రాజకీయాల్లో సామాజిక అన్యాయాన్ని అరికట్టుతాం..60 శాతం మా జనాభా ఉన్న స్థానాల్లో బీసీలనే పార్లమెంటుకు పంపుతాం:దాసు సురేశ్, అధ్యక్షులు(BCRS)
రాజకీయాల్లో సామాజిక అన్యాయాన్ని అరికట్టుతాం..
60 శాతం మా జనాభా ఉన్న స్థానాల్లో బీసీలనే పార్లమెంటుకు పంపుతాం..దాసు సురేశ్, అధ్యక్షులు - బీసీ రాజ్యాధికార సమితి
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని కారణంచేత రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లిచ్చే విషయంలో అన్యాయానికి ఒడిగట్టుతున్నాయని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ భుదవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.. బాగ్లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. నిజాం వ్యతిరేఖ పోరాటం మొదలు భారత స్వాతంత్ర పోరాటం నుండి తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటాలలో త్యాగాలు బడుగులవైతే నేటికీ అధికారం,అవకాశాలు కేవలం సంపన్న వర్గాలకు , ఆధిపత్యవర్గాలకే పరిమితమవుతున్నాయని మండిపడ్డారు..
జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం గురించి మాట్లాడే పార్టీలు సహితం తెలంగాణలో పార్లమెంటు సీట్ల కేటాయింపులో సామాజిక అన్యాయానికి పాల్పడుతున్నాయన్నారు. ఈ విషయంపై త్వరలోనే సామాజిక లౌకిక రాజకీయ వాదులు , మేధావులను సమావేశపరచి కొనసాగుతున్న అన్యాయంపై తెలంగాణ వ్యాప్తంగా విస్తృత ప్రచారం గావిస్తామన్నారు..
60 శాతానికి పైగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో సహితం బీసీలకు చట్టసభల్లో ఎప్పుడూ సరైన ప్రాతినిధ్యం లభించడం లేదనీ, పవర్ సెంటర్ కు కావాలనే ప్రధాన పార్టీలు బీసీలను దూరంగా నెట్టివేస్తున్నాయని ఆరోపించారు. బీసీ మేలుకో.. రాజ్యాన్ని ఏలుకో నినాద స్ఫూర్తితో బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా మెజారిటీ స్థానాల్లో బీసీ అభ్యర్థులకే ఓటు వేసి కనీసం 8 మంది బీసీ ఎంపీలను తెలంగాణ నుంచి పార్లమెంట్ అడుగుపెట్టేలా ఉద్యమిస్తామన్నారు.
Apr 05 2024, 21:08