హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ అవకతవకల్లో నలుగురిని అరెస్టు చేసిన ఏసీబీ..

హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ అవకతవకల్లో నలుగురిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ.. గొర్రెల పంపిణీలో అవకతవకలు పాల్పడి రూ.2.10 కోట్లు కొట్టేసిన అధికారులు.. గొర్రెలను కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా బ్రోకర్ల అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసిన అధికారులు

గంజాయి కేసులో అరెస్ట్ అయిన షణ్ముఖ్ కేసులో బయటకి సంచలన నిజాలు..

షణ్ముఖ్ కేసులో బయటకి సంచలన నిజాలు

షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని షణ్ముఖ్ మోసం చేశాడు

షణ్ముఖ్ అన్నయ్య సంపత్ నన్ను లైంగికంగా లొంగదీసుకున్నాడు

హోటల్స్, విల్లాస్ కి తీసుకెళ్లి నన్ను లోబరుచుకున్నాడు

ఓసారి అబార్షన్ కూడా చేయించాడు 

పెళ్లి గురించి అడిగితే.. రింగ్ తొడిగి పెళ్లి అయిపోయింది అన్నాడు

అన్నదమ్ములు చాలా కాలం నుండి గంజాయి వాడుతున్నారు

వారి దగ్గర డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నాయి -మౌనిక

ఏపీ:నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్‌-2024 విన్యాసాలు..

నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్‌-2024 విన్యాసాలు. సముద్ర తీరంలో ఇండియన్‌ నేవీ విన్యాసాలు. ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌లో పాల్గొననున్న 50 దేశాలు. హాజరుకానున్న ఉపరాష్ట్రపతి ధనఖడ్‌, గవర్నర్‌.

TS:నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ...

నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ. వనం నుంచి జనంలోకి సమ్మక్క దేవత ఆగమనం. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణిరూపంలో సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ట. ప్రభుత్వం తరుపున స్వాగతం పలకనున్న మంత్రి సీతక్క. గాల్లో కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలకనున్న ఎస్పీ, కలెక్టర్‌.

TS;వారం రోజుల్లో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌- సీఎం రేవంత్

వారం రోజుల్లో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌-రేవంత్

వచ్చేనెల 15న రైతుబంధు, రైతు భరోసా అమలు

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం-రేవంత్

వారం రోజుల్లో తెల్లరేషన్ కార్డుదారులకు 

200 యూనిట్ల ఉచిత విద్యుత్

ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేశాం.

నల్గొండకు నూతనంగా వచ్చిన డిఎస్పి శివరాం రెడ్డికి కాంగ్రెస్ మహిళా విభాగం మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తరఫున ఘన సన్మానం..

నల్గొండకు నూతనంగా వచ్చిన డిఎస్పి శివరాం రెడ్డికి కాంగ్రెస్ మహిళా విభాగం మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తరఫున ఘన సన్మానం..

నల్గొండ జిల్లా కి నూతనంగా విచ్చేసిన డీఎస్పీ శివరాం రెడ్డికి ఘన సన్మానం 

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన శివరాం రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది.మహిళలకు రక్షణ కల్పించే విధంగా మహిళల సమస్యలు పరిష్కరించాలని డిఎస్పి గారికి వివరిస్తూ మర్యాదపూర్వకంగా కలిసిన నాయకురాలు ఉపాధ్యక్షురాలు ఎగడి సుజాత ప్రధాన కార్యదర్శి ఎక్స్ కౌన్సిలర్ దుబ్బారూప కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు నాగరాణి టౌన్ సెక్రటరీ లలిత మల్లిక మండల అధ్యక్షురాలు స్వరూపారెడ్డి మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ లాలూ నాయక్ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఏపీ:పవన్‌ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

పవన్‌ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

భవిష్యత్తులో ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందే

నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే

కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా

ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం -పవన్‌

మా ప్రభుత్వం వస్తే కచ్చితంగా పథకాలు అమలవుతాయి

పథకాలతో పాటు అభివృద్ధి జరుగుతుంది

ఈ సారి గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నా-పవన్‌

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు...

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

కుప్పంలో చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి..

నేను నిలబడాలని అనుకుంటున్నా-భువనేశ్వరి

35 ఏళ్లు చంద్రబాబును గెలిపించారు

ఈ సారి నాకు ఛాన్స్‌ ఇవ్వాలి-నారా భువనేశ్వరి

భువనేశ్వరి వ్యాఖ్యలకు పార్టీ శ్రేణుల కేరింతలు

ఏపీ:డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు...

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

టీడీపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు-సజ్జల

వైసీపీ డీఎన్‌ఏలోనే మైనార్టీలు ఉన్నారు. వైసీపీకి సునామీలా వస్తున్న ఆదరణను..పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకెళ్లాలి. 2019 వరకు చంద్రబాబు ముఠా అరాచకాన్ని చూశాం.. అందుకే ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు.. మైనార్టీలకు 50 శాతం పదవులు ఇచ్చాం.. అన్ని వర్గాలకు జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓట్ల కోసం పథకాలను రూపొందించలేదు.. సంక్షేమం, అభివృద్ధి కోసం జగన్‌ కృషి చేస్తున్నారు. టీడీపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు-సజ్జల