ఈనెల 5న భువనగిరి లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ను జయప్రదం చేయండి: వల్లాస్ రాజ్ కాళ భైరవ జిల్లా కిసాన్ మోర్చా సెక్రటరీ
![]()
భారతీయ జనతా పార్టీ భువనగిరి మండల అధ్యక్షుడు చిర్క సురేష్ రెడ్డి అధ్వర్యంలో మీడియా సమావేశం మండల పార్టీ ఆఫీసులో ఏర్పాటు చెయ్యడం జరిగింది.
ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కిసాన్ మోర్చ సెక్రటరీ వల్దాస్ రాజ్ కాళభైరవ పాల్గొనడం జరిగింది.
వల్దాస్ రాజ్ కాళభైరవ మాట్లాడుతూ ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లి ఎన్నికల్లో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ,రైతు భరోసా క్రింద 15000 ,రైతు కూలీలకు 12000 ,కౌలు రైతులకు 15000, msp క్రింద రైతులకు 500 బోనస్ ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే ఇవ్వన్ని హామీలను అమలు చెయ్యకుండా రైతులను,ప్రజలను మోసం చేస్తుందన్నారు.
![]()
మాయమాటలతో రైతులను,ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఈ నెల 5-4-2024 రోజున భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ దీక్ష కీ పెద్ద ఎత్తున రైతులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు మానిక్యం రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చ సోషల్ మీడియా కన్వీనర్ కుషంగల ప్రభాకర్ ఉన్నారు


యాదాద్రి భువనగిరి జిల్లా కి ప్రధమ జిల్లా కలెక్టర్ గా విశిష్ట సేవలను అందించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న అనిత రామచంద్రన్ ను సీనియర్ ఐఏఎస్ అధికారిని ఈ వేసవికాలం లో రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకి మంచినీటి సరఫరా లో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి ప్రత్యేక అధికారులను నియమించారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అనిత రామచంద్రన్ ని నియమించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో జిల్లాలోని వివిధ మండలాల్లో గ్రామాలలో బాబు జగ్జీవన్ రామ్వి గ్రహాలకి మాస్క్ వేయడం జరిగిందని ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకి తక్షణమే మాస్క్ తొలగించి అధికారికంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని బుధవారం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బా రామకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు ఇటికల దేవేందర్ మాదిగ ,కోళ్ల జహంగీర్, కుసంగుల కుమార్ తదితరులు పాల్గొన్నారు
.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 97 వ జయంతి వేడుకలు కురుమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు కంకాల కిష్టయ్య మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన పోరాట యోధుడిని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లింగస్వామి, చిర్ర చందు, బత్తిని సహదేవ్, కాసుల వెంకన్న , జూకంటి నరసింహ, బుగ్గ బీరప్ప, ఎమ్మే మల్లేశం, వెలిజాల రమేష్, సాయి యాదగిరి, రేగు సాయిలు, దయ్యాల వెంకటేష్ ,దయ్యాల వీరస్వామి ,కంకల శ్రీనివాస్, మల్గ వెంకటేశం, బుగ్గ ఉదయ్, వేగు మల్లికార్జున్, కౌడే వెంకటేశం, కౌడ కృష్ణ, ఎమ్మే చిన్న లింగస్వామి, ఎమ్మే నవీన్, కౌడే శివ ,దయ్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Apr 04 2024, 17:24
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.0k