భువనగిరిలో బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు, గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ అభ్యర్థి క్యమా మల్లేష్ గారు ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులు మాట్లాడుతూ...
కాంగ్రెస్ అంటేనే లీక్ లు ,ఫెక్ న్యూస్ లు...పాలన గాలికొదిలేశారు కాంగ్రెస్ వాళ్లు......అక్రమ కేస్ లతో కాలయాపన చేస్తుంది...
ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్నాడు రేవంత్ రెడ్డి మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొంద పెట్టాలి.
పార్టీలో చేరికలతో కాంగ్రెస్ బిజీ అయ్యంది.. కేసీఆర్ బయటికి రాగానే రాష్ట్రంలో కాల్వల్లో నీళ్లు పారుతున్నాయ్....ఎనటికైన కేసీఆర్ గారే తెలంగాణ కు శ్రీరామరక్ష...
![]()
ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది.
ధాన్యం కి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు...ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాం అని మోసం చేశారు..కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలను గ్రామాల్లో విడమర్చి చెప్పాలి.
కార్యకర్తలు అంతా ఉద్యమ స్పూర్తితో పోరాటం చేయాలి..
అలివి గాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది..
ఇవ్వాళ కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది..
కొంత మంది స్వార్ధపరులు పార్టీని వీడి పోతున్నారు.. వాళ్ళను ప్రజలు నమ్మడం లేదు.. భువనగిరి లో గెలుస్తాం...క్యామ మల్లేష్ మాస్ లీడర్...తప్పకుండా గెలుస్తారు...
స్వయానా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుండి సస్పెండ్ అయిన వ్యక్తి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి చమల కిరణ్ కుమార్ రెడ్డి...ప్రశ్నించే గొంతును గెలిలించండి.....అసెంబ్లీ లో కోట్లాడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో BRS గెలవాలి.....
సబ్బండ వర్గాలను నిలువునా మోసం చేసింది కాంగ్రెస్....
నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారు....నల్ల చట్టాలు తెచ్చి రైతులను చంపిన పార్టీ బీజేపీ....మళ్ళీ అధికారంలో కి వచ్చేది BRS పార్టీనే..
కొంత మంది పార్టీ విడి పోతే ఎం నష్టం లేదు.. పార్టీ వదిలి పోయిన వారు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడైనా మళ్ళీ వారిని పార్టీలో చేర్చుకోమ్...ఈ భూమి ఉన్నంత కాలం BRS ఉంటుంది.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 97 వ జయంతి వేడుకలు కురుమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు కంకాల కిష్టయ్య మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన పోరాట యోధుడిని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లింగస్వామి, చిర్ర చందు, బత్తిని సహదేవ్, కాసుల వెంకన్న , జూకంటి నరసింహ, బుగ్గ బీరప్ప, ఎమ్మే మల్లేశం, వెలిజాల రమేష్, సాయి యాదగిరి, రేగు సాయిలు, దయ్యాల వెంకటేష్ ,దయ్యాల వీరస్వామి ,కంకల శ్రీనివాస్, మల్గ వెంకటేశం, బుగ్గ ఉదయ్, వేగు మల్లికార్జున్, కౌడే వెంకటేశం, కౌడ కృష్ణ, ఎమ్మే చిన్న లింగస్వామి, ఎమ్మే నవీన్, కౌడే శివ ,దయ్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద MRPS ఆధ్వర్యంలో ధర్నా రాస్తరోకో నిర్వహించడం జరిగింది


ఒక ముస్లిం అమ్మాయి తనని ఇష్టపడుతుందని తెలుసుకొని,ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని మతసామరస్యానికి ప్రతీకైనాడని, ఆమె సోదరుని సాయంతో భువనగిరి కోటను స్వాధీనం చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించి చరిత్ర సృష్టించిచాడని, ఆతర్వాత గోల్కొండ కోట పై దండయాత్ర చేసి విజయం సాధించిన పాపన్న గౌడ్ బహుజన రాజ్యం జెండాను గోల్కొండ కోట పై ఎగురవేసాడని వారు తెలిపారు. గత పాలకులు సర్థార్ సర్వాయి పాపన్న చరిత్రను కనుమరుగు చేసారని,ఆ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించటానికి నేటి యువత కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ వర్థంతి కార్యక్రమంలో భువనగిరి మాజీ కౌన్సిలర్ దేవరకొండ సత్యనారాయణ, సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బత్తుల గణేష్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు ఎర్ర శివరాజ్, గోపరాజు వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు

Apr 03 2024, 19:15
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
51.0k