9వ తరగతి బాలికను గర్భవతిని చేసిన యువకుడు

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి బాలికను ఓ యువకుడు గర్భవతి చేశాడు.

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ లో 9వ తరగతి చదువు తున్న బాలికను అదేగ్రా మానికి చెందిన యువకుడు పరిచయం అయ్యాడు.

తనను రోజూ కలిసేవాడు. మాయమాటలు చెబుతూ బాలికను మెల్లిగా తనవైపు మలుచుకున్నాడు. బాలిక ను మాటలతో మభ్యపెట్టా డు. రోజూ ఓ ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు..

అయితే కొన్ని నెల తరువా త బాలిక గర్భవతి అని తేలింది. దీంతో బాలికను కలిస్తే మళ్లీ తనను ఏం చేస్తారో అనేభయంతో యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురు ఏదో కోల్పోయినట్లు ఉడటంతో తల్లిదండ్రులు నిలదీశారు.

దీంతో బాలిక శనివారం అసలు విషయం చెప్పడం తో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగి పోయారు. వెంటనే పోలీస్ స్టేషన్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు.

కోహ్లీ సెంచరీ వృధా: రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో మరో విజయం

ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయ‌ల్స్ వ‌రుస విజ‌యా ల‌తో దూసుకుపొతుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ మ‌రో విజయం సాధించింది.

ఇప్పటివరకు నాలుగు మ్యా చ్‌లు ఆడగా.. అన్నింటిలో నూ గెలిచి మరోసారి టెబుల్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగ ళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టాని 183 పరుగు లు చేసింది. ఇక చేజింగ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజ‌యం సాధించింది.

ఓపెనర్ జాస్ బట్లర్ 100 నాటౌట్ తో సీజన్‌లో రెండో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.. ఇక కెప్టెన్ సంజు శాంసన్ (69) హాఫ్ సెంచరీలతో ఆర్సీబీ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఆర్సీ బీ బౌలర్లలో రీస్ టాప్లీ రెండు వికెట్లు తీయగా.. యష్ దయాళ్, మహ్మద్ సిరాజ్ చరో వికెట్ దక్కిం చుకున్నారు.

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్య‌ర్థి గా,నారాయ‌ణ శ్రీ‌గ‌ణేశ్: ప్ర‌క‌టించిన కాంగ్రెస్ హై కమాండ్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్‌ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేసింది.

ఈ మేరకు శనివారం ఏఐ సీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. గణేష్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ అభ్యర్థిపై అనేక చర్చల అనంతరం చివరకు గణేష్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటో న్మెంట్ స్థానం ఖాళీ అయ్యిం ది.బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ల్యాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చ‌నిపో వ‌డంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.

మే 13న కంటోన్మెంట్ ఉపఎన్నిక జరుగనుంది. ఎన్నికలకు సర్వం సిద్ధమ వుతున్న తరుణంలో ఆయా పార్టీలు కంటోన్మెంట్‌లో పోటీ చేయబోయే అభ్య ర్థుల ఎంపికపై దృష్టి సారిం చాయి.

ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధిం చాలనే ఉద్దేశంతోనే ముందు కు సాగుతోంది. కంటోన్మెంట్‌ లో పోటీ చేయబోయే అభ్య ర్థి ఎంపికపై దృష్టి పెట్టి కాంగ్రె స్.. శ్రీ గణేష్ పేరును అధికా రికంగా ప్రకటించింది.

కంటోన్మెంట్ కోసం కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగొ లు నాలుగుసార్లు సర్వేలు చేయగా.. కంటోన్మెంట్‌లో అరవ మాల సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

శ్రీ గణేష్ అరవ మాల సామాజికవర్గం కావడంతో హస్తం నేతలు అతడి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లేనందున కంటోన్మెంట్ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది...

ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆటో ఢీకొని చిన్నారి మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ కాల‌నీలో ఈరోజు చోటు చేసుకుంది.

ఇంటి ముందు 16 నెలల బాలుడు ఆడుకుంటుండ‌గా తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే ఆటో ఢీకొట్టింది. ఈ ప్ర‌మా దంలో ఆ బాలుడు అక్క‌డి క్క‌డే మృతి చెందాడు.

స్థానిక ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన పొట్ట రిశీంద్ర -అపూ ర్వ దంపతుల కుమారుడైన సుధన్వన్,16 నెలలు,శని వారం ఇంటి ముందు ఆడు కుంటుండగా అటుగా వచ్చి న ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి బాలుడిని ఢీకొట్ట డంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ న్నారు. ఈ ఘటనతో కోరుట్లలో విషాద చాయలు అలుముకున్నాయి...

శ్రీశైలంలో నేటినుండి ఉగాది మహోత్సవాలు

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో ఈరోజు నుండి ఈనెల 10 వరకు ఉగాది మహోత్స వాలు జరగనున్నాయి. 5రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తుల కోసం మంచినీరు, తదితర సౌకర్యాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

ఆలయం ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. లడ్డు ప్రసాదాలు, పెద్ద ఎత్తున అన్న ప్రసాద విత రణ సాంస్కృతిక కార్య క్రమాలు వంటి ఏర్పాట్ల ను ఏర్పాటు చేయడంపై ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టి సారించారు.

మహోత్సవాలపై ఇప్పటికే పలు దఫాలుగా సమీక్ష సమావేశాలను నిర్వహిం చారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా 17 భక్త బృందాల సహాయంతో

జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు ఎస్పీ రఘువరన్ రెడ్డి జిల్లా అధి కారుల సహాయ సహాకా రాలతో ఉగాది మహోత్స వాలు విజయవంతం చేసేందుకు ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టిని సారించారు.

కాంగ్రెస్‌లో చేరిన పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యే

వైసీపీకి పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గుడ్‌బై చెప్పారు. శ‌నివారం వైఎస్ ష‌ర్మిల స‌మ‌క్షంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయనకు షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అయితే, సీఎం జగన్ పూతపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూతిరేకుల సునీల్ కుమార్ ఖరారు చేశారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేను అయిన తనను కాదని..మరో వ్యక్తికి టికెట్ కేటాయించడంతో బాబు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మార్పులు వార్తలు వచ్చినా.. ఇంత కాలం సైలెంట్‌గా ఉన్నారు.

తాజాగా ఇవాళ షర్మిల హామీ మేరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు...

తెలంగాణ‌ లో మూడు రోజులు వర్షాలు?

తెలంగాణ వాసుల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు చెప్పింది. వేస‌వి కాలం కావ‌డంతో భానుడు నిర్దాక్షిణ్యంగా సెగలు కక్కుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఉదయం 8 గంటల నుంచే వేడి దంచేస్తుండడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. దీనికితోడు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వారిని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఈ క్రమంలోవాతావరణశాఖ తెలంగాణ ప్రజలకు చల్లని వార్త మోసుకొచ్చింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ జిల్లాలతో పాటు జగి త్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఎల్లుండి వర్షాలు పడతాయంటూ ఎల్లో అలెర్ట్ జారీచేసింది. మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

హైదరాబాద్ వాసులకు మాత్రం నిరాశే. భాగ్యన గరంలో మాత్రం వర్షం పడే అవకాశం లేదని పేర్కొంది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరి కలు జారీచేసింది.

ఉష్ణోగ్రతలు రెండుమూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. రాష్ట్రంలో గరిష్ఠంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది

బోటులో ఘోర అగ్ని ప్రమాదం..మత్స్యకారులకు తీవ్రగాయాలు

ఏపీలో ఈరోజు ఉదయం మరో ప్రమాదం చోటు చేసుకుంది. మత్స్యకారుల బోటులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.

విశాఖ తీరం నుండి 65 నాటికల్ మైళ్ళ దూరంలో చేపల వేట కొనసాగిస్తుం డగా బోటులో సిలిండర్ పేలింది అయితే.. ఈ ప్రమాదంలో 5 మంది మత్స్యకారులకు తీవ్రగా యాలు,కాగా నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి.

బోటు సిబ్బంది సమాచారం తో ఘటన స్థలానికి చేరు కొని సహాయం చేసింది ఇండియన్ కోస్ట్ గార్డ్. దీంతో మత్స్యకారులను ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. బోటులో సిలిండర్ ఎలా పేలిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు

నేడు రాజస్థాన్ రాయల్స్ తో RCB "డీ "

ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడి యంలో పోటీ పడబోతు న్నాయి.

రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవు తుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి ఇది నాలుగు, బెంగళూరుకు ఐదో మ్యాచ్‌ కానుంది.అలాగే, ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు జట్లు మొత్తం 30 సార్లు పోటీ పడగా.. రాజస్థాన్ కంటే బెంగళూరు అగ్రస్థానంలో ఉంది.

ఇక, ఆర్సీబీ 15 మ్యాచ్‌లు గెలవగా, రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసుకుంది. ఇక, 3 మ్యాచ్‌ల ఫలితం రాలేదు.. 2020 నుంచి రాజస్థాన్ vs బెంగళూరు మధ్య మొత్తం 9 మ్యాచ్‌లు జరగ్గా.. ఈ 9 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది.

2022లో పూణెలోని ఎంసీ ఏ స్టేడియంలో బెంగళూరు పై రాజస్థాన్ 29 రన్స్ తేడాతో విజయం సాధిం చింది.ఇక, జైపూర్ పిచ్ వేదికగా ఆడిన రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌లకు మద్దతు ఇస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు దాదాపు 185 పరుగులకు పైగా స్కోర్ చేసింది.

అయితే రెండు పర్యాయా లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు లక్ష్యాన్ని కాపాడు కుంది. ఇది సవాయ్ మన్ సింగ్ స్టేడియం యొక్క పిచ్ ఆట సాగుతున్నప్పుడు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే, ఇవాళ వర్షాలు కురిసే అవకాశం లేదు.. ఉష్ణోగ్రతలు సాయం త్రం 20 శాతం తేమతో 30 డిగ్రీల సెల్సియస్‌గా నమోద వుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

రాజస్థాన్ జట్టు: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, నాంద్రే బెర్గర్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ కృష్ణ, సందీప్ శర్మ.

బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, యశ్ దయాల్, రీస్ టాప్లీ, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్...

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అడవి లో తుపాకీ మోతలు

తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈరోజు ఎదురు కాల్పులు జరిగాయి.

పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలిలో 3 తుపాకులు, పేలు డు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

ములుగు జిల్లా కర్రిగుట్ట లు-ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివ రాలు తెలియాల్సి ఉంది.

కాగా, సోమవారం బీజాపూర్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.