రాజ్యాంగం కల్పించిన హక్కులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలి : ఏ ప్రదీప్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి


 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం లోని హక్కులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని రామన్నపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. ప్రదీప్ కోరారు. శనివారం మండల పరిధిలోని జనంపల్లి లోని తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల/కళాశాల లో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మొదట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు బాలికలకు చదవుకునే అవకాశం లేదని , స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగం లో కల్పించిన ప్రాథమిక హక్కుల ప్రకారం ప్రతి భారతీయుడు చదువుకునే అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. ముఖ్యంగా బాలికలకు ఉచిత విద్య అందించాలని నిర్ణయించారని దానిని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాలికలు చదువు తప్ప మరే ఆలోచన లేకుండా భవిష్యత్తును నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. నేటి విద్యార్థులు, యువత ఆన్ లైన్ లో అవసరం లేని వాటి జోలికి వెళ్ళి, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. 

విశిష్ట అతిథిగా విచ్చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. చందన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే పుస్తకాలతో పాటు దేశ నాయకులు జీవిత చరిత్రను, కరెంట్ ఎఫైర్స్, జనరల్ నాలెడ్జ్ లాంటి పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పినట్లు కలలు కనండి, ఆ కాలంలోనే నిజం చేసుకోండని ఆమె విద్యార్థులను కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం డి మజీద్, వైస్ ప్రెసిడెంట్ లింగయ్య, ప్యానల్ &రిటైనర్ న్యాయవాదులు మామిడి వెంకట్ రెడ్డి ,దంతూరి సత్తయ్య, డేవిడ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు స్వామి, సీనియర్ న్యాయవాది జగతయ్య, బార్ అసోసియేషన్ కల్చరల్ కార్యదర్శి శ్రావణ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్, పాఠశాల/కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ స్మిత మేడం, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది సాయిదీఫ్ , కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈనెల 19న నామినేషన్ కి వేలాదిగా తరలిరావాలి: ఎండి జహంగీర్ సిపిఎం భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి


ఈనెల 19న జరుగు నామినేషన్ కు వేలాదిగా తరలిరావాలని సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి పట్టణ కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా అనేక సమస్యలు తిష్టవేశాయని గత అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని మరిచిపోయి కుర్చీని కాపాడుకునే పనిలో పడ్డారని నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు మరిచి పరిపాలన సాగించాలని వారు అన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సూచికగా కావాలని నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని వారు అన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో నేటికీ పరిష్కారం గాని అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ప్రజా ఉద్యమాలు జరిగిన అధికార ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదని జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అరకోర వసతులతో సరైన వైద్యం అందించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు సమస్యల పరిష్కారం కోసం సిపిఎంకు ఓటేసి గెలిపించాలని, 19న జరిగే నామినేషన్ కు ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, శాఖ కార్యదర్శి దండు గిరి, సీనియర్ నాయకులు దండు యాదగిరి, నాయకులు దండు పద్మారావు, ఆడెపు గిరి, మాయ రాణి, దండు స్వరూప, దండు ధనలక్ష్మి, నాగరాణి, స్వాతి, బట్టు లక్ష్మి, బట్టుపల్లి నవీన్ కుమార్, ఎనబోయిన లింగం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, విద్యార్థులకు అస్వస్థత


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 14 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారానే విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారని ,అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శుక్రవారం జరగగా అధికారులు జప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఆత్మకూరు (M)మండల కేంద్రంలో దొంగల హల్ చల్


యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. ఆత్మకూరు మండల కేంద్రంలో చైన్ స్నాచర్స్ శుక్రవారం రాత్రి ఓల్డ్ సిటీ లో డాబా పై నిద్రిస్తుండగా, మేకపోతుల స్వామి (హెడ్ కానిస్టేబుల్) భార్య నర్మద పై ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడు మరియు మూడు తులాల నల్లపూసల దండ ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబంలో సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలంలో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఏసీపీ మధుసూదన్ రెడ్డి. ఇటీవల భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో ఇంటి ఆవరణలో బయట నిద్రిస్తున్న మహిళల మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గొలుసు దొంగలు.

..

సమాచార హక్కు చట్టం - 2005 సదస్సును విజయవంతం చేయాలి: కొడారి వెంకటేష్ సమన్వయ కమిటీ సభ్యులు


 సమాచార హక్కు చట్టంపై భువనగిరి లోని రిటైర్ ఎంప్లాయిస్ భవన్ లో శనివారం ఉదయం 11గంటలకు జరిగే అవగాహన సదస్సును విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార హక్కు చట్టం సమన్వయ కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ కోరారు. శుక్రవారం ఆయన భువనగిరి లో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాచార హక్కుచట్టం ప్రాధాన్యత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాలనలో పారదర్శకత , జవాబుదారీ తనం ఆర్టీఐ తోనే సాధ్యమన్నారు. అవినీతి రహిత సమాజం కోసం సమాచార హక్కు చట్టం ను ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ అవగాహన సదస్సులో సభాద్యక్షులుగా సమాచార హక్కు వికాసం సమితి రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ ఖుర్షీద్ పాషా, ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డా. వర్రె వెంకటేశ్వర్లు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎం. ఏ.కరీం (హైకోర్టు అడ్వకేట్) , విశిష్ట అతిథులుగా ఆజాద్ హింద్ ఫౌజ్ జాతీయ అధ్యక్షులు ఎం. ఎ. ముజీబ్, ఆత్మీయ అతిథులుగా భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బబ్బూరి హరనాథ్ గౌడ్, సమాచార వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా.యర్రమాద కృష్ణారెడ్డి, మాజీ ప్రజాప్రతి నిధుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకవరం మోహనరావు, దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు భట్టు రామచంద్రయ్య, పీపుల్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సురుపంగ శివలింగం, హమీద్ పాషా, పోతుగంటి సంపత్ కుమార్ , చింతకింది వెంకటేశ్వర్లు, బాబు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఆర్టీఐ ఆక్టివిటీ లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

ప్రజల కొరకు నిలబడుతూ హక్కుల కోసం పోరాడే జహంగీర్ ను గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ


   నిరంతరం ప్రజల తరఫున నిలబడుతూ హక్కుల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి యండి.జహింగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం నిర్వహించిన అనంతరం జహంగీర్ ని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ మహోత్సవ తెలంగాణ రైతాంగ పోరాట వారసత్వాన్ని ఉనికి పుచ్చుకున్న సిపిఐ(ఎం) దేశ రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నదని అన్నారు. పేదలు కష్టజీవుల తరపున నీతితో నిజాయితీతో పోరాడుతూ ప్రభుత్వ రంగాన్ని పాడు కాపాడుకోవడానికి సిపిఎం నిరంతరం ఉద్యమిస్తుందని నర్సింహ తెలియజేశారు. బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ లాంటి పార్టీలన్నీ ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా బడా కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్నాయని విమర్శించారు. మరోవైపు అంబానీ అదానీలకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూనే మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ బిజెపి ప్రజల మధ్యన చిచ్చు పెడుతుందని ఓట్లు రాబట్టుకునే పన్నాగం బీజేపీ పన్నుతుందని విమర్శించారు. డీజిల్ పెట్రోల్ విచ్చలవిడిగా పెంచుతూ మోయరాని భారాలతో పేదల నడుముడుతూ మతాన్ని దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్లు గుంజుకుంటుందని అన్నారు. ప్రజా వ్యతిరేక బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ లను ఓడించి ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి జాహంగీర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈనెల 19న భువనగిరి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ నామినేషన్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ పిలుపునిచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండా అశోక్, శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, సభ్యులు కాసారం మల్లయ్య, కొండా హైమావతి, కూకుట్ల చొక్కాకుమారి పాల్గొన్నారు.

           

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా సాంస్కృతిక కార్యదర్శిగా మల్లం వెంకటేశం నియామకం


తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా సాంస్కృతిక కార్యదర్శిగా మల్లం వెంకటేశంను నియమిస్తూ. ఉద్యమకారుల ఫోరం.రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్. చీమ శ్రీనివాస్ ఆదేశం మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్.నియామక పత్రం శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మల్లం వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బలోపేతనికి కృషి చేస్తూ హక్కుల కోసం పోరాడుతామని అన్నారు . తమ నియామకానికి సహకరించిన ఉద్యమ నేతలకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరంజిల్లా ఉపాధ్యక్షులు మంటి రమేష్, నియోజకవర్గ అధ్యక్షుడు జోగు అంజయ్య, వలిగొండ మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్, . పబ్బు స్వామి, బొడిగె సుదర్శన్, శ్రీనివాసచారి, మంటి రమేష్ ,కదిరేని స్వామి. తదితరులు పాల్గొన్నారు.

రాయగిరిలో ఘనంగా నల్ల పోచమ్మ తల్లి బోనాల పండుగ


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో గ్రామ దేవతల జాతర కొనసాగుతుంది. ఇందులో భాగంగా గురువారం మహిళలు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో నల్ల పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. గ్రామ పెద్దలు, భక్తులు గ్రామ దేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నల్ల పోచమ్మ తల్లి పండుగలో త్రిబుల్ ఆర్ ఉద్యమ నాయకులు అవుశెట్టి రమేష్, ముద్దం శ్రీశైలం ,యువకులు బొజ్జా భాను, బొజ్జ శివ ,ముద్ద ఉపేందర్, సారా జీవన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులుగా దంతూరి అరుణ్ కుమార్ నియామకం


భారతీయ జనతా పార్టీ యువ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులుగా వలిగొండ మండలం కు చెందిన దంతూరి అరుణ్ కుమార్ ను నియమిస్తూ గురువారం భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో జరుగుతున్న యువత ,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచి విస్తరించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ నియామకానికి సహకరించిన వలిగొండ మండల జిల్లా రాష్ట్ర నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి : పాలడుగు భాస్కర్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

Lll

      భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రశ్నించే గొంతు పోరాడే నాయకుడు సిపిఎం అభ్యర్థి యండి.జహంగీర్ ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎండి. జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో దేశాన్ని అధోగతి పాలు చేసిందని దేశంలోని ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్ శక్తులకు కారు చౌకగా అమ్మతు దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. లౌకిక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కులము మతము మతోన్మాదము మనువాద సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల మధ్యన ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. బిజెపి పాలనలో సామాన్య మానవులు నిత్యవసర సరుకులను కొని తినే పరిస్థితుల్లో లేరని అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు పెంచడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు దళితుల పైన మహిళల పైన గిరిజనుల పైన దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని రాజ్యాంగంలో ఉన్న పౌరుల హక్కులను మొత్తం దెబ్బతీస్తున్న పరిస్థితి ఉన్నదని మరో మారు ఈ దేశంలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రజల బతుకుకు రాజ్యాంగానికి రక్షణ లేదని ఈ ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమయిందని బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలల్లో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని అందుకే ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ టీఆర్ఎస్ ను ఓడించి సిపిఎం గెలిపించాలని ప్రజలను భాస్కరు కోరినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పగిళ్ల ఆశయ్య , కొండమడుగు నర్సింహ్మ, సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ , సిపిఎం మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, గ్రామ శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, సభ్యులు బొల్లెపల్లి స్వామి, బొల్లెపల్లి కిషన్, గంగనబోయిన బాల్ నర్సింహ్మ , గంగదార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.