉత్తర మరియు మధ్య జోర్డాన్ గుండా ఇజ్రాయెల్ వైపు ఎగురుతున్న డజన్ల కొద్దీ డ్రోన్‌లను జోర్డాన్ జెట్‌లు కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైనిక మూలాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి జోర్డాన్ తన జెట్‌లను పంపడం ఒక పెద్ద అడుగు, ఎందుకంటే అమ్మన్ గతంలో గాజాలో దాని ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్‌ను తీవ్రంగా విమర్శించారు. డ్రోన్లు జోర్డాన్ లోయ వైపు గాలిలోకి ప్రయోగించబడ్డాయి మరియు జెరూసలేం వైపు వెళ్లినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. మరికొందరిని ఇరాకీ-సిరియా సరిహద్దు దగ్గర నిలిపివేశారు. వారు తదుపరి వివరాలను అందించడం లేదు.

ఇజ్రాయెల్ మీడియా ప్రకారం, జోర్డాన్ జెట్‌లు ఉత్తర మరియు మధ్య జోర్డాన్ గుండా ఇజ్రాయెల్ వైపు ఎగురుతున్న డజన్ల కొద్దీ డ్రోన్‌లను కూల్చివేసాయి. అయితే దీనికి ముందు, గాజా యుద్ధ సమయంలో, జోర్డాన్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిలిచింది. ఇప్పుడు పరిస్థితి మారిందని నిపుణులు భావిస్తున్నారు. సౌదీ అరేబియా కూడా ఇరాన్ దాడిని ఖండించింది, ఇది ప్రపంచానికి మంచిది కాదని వివాదాన్ని పెంచుతుందని పేర్కొంది. ఇరాన్ చర్యల పట్ల సౌదీ అరేబియా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా స్పష్టమైంది. ఇది కాకుండా, ఇరాన్ చేసిన ఈ దాడిపై ఇతర ముస్లిం దేశాలు కూడా మౌనం వహించాయి. ఈ దాడి తర్వాత ముస్లిం దేశాల మధ్య చీలిక ఇరాన్‌కు మంచి సంకేతం కాదు. దీని కారణంగా ఇరాన్ ఉద్రిక్తత ఖచ్చితంగా పెరుగుతుంది.

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ భక్తుల సర్వదర్శనానికి 10గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది..

తిరుమల శ్రీవారిని నిన్న 77వేల 511 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు..

ఇక రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై మలయప్పస్వామి ఊరేగనున్నారు.

ఈ నేఫథ్యంలో శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు..

Streetbuzz News

తెలంగాణకు వడగాలుల ముప్పు.. నేడు, రేపు పెరగనున్న ఎండలు

హైదరాబాద్‌: ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కన్నా మంగళ, బుధవారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది..

దీంతోపాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రధానంగా బుధవారం కొన్ని జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది..

Streetbuzz News

SB NEWS

రాజీనామా చేస్తే రూ.15వేలు ఆఫర్.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిళ్లు

ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కొందరు వైకాపా నాయకులు, పాలకుల లక్ష్యం ఒక్కటే.. గ్రామ వాలంటీర్లతో రాజీనామా చేయించడమే. రహస్యంగా వాలంటీర్లను ఓ ప్రాంతానికి రప్పించుకుని సమావేశాలు నిర్వహించడం, రాజీనామాలకు ఒత్తిడి తీసుకురావడం పరిపాటిగా మారింది..

కొందరు విముఖత చూపడంతో వారినీ ఒప్పించేందుకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తుండటం కనిపిస్తోంది. బరిలో ఉన్న అభ్యర్థి ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తారని చెబుతుండటం గమనార్హం.

అలాగే, మళ్లీ అధికారంలోకి రాగానే మీ ఉద్యోగం తిరిగి ఇస్తామనే హామీలూ గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు వాలంటీర్లు ఇష్టం లేకపోయినా రాజీనామాలకు సిద్ధమైనట్లు సమాచారం. సోమవారం కొత్తపల్లి మండలంలోని కొన్ని తీరప్రాంత గ్రామాల్లో ఇదే తరహాలో బేరసారాలు జరిగాయి..

రోజుకు నలుగురిని మార్చాలంట! : నాయకులు ఆఫర్‌కు తోడు.. కొన్ని నిబంధనలనూ ప్రస్తావించడం క్షేత్రస్థాయిలో చర్చగా మారింది.

రాజీనామా చేసిన వాలంటీర్లు వైకాపా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించడంతో పాటు.. ఒక్కొక్క వాలంటీర్‌ రోజుకు కనీసం నలుగురిని కలసి వైకాపాకు ఓటేసేలా చేయాలన్నది ఆ మాటల సారాంశం. ఇలా చేసినందుకు తమ నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని భరోసా ఇస్తుండటం భారీగా చర్చగా మారింది..

రేపు మద్యం దుకాణాలు బంద్

రాష్టంలో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేయిస్తుంటారు.

ఈ క్రమంలోనే తాజగా శ్రీరామనవమిని పురస్క రించుకొని హైదరాబాద్‌ జంట నగరాల్లో ఒకరోజు మద్యం దుకాణాలు బంద్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

రేపు 17వ తేదీ బుధవారం మద్యం దుకాణాలు బంద్‌ కావాల్సిందే అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హైదరా బాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు.

ఎవరైనా ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూ డదనే ఉద్దేశంతో..

ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న వైన్స్‌, కల్లు కాంపౌండ్లు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ మూతపడనున్నాయి.

ఈ మేరకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.