సుంకిశాల గ్రామం నుండి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆరెస్ పార్టీని వీడి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన వలిగొండ మండలం సుంకిశాల గ్రామ నాయకులు.

వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ మొగిలిపాక నరసింహ,ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి,మాజీ సర్పంచ్ పోలెపల్లి స్వామి,ఎండోమెంట్ డైరెక్టర్ బాల కృష్ణ,మాజీ పాల సంఘం చైర్మెన్ రాచమల్ల శంకరయ్య,పాల సంఘం చైర్మెన్ పరమేష్,ఈతాప రాములు,పోలేపల్లి వీరాస్వామి,బొక్క బుచ్చిరెడ్డి మరియు 200మంది బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు.

ఎంపీపీ పూస బాల నరసింహ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన బందెల క్రిస్టఫర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం అభివృద్ధి ప్రదాత, ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో ముందడుగు వేసి ఇంద్రపాల నగరం గ్రామ సర్పంచిగా గత ఐదు సంవత్సరాలుగా పలు అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి, గ్రామాన్ని ప్రగతి పథంలో లో నడిపించి, రామన్నపేట ఎంపీపీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రజా నాయకులు పూస బాల నరసింహ కి ఇంద్ర పాలనగరం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బందెల క్రిస్టఫర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఇంద్రపాల నగరం గ్రామానికి వీరి చేసిన సేవలు సేవలు మరువలేమని అన్నారు

ఆడపిల్లలకు రక్షణ కరువు ...కీచక ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించాలి :ఏఐఎస్ఎఫ్


నేటి సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడమే పాపం అయిపోయిందని అమ్మాయిలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయిందని, రోజురోజుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అమ్మాయిలపై అఘాయిత్యాలు, కామాంధుల ఆగడాలు పెరుగుతున్నాయని మోత్కూర్ మండల కేంద్రంలో ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ అన్నారు 

దానికి నిదర్శనమే గుండాల మండల కేంద్రంలో జరిగిన సంఘటన 

 విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వక్ర బుద్ధితో గత కొంతకాలంగా చాక్లెట్లు ఆశ చూపి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని కలిసి వేసిందని అన్నారు కామాంధుడైన అండెం మాధవరెడ్డి పైన పోక్సో కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించాలని డీఈఓ,ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఎ ఐ ఎస్ ఎఫ్)గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం 

నిత్యం విద్య సంస్థల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఇకమీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం 

         

ఆరోగ్యాన్ని కాపాడుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి: ఏ ప్రదీప్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి

 ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకొని, దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని రామన్నపేట మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి ఏ. ప్రదీప్ అన్నారు. బుధవారం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యాధి వచ్చాక చికిత్స చేయించుకోవడం కంటే వ్యాధి రాకుండా తీసుకునే జాగ్రత్తలే ముఖ్యమని ఆయన అన్నారు. కుటుంబ యజమాని అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి పోతుందని, తద్వారా దేశ పురోభివృద్ధి కూడా జరగదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ దురలవాట్లను విడనాడి కుటుంబ అభివృద్ధికి, దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో రామన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న, రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం డి మజీద్, సీనియర్ న్యాయవాదులు నరేందర్ రావు, జినుకుల ప్రభాకర్, ప్యానల్ అడ్వకేట్లు మామిడి వెంకట్ రెడ్డి, డేవిడ్, స్వామి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జగతయ్య, మొగిలయ్య, వైద్యులు డాక్టర్ శ్వేత ప్రియాంక, డాక్టర్ మాదవా చారి , డాక్టర్ అంఖిత, డాక్టర్ లింగా యాదవ్, డాక్టర్ ముఖిత్, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది సాయిదీప్ , వైద్య సేవలకు వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.

అమ్మాయిలకేది రక్షణ ...అధికారులు ఏం చేస్తున్నారు: కొడారి వెంకటేష్ ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు

 నేటి సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడమే పాపమైపోయిందని, అమ్మాయిలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, కామాందుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సైతం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ఏడాది కాలంగా అభం శుభం తెలియని అమాయక పిల్లలపై ప్రధానోపాధ్యాయుడే కాటేస్తుంటే మండల విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పిల్లల హక్కుల పరిరక్షణ కోసం, నెల నెలా లక్షల రూపాయలు వేతనాలు తీసుకుంటూ పిల్లల హక్కుల్ని భంగం చేస్తున్నారని ఆయన అన్నారు. గుండాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాధవరెడ్డి చేసిన అఘాయిత్యానికి మొత్తం ఉపాద్యాయ లోకం తలదించుకుని, సభ్య సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భువనగిరి లో పరీక్ష రాస్తున్న సమయంలో ఓ లెక్చరర్ అసభ్య ప్రవర్తన, చౌటుప్పల్ లో తల్లిదండ్రుల వద్ద ఆదమరచి నిద్రపోతున్న చిట్టితల్లిని ఎత్తుకెళ్లి ఓ కామాంధుడు తన కోరిక తీర్చుకోవడం, గుండాల లో విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో తల ఎత్తుకొని నిలబడేలా చేయాల్సిన గురువే, ఆ చిన్నారులతో తన కోరికలు తీర్చుకునే సంఘటనలు చూస్తుంటే,  పిల్లలను చదువులు మాన్పించి, బాల్యవివాహాలు చేసి బాధ్యత తీర్చుకోవడమే మంచిదని తల్లిదండ్రులకు భావన కలుగుతుందని ఆయన అన్నారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడినా, వారితో అసభ్యంగా ప్రవర్తించినా, నిందితులకు ఉరిశిక్షే సరియైన శిక్ష అని ఆయన అన్నారు .భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు , చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

టేకుల సోమవారం లో సెక్యూరిటీ టీం మెంబెర్స్ తో పూట్ పెట్రోలింగ్ నిర్వహించి నేరాల పట్ల అవగాహన కల్పించిన వలిగొండ ఎస్సై మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలో సెక్యూరిటీ టీం మెంబెర్స్ తో కలిసి వలిగొండ ఎస్సై డి మహేందర్ మంగళవారం రాత్రి ఫూట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు జరుగుతున్న దొంగతనాలు , చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. అన్ని గ్రామాల్లో టీం సభ్యులు తమ తమ గ్రామాలలో గస్తీ నిర్వహించి ,దొంగతనాలు జరగకుండా చూడాలని అన్నారు .అనుమానం ఉన్న వ్యక్తులు తారాసపడితే వెంటనే సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు చేగూరి మోహన్, చేగూరి బాలకృష్ణ, టి గణేష్ రెడ్డి, చేగూరి మల్లేష్ ఆధ్వర్యంలో యువకులు,తదితరులు పాల్గొన్నారు.

వెలువర్తి గ్రామంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ప్రజలకు వెలువర్తి గ్రామంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పూజారి ఆదిత్య శర్మ ఉగాది పర్వదిన ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు పంచాంగాన్ని వినిపించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నానమాల ఉప్పలయ్య, దేవాలయ కమిటీ సభ్యులు ,భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వలిగొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుండి పడిన వ్యక్తికి తీవ్రగాయాలు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం రైలు నుండి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల , ప్రకారం వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుంటూరుకు చెందిన పాటిబండ్ల నాగార్జున వయస్సు 23 ,ఇతను సికింద్రాబాద్ నుండి గుంటూరుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు నుండి పడి, తీవ్ర గాయాలు అయ్యాయి .అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది గమనించి 108 వారికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని, చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు.

యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంలోకి సెల్ ఫోన్ లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ


యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది తమ సెల్ ఫోన్ లను నిషేధిస్తూ సోమవారం ఏప్రిల్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. విలేఖరుల తో పాటుగా ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే మినిస్ట్రీస్ సిబ్బంది, మతపర సిబ్బంది ,నాలుగో తరగతి సిబ్బంది ,ఎస్పీఎఫ్, హోం గార్డ్స్ ,ఔట్సోర్సింగ్ సిబ్బంది వారి సెల్ ఫోన్లు ఆలయంలోకి తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ కార్యనిర్వణాధికారి కార్యాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.

రామన్నపేట ఎంపీపీ పూస బాలమణి - బాల నరసింహ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రపాల నగరం కాంగ్రెస్ పార్టీ నాయకులు


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎంపీపీ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవంగా రావన్నపేట ఎంపీపీ గా ఇంద్రపాల నగరం గ్రామానికి చెందిన పూస బాలమని- బాల నరసింహ ఎన్నికైనారు. రామన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన బాలమణి కి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , మండల నాయకులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంద్రపాల నగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందెల క్రిస్టఫర్, భూతం గణేష్ ,భూతం బాలస్వామి ఎంపీపీ బాలమణి- బాల నరసింహ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.