NLG: మునుగోడులో ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మునుగోడులో ఏఐటీయూసీ, తెలంగాణ రైతు సంఘం మరియు సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం, జిల్లా కార్యదర్శి బండ శ్రీశైలం మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో రైతులకు ఇతర కార్మికులకు ఇబ్బంది పెట్టే కార్మిక చట్టం తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు సురికి చలపతి, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బండమీది యాదయ్య, మందుల పాండు, ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు దుబ్బ వెంకన్న, బెల్లం శివయ్య, భవనిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఈద యాదయ్య, హమాలి కార్మిక సంఘం నాయకులు దామ ఖాసిం, చందపాక యాదయ్య ఆటో కార్మికులు భిక్షం మాధవన్, నరసింహ,చిరంజీవి, బండారు శంకర్, దశరథ, చాపల విప్లవ కుమార్, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ మున్సిపల్ కమిషనర్ గా సయ్యద్ ముసాబ్ అహ్మద్

నల్గొండ: అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్‌ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కు నల్గొండ మున్సిపల్ కమీషనర్‌ గా పదోన్నతి లభించింది. నల్లగొండ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ గా సయ్యద్ ముసాబ్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

NLG: మేడిగడ్డ పై సమగ్ర విచారణ జరిపించి బాద్యులపై చర్యలు తీసుకోవాలి: జూలకంటి రంగారెడ్డి

నల్లగొండ: మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగడంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబి పై తక్షణమే అఖలపక్ష సమావేశం నిర్వహించాలని, నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గజిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మేడిగడ్డ ప్రాజెక్టును బొందల గడ్డగా మార్చింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కెసిఆర్ పై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయంలో నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్ని ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయ్యాయని, గత ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు మాత్రమే శంకుస్థాపనలు చేశారని, ఏ ఒక్క కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయలేదని విమర్శించారు.

ఈ సమావేశంలో సీ పి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేష్, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, కందాల ప్రమీల, చిన్నపాక లక్ష్మీనారాయణ. తదితరులు పాల్గొన్నారు.

NLG: నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జలెంధర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: నాంపల్లి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జలెంధర్ రెడ్డి గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు HYD వనస్థలిపురం పోలీస్ స్టేషన్ నుండి, బదిలీపై నాంపల్లి సర్కిల్ కి వచ్చారు. ఇక్కడ పని చేసిన సిఐ నవీన్ కుమార్ ను అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. సీఐ నవీన్ కుమార్ కు హాలియా కు పోస్టింగ్ ఇవ్వవచ్చని సమాచారం.

NLG: ధర్మబిక్షం గౌడ్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి: జనార్దన్ గౌడ్

 

నల్లగొండ: మాజీ పార్లమెంటు సభ్యుడు, కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. ఈ రోజు ధర్మ బిక్షం గౌడ్ 102 వ జయంతి సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో ధర్మ భిక్షం చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ హైవే కి బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ పేరును నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 

బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం గీత కార్మికుల కోసం అనేక విధాలుగా పోరాటం చేసి వారి యొక్క హక్కులను కాపాడినటువంటి గొప్ప నాయకుడు ధర్మబిక్షం గౌడ్ అన్నారు.

ఉమ్మడి జిల్లా ప్రజలు ధర్మబిక్షం గౌడ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని పోరాట పటిమను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేఖల భద్రాద్రి, యువజన నాయకుడు చంద్రశేఖర్ గౌడ్, కారింగు నరేష్ గౌడ్ , చింతల యాదగిరి గౌడ్, కొంపెల్లి రామన్న గౌడ్, పుల్లెంల యాదగిరి గౌడ్, మాద శ్రీనివాస్ గౌడ్, గజ్జి నరేష్ యాదవ్, చింతల విజయ్ కుమార్ గౌడ్, కారింగ్ శంకర్ గౌడ్, జేరిపోతుల లింగయ్య గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.

TS: మేక సంజీవరెడ్డి కి నివాళులర్పించిన నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షుడు నగేష్ నాయక్

తెలంగాణ రాష్ట్ర ధరణి కమిటీ సభ్యులు అడ్వకేట్ భూమి సునీల్ కుమార్ తండ్రిగారైన మేక సంజీవరెడ్డి ఈనెల 5వ తేదీన పరమపదించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, అయ్యగారి పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి.. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేక సంజీవరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ భూమి సునీల్ కుమార్, అడ్వకేట్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

NLG: నూతన ఎంపికైన గ్రంథపాలకులకు అభినందనలు తెలిపిన తెలంగాణ గ్రంధాలయ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు

నల్లగొండ: గురుకుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లైబ్రేరియన్ పోస్టులపై, రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ ప్రక్రియ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈరోజు హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం ఎంతో శుభసూచకమని గ్రందపాలకుడు డాక్టర్ రాజారామ్ అన్నారు.

సాధించుకున్న తెలంగాణలో గ్రంథాలయాల సేవలు గ్రంథ పాలకుల ద్వారా సాధ్యమని, విద్యార్థుల డెవలప్మెంట్ గురించి పోటీ పరీక్షలపై అవగాహనను కల్పించడం కొరకు జ్ఞానాభివృద్ధి కోసం గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడుతాయని డాక్టర్ రాజారామ్ తెలిపారు. ఈరోజు నల్గొండలో తెలంగాణ గ్రంధాలయ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు డాక్టర్ రాజారామ్ (మహిళా కళాశాల గ్రంథ పాలకులు), డాక్టర్ దుర్గాప్రసాద్ (నాగార్జున ప్రభుత్వ కళాశాల గ్రంథపాలకులు) నూతనంగా ఎంపికైన గ్రంథపాలకులను అభినందించారు.

NLG: విద్యార్థులకు స్నాక్స్ అందజేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎస్ పి టి ప్లాటినం సభ్యులు

నల్గొండ పట్టణంలోని మాధవ నగర్ జేబీఎస్ ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించే క్రమంలో ఉదయం మరియు సాయంత్రం పూట విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకుగాను, ఈరోజు లయన్స్ క్లబ్ ఎస్పిటి ప్లాటినం నల్గొండ సభ్యులు మరియు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ - ఆండాలు వివాహ వార్షికోత్సవం సందర్భంగా లయన్ జెల్లా దశరథ ఆధ్వర్యంలో దాదాపు 10 వేల రూపాయల స్నాక్స్ అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నిర్మల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వ జేబీఎస్ పాఠశాలలోని విద్యార్థులకు గత 3 సంవత్సరముల నుండి లయన్స్ క్లబ్ ఆఫ్ ప్లాటినం ఎస్ పి టి నల్గొండ ఆధ్వర్యంలో ఈ యొక్క స్నాక్స్ అందజేస్తున్నామని, దాతలు అందించిన సహకారంతో విద్యార్థులు పట్టుదలతో కృషిచేసి 10వ తరగతిలో ఉన్నతమైన మార్కులు సంపాదించి ముందుకు వెళ్లాలని, తద్వారా మంచి భవిష్యత్తును పొందవచ్చునని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జెల్లా దశరథ, పుట్టా వెంకన్న, దాసోజు శ్రీనివాసచారి, మాధగోని స్వామి, మామిడి శ్రవణ్ కుమార్, జెల్లా లవన్ కుమార్,పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ నాగిరెడ్డి ఆర్ నరసింహారెడ్డి కే సంపత్ కుమార్ బి.రూప, ఎన్. శ్రీనివాస్, బొమ్మపాల గిరిబాబు, కే.ప్రతిమ, జీ.రత్నమాల, పి. వెంకట్రావు, ఏవీఆర్ వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

NLG: గౌరవ డాక్టరేట్ పొందిన దళిత నాయకుడికి సన్మానం

నల్లగొండ జిల్లాకు చెందిన తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కత్తుల రవి సామాజిక రంగంలో కృషి చేసినందుకు గాను, చెన్నైలోని గ్లోబల్ యూనివర్సిటీ వారు ఇటీవల ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు.

డాక్టరేట్ ని పొంది బుధవారం నల్లగొండకు వచ్చిన సందర్భంగా ఆ సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు.

NLG: మార్చి 27, 28 తేదీల్లో ఎన్జీ కళాశాలలో జాతీయ సదస్సు

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో మార్చి 27, 28 తేదీల్లో తెలుగు నాటక సాహిత్యం- సమాజం అను అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించబడుతుందని కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ అన్నారు.

బుధవారం జాతీయ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడారు. జాతీయ సదస్సులను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందింపచేయడమే కాకుండా వారిలో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి ఉపయోగపడుతుందని, అదేవిధంగా సాహిత్య పరిశోధకులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ మునీర్, డాక్టర్ అంతటి శ్రీనివాసులు, ఐక్యు ఏసి కోఆర్డినేటర్ వైవిఆర్ ప్రసన్నకుమార్, అకడమిక్ కోఆర్డినేటర్ వి. శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి వి. నాగరాజు, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య , తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఎన్. దీపిక, ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ వెల్దండి శ్రీధర్, జి. గోవర్ధనగిరి, ఎస్. ప్రభాకర్, ఎం.లింగస్వామి, గ్రంథపాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్, వ్యాయామ అధ్యాపకులు కె.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.