రాజకీయాల్లో కనిపించని సామాజిక న్యాయం... బిసి అణగారిన వర్గాల రాజకీయ అభివృద్ధికై మార్చి 2న ఆత్మగౌరవ సదస్సు: బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షుడు

రాజకీయాల్లో కనిపించని సామాజిక న్యాయం.. మార్చ్2న హైద్రాబాద్లో బీసీ,అణగారిన వర్గాల ఆత్మగౌరవ సదస్సు.. దాసు సురేశ్ - అధ్యక్షులు; బీసీ రాజ్యాధికార సమితి

ప్రస్తుత రాజకీయాల్లో సామాజిక న్యాయం క్రమంగా కనుమరుగవుతున్నదనీ, బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఆర్థికంగా బలంగా లేకపోవడంతో రాజకీయాల్లో అవకాశాలకు ఆమడ దూరంలో నెట్టివేయబడుతున్నాయని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ఓక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు..సామాజిక న్యాయం వివిధ పార్టీల విధానాల్లో, మేనిఫెస్టోలలో ప్రచురితమవుతున్నా దానిని అమలు విషయంలో మాత్రం పార్టీలకు చిత్తశుద్ధి కరువవుతుందని పేర్కొన్నారు .. ఈ దరిమిలా బీసీ అణగారిన వర్గాల “ఆత్మగౌరవ సదస్సును” మార్చి 2వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా నిర్వహించనున్నామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు..  

సామాజిక మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వంలో సబ్బండ వర్గాలు ఏ విధమైన పరిపాలనను కోరుకుంటున్నాయో స్వయంగా తెలియజెప్పడానికి వివిధ రాజకీయ పార్టీల బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతినిధులు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, న్యాయ వ్యవస్థలోని ప్రముఖులు, జర్నలిస్టులు విద్యార్థి, ఉద్యమ ,కార్మిక మహిళా నాయకులు, వివిధ కులసంఘాల నాయకులు ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను వెలుబుచ్చనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు నేతృత్వం వహించనున్నారని దాసు సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు..

కులగణన తీర్మానాన్ని చట్టబద్ధం చేయాలి.. కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి: బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్

కులగణన తీర్మానాన్ని చట్టబద్ధం చేయాలి.. కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి: బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్

కులగణన తీర్మానాన్ని చట్టబద్ధం చేయాలి.. కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కనీసం 6 మంత్రి పదవులను, 10 ఎంపీ సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దా సురేష్ డిమాండ్..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమగ్ర కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని ఇదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలుపడం హార్షనీయమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ తెలిపారు.. శనివారం బాగ్లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయం నందు ఏర్పాటు చేసిన తెలంగాణ మేధావుల మేధోమధన కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలు, సామాజిక ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు..

సభాధ్యక్షత వహించిన దాసురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం అస్పష్టంగా ఉందని తీర్మానం కాకుండా దీనికి జ్యూడిషల్ కమిషన్ లేదా ప్రత్యేకమైన బిల్లు ప్రవేశపెడితే తెలంగాణ ప్రజానీకానికి మరింత ఉపయోగంగా ఉండేదన్నారు.. తెలంగాణలో ప్రభుత్వం మారినా నేటికీ బీసీలపై అవకాశాలపరంగా వివక్ష కొనసాగుతూనే ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.. గత ప్రభుత్వంలో బీసీలకు నాలుగు మంత్రి పదవులు దక్కగా కాంగ్రెస్ పాలనలో నేడు కేవలం రెండు మంత్రి పదవులు మాత్రమే బీసీల చేతుల్లో ఉన్నాయన్నారు.. బీసీలకు కూడా ఉపముఖ్యమంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తున్నామన్నారు..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తామన్న కులగణకుకు చట్టబద్ధత లేకపోవడంవలన ప్రజాధనం నిష్ప్రయోజనమయ్యే అవకాశముందన్నారు .. అసెంబ్లీ తీర్మానం కంటే కులగణనను చట్టం చేయడం మరింత మెరుగైన విధానం అని దాసు సురేశ్ తెలిపారు. 2016లో కర్ణాటకలో 160 కోట్లతో 45 రోజులు లక్షా అరవై వేల మందితో నిర్వహించిన కులగణన ఫలితాలు నేటికీ బయటకు రాక ఫలితాలు ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడకపోవడాన్ని ఒకసారి పరిశీలించాలన్నారు.

రాష్ట్రంలో ఆస్తులు అగ్రవర్ణాలకు , అప్పులు బలహీన్న వర్గాలకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటివరకు రాష్ట్ర అప్పు 7.33 లక్షల కోట్లు కాగా కాళేశ్వరంలో అదనపు టిఎంసి కోసం వెచ్చించింది 1,40,000 కోట్లు అయితే ప్రతి సంవత్సరం అప్పుల వడ్డీకి చెల్లించడానికి 14000 కోట్లు ఖర్చు అవుతుండగా దీని భారం బలహీనవర్గాల మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు..

కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చిన విధంగా ఐదు సంవత్సరాలకు గాను బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ను కేటాయిస్తామని, నిధులను సబ్ ప్లాన్ లో చేరుస్తామని కాంగ్రెస్ చెప్పిన హామీ ఏమయిందని దాసురేష్ ప్రశ్నించారు.. ఈ హామీ ప్రకారం ఈ వార్షిక బడ్జెట్లో చేర్చాల్సిన 20 వేల కోట్లకు గాను కేవలం 8000 కోట్లను మాత్రమే బీసీ సంక్షేమానికి వినియోగించడం ఏ మేరకు సబబు అని ప్రశ్నించారు..

బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ కంటే మెరుగ్గా పనిచేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బీసీలకు కేటాయించిన నాలుగు మంత్రి పదవులు అయినా ఎందుకు కేటాయించలేక పోతుందని ప్రశ్నించారు.. మంత్రి పదవులకు ప్రాతినిధ్యం లేని కులాలకు చెందిన వాకిటి శ్రీహరి ముదిరాజ్, వీర్లపల్లి శంకర్, బీర్ల ఐలయ్య , మఖన్ సింగ్, ఆది శ్రీనివాస్ లేదా అపారమైన అనుభవం ఉన్న మహేష్ కుమార్ గౌడ్ లకు ఎందుకు అవకాశం కల్పించరని ప్రశ్నించారు..

బీసీ ఉద్యమ నేత విజిఆర్ నారగోని అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలే తప్ప అవినీతి అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.. ప్రభుత్వం నియమించుకున్న సలహాదారులు ఉన్నత స్థాయి పదవులను కేవలం ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం , ప్రాతినిధ్యం ఇవ్వడం సమసమాజ నిర్మాణానికి విఘాతకమన్నారు..ఇతర వర్గాలకు సమర్ధత లేదా అని ప్రశ్నించారు..సీఎంఓలో బీసీలకు సముచిత ప్రాధాన్యత ఎందుకు లేదన్నారు ..?

మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , గురుకుల పాఠశాలలకు సమీకృత భవనాలను ఎప్పటి వరకు పూర్తి చేస్తారో కాలపరిమితిని తెలపాలన్నారు.. ఆదిలాబాద్,నిజామాబాద్,రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లా నుండి ఒక్క మంత్రి లేకపోవడం పరిపాలన సౌభ్యానికి ఇబ్బంది కలుగుతుందని తెలియజేశారు.. అనుభవజ్ఞుడైన ఆకునూరి మురళి (ఐఏఎస్) లాంటి వారిని కాదని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిజిపి మహేందర్ రెడ్డి కి టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించడం దేనికి నిదర్శనం అన్నారు.. పాత నియామకాలే తప్ప కొత్త నోటిఫికేషన్లు ప్రభుత్వంలో కరువైనాయన్నారు.

సోషల్ జస్టిస్ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ , ఉదయపూర్ డెకరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని దాసు సురేశ్ ప్రశ్నించారు.. పార్లమెంటు సీట్ల పంపకంలో నైనా బీసీలకు పది సీట్లు కేటాయించాలన్నారు..

ఈ కార్యక్రమంలో ఓబీసీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ చైర్మన్ ఆళ్ల రామకృష్ణా ,బిసి రాజ్యాధికార సమితి సెక్రటరీ సుధాకర్ , వై బాలకృష్ణ , మహిళా అధ్యక్షురాలు బోనం ఊర్మిళ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారు పద్మావతి ప్రధాన కార్యదర్శి గోశిక స్వప్న , ప్యారసాని దుర్గేష్, వైద్యనాథ్, సికిందరాబాద్ నియోజక వర్గ కన్వీనర్ బొమ్మ నరేందర్ , వరంగల్ జిల్లా కన్వీనర్ పొదిల రాజు , పన్నీరు కృష్ణ కొండా యాదగిరి, దాసు బలరాం తదితరులు పాల్గొన్నారు ..

జర్నలిస్ట్ శంకర్ ను పరామర్శించిన బి.ఆర్.ఎస్ నేత ధనుంజయ నేత

జర్నలిస్టు శంకరుని పరామర్శించిన బిఆర్ఎస్ నేత పెండెం ధనుంజయ నేత

దాడికి గురైన జర్నలిస్ట్ శంకర్ని హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో డిశ్చార్జ్ సమయంలో కలిసి పరామర్శించిన పెండెం ధనంజయ నేత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

సమాజంలో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల అభివృద్ధి కొరకు పనిచేసే ఇలాంటి జర్నలిస్టులు దాడికి గురి కావడం విచారకరమని ఆయన తెలియజేశారు, తెలంగాణ ప్రభుత్వం లో మరొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంచలన ఆరోపణలు..

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంచలన ఆరోపణలు..

2, 3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారంటున్న ఆప్.. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని బెదిరింపులు వస్తున్నాయన్న ఆప్ నేతలు.. సీఆర్పీ 41 కింద నోటీసులిచ్చి.. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఆమ్ ఆద్మీ.. ఇప్పటికే కేజ్రీవాల్ కు 7వ సారి నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఈ నెల 26న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ.. అదే రోజు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ అనుమానం..

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల కెసిఆర్ దిగ్భ్రాంతి...

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. ఓఆర్ఆర్ పై ప్రమాదానికి గురైన లాస్య నందిత కారు.. అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారు.. ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు..

ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. లాస్య మృతికి సంతాపం తెలిపిన కేసీఆర్.. లాస్య అకాల మరణం బాధాకరం.. ఆమె కుటుంబానికి అండగా ఉంటాం- కేసీఆర్

కరెంటు కోతలు పెడితే... విద్యుత్ అధికారులపై కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

ఎక్క‌డైనా అయిదు నిమిషాల‌కు మించి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతే అందుకు గ‌ల కార‌ణాల‌పై వెంట‌నే స‌మీక్షించుకోవాలని చెప్పారు.

సాంకేతిక‌, ప్ర‌కృతిప‌ర‌మైన కార‌ణాలు మిన‌హా ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎవ‌రైనా కోత‌ల‌కు కార‌ణ‌మైతే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

విద్యుత్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరిక

రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ అవకతవకల్లో నలుగురిని అరెస్టు చేసిన ఏసీబీ..

హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ అవకతవకల్లో నలుగురిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ.. గొర్రెల పంపిణీలో అవకతవకలు పాల్పడి రూ.2.10 కోట్లు కొట్టేసిన అధికారులు.. గొర్రెలను కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా బ్రోకర్ల అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసిన అధికారులు

గంజాయి కేసులో అరెస్ట్ అయిన షణ్ముఖ్ కేసులో బయటకి సంచలన నిజాలు..

షణ్ముఖ్ కేసులో బయటకి సంచలన నిజాలు

షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని షణ్ముఖ్ మోసం చేశాడు

షణ్ముఖ్ అన్నయ్య సంపత్ నన్ను లైంగికంగా లొంగదీసుకున్నాడు

హోటల్స్, విల్లాస్ కి తీసుకెళ్లి నన్ను లోబరుచుకున్నాడు

ఓసారి అబార్షన్ కూడా చేయించాడు 

పెళ్లి గురించి అడిగితే.. రింగ్ తొడిగి పెళ్లి అయిపోయింది అన్నాడు

అన్నదమ్ములు చాలా కాలం నుండి గంజాయి వాడుతున్నారు

వారి దగ్గర డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నాయి -మౌనిక

ఏపీ:నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్‌-2024 విన్యాసాలు..

నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్‌-2024 విన్యాసాలు. సముద్ర తీరంలో ఇండియన్‌ నేవీ విన్యాసాలు. ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌లో పాల్గొననున్న 50 దేశాలు. హాజరుకానున్న ఉపరాష్ట్రపతి ధనఖడ్‌, గవర్నర్‌.

TS:నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ...

నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ. వనం నుంచి జనంలోకి సమ్మక్క దేవత ఆగమనం. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణిరూపంలో సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ట. ప్రభుత్వం తరుపున స్వాగతం పలకనున్న మంత్రి సీతక్క. గాల్లో కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలకనున్న ఎస్పీ, కలెక్టర్‌.