ఆడపిల్లలకు రక్షణ కరువు ...కీచక ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించాలి :ఏఐఎస్ఎఫ్
నేటి సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడమే పాపం అయిపోయిందని అమ్మాయిలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయిందని, రోజురోజుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అమ్మాయిలపై అఘాయిత్యాలు, కామాంధుల ఆగడాలు పెరుగుతున్నాయని మోత్కూర్ మండల కేంద్రంలో ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ అన్నారు
దానికి నిదర్శనమే గుండాల మండల కేంద్రంలో జరిగిన సంఘటన
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వక్ర బుద్ధితో గత కొంతకాలంగా చాక్లెట్లు ఆశ చూపి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని కలిసి వేసిందని అన్నారు కామాంధుడైన అండెం మాధవరెడ్డి పైన పోక్సో కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించాలని డీఈఓ,ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఎ ఐ ఎస్ ఎఫ్)గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
నిత్యం విద్య సంస్థల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఇకమీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం




యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలో సెక్యూరిటీ టీం మెంబెర్స్ తో కలిసి వలిగొండ ఎస్సై డి మహేందర్ మంగళవారం రాత్రి ఫూట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు జరుగుతున్న దొంగతనాలు , చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. అన్ని గ్రామాల్లో టీం సభ్యులు తమ తమ గ్రామాలలో గస్తీ నిర్వహించి ,దొంగతనాలు జరగకుండా చూడాలని అన్నారు .అనుమానం ఉన్న వ్యక్తులు తారాసపడితే వెంటనే సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు చేగూరి మోహన్, చేగూరి బాలకృష్ణ, టి గణేష్ రెడ్డి, చేగూరి మల్లేష్ ఆధ్వర్యంలో యువకులు,తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ప్రజలకు వెలువర్తి గ్రామంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పూజారి ఆదిత్య శర్మ ఉగాది పర్వదిన ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు పంచాంగాన్ని వినిపించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నానమాల ఉప్పలయ్య, దేవాలయ కమిటీ సభ్యులు ,భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం రైలు నుండి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల , ప్రకారం వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుంటూరుకు చెందిన పాటిబండ్ల నాగార్జున వయస్సు 23 ,ఇతను సికింద్రాబాద్ నుండి గుంటూరుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు నుండి పడి, తీవ్ర గాయాలు అయ్యాయి .అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది గమనించి 108 వారికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని, చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది తమ సెల్ ఫోన్ లను నిషేధిస్తూ సోమవారం ఏప్రిల్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. విలేఖరుల తో పాటుగా ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే మినిస్ట్రీస్ సిబ్బంది, మతపర సిబ్బంది ,నాలుగో తరగతి సిబ్బంది ,ఎస్పీఎఫ్, హోం గార్డ్స్ ,ఔట్సోర్సింగ్ సిబ్బంది వారి సెల్ ఫోన్లు ఆలయంలోకి తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ కార్యనిర్వణాధికారి కార్యాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎంపీపీ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవంగా రావన్నపేట ఎంపీపీ గా ఇంద్రపాల నగరం గ్రామానికి చెందిన పూస బాలమని- బాల నరసింహ ఎన్నికైనారు. రామన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన బాలమణి కి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , మండల నాయకులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంద్రపాల నగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందెల క్రిస్టఫర్, భూతం గణేష్ ,భూతం బాలస్వామి ఎంపీపీ బాలమణి- బాల నరసింహ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
యాదాద్రి జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి తాగు నీరు అందించాలని యదాద్రి భువనగిరి జిల్లా తాగు నీటి సరఫరా ప్రత్యేక అధికారిణి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదేశించారు.ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో గ్రామాలు, మున్సిపాలిటీలలో తాగు నీటి సరఫరాపై మిషన్ భగీరథ, మున్సిపల్, ఇంజనీరింగ్, ఎంపీడీవో అధికారులతో మండలాలు, మున్సిపాలిటీల వారీగా సమీక్షించారు. జిల్లాలో తాగునీటికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని అన్నారు . తప్పనిసరిగా ప్రతినెలా 1, 11 ,21 తేదీలలో వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Apr 10 2024, 18:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
19.7k