విజయవంతమైన బీసీ రాజ్యాధికార సమితి సబ్బండ వర్గాల ఆత్మగౌరవ సదస్సు, ప్రజా పాలనలో అన్ని వర్గాలను బాగసామ్యూల్ని చేయండి: దాసు సురేష్
అగ్రవర్ణాలకే అవకాశాలిస్తే సామాజిక న్యాయం సాధ్యమయ్యేదెలా ? దాసు సురేశ్
ప్రజాపాలనలో సబ్బండ వర్గాలనూ భాగస్వామ్యుల్ని చెయ్యండి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి.
సబ్బండ వర్గాల ఆత్మగౌరవ సదస్సులో సమాన అవకాశాలపై తీర్మానించిన బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు.
బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు దాసు సురేశ్ నేతృత్వంలో శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్ , అజీజ్ పాషా , ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విషారధన్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు ..
తెలంగాణలో దశాబ్దాలుగా వివక్షకు, నిరాదరణకు లోనవుతున్న బీసీ, అణగారిన వర్గాలు తమ అవకాశాలకోసం నేటికీ పోరాడాల్సిన పరిస్థితులే నెలకొన్నాయని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ సదస్సులో పలు సామాజిక ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు సామూహికంగా నినదించారు ..
ప్రస్తుత ప్రభుత్వంలో అవకాశాలు పదవులు కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి చెందడం తెలంగాణ ప్రజలను సబ్బండ వర్గాల ప్రజలను ఆలోచింపజేస్తుందని సభాధ్యక్షులు దాసు సురేశ్ తన ప్రారభోపన్యాసంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా భావించి ప్రజలు గెలిపిస్తే అటువంటి ప్రజా ప్రభుత్వంలో బీసీ దళిత గిరిజన మైనార్టీలకు సముచిత ప్రాతినిధ్యం లేకపోవడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు..ఆర్థికంగా ఎదగడానికి ఈ వర్గాలకు ప్రత్యేకమైన ఫైనాన్స్ కమీషన్ ను, పారిశ్రామిక, వ్యాపార ఔత్సాహిక విభాగాలను అందుకు అవసరమైన ఆర్థిక సబ్ ప్లాన్ ను ప్రభుత్వం అమలుచేయాలన్నారు..
జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి సమాన అవకాశాల గురించి అనేక సమావేశాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ ఇదే స్పూర్తితో బీసీ ఎస్టీ వర్గాలకు డిప్యూటీ సీఎం గా అవకాశాలను కల్పించాలని జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కోరారు .. గత ప్రభుత్వం 4 గురు బీసీలకు మంత్రులుగా అవకాశమివ్వగా ఈ ప్రభుత్వంలో కేవలం రెండు మంత్రివర్గ పదవులకే బీసీలను పరిమితం చేయడం భాధాకరమన్నారు.. రానున్న పార్లమెంటు ఎన్నికలలో 8 స్థానాలకు తగ్గకుండా బీసీ లకు అవకాశమివ్వాలన్నారు..
అలుపెరగకుండా నిరంతరం క్షేత్రస్థాయి పోరాటాలు చేయడం ద్వారానే బీసీలు, అణగారిన వర్గాలకు అధికారం దక్కుతుందని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పేర్కొన్నారు.. ప్రగతి భవన్ పేరును జ్యోతిబాపూలే ప్రజా భవన్ గా మార్చినంత మాత్రాన ఆ మహనీయుని ఆశయాలు నెరవేరవని జ్యోతిబాపూలే ఆకాంక్షించిన సమసమాజ స్థాపన, సబ్బండ వర్గాలను అధికారానికి చేరువ చేయడం ద్వారానే ఆ మహనీయుని ఆకాంక్షలు నెరవేరుతాయని తెలిపారు ..
తెలంగాణలో అధికారంలోకి వచ్చి ప్రజా పాలన కొనసాగిస్తామని , సామాజిక న్యాయ సాధన చేకూరుస్తామని అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చివరకు తెలంగాణలో రాజకీయ ప్రాతినిధ్యపు అవకాశాలను కేవలం ఒకే ఒక్క సామాజిక వర్గానికి పరిమితంచేస్తూ ఇతర వర్గాలను అపహాస్యం , అవహేళన చేస్తున్నదని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు ..ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన మెజారిటీ పదవులను కేవలం ఒకేఒక్క సామాజిక వర్గానికి కట్టబెట్టడం తీవ్ర అభ్యంత్రకరమన్నారు..
బీసీలు అనగారిన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగనిదే రాజకీయంగా ఎదగడం కష్టమని మాజీ ఎంపీ అజీజ్ పాషా తెలిపారు బీసీలకు ప్రత్యేకమైన పారిశ్రామిక పాలసీని ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు
పార్లమెంట్లోని ఓబిసి స్టాండింగ్ కమిటీ మాదిరిగా తెలంగాణ అసెంబ్లీలో బీసీ లెజిస్లేచర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ భలపరిచారు.,రానున్న ఎన్నికలలో మెజారిటీ బీసీలు అధికారం చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించారు..
రాజ్యాధికార మూలాలు చరిత్రలోనే ఉన్నాయని బీసీ దళిత గిరిజన మైనారిటీ వర్గాలు తమ చరిత్రను తెలుసుకోగలిగినప్పుడే భవిష్యత్తు నిర్మాణం, రాజ్యాధికారాన్ని చేపట్టగలుగుతారని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహరాజ్ పేర్కొన్నారు
పరిపాలన తమకు చేతకాదా అని, పాలనలో తమకు భాగస్వామ్యం కావాలని పలువురు వక్తలునినదించారు..
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కన్వీనర్ గుజకృష్ణ ,బిసి రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షులు దొంత ఆనందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ ముఖ్య నాయకులు గాజు యుగేందర్ యాదవ్ , ఊరుగొండ శివ, మడత కిశోర్ , బీసీ ఉద్యోగ సంఘాల చైర్మన్ దానకర్ణ చారి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ వ్యవస్థాపక సభ్యురాలు కృష్ణ లత కన్వీనర్ బోనం ఊర్మిళ సలహాదారులు సిహెచ్ భద్ర పూసల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, పొదిల రాజు , , సాయిబాబా , యువ నాయకులు పాక శ్రీనివాస్ రోజా నేత బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి జక్కని సంజయ్, సౌత్ ఇండియా కాపు సంక్షేమ సంఘం వేల్పురి శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు జంపాల రాజేష్ పద్మశాలీ సంఘం అధ్యక్షులు బూర మల్లేశం బిజెపి బీసీ మోర్చా నాయకులు బొమ్మిడాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
Mar 09 2024, 18:32