మహాలక్ష్మి మహిళలకు 500లకు గ్యాస్..అకౌంట్లో డబ్బులు

తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకంపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది.

18.86 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించు కున్నారని.. ఏప్రిల్ 13 నాటికి కొందరు రెండో రాయితీ సిలిండర్ కూడా పొందారని తెలిపింది.

మొత్తంగా 21.29 లక్షల మందికి రూ.59.97 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలి పింది. కాగా రాష్ట్ర వ్యాప్తం గా 39.33 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు రూ.500కు సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించారు...

Streetbuzz News

SB NEWS

బైజూస్‌ ఇండియా సీఈఓ రాజీనామా?

ఆర్థిక కష్టాలతో సతమ తమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌లో సంక్షోభం మరింత ముది రినట్లు కనిపిస్తోంది. సంస్థ భారతీయ విభాగం సీఈఓ అర్జున్‌ మోహన్‌ సోమవారం రాజీనామా చేశారు.

దీంతో సంస్థ రోజువారీ కార్యకలాపాలను వ్యవ స్థాపకుడు బైజూ రవీంద్రన్‌ పర్యవేక్షించనున్నట్లు కంపెనీ తెలిపింది.

రవీంద్రన్‌కు అత్యంత నమ్మకస్థుడిగా అర్జున్‌ మోహన్‌కు సంస్థలో పేరుంది. రవీంద్రన్‌ క్యాట్‌ కోచింగ్‌ ఇస్తున్న తొలినాళ్లలో అర్జున్‌ ఆయనకు స్టూడెం ట్‌. ఆయన సీఈఓ బాధ్యత లు చేపట్టి ఆరు నెలలే అవు తోంది.

సంస్థ పునర్‌వ్యవస్థీకరణ కీలక దశలో ఉన్న తరు ణంలో రాజీనామా చేయడం గమనార్హం. కానీ, సంస్థకు సలహాదారుడిగా మాత్రం ఆయన కొనసాగనున్నట్లు సమాచారం....

Streetbuzz News

ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్

కొన్నిసార్లు ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధం, కొన్నిసార్లు ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం మరియు ఇప్పుడు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత తరువాత, ప్రపంచం మొత్తం యుద్ధ భయంతో భయపడుతోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు మరియు డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌పై భారీ దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. రాబోయే 24-48 గంటల్లో ఎప్పుడైనా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయవచ్చని నమ్ముతారు. కాగా, యుద్ధం మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ ప్రముఖ నేత ఖమేనీ అమెరికాకు సవాలు విసిరారు. అటువంటి పరిస్థితిలో, ఇజ్రాయెల్ దాడి చేస్తే, విధ్వంసక ప్రతీకారం నుండి ఇరాన్ వెనక్కి తగ్గదని స్పష్టమైంది. అటువంటి పరిస్థితిలో, యుద్ధం మరొక వైపు ప్రారంభమవుతుంది.

శనివారం, ఇరాన్ 300 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు మరియు డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌పై పెద్ద దాడిని ప్రారంభించిందని మీకు తెలియజేద్దాం. అయితే, వీటిలో 99 శాతం వాయు రక్షణ వ్యవస్థ సహాయంతో ఇజ్రాయెల్ గాలిలో కాల్చివేసింది. ఇరాన్ దాడిని ఆపడంలో ఇజ్రాయెల్‌కు పొరుగున ఉన్న ముస్లిం దేశం జోర్డాన్‌తో పాటు అమెరికా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ కూడా సాయపడ్డాయి. ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఉంది. ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ తదుపరి దశ ఏమిటో ఇజ్రాయెల్ యొక్క ప్రముఖ రాజకీయ నాయకులు ఆదివారం చర్చిస్తూనే ఉన్నారు.

ఇజ్రాయెల్ ఎప్పుడు మరియు ఎలా దాడి చేస్తుంది?

ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడిని భగ్నం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ ఆదివారం సమావేశమైంది. ఈ సమావేశంలో పీఎం నెతన్యాహు, రక్షణ మంత్రి గాలంట్, కేబినెట్ మంత్రి బెన్నీ గంజ్ ఇరాన్‌కు తగిన సమాధానం ఇస్తారని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ సభ్యుడు మరియు పోర్ట్‌ఫోలియో లేని మంత్రి బెన్నీ గాంట్జ్ ప్రచారం ఇంకా ముగియలేదని జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వెంటనే స్పందించదని వీడియో ప్రకటనలో పేర్కొంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేస్తామని, సరైన సమయంలో ఈ దాడికి మూల్యం చెల్లించుకుంటామని గాంట్జ్ చెప్పారు. దాడిని విఫలమవ్వడాన్ని ఇజ్రాయెల్ తన జాతీయ భద్రత కోసం సద్వినియోగం చేసుకోవాల్సిన వ్యూహాత్మక విజయంగా గాంట్జ్ అభివర్ణించారు.

వార్ క్యాబినెట్ దాడి మరియు రక్షణ కోసం దాని ప్రణాళికను ఖరారు చేసిందని మీకు తెలియజేద్దాం. అయితే, ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో స్పష్టంగా తెలియదా? అతను నేరుగా దాడి చేస్తాడా లేదా మరేదైనా ఉపాయాన్ని అనుసరిస్తాడా? మరోవైపు ఇజ్రాయెల్ ప్రతీకార దాడిపై ఇరాన్ అప్రమత్తమైంది.

అమెరికా హెచ్చరించింది

అమెరికా నిరాకరించినప్పటికీ, ఇరాన్ దాడికి ప్రతిస్పందించాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుందని మీకు తెలియజేద్దాం. నిజానికి ఇరాన్ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు. ఈ సమయంలో, బిడెన్ ఇజ్రాయెల్‌కు ఇరాన్‌పై తదుపరి చర్యకు మద్దతు ఇవ్వబోమని హెచ్చరించాడు. అధ్యక్షుడు బిడెన్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు స్పష్టమైన సందేశాన్ని పంపారు. ఇరాన్ దాడి విఫలమైంది. ఇజ్రాయెల్ గెలిచింది. అందువల్ల, ఇరాన్ గడ్డపై నేరుగా సైనిక దాడి చేయడం ద్వారా దీనిని మరింత తీవ్రతరం చేయవలసిన అవసరం లేదు.

మధ్యప్రాచ్యంలో యుద్ధ ధ్వని

ఇజ్రాయెల్ ముందు ఉన్న ఇబ్బంది ఏమిటంటే, ఒక వైపు దాని అతిపెద్ద మిత్రదేశమైన అమెరికా శాంతి కోసం విజ్ఞప్తి చేస్తోంది, మరోవైపు ఇరాన్‌పై గట్టిగా దాడి చేయాలని పట్టుబట్టే ఇజ్రాయెల్ భద్రతా స్థాపనలో చాలా మంది కరడుగట్టినవారు ఉన్నారు. నెతన్యాహు సంకీర్ణ భాగస్వామి, భద్రతా మంత్రి ఇటామర్ బెన్ జివిర్, ఇరాన్‌పై దాడి చేయడంలో జాప్యం బోలు పాశ్చాత్య ఆలోచనగా పేర్కొన్నారు. ఇరాన్‌కు ఇజ్రాయెల్ సమాధానం ఇస్తుందని టెల్ అవీవ్ నేతల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. దీని అర్థం ఇజ్రాయెల్ తదుపరి చర్య మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ప్రారంభిస్తుంది.

MLC Kavith: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)..

లిక్కర్ స్కామ్ కేసులో కవితను మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈ మూడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో.. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాదులు, కవిత తరఫున న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది.

సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని.. విచారణకు ఆమె సహకరించలేదని సీబీఐ ఆరోపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కవితను 9 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. దీని ప్రకారం.. కవిత ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు..

ఓటు నమోదుకు నేడే చివరి అవకాశం

ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఇదే ఆఖరి గడువు

అమరావతి: ఈ సారి ఓటర్ల జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి రోజు..

మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలంటే నమోదు చేసుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం. దీన్ని చేజార్చుకుంటే ప్రజాస్వామ్యంలో వజ్రాయుధాన్ని కోల్పోయినట్లే..

Streetbuzz News

SB NEWS

Streetbuzz News

Real time news platform

మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుం డడంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లపై దృష్టిసారించారు.

ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్నారు.

సాధారణ పోలింగ్‌‌కు నాలుగు రోజుల ముందు గానే ఈ పక్రియను పూర్తి చేయాల్సి ఉండడంతో 8వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

దీంతో ఈ దిశగా అధికా రులు అడుగులు వేస్తు న్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణను నెల 30న మొదలు పెట్టి రెండో తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల సంఘం నిర్ణయించినట్టుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ఆయా జిల్లాల్లోనే ముద్రిం చనున్నాయి.

కాగా ఈవీఎం యంత్రాలపై ఉంచే బ్యాలెట్‌ పత్రాలను హైదరాబాద్‌లోనే ముద్రించా లని అధికారులు నిర్ణయిం చారు.85 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించు కునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిం చిన విషయం తెలిసిందే.

వృద్ధులతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు, దివ్యాంగులు కూడా పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అవకాశం ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృ ద్ధులు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అధికా రులు ఏర్పాట్లు చేయను న్నారు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలి : మాజీ సీఎం కేసీఆర్

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు.

పార్లమెంట్‌ ఎన్నికల సంద ర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని గెలిపించాలని సూచిం చారు.

ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్‌ను రాజయ్య ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని రాజయ్యకు కేసీఆర్‌ సూచించారు.

ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లా డుతూ.. కడియం శ్రీహరిపై అనర్హత వేటు ఖాయమన్నారు.

కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మె ల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. కడియం, దానం, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని రాజయ్యకు కేసీఆర్‌ సూచించారు..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచ మేధావి,రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు రాష్ట్రవ్యాప్తం గా విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తం గా పోటీ పరీక్షల్లో వారి ప్రావిణ్యతను పెంచడం కోసం ప్రత్యేకంగా నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

ఎన్నికల నియమావళి అనుసరించి ఆలస్యం జరుగుతున్నదన్నారు. హైదరాబాద్ నుండి ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లకు వీడియోలు, ఆడియోల ద్వారా కోచింగ్ ప్రక్రియను ఏర్పాటు చేయా లనే ఆలోచన చేస్తున్నామ న్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరున విద్యను అందిం చాలనే ఆలోచన మేరకు ఈ నాలెడ్జ్ సెంటర్లను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు.

కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని వారికి అనుగుణంగా మార్చాలనే ఆలోచన చేస్తున్నాయన్నారు.గత పది సంవత్సరాలపాటు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

రాజ్యాంగ స్ఫూర్తితో,అంబే ద్కర్ ఆశయాలకు అనుగు ణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని పేర్కోన్నారు.రాహుల్ గాంధీ పిలుపుమేరకు రాష్ట్రంలో నవసమాజం, సమాన త్వంతో పరిపాలనలో పూర్తిస్థాయిలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

ముంబై పై CSK ఘన విజయం

ఐపిఎల్‌లో భాగంగా ఆది వారం ముంబై ఇండియ న్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ సీజన్‌లో చెన్నైకి ఇది నాలుగో విజయం కావడం విశేషం. ఇక వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరు మీద కనిపించిన ముంబైకి ఈసారి ఓటమి తప్ప లేదు.తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరు గులు చేసింది.

తర్వాత లక్షఛేదనకు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకం సాధిం చినా ఫలితం లేకుండా పోయింది.

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఓపెనర్లు రోహిత్, ఇషాన్ కిషన్‌లు శుభారంభం అందించారు.

ధాటిగా ఆడిన ఇషాన్ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 23 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యా డు. అయితే తిలక్‌వర్మ (31)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు.

అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఒంటరి పోరాటం చేసిన రోహిత్ 63 బంతుల్లోనే 5 సిక్సర్లు, 11 ఫోర్లతో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇదే క్రమంలో టి20 కెరీర్‌లో 500 సిక్సర్లు కొట్టి నయా చరిత్ర సృష్టించాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైను రుతురాజ్ (69), శివమ్ దూబె 66 నాటౌట్ ఆదుకున్నారు...

'ఫోన్‌ రిపేరుకు ఇచ్చి.. పోలీసులకు చిక్కి'.. ఎన్‌ఐఏ కస్టడీలో బెంగళూరు బ్లాస్ట్‌ నిందితులు!

బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితులను జాతీయ విచారణ సంస్థ (NIA) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే..

అయితే, మార్చి 1న చోటుచేసుకున్న ఆ ఘటన అనంతరం పారిపోయిన నిందితులు.. నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో తప్పించుకు తిరిగారు. ఈ క్రమంలో 35 సిమ్‌లు, ఫేక్‌ ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సులతో దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చివరకు ఓ సెల్‌ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చి పోలీసులకు దొరికిపోవడం గమనార్హం.

కోల్‌కతాలో అరెస్టైన ముసావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌, అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌ తాహాలను ఎన్‌ఐఏ కీలక నిందితులుగా అనుమానిస్తోంది. దాడి తర్వాత ఈ ఇద్దరు నిందితులు అనేక రాష్ట్రాలు తిరుగుతూ చివరకు పశ్చిమ బెంగాల్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో అనేక హోటళ్లలో తలదాచుకున్నారు. సెల్‌ఫోన్లను తరచూ మార్చిన నిందితులు దాదాపు 35 సిమ్‌ కార్డులు వాడారు. కోల్‌కతాలోని ఎస్‌ప్లనేడ్‌ ప్రాంతంలోని కొన్నిరోజులు బసచేశారు. ఈ క్రమంలో ఓ నిందితుడి సెల్‌ఫోన్‌లో సమస్య తలెత్తింది. దాంతో అక్కడి చాంద్‌నీ చౌక్‌ మార్కెట్లోని ఓ దుకాణంలో రిపేర్‌కు ఇచ్చారు. ఫోన్‌లో మాత్రం సిమ్‌కార్డులు లేవు.

మైక్రోఫోన్‌లో ఏదైనా సమస్య ఉందా?అని తెలుసుకుందామనుకున్న దుకాణం యజమాని.. అతడి దగ్గరున్న ఓ సిమ్‌ కార్డును అందులో పెట్టి చూశాడు. అదే నిందితులను పట్టించేందుకు మార్గం చూపింది. ఆ సాయంత్రం నిందితుడు వచ్చి ఫోన్‌ అడిగినప్పటికీ.. ఇంకా రిపేర్‌ కాలేదని, మరుసటి రోజు రావాలని చెప్పడంతో వెనుదిరిగి పోయాడు.

అప్పటికే నిందుతుల ఫోన్‌ను ట్రాక్‌ చేస్తున్న పోలీసులు.. ఆ మొబైల్‌లో వేసిన సిమ్‌కార్డు సిగ్నల్స్‌తో అప్రమత్తమయ్యారు. ఫోన్‌ ఐఎంఈఐ నంబరు ఆధారంగా ఫోన్‌ ఆచూకీ కనుగొన్నారు. మొబైల్‌ షాప్‌నకు చేరుకున్న దర్యాప్తు అధికారులు.. యజమాని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. అందులో ఒకరు పెట్టుకున్న క్యాప్‌ కూడా వారి ఆచూకీ గుర్తించేందుకు దోహదపడినట్లు తెలిసింది. చివరకు కోల్‌కతా శివారులోని దిఘా ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నారు..