తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి : జిల్లా తాగునీటి సరఫరా అధికారిని అనిత రామచంద్రన్


యాదాద్రి జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి తాగు నీరు అందించాలని యదాద్రి భువనగిరి జిల్లా తాగు నీటి సరఫరా ప్రత్యేక అధికారిణి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదేశించారు.ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో గ్రామాలు, మున్సిపాలిటీలలో తాగు నీటి సరఫరాపై మిషన్ భగీరథ, మున్సిపల్, ఇంజనీరింగ్, ఎంపీడీవో అధికారులతో మండలాలు, మున్సిపాలిటీల వారీగా సమీక్షించారు. జిల్లాలో తాగునీటికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని అన్నారు . తప్పనిసరిగా ప్రతినెలా 1, 11 ,21 తేదీలలో వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సేవకుడు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి


ప్రజల మనిషి నిరంతరం ప్రజా సేవకుడు ప్రజా ఉద్యమ నాయకుడు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించాలని ఈరోజు సోమవారం భువనగిరి మండలం నందనం సిపిఎం గ్రామ శాఖ సమావేశానికి భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కి సిపిఎం అభ్యర్థి ప్రజా ఉద్యమ నాయకుడైన ఎండి జహంగీర్ గారి గెలిపించాలని అన్నారు.ఆయన గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు రాజకీయా జీవితంలో అనేక సవాలను ఎదుర్కొని నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాటాలు దినచర్య గా కొనసాగుతున్న ఎండి.జహంగీర్ ని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలంతా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి సిపిఎం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేయాలని నరసింహ అన్నారు .ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లవ్డియ రాజు ,సింగిరెడ్డి భూపాల్ రెడ్డి ,కొల్లూరు సిద్దిరాజు, లచ్చిరెడ్డి , కొల్లూరు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

దేశంలో మోడీ భువనగిరిలో బూర గెలుపు ఖాయం: జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నం శివకుమార్


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బోళ్ళ సుదర్శన్ గారి అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పదాధికారులు మరియు ముఖ్య నాయకుల సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నం శివకుమార్ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందని అన్నారు వారిని ఇంటి ఇంటికి వెళ్లి వారిని కలిసి ఓటును అభ్యర్ధించాలని అన్నారు ,ప్రధాని నరేంద్ర మోడీ గెలుపు బూత్ ఓటర్ల పైన వుంటుంది అదేవిధంగా బూర నర్సయ్య గౌడ్ గెలుపు కూడా బూత్ ఓటర్ల పైన వుంటుంది కాబట్టి బూత్ అద్యక్షులు బూత్ కార్యకర్తలు బూతుల లో పని చేయాలని అన్నారు, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జీ కిషన్ రెడ్డి గారు భువనగిరి జిల్లా కేంద్రంలో త్వరలో నిర్వహించ బోయే బారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు,రానున్న భువనగిరి లోక్సభ ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు, స్వాతంత్రం వచ్చినప్పటినుండి 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో పేదలు పేదలు గానే ఉన్నారని, గడిచిన పది సంవత్సరాల బిజెపి పాలనలో పేదల కొరకు,యువత కొరకు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం స్వయం ఉపాధి పొందే విధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలతో అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్న హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందని అన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బిజెపి ప్రభుత్వమే కాబట్టి బోనగిరిలో బిజెపి అభ్యర్థిని గెలిపించుకొని పార్లమెంట్ అభివృద్ధికి భువనగిరి ప్రజలు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు అన్నారు *ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి మందుల లక్ష్మి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కందుల తానీషా గౌడ్ ,మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ ,లోడే లింగస్వామి గౌడ్, మాజీ మండల అధ్యక్షులు నాగేల్లి సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకులు కణతాల అశోక్ రెడ్డి ,శీలోజు శ్రీరాములు, బందారపు రాములు,మంద నరసింహ,బొడిగే ఆనంద్,పాక పుల్లయ్య, మండల ఉపాధ్యక్షులు రావుల పద్మా రెడ్డి, దయ్యాల వెంకటేశం గంగదారి దయాకర్, మండల కార్యదర్శులు మైసోల్ల మచ్చ గిరి, బైరు మల్లేశం మందుల నాగరాజు , బీజేవైఎం జిల్లా కార్యదర్శి రేగురి అమరేందర్,బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు వెలిమినేటి వెంకటేశం ,మహిళా మోర్చా అధ్యక్షురాలు చిన్నం అంజమ్మ ,కిసాన్ మోర్చా అధ్యక్షులు కొత్త రామచంద్రం, దళిత మోర్చా అధ్యక్షులు పల్లెర్ల నరసింహ, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొలుగుల భాగ్యమ్మ సోషల్ మీడియా కన్వీనర్ రాస శ్రీశైలం ,బుంగమట్ల మహేష్, పెరిక వెంకటేష్, రాజేశ్వర చారి, జినుకల మల్లయ్య,దాసు తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేట ఎంపీపీ గా పూస బాలమణి ఎన్నిక


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్ర పాలనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ పూస బాలమణి ఎన్నికయ్యారు. కాంగ్రెస్, సిపిఎం ఎంపిటిసి లు కలిసి ఆమెను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ బాలమణి కి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలమణి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యేకు మరియు ఎంపిటిసి లకు కృతజ్ఞతలు తెలిపారు.l

బీబీనగర్ లో బి ఆర్ ఎస్ పార్టీకి షాక్... ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో 500 మంది చేరిక


యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీబీనగర్ మండల కేంద్రంలో ఆదివారం దాదాపు 500 మంది బీఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.

ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్


 పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని భువనగిరి పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్లో బి ఆర్ ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థి మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ లో గంగ జమున తహేజీబ్ కొనసాగుతుందని తెలంగాణ హిందూ ముస్లిం భాయ్ భాయ్ లాగా ఉంటారని ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా ముస్లిం మైనారిటీ లకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం

ఆనవయితీగా వస్తుందని అన్నారు.అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ లకు ఓటు బ్యాంకు గా పరిగననిస్తుందని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం లో మైనారిటీ లను అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగిందని అన్నారు.ముస్లిం మైనారిటీ లకు రంజాన్ తోఫా మరియు ఇతర సౌకర్యాలు కల్పించలేని అసమర్ధత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అని అన్నారు.మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గం ముస్లిం మైనారిటీ లకు అన్ని విధాలుగా ఆదుకున్నారని అన్నారు. అలాగే ప్రతి ముస్లిం కుటుంబం సుఖ సంతోషాలతో ఈదుల్ ఫిత్ర్ రంజాన్ పండుగ ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, భువనగిరి జెడ్పిటిసి సుబ్బూరు భీరు మలయ్య, 

 కోఆప్షన్ సభ్యులు అఫ్జల్ నిక్కత్ ఇక్బాల్ చౌదరీ.ఎండీ ముజీబ్ ఇస్మాయిల్,ఎండీ ముజీబ్,ఎండీ రహీం ఎండీ అంజద్ గఫ్ఫార్.పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్ కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, వీరేష్ లు పాల్గొన్నారు.

కవి రెబ్బ మల్లికార్జున్ కు ఘన సన్మానం


ప్రముఖ కవి రెబ్బ మల్లికార్జున్ ను ఉగాది కవి సమ్మేళనంలో ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రచయిత సంఘం మరియు భువన భారతి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో "శ్రీ క్రోధి" నామ సంవత్సర ఉగాది వేడుకల జిల్లా స్థాయి కవి సమ్మేళనంను స్థానిక సోమసీతా రామ ఫంక్షన్ హాల్ రాయగిరిలో ఏర్పాటు చేశారు. ఈ కవి సమ్మేళనంలో రెబ్బ మల్లికార్జున్ పాల్గొని తన కవితా గానం చేసి, పలువురి ప్రముఖ కవుల ప్రశంసలందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చేతుల మీదుగా రెబ్బ మల్లికార్జున్ కి శాలువా, మెమోటో, ప్రశంసపత్రం అందజేసి ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు.

    ఈ కార్యక్రమంలో... డాక్టర్ ఎన్. గోపి డా!! కూరెళ్ల విఠలాచార్య, గడ్డం నరసింహారెడ్డి, సోమ సీతారాములు, డా!! పోరెడ్డి రంగయ్య. మెరుగు సదానందం, శ్రీమతి బండారు జయశ్రీ తదితరులు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.

గోపరాజు పల్లి లో మంచినీటి సమస్యను పరిష్కరించాలి: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామంలో 300 కుటుంబాల రెండు వాటర్ ప్లాంట్ఉండగా తక్కువ సామర్థ్యం గల వాటర్ ప్లాంట్ ను పివి శ్యామ్ సుందర్ రావు ఫౌండేషన్ నుండి పెట్టుకోవడం జరిగింది .గతంలో ఉన్న వాటర్ ప్లాంట్ మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి విరాళం నుండి వాటర్ ప్లాంట్ నిర్మించుకోవడం జరిగింది అట్టి వాటర్ ప్లాంట్ చెడిపోయి శిథిల అవస్థలో మూడు మాసాల నుండి ఉన్నది గ్రామ సర్పంచ్ల కాలపరిమితి అయిపోయిన తర్వాత గ్రామపంచాయతీలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు .వర్షాలు తక్కువ పడడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటి సమస్య పెద్ద సమస్యగా ఏర్పడింది అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి అన్నారు. దాతలు సహకారం లేక ఇబ్బందుల పాలవుతున్నారని,పంచాయతీ కార్యదర్శి మరియు స్పెషల్ ఆఫీసర్లు స్పందించి ప్రతిపాదనలు పంపాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో స్పందించి ప్రతిపాదనలు తీసుకొని నూతన వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసం సహకరించాలని ఒక ప్రకటనలో కోరారు.

మూర్తి గారి జనార్ధన్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శం: కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త


 ఏదీ గుడ్డిగా నమ్మకుండా, దాన్ని అధ్యయనం చేసి, తెలుసుకొని ఆచరించాలనే మూర్తిగారి జనార్థన్ ఆలోచన నేటి యువతకు ఆదర్శం కావాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం స్థానిక రెడ్డివాడలోని మూర్తిగారి జనార్ధన్ గృహములో జరిగిన మూర్తి గారి జనార్థన్ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ మూర్తి గారి జనార్థన్ అనేక సంస్థలకు చెందిన పుస్తకాలను , సాహిత్యాన్ని అధ్యయనం చేసి అందులోని విజ్ఞానాన్ని, హేతువాద దృక్పథం మరియు మానవత్వాన్ని కవితలుగా, శీర్షికలుగా, వ్యాసాలుగా వ్రాసి పత్రికలకు పంపిచేవారని ఆయన అన్నారు. మూర్తి గారి జనార్థన్ తన జీవితాంతం వందలాది పుస్తకాలు అధ్యయనం చేసారని ఆయన గుర్తుచేశారు. మూర్తి గారి జనార్థన్ ఆశయాలు చాలా గొప్పవని, వాటిని నేటి తరం తప్పక ఆచరించాలని ఆయన కోరారు. జనార్థన్ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు శ్రీనివాసాచార్యులు, జిట్టా భాస్కర్ రెడ్డి, షేక్ హమీద్ పాషా, బోగ మల్లేష్ మూర్తి గారి జనార్థన్ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

లోతుకుంట మోడల్ స్కూల్ లో ప్రశాంతంగా ముగిసిన మోడల్ ప్రవేశ పరీక్ష: ప్రిన్సిపల్ రాము


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట మోడల్ స్కూల్ లో 2024- 25 విద్యా సంవత్సరానిగాను ఆరవ తరగతి, ఏడు నుంచి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఆరవ తరగతి కి ,మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ఆరవ తరగతి నుండి పదవ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్, రాము మాట్లాడుతూ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని అన్నారు. ఉదయము ఆరవ తరగతి పరీక్షకు 16 మంది మధ్యాహ్నము ఏడవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో 17 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. మొత్తం 130 విద్యార్థులు హాజరై పరీక్షలు రాయడం జరిగిందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భాస్కర్, సిబ్బంది డి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.