గోపాల్ గోస.. కండరాల క్షీణత వల్ల పనిచేయలేని వైనం.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు...
గోపాల్ గోస.. కండరాల క్షీణత వల్ల పనిచేయలేని వైనం.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు...
చిట్యాల మండలం నేరేడ గ్రామానికి చెందిన గోపాల్ నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. 18 సంవత్సరాలకే కండరాల క్షీణత వ్యాధితో మంచం పట్టాడు, ఏం పనిచేయలేని పరిస్థితి, ఇటీవల తండ్రి మృతి వల్ల చిన్న భిన్నమైన కుటుంబం, ఘోరంగా మారిన ఇంటి పరిస్థితి, గోపాల్ గురించి ఎన్నో ప్రముఖ పత్రికలు మరియు చానల్లో గోపాల పరిస్థితి గురించి వివరించడం జరిగింది. గోపాల్ 18 సంవత్సరాలకు మంచాన పడితే అతని ప్రస్తుత వయసు 40 సంవత్సరాలు, ప్రస్తుతం తన ఇంటి పరిస్థితి బాలేదని, ప్రజలు తనకు ఆర్థిక సాయం అందించి తన మనుగడకు తోడ్పడాలని ప్రజలను వేడుకోవడం జరిగింది. ఆర్థిక సాయం చేయడానికి ప్రజలు నేరుగా తనకు ఫోన్ చేసి తన పరిస్థితి తెలుసుకున్నాకే ఫోన్ పే ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ తన సహాయం చేయాలని ప్రజలను వేడుకోవడం జరిగింది.
Mar 16 2024, 15:41