Elections 2024: జగన్ పై రాయి దాడి.. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission ) స్పందించింది. భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది..

మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం సభలో జరిగిన వరస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఘటన జరిగిన ప్రాంతాన్ని విజయవాడ పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడికి సంబంధించి ప్రాథమిక నివేదికను విజయవాడ సీపీ క్రాంతి రాణా ఈ రోజు సాయంత్రానికి ఈసీకి అందజేయనున్నారు.

నిన్న సీఎం జగన్ విజయవాడలో చేపట్టిన బస్సు యాత్రలో ఆయనపై రాయి దాడి జరిగింది. దీంతో ముఖ్యమంత్రి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. దీంతో సీఎంకు ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ప్రచారం కొనసాగించారు. జగన్‌ నుదుటికు రెండు కుట్లు పడ్డాయని, గాయం పెద్ద తీవ్రమైనది కాదని, ప్రమాదం ఏమీ లేకపోయినా వాపు మాత్రం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు.

Iసీఎంపై దాడి ఘటనతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భద్రతపై పలువురు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీతో పాటు సీఎం సెక్యూరిటీ, ఎస్కార్ట్‌, పెరిఫెరీ ఇలా వందల మందితో ముఖ్యమంత్రికి భద్రత ఉంటుంది. వీళ్లు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనం. అయినా సీఎంపైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థమవుతోందని ప్రజలు పెదవి విరుస్తున్నారు.

సూర్యఘర్ పథకం ద్వారా పేదలకు ఉచితంగా విద్యుత్..

పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించాం..

70 ఏళ్ల లోపు అందరికి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు..

ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుంది..

ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు..

పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికి సబ్సిడీ ధరకు గ్యాస్ అందిస్తాం..

మహిళలను లక్షాధికారులను చేయడమే మా లక్ష్యం. -ప్రధాని మోడీ

Congress: మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు దీక్ష

కరీంనగర్: పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆదివారం దీక్ష (Initiation) చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పొన్నం దీక్ష చేయనున్నారు..

మరో ఆరు రోజుల్లో పార్లమెంట్‌ (Parliament) ఎన్నికల నోటిఫికేషన్‌ (Election Notification) జారీ అయి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుండగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటున్నది. రెండు రోజులుగా కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ (Congress vs BJP)గా మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ (Bandi Sanjay Kumar) ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.

బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తిచేసుకున్నా విభజన హామీలను విస్మరించిందని, దానికి నిరసనగా ఈరోజు కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో దీక్ష చేపడతానని పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆయనకు దీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధం కావడం రాజకీయ కలకలాన్ని సృష్టిస్తున్నది.

పరస్పర ఆరోపణలు..

విభజన హామీలను విస్మరించిన బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని, ఓట్లు అడిగే నైతిక హక్కు ఆ పార్టీకి లేదని పొన్నం ప్రభాకర్‌ విమర్శిస్తున్నారు. గడిచిన పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకున్నారని ఆయన విమర్శించారు.

రాముడి ఫొటోలు, అక్షింతలు ఇంటింటికి పంపడం మినహా ప్రతి ఇంటికి ఏమి చేశారో చెప్పాలని, బీజేపీకి చేతనైతే రాముడి బొమ్మతో కాకుండా మోదీ బొమ్మతో ఓట్లు అడగాలని పొన్నం సవాల్‌ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌ తమతమ నియోజకవర్గాల్లో ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు..

MLC Kavitha: కస్టడీలో ఉన్న కవితకు కొన్ని వెసులుబాట్లు.. అవేంటంటే..

దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. రోజూ సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది.

న్యాయవాది మోహిత్ రావు, భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీ రామారావు (కేటీఆర్), పీఏ శరత్‌చంద్రలకు అనుమతి లభించింది. వీరితో పాటు ఇంటి భోజనం తీసుకొచ్చేందుకు విద్యానిధి పరాంకుశానికి సైతం అనుమతి ఇచ్చింది. న్యాయవాది, కుటుంబ సభ్యులు కలిసే సమయంలో సీబీఐ అధికారులు అక్కడ లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేసింది.

కస్టడీలో ఉన్న సమయంలో కవితకు ఇంటి నుంచి తెచ్చిన భోజనం తినేందుకు కోర్టు అనుమతిచ్చింది. జపమాల, దుస్తులు, పరుపు, బెడ్‌షీట్లు, టవల్స్, పిల్లోను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. కవిత చదువుకోడానికి ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్, ఎలాన్ మస్క్, ది నట్‌మెగ్స్ కర్స్, రెబెలా ఎగెనెస్ట్ ది రాజ్, రోమన్ స్టోరీస్ పుస్తకాలు అనుమతిచ్చింది.

కాగా.. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది.

ఏప్రిల్ 15వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని దిల్లీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచే మూడు రోజుల పాటు కవితను సీబీఐ విచారించనుంది.

నిజంనిప్పులాంటిది
మా బాపు నన్ను మోసం చెయ్యడు !

- వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య

- ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు ఎంపీ టికెట్ ప్రకటించిన సీఎం కేసిఆర్

జనగామ జిల్లా ; స్టేషన్ ఘనఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోవటంతో.. తీవ్ర అసంతృప్తి అంతకుమించిన ఆవేదనతో ఉన్న రాజయ్య... ఆరు నూరైనా, నూరు నుటయాభై అయినా తాను మాత్రం ప్రజాక్షేత్రంలోనే ఉంటానన్నారు.

అయితే.. టికెట్ రాలేదన్న బాధతో స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలను చూసి భోరున విలపించిన రాజయ్యకు కేసీఆర్ ఎంపి టికెట్ ఇవ్వడంతో పార్టి శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేశారు.

బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏరుకొండ హరి

నల్లగొండ:

బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ పట్టణానికి చెందిన ఏరుకొండ హరి నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏరుకొండ హరి బిజెపిలో వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ ఓ బీసీల హక్కుల సాధన కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రాజిలేని పోరాటం చేస్తామని తెలిపారు.

ఓబీసీలను సంఘటితం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి , ఓబీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Streetbuzz News



18 న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే.

ఏప్రిల్ 19వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుండగ, జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే… ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.

ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ఏప్రిల్ 26న స్కూటినీ జరుగుతుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది అని తెలిపారు.

మే 13న రాష్ట్రంలో పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని నెల్లూరు పర్యటనలో ముకేశ్ కుమార్ మీనా వ్యాఖ్యానించారు.

నేటి నుండి భద్రాద్రిలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు

ఇవాళ్టి నుండి భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి వసంతపక్ష తిరు కళ్యాణ నవాహ్నిక బ్రహ్మో త్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.

నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.ఉదయం అంతరాలయం లోని ధ్రువ మూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకొని ధ్వజారో హణం చేయనున్నారు.

వేడుకల ప్రారంభానికి ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణ పుణ్యా హవాచన, రుత్విగ్వరణం, రక్షాబంధనం, స్నపన తిరు మంజనం, వాస్తు హోమం, ఉగాది పర్వదినం సంద ర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఉగాది ప్రసాద వితరణ, సాయంత్రం దర్బార్‌ సేవ తర్వాత నూతన పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు.

అలాగే కల్పవృక్ష వాహనంపై తాత గుడి సెంటర్‌ వరకు స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు.శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు.

ఈ నెల 16వ తేదీన సాయంత్రం నేత్రపర్వంగా ఎదుర్కోలు ఉత్సవం, 17వ తేదీన శ్రీరామనవమి కళ్యా ణ మహోత్సవం, 18వ తేదీన పట్టాభిషేక మహోత్స వం జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా మిథిలా ప్రాంగణంలో జరిగే వేడుకల కోసం కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు తున్నామని ఈవో వెల్లడించారు.

ప్రతి భక్తునికి స్వామివారి తలంబ్రాలు అందేలా ఈసారి 60 తలంబ్రాల కౌంటర్లు, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు కొను గోలు చేసేందుకు 19 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల సౌకర్యం కోసం 2.50 లక్షల లడ్డూలు, 5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశామని ఈవో రమాదేవి పేర్కొన్నారు...

TG Politics: నాపై కుట్ర జరుగుతోంది.. పడేయాలని చూస్తున్నారు : సీఎం రేవంత్

కోడంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు..

సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సోమవారం సీఎం రేవంత్ (Revanth) వచ్చారు. అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొడంగల్ నుంచి 60 ఏళ్ల క్రితం అచ్యుతా రెడ్డి మంత్రి అయ్యారు. తర్వాత నియోజకవర్గం నుంచి మంత్రి పదవి చేపట్టలేదు. కొడంగల్ నుంచి గెలిచిన తనకు సోనియా గాంధీ అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. 100 రోజుల్లో కొడంగల్‌కు మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్, జూనియర్, డిగ్రీ కాలేజీ తీసుకొచ్చానని సీఎం రేవంత్ వివరించారు. అలాంటి తనపై కుట్ర జరుగుతోందని హాట్ కామెంట్స్ చేశారు.

కుట్ర

'వందల కోట్లతో తండాలకు రోడ్లు తెచ్చా. రూ. 4వేల కోట్లతో నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చాం. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించి, రేవంత్ రెడ్డిని కిందపడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఎందుకు కింద పడేయాలి..? కరువు ప్రాంతానికి నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తి పోతల తెచ్చినందుకా..? కాలేజీలు తెచ్చినందుకా? సిమెంటు ఫ్యాక్టరీ తెచ్చి ఉపాధి కల్పిస్తున్నందుకా? బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న అరుణ పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా తేలేదు. కొడంగల్‌ను అభివృద్ధి చేయనీయొద్దని అరుణ కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి అని' సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఎందుకు ఓడించాలి

'లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి..? ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకా? లేదంటే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా? పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొడంగల్‌లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎందుకు రేవంత్ రెడ్డిని పడగొట్టాలి? కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలి? ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారు? మోదీకి మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా? అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు..