దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం.... కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త
![]()
భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య స్పూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైందని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. బుధవారం భువనగిరి అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద నిర్వహించిన దొడ్డి కొమురయ్య 97 వ జయంతి సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి నిజాం నవాబు ఏర్పాటు చేసుకున్న రాజాకార్ ప్రైవేటు సైన్యం, దొరలు, జామీందారుల ఆగడాలకు వ్యతిరేకంగా చేపట్టిన శాంతియుత రైతాంగ పోరాట ఉద్యమంలో దొడ్డి కొమురయ్య పై రజాకార్లు కాల్పులు జరిపి ఆయన ప్రాణాలు బలిగొన్నారని ఆయన తెలిపారు.ఆ తరువాత తెలంగాణలో గుప్తల సంఘం, సాయుధ పోరాట సంఘాలు ఏర్పడి తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసి రజాకార్ల నుండి విముక్తి కల్గించారని ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా శాంతియుతంగా జరుగుతున్న సమయంలో కాసోజు శ్రీకాంత్ చారి మరణంతో తీవ్ర రూపం దాల్చిందని ఆయన అన్నారు. తొలి అమరుల స్పూర్తితో ప్రజలు పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని ఆయన అన్నారు.
![]()
నేటి యువత తొలి అమరులైన దొడ్డి కొమురయ్య, కాసోజు శ్రీకాంత్ చారిల జీవిత చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేసి, భవిష్యత్తు తరాలకు అందించటానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్, యాదవ సంఘం జిల్లా నాయకులు వేల్పుల యాద మల్లయ్య యాదవ్, గుండె బోయిన వీరేష్ యాదవ్, పర్వతం కృష్ణ యాదవ్, నక్కల చిరంజీవి యాదవ్, బద్దుల అశోక్ యాదవ్, శ్రీ రాం శరత్ యాదవ్ ,రాసాల రణధీర్ యాదవ్, మాదరబోయిన నరేష్ యాదవ్, శ్రీధర్ యాదవ్ కందుల విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 97 వ జయంతి వేడుకలు కురుమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు కంకాల కిష్టయ్య మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన పోరాట యోధుడిని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లింగస్వామి, చిర్ర చందు, బత్తిని సహదేవ్, కాసుల వెంకన్న , జూకంటి నరసింహ, బుగ్గ బీరప్ప, ఎమ్మే మల్లేశం, వెలిజాల రమేష్, సాయి యాదగిరి, రేగు సాయిలు, దయ్యాల వెంకటేష్ ,దయ్యాల వీరస్వామి ,కంకల శ్రీనివాస్, మల్గ వెంకటేశం, బుగ్గ ఉదయ్, వేగు మల్లికార్జున్, కౌడే వెంకటేశం, కౌడ కృష్ణ, ఎమ్మే చిన్న లింగస్వామి, ఎమ్మే నవీన్, కౌడే శివ ,దయ్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద MRPS ఆధ్వర్యంలో ధర్నా రాస్తరోకో నిర్వహించడం జరిగింది


ఒక ముస్లిం అమ్మాయి తనని ఇష్టపడుతుందని తెలుసుకొని,ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని మతసామరస్యానికి ప్రతీకైనాడని, ఆమె సోదరుని సాయంతో భువనగిరి కోటను స్వాధీనం చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించి చరిత్ర సృష్టించిచాడని, ఆతర్వాత గోల్కొండ కోట పై దండయాత్ర చేసి విజయం సాధించిన పాపన్న గౌడ్ బహుజన రాజ్యం జెండాను గోల్కొండ కోట పై ఎగురవేసాడని వారు తెలిపారు. గత పాలకులు సర్థార్ సర్వాయి పాపన్న చరిత్రను కనుమరుగు చేసారని,ఆ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించటానికి నేటి యువత కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ వర్థంతి కార్యక్రమంలో భువనగిరి మాజీ కౌన్సిలర్ దేవరకొండ సత్యనారాయణ, సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బత్తుల గణేష్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు ఎర్ర శివరాజ్, గోపరాజు వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు


Apr 03 2024, 17:50
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
29.9k