ఆర్థిక సహాయం అందజేసిన గోలిగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల మదిరె గోలిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు ఆదివారం రోజున అనారోగ్య కారణాలతో వేముల లక్ష్మమ్మ మరణించగా వారి కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గోలిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు, పులిగిల్ల గ్రామ శాఖ అధ్యక్షుడు బుగ్గ వెంకటేశం, బుగ్గ మనోజ్, బండారు మైసయ్య, కొంతం తిరుమల్ రెడ్డి, భోగ రమేష్, వేముల అమరేందర్, పర్వతం రాజు, పల్సం భాస్కర్, పల్లెర్ల స్వామి, పల్లెర్ల యాదగిరి, కళ్లెం జంగారెడ్డి, మంద రవి, వేముల అశోక్, తేర్యాల మల్లయ్య, రామోజీ, కంబాలపల్లి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

నవోదయ సీటు సాధించిన పవిత్రాత్మ పాఠశాల విద్యార్థి బుర్ర జతీన్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రములోని పవిత్రాత్మ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న అరూరు గ్రామానికి చెందిన బుర్ర వాసుదేవ్ విజయాల కుమారుడు బుర్ర జతీన్ 2024 -25 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయం చలకుర్తిలో సీటు పొందారు. ఈ సందర్భంగా వలిగొండ లోని పాఠశాల యాజమాన్యం విద్యార్థికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. బాగా కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మరెన్నో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వాళ్ళ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుతున్నారు.

మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ


భువనగిరి : రంజాన్ పవిత్ర మాస ఉపవాసా దీక్షలు పాటిస్తున్న నిరుపేద ముస్లిం కుటుంబాల కు మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ సౌజన్యంతో రెండవ రోజు సోమవారం మైనార్టీ వెల్ఫేర్ సొసై టీ జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్,ఇస్తి యాక్ అహ్మద్ ల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్ మసీదు వద్ద నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక మదర్ థెరిస్సా హైస్కూల్ కరస్పాండెంట్ సురేష్ కుమార్ మాట్లా డుతూపవిత్ర రంజాన్ మాసంలో నిరుపేద ముస్లిం కుటుంబాల సంక్షేమాన్ని దృష్టియందుం చుకొని స్వచ్ఛందంగా నిత్యవసరాలు పంపిణీ చేస్తున్న ఇంతియాజ్ అహ్మద్, ఇస్తియాక్ అహ్మద్ లు చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి అభి నందించారు.భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.దీనికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు.

అనంతరం ఇంతియాజ్ మాట్లాడుతూ నిరుపేద ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ నదీమ్ ఖాన్ సహకారంతో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగు తుందన్నారు. ప్రతి ఏటాలాగే ఈసారి కూడ మేరాజ్ గ్రూప్ వారి సౌజన్యంతో ఇప్పటికే ఆదివారం రెండు లక్షల రూపాయల విలువగల నిత్యవసర సరు కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా సోమవారం రెండవ విడతలో భాగంగా పట్టణంలోని పేద ముస్లిం కుటుంబాల కు ఒక్కొక్కరికి 3000.రూపాయల రంజాన్ తోఫా కిట్టును మరో రెండు లక్షల రూపాయల తో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు . తమపై ఎంతో నమ్మకంతో ప్రతి ఏటా భువనగిరి పట్టణంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు తమ వంతు సహాయంగా నిత్యవసర సరుకులు అందజేస్తున్న మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ నదీమ్ ఖాన్ కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసంలో పేదలను గుర్తించి వారికీ తమకు తోచిన సహాయం అందించాలన్నదే తమ లక్ష్య మన్నారు.ఈ కార్య క్రమంలో టీజేయు జిల్లా అధ్యక్షుడు ఎండి శానూర్ బాబా,మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీఇస్తియాక్ అహ్మద్,సయ్యద్ రఫీఖ్ అహ్మద్,ఎండీ కామ్రాన్ హుస్సేన్,ఎండీ సలీం ఎండీ గయాజ్ అహ్మద్ ఎండీ సిరాజ్, ఎండీ మొఖ్తార్,అహ్మద్,ఆదిల్ రాషేద్,షకీల్,రెయ్యాన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలి : పల్ల గొర్ల మోదీ రాందేవ్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు


 భువనగిరి SV హోటల్లో నిర్వహించిన సమావేశంలో  విద్యార్థుల ఫీజు రీయింబర్స్ స్కాలర్షిప్ బకాయిలు 7200 కోట్లు విడుదల చేయాలి లేనియెడల కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు అన్నారు బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ 100 రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడు మీద ఉన్నప్పుడు ఓ మల్లన్న ఒడ్డు దిగాక బోడి మల్లన్న అన్నట్లుగా ఉన్నది ఈ ప్రభుత్వ పరిస్థితి 100రోజుల్లో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ విగ్రహాలు వచ్చినాయి గాని విద్యార్థుల సమస్యలు తీరలేదు లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన bjp 6,brs 4, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 2 టికెట్లు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు అన్ని పార్టీలు బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలన్నారు బీసీ కార్పొరేషన్లను 56కు పెంచాలన్నారు తక్షణమే ఫీజు రీయిమెంట్స్ స్కాలర్షిప్ విద్యార్థుల సమస్యలు మరియు అన్ని రంగాల సమస్యలు పరిష్కరించాలన్నారు లేకుంటే లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు అన్నారు *ఈ సమావేశంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య,ఉపసర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు రాసాల యాదయ్య గౌడ్, నల్లమాసం నాదం, ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల అధ్యక్షులు పరధిన్,మనోజ్,మురళి, యూసన్, హాయ్ కిరణ్, మల్లేష్, ఫణి తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ మాసంలో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈనెల 5 నుండి 14 వరకు జరగనున్న మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ నాయకులు సోమవారం పిలుపునిచ్చారు. ఈనెల 5న బాబు జగ్జీవన్ రావ్ జయంతి, 11న మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి, 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నాయకులు కోరారు. 14 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించే జై భీమ్ యాత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ,ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా మహనీయుల జయంతి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు బట్టు రామచంద్రయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, ఈరపాక నరసింహ, శివలింగం, తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం లపై అవగాహన కలిగి ఉండాలి : జిల్లా కలెక్టర్


యాదాద్రి భువనగిరి జిల్లా; పోలింగ్ రోజు నిర్వహించే విధుల పట్ల ఈవీఎం యంత్రాల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ హనుమంతు కే జండగే సోమవారం ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని వెన్నెల కాలేజీలో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధానంపై జరిగే రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు1052 ప్రిసైడింగ్ అధికారులకు,1054 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

గోపరాజు పల్లి లో వైభవంగా శ్రీ సీతారామ చంద్ర స్వామి తిరు కళ్యాణ మహోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో ఆదివారం మధ్యాహ్నం అభయ ఆంజనేయ స్వామికి చందనోత్సవం ,అష్టోత్తర పత్రి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం ను వేద మంత్రోచ్ఛరణాల తో వైభవంగా నిర్వహించారు. ముంబైలో నివాసముంటున్న గ్రామానికి చెందిన పద్మశాలీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కీసర్ల ఉపేంద్ర సత్తిరెడ్డి, ఎంపిటిసి నీలం లలిత బాబురావు, గ్రామ ప్రజలు భక్తులు మరియు పద్మశాలీలు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి ఖిలా పై బిజెపి జెండా ఎగరడం ఖాయం: మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు కొత్త రామచందర్ యాదవ్


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలువబోతున్నారని వలిగొండ మండల బాజపా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొత్త రామచందర్ యాదవ్ ఆదివారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గెలుపు పై దీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రజలు నరేంద్ర మోడీని కోరుకుంటున్నారని అభివృద్ధి జరగాలంటే కచ్చితంగా కేంద్రంలో బిజెపి పార్టీని గెలిపించాలని బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాల వారికి సమన్యాయం జరగాలన్న,భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా విద్య వైద్య వ్యాపారంగాలు అభివృద్ధి పథంలో ముందుకు నడవాలన్న, అదేవిధంగా భువనగిరి కోటను దాదాపు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు రైతులకు రైతు భరోసా కింద సంవత్సరానికి 6,000/- రూపాయలు పెట్టుబడిసహాయం, రేషన్ బియ్యం, ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం, సి సి రోడ్లు వీధిలైట్లు స్మశాన వాటికలు వైకుంఠధామం, గర్భిణి మహిళలకు పోషక ఆహారం, ఇలాంటి సంక్షేమ పథకాలను అభివృద్ధి చేసి పథకాల అమలు చేసి రాబోయే రోజులలో సరికొత్త పథకాలు ప్రవేశపెట్టి మరింత అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ నీ అత్యధిక మెజార్టీతో గెలిపించి కేంద్రంలో భారతీయ జనతా అధికారంలోకి రావడానికి సహకరించి, భువనగిరి ఖిల్లాపై బిజెపి జెండా ఎగరవేసి చరిత్రను తిరగ రాయాలని వారు అన్నారు.

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీల విజేతలకు బహుమతులు ప్రధాన చేసిన ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర


వలిగొండ మండలంలోని అరూరు గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సుద్దాల సాయికుమార్ అధ్యక్షతన జరిగినది

అవినీతి, అక్రమాలను పారద్రోలడానికి యువత రాజకీయాలకు ఆకర్షితులు కావాలని, చెడు వ్యసనాలను దూరం చేసేందుకు,ఆరోగ్యవంతులుగా ఉండేందుకు క్రీడలు అవసరమని ఏ ఐ వై ఎఫ్ వలిగొండ మండల సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రీడోత్సవాల ముగింపు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆరూరు లోని జరిగింది. ఈ ప్రధానోత్సవ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర, సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ముఖ్య అతిథిలుగా , క్రికెట్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు లింగరాజు పల్లి కి మొదటి బహుమతి, ఆరూరి కి రెండవ బహుమతి, బహూకరించారు.

ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధర్మేంద్ర మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా అవసరమని, గ్రామీణ స్థాయి నుండే క్రీడలను ప్రోత్సహించి అధిక నిధులు కేటాయించాలన్నారు.ప్రస్తుత సమాజంలో యువత, విద్యార్థులు కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమైన సమయంలో, యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఏ ఐ వై ఎఫ్ క్రీడలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని వారు అన్నారు.క్రీడలు ప్రతి మనిషి జీవనంలో ఒక వ్యాయామంగా మారాలని, మానసిక పునరుత్తేజానికి, ఆరోగ్యకరమైన జీవనానికి ఆవశ్యమని వారు ఉద్ఘాటించారు. పౌష్టికాహార లోపంతో యువత శారీరకంగా ఎదుగుదల కొరవడిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.నిత్యం యువత క్రీడల్లో పాల్గొనటం ద్వారా చెడు వ్యసనాలకు దూరం కావొచ్చని, నేడు రాష్ట్రంలో మాధకద్రవ్యాలకు బానిసై అనేక మంది విద్యార్థులు, యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వ్యాసనాల మత్తులో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు అన్నారు. అదేవిధంగా ప్రస్తుత రాజకీయాలు అవినీతి, అక్రమాలతో తారవిల్లుతోందని, కేవలం బడా కార్పొరేట్ వ్యాపార బడా బాబులు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారని దీని వలన సమాజ మార్పు సాధ్యం కాదని, కేవలం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే స్థానం ఉంటుందని, ఇది సమాజ నిర్మాణానికి విఘాతం కల్గిస్తుందని వారు విమర్శించారు. అందుకే నేటి నవతరం రాజకీయాలకు ఆకర్షితులు కావాలని, రాజకీయాలంటే నిస్వార్థ సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ చీలికలు తెచ్చి అశాంతిని నెలకొల్పుతున్నదని,అదే విధానాలను తెలంగాణ లో కూడా అమలు చేయాలని ప్రజల మధ్య మతం రంగు తో అల్లర్లు నిర్వహించాలని బీజేపీ కుట్రలు పన్నుతున్నదని ఈ దుష్ట చర్యలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని, బీజేపీ ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని వారు పిలుపునిచ్చారు. ఇటీవల మేడ్చల్ జిల్లా చెంగిచర్ల ప్రాంతంలో జరిగిన ఘటన అదే కోవలోకి వస్తుందని, రెండు మతాల మధ్య వైరుధ్యాలను సృష్టించి ఘర్షణలకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు. కేవలం ఎన్నికల సమయంలోనే బీజేపీ ఈ నీచపు అకృత్యాలకు పాల్పడటం సిగ్గు చేటు అన్నారు.

ఈ సందర్భంగా పోలేపాక యాదయ్యమాట్లాడుతూ యువతను మతోన్మాద రాజకీయాల వైపు మళ్లిస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని, దేశ ఐక్యత అంటే అన్ని మతాలు, కులాల సమూహమేనని చాటి చెప్పే విధంగా యువత సన్నద్ధం కావాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్, పెరబోయిన మహేందర్,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బబ్బురి శ్రీధర్, నాయకులు మేడి దేవేందర్, మారుపాక వెంకటేష్,ఎం.డి నయీమ్, బహుమతి దాత చిలకమర్రి నారాయణ, దుప్పల్లి జావిద్, జక్కడి శ్రీనివాసరెడ్డి, రవ్వ శివ, జోలం మల్లేష్, మహేష్, మెట్టు సంతోష్, మారుపాక లోకేష్, తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం అందజేసిన గోలిగూడెం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల మదిరె గోలిగూడెం గ్రామానికి చెందిన బొడ్డు నరసింహా అనారోగ్యంతో మరణించారు. అతని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు బొడ్డు నరసింహ అంత్యక్రియల నిమిత్తం10,000/-

రూపాయలను ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గోలిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు, పులిగిల్ల గ్రామ శాఖ అధ్యక్షుడు బుగ్గ వెంకటేశం, బుగ్గ మనోజ్, బండారు మైసయ్య, కొంతం తిరుమల్ రెడ్డి, భోగ రమేష్, వేముల అమరేందర్, పర్వతం రాజు, పల్సం భాస్కర్, పల్లెర్ల స్వామి, పల్లెర్ల యాదగిరి, కళ్లెం జంగారెడ్డి, మంద రవి, వేముల అశోక్, తేర్యాల మల్లయ్య, రామోజీ, కంబాలపల్లి పరమేష్, తదితరులు పాల్గొన్నారు.