ఈనెల 5న భువనగిరిలో జరుగు సిపిఎం నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశమును జయప్రదం చేయండి; మాటూరి బాలరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
![]()
ఈనెల 5వ తేదీన భువనగిరి పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ లో జరుగు సిపిఎం నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు కోరారు
ఈరోజు వలిగొండ మండల కేంద్రంలో జరిగిన సిపిఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు దీనిలో భాగంగా భువనగిరి నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు బి. వెంకట్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు ఈ సమావేశంలో ఎన్నికల కోసం గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు పనిచేసే ప్రణాళిక రూపొందించడం చర్చించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశానికి సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ హాజరుకావాలన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి 500 రూపాయల బోనస్ సౌకర్యాన్ని కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పంట ఎండిపోయిన రైతులను ఆదుకోవాలని ఎకరానికి 20వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కల్కూరి రామచందర్,కూర శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ తదితరులు పాల్గొన్నారు



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 97 వ జయంతి వేడుకలు కురుమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు కంకాల కిష్టయ్య మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన పోరాట యోధుడిని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లింగస్వామి, చిర్ర చందు, బత్తిని సహదేవ్, కాసుల వెంకన్న , జూకంటి నరసింహ, బుగ్గ బీరప్ప, ఎమ్మే మల్లేశం, వెలిజాల రమేష్, సాయి యాదగిరి, రేగు సాయిలు, దయ్యాల వెంకటేష్ ,దయ్యాల వీరస్వామి ,కంకల శ్రీనివాస్, మల్గ వెంకటేశం, బుగ్గ ఉదయ్, వేగు మల్లికార్జున్, కౌడే వెంకటేశం, కౌడ కృష్ణ, ఎమ్మే చిన్న లింగస్వామి, ఎమ్మే నవీన్, కౌడే శివ ,దయ్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద MRPS ఆధ్వర్యంలో ధర్నా రాస్తరోకో నిర్వహించడం జరిగింది


ఒక ముస్లిం అమ్మాయి తనని ఇష్టపడుతుందని తెలుసుకొని,ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని మతసామరస్యానికి ప్రతీకైనాడని, ఆమె సోదరుని సాయంతో భువనగిరి కోటను స్వాధీనం చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించి చరిత్ర సృష్టించిచాడని, ఆతర్వాత గోల్కొండ కోట పై దండయాత్ర చేసి విజయం సాధించిన పాపన్న గౌడ్ బహుజన రాజ్యం జెండాను గోల్కొండ కోట పై ఎగురవేసాడని వారు తెలిపారు. గత పాలకులు సర్థార్ సర్వాయి పాపన్న చరిత్రను కనుమరుగు చేసారని,ఆ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించటానికి నేటి యువత కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ వర్థంతి కార్యక్రమంలో భువనగిరి మాజీ కౌన్సిలర్ దేవరకొండ సత్యనారాయణ, సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బత్తుల గణేష్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు ఎర్ర శివరాజ్, గోపరాజు వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు


Apr 03 2024, 17:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.2k