బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్ జ్యోతిరావు పూలే జయంతి వేడుక ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్ జ్యోతిరావు పూలే జయంతి వేడుక ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి
గొప్ప మార్గదర్శి, సంఘసంస్కర్త, సామాజికవేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ,త్యాగశీలి అయిన
మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతిని
నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో బీసీ సంక్షేమ ఉద్యోగ యువజన మహిళ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించడం అయినది
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి,
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ,
ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ లు మాట్లాడుతూ
1827 ఏప్రిల్ 11వ తేదీ న మహారాష్ట్రలోని సతారా గ్రామంలో జన్మించిన జ్యోతిబాపూలే ఆనాటి సమాజంలో ఉన్న అసమానతులకు, వివక్షతలకు, విద్వేషాలకు, అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడని
సమాజం నుండి వీటిని రూపుమాపాలంటే తొలగించాలంటే ప్రజలను విజ్ఞానవంతులు చేయడమే పరిష్కారమని భావించి
స్త్రీల కోసం అనేక పాఠశాల నెలకొల్పి వారిని విజ్ఞానవంతులు చేసిన గొప్ప విజ్ఞానవంతుడని
ముందుగా తన భార్య అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలే కు చదువు నేర్పించి
తద్వారా సమాజంలోని మహిళలకు చదువునందించిన గొప్ప మార్గదర్శి అని
అదే విధంగా వివక్షతకు, విద్వేషాలకు వ్యతిరేకంగా అనేకమైన గ్రంథాలను రాసి ప్రచురించిన గొప్ప తత్వవేత్త అని
వారు కొనియాడుతూ మనందరికీ వారు ఆదర్శనీయుడని పేర్కొన్నారు .
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్ ,బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, సమాచార సమితి అంజయ్య ,
బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ కార్యదర్శులు అక్కినపల్లి లక్ష్మయ్య ,నల్లబోతు శ్రీనివాస్ యాదవ్, నల్పరాజు వెంకటేశ్వర్లు మరియు బెల్లి నాగరాజు యాదవ్ , చల్ల కోటేష్ యాదవ్, నోముల క్రాంతి కుమార్ యాదవ్, కంభంపాటి కనకయ్య,k. కృష్ణయ్య దూదిగామ స్వామి, బక్కతట్ల వెంకన్న యాదవ్, ఖమ్మంపాటి శంకర్ దుర్గ ,వళ్ళ కీర్తి శ్రీనివాస్, సదానంద్, రుద్ర వెంకటాచారి, కూరెళ్ళ రవీంద్ర చారి ,కర్నాటి ధనుంజయ, పులిపాటి వెంకటయ్య , పున్న వీరేశం తదితరులు పాల్గొన్నారు.
Apr 11 2024, 21:12