ప్రజాపాలనలో బీసీల భాగస్వామ్యం లేకపోతే సామాజికన్యాయం ఎలా సాధ్యం?: బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్
ప్రజాపాలనలో బీసీల భాగస్వామ్యం లేకపోతే సామాజికన్యాయం ఎలా సాధ్యం?
దాసు సురేశ్
పోరాటాలకు పనికొచ్చిన బీసీలు పాలనలో ( పదవులకు) పనికిరారా?
బీసీ మేధావుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్, రాహుల్ గాంధీకి బీసీల సూటి ప్రశ్న...
సబ్బండ వర్గాల మద్దతుతో సామజిక న్యాయమే ధేయంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో బీసీ లకు సమన అవకాశాలు లేక సామాజికన్యాయం కుంటు పడుతుందని బీసీ నాయకులు, ఉద్యమకారులు వాపోయారు, బీసీ రాజ్యాధికార సమితి బుధవారం భాగ్ లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో, బీసీ నాయకులూ, ఉద్యమకారులు, ప్రజా సంగాల నాయకులూ, మేధావులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, తమకు ప్రభుత్వ పదవులు దక్కాల్సిన వాటాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వ పాలనలో తాము భాగస్వాములమేనని నినాదించారు, తదనంతరం బీసీ రాజ్యాధికార అధ్యక్షులు దాసు సురేష్ మాట్లాడుతూ బీసీ, ఎస్సి , ఎస్టీ , మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం 17 కార్పొరేషన్ లు ఏర్పాటు చేయటాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు తాము ప్రభుత్వానికి నివేదించిన వెంటనే , బీసీ అభివృద్ధి కోసం బడ్జెట్లో 8 వెల కోట్లు కేటాయించటం , బీసీ, ఎస్సి , ఎస్టీ , మైనారిటీ , రెసిడెన్సియల్ గురుకులాలకు సమీకృత భవనాలను ఏర్పాటు చేయటం 30 వేల ఉద్యోగాల భర్తీ, తదితర అంశాలను, శీఘ్ర గతిన 100 రోజులు పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తాము అభినందిస్తున్నామన్నారు, ఇదేసమయంలో కెసిఆర్ ప్రభుత్వం పై నిరంతరం పోరాటం చేసిన ప్రజా ఉద్యమ సంగాల నాయకులకు ప్రభుత్వ పాలనలో అవకాశాలు కల్పించటం పై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు , కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రమే కాకుండా ప్రజా పోరాటాలతో మద్దతుగా నిలచిన, సివిల్ సొసైటీ నాయకులకు కూడా ప్రాధాన్యతకలిగిన నామినేటెడ్ పదవులలో అవకాశాలు ఇవ్వాలని కోరారు, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సామజిక న్యాయం కోసం పోరాటం చేస్తుండగా తెలంగాణ లో పదవులన్నీ రెడ్డి సామాజికవర్గానికె పరిమితం అవుతున్నాయని ఆవేదన వెక్తం చేశారు , కాంగ్రెస్ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని బీసీ ల ఆర్థిక స్థితి గతుల ఎదుగుదలకు సహకరించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షులు దొంత ఆనందం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కన్వీనర్ గుజ్జ కృష్ణ , మహిళా కన్వీనర్ బోనం ఊర్మిళ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ స్వామి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు నీలం వెంకటేష్, బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక సభ్యురాలు దోనేటి కృష్ణలత, బీసీ రాజ్యాధికార సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పద్మావతి, ప్రధాన కార్యదర్శి గోషిక స్వప్న,మీడియా సెక్రటరీ మారేపల్లి లక్ష్మణ్ , పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తులసీ శ్రీమన్, బీసీ నాయకులు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, గజవెల్లి మధుసూదన్,సుధాకర్ , ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ కాలసముద్రం సుధాకర్ , వీరాస్వామి యాదవ్ , దామెరకొండ కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి పెండెం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Apr 02 2024, 23:36