నల్లగొండ:చేనేత వస్త్ర నిల్వలు ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలి..
చేనేత వస్త్ర నిల్వలు ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలి
కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కి వినతి
గంజి మురళీధర్
చేనేత సహకార సంఘాలలో మాస్టర్ వీవర్స్ దగ్గర పేరుకుపోయిన వస్త్రాల నిలువలను ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ విజ్ఞప్తి చేశారు
సోమవారం గ్రీవెన్స్ సెల్ లో జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గంజి మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ప్రధాన వృత్తి చేనేత తీవ్ర సంక్షోభంలో అవస్థలు పడుతుందని అన్నారు. చేనేత కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్ర నగదును పెంచి అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సహకార వ్యవస్థ బలహీనంగా తయారైందని వెంటనే ఎన్నికలు నిర్వహించి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని కోరారు. చేనేత బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షలు నగదు, రాష్ట్రంలోని అన్ని మగ్గాలకు అనుబంధ వృత్తులకు జియో టాగ్ వేసి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కోరారు. చేనేత ముడి సరుకులు, రంగులు, రసాయనాలు ,నూలు ధరలపై కేంద్రం వేసిన జిఎస్టిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. నేతన్న భీమా పై వయోపరిమితిని సడలించి అందరికీ వర్తింప చేయాలని, ప్రతి చేనేత కార్మికుడికి ఈఎస్ఐ ,హెల్త్ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాల కార్మికుల రుణాలు మాఫీ చేసి 80 శాతం రాయితీతో రుణాలు ఇవ్వాలని, ప్రతి చేనేత కార్మికుడికి ఇంటి స్థలం ఇచ్చి వర్క్ షెడ్డు నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని, ప్రభుత్వ సిబ్బంది యూనిఫారాలకు కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలలో చేనేత వస్త్రాలను పంపిణీ చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు, మగ్గం నేసే పతి కార్మికుడికి త్రిఫ్టు ఫండ్ పథకం, చేనేత మిత్ర అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న 6నెలల త్రిప్టు పండు చేనేత మిత్ర,చేనేత భీమా డబ్బులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత వృత్తిరక్షణ, వృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్లో 1200 కోట్ల రూపాయలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ద్వారా వారు ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు
*ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం శివయ్య, ఉపాధ్యక్షులు చెరుకు సైదులు, మిర్యాల అశోక్, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి గంజి నాగరాజు, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు కర్నాటి శ్రీరంగం ,గడ్డం దశరథ, ఏల శ్రీనివాస్, వృత్తి సంఘాల నాయకులు కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Mar 14 2024, 21:33